Penci Sport plugin only working with the Soledad theme.

సినిమా - Telugu News Today

Category: సినిమా

cinema

  • Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

    Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar box office collections | ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు (Dhurandhar box office collections) సృష్టిస్తోంది. రిలీజ్ అయి నాలుగు వారాలు పూర్తయినా సినిమా వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. నాలుగో వారంలో కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ద్వారా బాలీవుడ్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పరచింది.

    Dhurandhar box office collections | వరుసగా నాలుగో వారం..

    తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నాలుగో వీక్‌లో సుమారు రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు (Dhurandhar box office collections) సాధించి.. బాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా నాలుగో వారంలో ఇంత భారీ మొత్తాన్ని సాధించలేదు. ఇండియాలో మొత్తం నెట్ వసూళ్లు రూ.784 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు రూ.1164 కోట్లు దాటాయి.

    Dhurandhar box office collections | జవాన్​ రికార్డులను తిరగరాస్తూ..

    ఈ విజయంతో ‘ధురంధర్’ సినిమా.. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రం వసూళ్లను అధిగమించి, హిందీ సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అవతరించింది. భారత్‌లో హిందీ చిత్రాల్లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ఈ చిత్రం రికార్డు నమోదు చేసింది.

    Dhurandhar box office collections | రెండోస్థానంలో..

    ప్రస్తుతం భారత్‌లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పుష్ప 2 నిలిచింది. అయితే, థియేట్రికల్ రన్ ఇంకా బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే వీకెండ్‌లో పుష్ప 2ను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోయినప్పటికీ ఇంత భారీ విజయం సాధించడం విశేషం. సాధారణంగా బాలీవుడ్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ విడుదలై ఉంటే మరింత రూ.100 కోట్ల వసూళ్లు సులువుగా వచ్చేవని అంచనాలు ఉన్నాయి. అయినా సరే, భారత్ మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిత్రం అద్భుతంగా రాణిస్తోంది.

    రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణ తగ్గకపోవడం ద్వారా ఈ చిత్రం రూ.1200 కోట్ల మార్క్‌ను త్వరలోనే అందుకునే అవకాశం కనిపిస్తోంది. రాబోయే వీకెండ్‌లో ఈ మైలురాయిని చేరుకోవడం కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    త్వరలో సీక్వెల్​..

    ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలో వస్తోంది. ఈ ఏడాది వేసవిలో లేదా మార్చి నాటికి పార్ట్-2 థియేటర్లకు రావచ్చని సమాచారం. మొదటి భాగం ముగింపు ఉత్కంఠగా సాగడంతో సీక్వెల్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా మరింత ఆకర్షణీయంగా తెరకెక్కనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

    ఇక ఓటీటీ విషయానికొస్తే, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల చివరి నాటికి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని అంచనాలు ఉన్నాయి, అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..

    Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar collections | రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సూపర్​హిట్​ టాక్​ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ రికార్డుల్లో కొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ముఖ్యంగా హిందీ సినిమాల చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్ల నెట్ వసూళ్లను దాటిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది.

    Dhurandhar collections | 15 రోజుల్లోనే..

    ధురందర్​ చిత్రం విడుదలై 15 రోజుల్లోనే భారతదేశంలో రూ.503 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించడం ద్వారా హిందీ చిత్రాల్లో రికార్డును సృష్టించింది. గతంలో షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ 18 రోజుల్లో రూ.505 కోట్లు, రాజ్‌కుమార్ రావు-శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘స్త్రీ 2’ 22 రోజుల్లో రూ.503 కోట్లు సాధించాయి. ఈ రెండు చిత్రాల రికార్డులను ‘ధురంధర్’ బద్దలు కొట్టింది.

    Dhurandhar collections | పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ఆధిపత్యం..

    పాన్ ఇండియా చిత్రాల జాబితాలో మాత్రం అత్యవేగంగా రూ.500 కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ రికార్డు కొనసాగుతోంది. ఈ తెలుగు చిత్రం కేవలం 11 రోజుల్లోనే రూ.552 కోట్లకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా ర్యాంకింగ్‌లో ‘ధురంధర్’ రెండో స్థానంలో, ‘జవాన్’ మూడో స్థానంలో, ‘స్త్రీ 2’ నాలుగో స్థానంలో నిలిచాయి.

