తెలుగు న్యూస్‌టుడే, ఇంటర్నెట్ డెస్క్: Government apps | కేంద్ర ప్రభుత్వం యువతలో స్కిల్స్ పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ యాప్స్‌ను కూడా నడుపుతోంది. వీటిలో రెండు యాప్ప్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
Government apps | మై గోవ్ యాప్..
మై గోవ్ యాప్ (My gov app) అనేది పౌర భాగస్వామ్యానికి వేదికగా నిలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని 2014లో ప్రారంభించారు. ప్రజలు వివిధ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో పాలుపంచుకునేలా చేసేందుకు దీనిని తీసుకువచ్చారు. ప్రజల నుంచి పాలనాపరంగా మంచి ఆలోచనలను సేకరించేందుకు ఇది వేదికగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో వివిధ క్విజ్లు, సర్వేలు, కాంపిటీషన్లు నిర్వహిస్తూ ఉంటారు. అంతే క్విజ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో చాలా క్విజ్లు ఉంటాయి. మీకు నచ్చినది ఎంచుకుని పార్టిసిపేట్ చేయవచ్చు. ఇందులో మీరు గెలిచినట్లయితే క్విజ్ కాంపిటీషన్ బట్టి రూ.5 వేల నుంచి రూ.లక్షల వరకు గెలుచుకోవచ్చు. అంతేకాకుండా గెలిచిన వారి వివరాలను ఇదే యాప్‌లో నమోదు చేస్తారు.
Government apps | స్కిల్ ఇండియా యాప్
స్కిల్ ఇండియా యాప్ (Skill india) దేశంలోని ప్రజల్లో నైపుణ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో చాలా రకాల కోర్సులను ఉచితంగా అందిస్తోంది. దీనిలోకి వెళ్లి ఉచితంగా లభించే సెలెక్ట్ చేసుకుని నేర్చుకోవచ్చు. వీటిలో ఏఐకి సంబంధించిన కోర్సులను సైతం అందిస్తోంది. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా అందిస్తారు. అంతేకాకుండా ఇదే యాప్‌లో జాబ్స్ కూడా సెర్చ్ చేసుకుని అప్లయ్ చేసుకుని జాబ్ పొందవచ్చు. ఇలా ఈ ప్రభుత్వ యాప్‌లను సద్వినియోగం చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.