    Dhurandhar collections | మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్​

    చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విజయాన్ని పంచుకుంది. 15వ రోజుల్లో ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. రెండు వారాల్లోనే ఈ స్థాయి విజయాన్ని సాధించిన ‘ధురంధర్’ మరిన్ని రోజులు థియేటర్లలో కొనసాగితే.. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Dhurandhar collections | చిత్రం నేపథ్యం..

    ‘ధురంధర్’ ఒక శక్తివంతమైన స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రణ్‌వీర్ సింగ్ ‘హంజా’ అనే గూఢచారి పాత్రలో అద్భుత నటన కనబర్చారు. పాకిస్తాన్‌లోని కరాచీలోని గ్యాంగ్‌లు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొచ్చుకుపోయి భారత భద్రతను కాపాడే ఈ పాత్రలో రణ్‌వీర్ తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని విమర్శకులు కొనియాడుతున్నారు. ఆయనతో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

  • Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!

    Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Movies releasing this week | సినిమా ప్రియులకు ఈ వారం మంచి ఎంట్రటైన్​మెంట్​ లభించనుంది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి పెద్దగా ప్రచారం లేదు. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందామా..

    Movies releasing this week | థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు

    • సకుటుంబానాం – డిసెంబర్ 19
    • గుర్రం పాపిరెడ్డి – డిసెంబర్ 19
    • మిస్ టీరియస్ – డిసెంబర్ 19
    • అవతార్: ఫైర్ అండ్ యాష్ – డిసెంబర్ 19

    Movies releasing this week | ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు, సిరీస్‌లు

    నెట్‌ఫ్లిక్స్

    • ప్రేమంటే – డిసెంబర్ 19 నుంచి..
    • రాత్ అఖేలీ హై – డిసెంబర్ 19 నుంచి..
    • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 – డిసెంబర్ 18 నుంచి..

    అమెజాన్ ప్రైమ్ వీడియో

    • ధామా (హిందీ) – డిసెంబర్ 16 నుంచి..
    • ఫాలౌట్ – డిసెంబర్ 17 నుంచి..
    • ఏక్ దివానే కీ దివానీయత్ (హిందీ) – డిసెంబర్ 16 నుంచి..
    • ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (వెబ్ సిరీస్) – డిసెంబర్ 19 నుంచి..

    జీ5

    • నయనం – డిసెంబర్ 19 నుంచి..
    • డొమినిక్ అండ్ లేడీస్ వర్సెస్ – డిసెంబర్ 19 నుంచి..

    డిస్నీ+ హాట్‌స్టార్

    • మిసెస్ దేశ్ పాండే (హిందీ సిరీస్) – డిసెంబర్ 19 నుంచి..

    ఈ వారం థియేటర్లలో నాలుగు చిత్రాలు, ఓటీటీలో 10కి పైగా సినిమాలు, సిరీస్​లు రిలీజ్​ కానున్నాయి. ఇవి ప్రేక్షకులకు మంచి ఎంట్రటైన్​మెంట్​ అందించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.

    ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Dekh Lenge Saala Song Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకుడిగా దర్శకుడు హరీశ్​ శంకర్ రూపొందిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి దశలో ఉంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పాటల ద్వారా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.

    ఉర్రూతలూగిస్తున్న సాంగ్​ :Dekh Lenge Saala Song Release

    ఇందులో భాగంగా నేడు ‘దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా’ అనే లిరికల్ సాంగ్​ను చిత్ర యూనిట్​ విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ట్రాక్‌కు భాస్కరభట్ల రచించిన సాహిత్యం అందించారు. ప్రముఖ గాయకుడు విశాల్ దడ్లానీ గాత్రం అందించారు.

    సినిమాపై హైప్​ పెంచుతున్న పాట : Dekh Lenge Saala Song Release

    ఈ పాటకు సంబంధించి లిరిక్ షీట్‌ను లక్ష మంది అభిమానులు కలిసి ఆవిష్కరించడం విశేషం. చిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ లిరికల్ వీడియోను చూసి సంబరపడుతున్నారు. రిలీజ్ ​అయిన నిమిషాల్లోనే వైరల్​గా మారింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నారు. ఈ నేపథ్యంలో పాట మరింత హైప్‌ను సృష్టిస్తోంది.

    Dekh Lenge Saala Song Release
    Dekh Lenge Saala Song Release

    Akhanda 2 Review |అఖండ 2: తాండవం.. బాలకృష్ణ మరోసారి ‘అఖండ’ విజయం సాధించాడా?

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 Review |అఖండ 2: తాండవం.. బాలకృష్ణ మరోసారి ‘అఖండ’ విజయం సాధించాడా?

    Akhanda 2 Review |అఖండ 2: తాండవం.. బాలకృష్ణ మరోసారి ‘అఖండ’ విజయం సాధించాడా?

    చిత్రం: అఖండ 2: తాండవం : Akhanda 2 Review

    కథానాయకుడు: నందమూరి బాలకృష్ణ

    ముఖ్య పాత్రలు: సంయుక్త మేనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, శ్వేతా చటర్జీ, విజి చంద్రశేఖర్ తదితరులు

    సంగీతం: ఎస్. తమన్

    ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్

    కూర్పు: తమ్మిరాజు

    నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, ఇషాన్ సక్సేనా

    సమర్పణ: ఎం. తేజస్విని నందమూరి

    కథ, మాటలు, దర్శకత్వం: బోయపాటి శ్రీను

    విడుదల : డిసెంబర్ 12, 2025

    ‘అఖండ’ సృష్టించిన అదే ఉద్వేగం, అదే భక్తి రసం, అదే మాస్ జ్వరంతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల్ని కలిసింది. Akhanda 2 Review మొదటి భాగం ఎంతటి బ్లాక్‌బస్టర్ అయిందో అందరికీ గుర్తుంది కదా! ఇప్పుడు ఆ కొనసాగింపుగా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ అంచనాల్ని అందుకుందా? థియేటర్‌లో బాలయ్య అభిమానులు మళ్లీ దద్దరిల్లేలా చేశాడా? చూద్దాం..

    Akhanda 2 Review | కథ సారాంశం..

    కథ టిబెట్ సరిహద్దు నుంచి ఆరంభమవుతుంది. భారతీయుల హిందూ నమ్మకాల్ని, సనాతన ధర్మాన్ని ఛిన్నాభిన్నం చేయాలని శత్రు దేశం (చైనా) ఒక ఘోర కుట్ర పన్నుతుంది. కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులపై బయోలాజికల్ దాడి చేస్తారు. ఫలితంగా వేలాది మంది కోమాలోకి జారుకుంటారు. దీనికి ప్రతి విరుగుడుగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. కానీ శత్రువులు ఆ ల్యాబ్‌ను ధ్వంసం చేసి శాస్త్రవేత్తలందరినీ హతమార్చేస్తారు ఉంటారు. ఆ బృందంలోని యువ శాస్త్రవేత్త జనని (హర్షాలీ మల్హోత్రా) మాత్రమే ఆ వ్యాక్సిన్‌తో సహా ప్రాణాలతో బయటపడుతుంది.

    Akhanda 2 release update

    ఆమెను వెంటాడే శత్రు బలగాల నుంచి కాపాడే బాధ్యత రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) తీసుకుంటాడు. అదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ (మరో బాలకృష్ణ) డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ రెండు ట్రాక్‌లు ఎలా ముడిపడతాయి? అఘోరాకు జనని గురించి తెలిసింది ఎలా? చివరికి భారత గౌరవాన్ని, హిందూ ధర్మ గొప్పతనాన్ని ఆయన ఎలాంటి తాండవంతో నిలబెట్టాడు? అనేది మిగతా కథ.

    సినిమా ఎలా సాగింది?

    బోయపాటి శ్రీను ఈసారి కథను దేశ సరిహద్దులకు మించి తీసుకెళ్లారు. అఘోరా పాత్రకు మరింత శక్తి కల్పించి, ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని కలిపి ఒక భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించారు. మొదటి భాగంలో ఫ్యాక్షనిజం మీద యుద్ధమైతే ఇక్కడ డ్రగ్స్ మాఫియా, బయో టెర్రరిజం, సరిహద్దు దాడులతో సహా జాతీయ భద్రత విషయాలు కలిశాయి.

    ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగినా, బాలమురళీకృష్ణ పరిచయం, ఆయన ఎంట్రీ సీక్వెన్స్‌లు అదిరిపోతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమా ఒక్కసారిగా గేర్ మార్చి, రెండో భాగంలో అఘోరా రూపంలో బాలకృష్ణ పూర్తి జోష్‌తో దండయాత్ర చేస్తాడు. హిమాలయాల్లో సర్జికల్ స్ట్రైక్, తాంత్రికుడైన నేత్రతో ఎదుర్కొనే సన్నివేశాలు, హనుమాన్-శివుడి రూపాల్లో అఘోరా, తల్లి సెంటిమెంట్ – ప్రతి ఎపిసోడ్ ఒక్కటే గూస్‌బంప్స్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భారత్ గొప్పతనం, వేదభూమి మహత్యం గురించిన సంభాషణలు థియేటర్‌ను ఉర్రూతలూగిస్తాయి.

    నటన, సాంకేతిక విభాగాలు

    ఈ చిత్రం పూర్తిగా బాలకృష్ణ వన్ మేన్ ఆర్మీ. రెండు పాత్రల్లోనూ ఆయన విశ్వరూపం చూపించారు. అఘోరా రూపంలో భక్తి-ఆవేశం, బాలమురళీకృష్ణగా స్టైల్-సంభాషణ – రెండూ అద్భుతం. ఆయన మాటల డెలివరీ, యాక్షన్ ఘట్టాలు ఒక్కసారిగా సీట్ల నుంచి లేపేస్తాయి.

    Akhanda2 Release Date Fix
    Akhanda2 Release Date Fix

    సంయుక్త మేనన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా గ్లామర్‌తో ఆకట్టుకుంది. హర్షాలీ మల్హోత్రా కథలో కీలక పాత్ర, ఆమె నటన సహజంగా కనిపించింది. విలన్లలో ఆది పినిశెట్టి (నేత్ర) మాత్రమే కొంత గుర్తుండిపోతాడు, మిగతా వారు రొటీన్. తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ ఎమోషనల్ ఘట్టాలకు బలం చేకూర్చారు.

    సాంకేతికంగా తమన్ సంగీతం సినిమాకు ప్రాణవాయువు. పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. రాంప్రసాద్ ఛాయాగ్రహణం గ్రాండ్, ముఖ్యంగా కుంభమేళా, హిమాలయ సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. నిర్మాణ విలువలు పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

    ప్లస్ పాయింట్లు : Akhanda 2 Review

    • బాలకృష్ణ డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్
    • రెండో భాగంలో అఘోరా తాండవం, ఎలివేషన్ సీన్లు
    • తమన్ బీజీఎం, భావోద్వేగ ఘట్టాలు
    • దేశభక్తి-హిందూ ధర్మ గొప్పతనం చాటిన సన్నివేశాలు

    మైనస్ పాయింట్లు: Akhanda 2 Review

    • ప్రథమార్ధంలో కొన్ని సీన్లు కాస్త సాగతీతగా అనిపించడం
    • విలన్లకు పెద్దగా బలం లేకపోవడం

    చివరగా.. ‘అఖండ 2: తాండవం’ అంటే బాలకృష్ణ అభిమానులకు పండుగ, మాస్ ప్రేక్షకులకు పూనకాలు. మొదటి భాగం ఫార్ములానే అనుసరించినా, దాన్ని మరింత గ్రాండ్ స్థాయికి తీసుకెళ్లినందుకు బోయపాటి శ్రీనుకు, బాలయ్యకు జోహార్లు. థియేటర్‌లో గూస్‌బంప్స్, ఉద్వేగం, భక్తి రసం కావాలంటే ఈ చిత్రం మిస్ కాకూడదు.

    రేటింగ్: 3.75/5 : Akhanda 2 Review

    (గమనిక: ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

    ఇది కూడా చదవండి..: Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda2 Release Date Fix |అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్​.. డిసెంబర్ 12న గ్రాండ్​గా రిలీజ్

    Akhanda2 Release Date Fix |అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్​.. డిసెంబర్ 12న గ్రాండ్​గా రిలీజ్

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Akhanda2 Release Date Fix |ఐదు రోజులుగా సోషల్ మీడియా నుంచి వార్తా ఛానెళ్ల వరకు అన్నీ ‘అఖండ 2’ వాయిదా వార్తలతో నిండిపోయాయి. వివిధ రకాల ప్రచారాలు, వదంతులు, ఆరోపణలు, అభిమానుల ఆందోళనలు కలిసి ఈ విషయం రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. కాగా.. నిర్మాణ సంస్థ సినిమా విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. డిసెంబర్ 12న చిత్రం థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు 14 రీల్స్​ ప్లస్​ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.

    Akhanda2 Release Date Fix | అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్​.. డిసెంబర్ 12న గ్రాండ్​గా రిలీజ్

    Akhanda 2 release update

    ‘‘డబుల్ బ్లాక్‌బస్టర్ అనుభవాన్ని అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం” అని నిర్మాతలు పేర్కొన్నారు. అదనంగా డిసెంబర్ 11 రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటి నుంచి మరే మార్పు ఉండదని, చెప్పిన సమయానికి సమయానికే షోలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

    Akhanda2 Release Date Fix : 11న ప్రీమియర్​ షోస్​

    ప్రస్తుతం అభిమానులందరి దృష్టి డిసెంబర్ 11 అర్ధరాత్రి వచ్చే ఫస్ట్ షో టాక్ మీదే నెలకొని ఉంది. ఈ సందర్భంగా ప్రత్యేక రిలీజ్ ట్రైలర్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త మీనన్ తదితరులు ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించారు.

    మొదట్లో వాయిదా వార్త ఎంతోమంది అభిమానుల్లో నెగటివ్ భావన కలిగించినప్పటికీ, క్రమంగా ఈ నిర్ణయం సినిమా నాణ్యత కోసమే అని గ్రహించిన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ డిసెంబర్ 25 వరకు వెళ్తే ఇంకా ఆలస్యమవుతుందనే ఆందోళన కలిగిన వారికి ఈ ప్రకటన ఊరట కలిగించింది.

    Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.

    Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు

    సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన నిర్మాణ సంస్థ.. “అఖండ-2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేం మా వంతు అన్నీ ప్రయత్నాలు చేశాం. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఊహించని రీతిలో పరిస్థితులు మారిపోతాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ గారికి, దర్శకుడు బోయపాటి శ్రీను గారికి మా కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.

    Akhanda 2 release update

    Akhanda 2 release update | ఎన్నో పుకార్లు..

    ముందుగా డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేసిన ఈ చిత్రం, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఆలస్యం చుట్టూ ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇటీవలే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వదంతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను సద్దుమణిగేందుకు చొరవ తీసుకున్న వారిలో ఆయన కూడా ఒకరని సమాచారం.

    Akhanda 2 release update | నిర్మాత పోస్ట్​

    ప్రస్తుతం చిత్ర బృందం అన్ని అడ్డంకులను అధిగమించి, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని నిర్మాత రామ్​ ఆచంట సైతం ట్విట్టర్​లో స్పష్టం చేశారు.

  • This Week OTT Release | ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​  కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఇవే..

    This Week OTT Release | ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఇవే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: This Week OTT Release | ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఈ వారం ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్​ కానున్నాయి. ప్రేమ, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్, హరర్ నేపథ్యాలతో రూపొందిన సినిమాలు ఆద్యంతం టెన్షన్‌ను నింపుతూ ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి.

    This Week OTT Release
    This Week OTT Release

    This Week OTT Release | ది గర్ల్‌ఫ్రెండ్..

    షరతులు లేని ప్రేమికుల మధ్య ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను అత్యంత భావోద్వేగంగా చిత్రం ఈ చిత్రం. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి కథానాయకులుగా నటించగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అను ఇమాన్యుయేల్ మరో ముఖ్య పాత్రలో కనిపించించారు. ఇటీవల థియేటర్లలో విడుదలై యువతను ఎంతగానో ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

    This Week OTT Release | స్టీఫెన్..

    ఒకే సీజన్‌లో తొమ్మిది మంది మహిళలను దారుణంగా హతమార్చేసిన సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఉత్కంఠ రగిలిస్తుంది. ‘గార్గి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గోమతి శంకర్ హీరోగా నటించగా, మిథున్ బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ రోజు (డిసెంబర్ 5) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

    This Week OTT Release | జటాధర..

    సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. శిల్పా శిరోద్కర్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అభిషేక్ జైశ్వాల్, వెంకట్ కల్యాణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

    This Week OTT Release | డీయస్ ఈరే..

    మలయాళ సూపర్‌స్టార్ ప్రణవ్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్. ‘భూతకాలం’, ‘భ్రమయుగం’ వంటి విజయవంతమైన చిత్రాలిచ్చిన రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

    రణం అరం తవరేల్ (తెలుగులో ‘ది హంటర్: చాప్టర్-1’)..

    వైభవ్ హీరోగా నటించిన తమిళ థ్రిల్లర్ ఇది. నందితా శ్వేత, తాన్యా హోప్ కథానాయికలు. షెరీఫ్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది.

    ఇతర ప్లాట్‌ఫాంలలో విడుదల కానున్న చిత్రాలు..

    నెట్‌ఫ్లిక్స్

    • ది అబాండన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
    • ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
    • ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ 2 (ఇంగ్లీష్ మూవీ)
    • న్యూయార్క్ ఎట్ 100 (ఇంగ్లీష్ మూవీ)
    • జేకెల్లీ (ఇంగ్లీష్ మూవీ)

    ఆహా

    • ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు వెబ్ సిరీస్)

    అమెజాన్ ప్రైమ్ వీడియో

    • షూర్లీ టుమారో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
    • మ్యాన్ ఫైండ్స్ టేప్ (ఇంగ్లీష్ మూవీ – రెంటల్)

    ఈ వారం ఓటీటీలో రానున్న చిత్రాలు, వెబ్​సిరీస్​లు థ్రిల్లర్ అభిమానులను ఎంట్రటైన్​ చేయనున్నాయి. మీకు నచ్చిన చిత్రం ఏదైనా ఎంచుకుని ఆస్వాదించండి.

    ఇది కూడా చదవండి..: Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 postponed Reason | ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై తొలిసారి నోరు విప్పారు. హీరో శ్రీనందు నటించిన ‘సైక్ సిద్ధార్థ’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రం వాయిదా గురించి స్పష్టత ఇచ్చారు.

    “నేను కూడా ఉదయం నుంచి అఖండ 2కి సంబంధించిన ఆర్థిక ఇష్యూను క్లియర్ చేయడానికే బయట తిరిగాను. అందుకే ఈ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా వచ్చాను” చెప్పారు.

    Akhanda 2 release postponed

    Akhanda 2 postponed Reason | ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు..

    “అఖండ 2 సమస్య కేవలం కొన్ని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవే. అవి బయటకు చెప్పకూడని విషయాలు. కానీ ఇప్పుడు ఎవరి మనసు వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు.. ఇది చాలా దురదృష్టకరం. ‘ఎన్ని కోట్లు ఇవ్వలేదు’, ‘ఎవరికి డబ్బులు ఆపారు’ అని రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. అవన్నీ పూర్తిగా అనవసరమైన, పుకార్లు మాత్రమే. ప్రేక్షకులు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. Akhanda 2 postponed Reason త్వరలోనే ఈ ఆటంకం తొలగిపోతుంది, చిత్రం రిలీజ్ అవుతుంది. గతంలో కూడా అనేక సినిమాలు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని విజయవంతంగా విడుదలయ్యాయి” అని ఆయన చెప్పారు.

    డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సిన నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: ది తాండవం’ చిత్రం ఆఖరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత సురేశ్ బాబు ఇచ్చిన ఈ హామీ అభిమానులకు కొంత ఊరటనిచ్చే వార్తగా నిలుస్తోంది. త్వరలోనే అధికారిక కొత్త రిలీజ్ తేదీ ప్రకటన రానుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్​క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    Akhanda 2 release postponed | సోషల్​ మీడియాలో పోస్ట్​

    ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక భావోద్వేగ పోస్టు ద్వారా తెలియజేసింది. “అనివార్యమైన కారణాల వల్ల అఖండ 2ని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేకపోతున్నామని తీవ్ర బాధతో తెలియజేస్తున్నాం. ఈ క్షణం మాకు అత్యంత వేదననిచ్చింది. ప్రతి బాలయ్య అభిమాని, సినీ ప్రేమికుడు ఎదుర్కొనే నిరాశను మేం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం” అని పేర్కొంది. అలాగే వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించి సానుకూల వార్తతో మళ్లీ వస్తామని పేర్కొంది.

    ఈ ఆకస్మిక వాయిదాకు ఆర్థికపరమైన చిక్కులే కారణమని ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి ప్రీమియర్ షోలను రద్దు చేయడం, ఆ తర్వాత విడుదలను వాయిదా వేయడం చర్చకు దారి తీసింది.

    Akhanda 2 release postponed | కొత్త తేదీ​ ఎప్పుడో..

    కొత్త రిలీజ్ తేదీ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం లేదా వీకెండ్‌లోపు స్పష్టమైన ప్రకటన రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రూపొందిన ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మళ్లీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అఘోరగా మరో సారి శక్తివంతమైన పాత్రలో తెరపై అఖండ తాండవం చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, హర్షాలీ మల్హోత్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

    ఇది కూడా చదవండి..: Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai