Penci Sport plugin only working with the Soledad theme.

భక్తి - Telugu News Today

Category: భక్తి

పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం

  • Gupt Navratri 2026: నేటి నుంచి గుప్త నవరాత్రులు.. దీని విశిష్టత ఏమిటంటే..

    Gupt Navratri 2026: నేటి నుంచి గుప్త నవరాత్రులు.. దీని విశిష్టత ఏమిటంటే..

    Gupt Navratri 2026: నవరాత్రి పండుగ ప్రతియేటా నాలుగు సార్లు వస్తుంది. చైత్ర మాసం, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు సాధారణంగా ఎక్కువ మందికి తెలిసినవి. వీటిని ఘనంగా జరుపుకుంటారు. అయితే మాఘ మాసం, ఆషాఢ మాసంలో వచ్చే రెండు గుప్త నవరాత్రుల గురించి చాలా మందికి తెలియదు.

    Gupt Navratri 2026
    Gupt Navratri 2026

    గుప్త నవరాత్రులు ప్రధానంగా ఆధ్యాత్మిక సాధకులు, తాంత్రిక మార్గంలో నడిచే వారు రహస్యంగా ఆచరించే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దేవీ ఆరాధన ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించుకోవడం, జీవితంలోని అడ్డంకులను అధిగమించడం ప్రధాన ఉద్దేశంగా పండితులు చెబుతారు.

    Gupt Navratri 2026: నేటి నుంచి మాఘ గుప్త నవరాత్రులు

    2026లో మాఘ గుప్త నవరాత్రి జనవరి 19వ తేదీ ఆదివారం ప్రారంభమై జనవరి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. అష్టమి జనవరి 26, నవమి జనవరి 27, ఉపోషణ ముగింపు జనవరి 28న జరుగుతుంది.

    Gupt Navratri 2026
    Gupt Navratri 2026

    శుభ ముహూర్తాలు

    నవరాత్రి ప్రారంభంలో దేవీ ఆవాహనకు ఘటస్థాపన(కలశ స్థాపన) చేస్తారు. 2026లో మాఘ గుప్త నవరాత్రి ఘటస్థాపనకు శుభ సమయాలు ఇవే..

    • ఘటస్థాపన శుభ ముహూర్తం: జనవరి 19, 2026 ఉదయం 7:14 నుంచి 10:46 వరకు..
    • అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:11 నుంచి 12:53 వరకు..
    • ప్రతిపద తిథి: జనవరి 19 రాత్రి 1:21 నుంచి జనవరి 20 రాత్రి 2:14 వరకు..

    గుప్త నవరాత్రి అంటే ఏమిటి..

    “గుప్త” అంటే రహస్యమైనది అని అర్థం. సాధారణ నవరాత్రుల్లో ఊరేగింపులు, భజనలు, ప్రదర్శనలతో బహిరంగంగా జరుపుకుంటారు. కానీ గుప్త నవరాత్రి పూర్తిగా అంతర్ముఖమైన, రహస్య సాధనగా పేర్కొంటారు. తాంత్రిక విధానాలు, మంత్ర సాధన, దశ మహావిద్యల ఆరాధన ఇందులో ప్రధానంగా చెబుతుంటారు. రహస్యంగా చేసే ఆరాధనకు ఈ కాలంలో ప్రత్యేక శక్తి ఉంటుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. దేవీ దుర్గను సూక్ష్మ రూపాల్లో ఆరాధించడం ద్వారా జీవితంలోని అవరోధాలు తొలగుతాయని, అంతర్గత శక్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

    గుప్త నవరాత్రి ఎవరు ఆచరించాలి?

    ఈ పవిత్ర కాలం ప్రత్యేకంగా ఈ కింది వారికి అనుకూలం..

    • ఆధ్యాత్మిక సాధకులు, మంత్ర జపం-ధ్యానం చేసే వారు
    • జీవితంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నవారు
    • క్రమశిక్షణతో సాధన చేయాలని ఆసక్తి ఉన్న భక్తులు
    • బాహ్య గౌరవాల కంటే అంతర్గత బలాన్ని కోరుకునేవారు

    ఆచరించాల్సిన నియమాలు..

    • ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం
    • మొదటి రోజు చౌకీ ఏర్పాటు చేసి కలశ స్థాపన నిర్వహించడం
    • దుర్గా మంత్రాలు, దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశతి పారాయణం
    • ప్రతిరోజూ ఉదయం-సాయంత్రం ఆరతి నిర్వహించడం
    • ఉపవాసం ఆచరించేవారు పండ్లు, సాత్విక ఆహారం మాత్రమే సేవించడం

    గమనిక: మేం అందించిన ఈ కథనం ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం.. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    Top Links : ఇవి కూడా చదవండి

    1. Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!
    2. Times of India – Magha Gupt Navratri 2026: Date, Puja Muhurat, Rituals and Significance
    3. Economic Times – Gupt Navratri 2026 January: Dates, rituals, shubh muhurats, mantras…
  • Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

    Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Mauni Amavasya 2026 | సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైంది. అంతేకాకుండా మహోన్నతమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఇది మాఘ మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య. మాఘ అమావాస్య లేదా మాఘి అమావాస్య అనే పేర్లతో దీనిని పిలుస్తారు. ఈ ఏడాది మౌని అమావాస్య రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా సమకూరడంతో ఈ రోజు ఆధ్యాత్మిక మహత్త్వం మరింత ప్రముఖ్యత ఏర్పడింది.

    Mauni Amavasya 2026
    Mauni Amavasya 2026

    పుణ్యస్నానాలు, దానధర్మాలు..

    ఈ Mauni Amavasya 2026 రోజును దానధర్మాలు చేయడంతో పాటు పుణ్య స్నానాలు ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర దివ్య స్నానం ఆచరిస్తారు. కాగా.. 2026లో మౌని అమావాస్య జనవరి 18న రానుంది.

    మౌని అమావాస్య 2026 తేదీ, తిథి మరియు సమయం

    • మౌని అమావాస్య: జనవరి 18, 2026 (ఆదివారం)
    • అమావాస్య తిథి ప్రారంభం: జనవరి 18, 2026 రాత్రి 12:03 గంటల నుంచి..
    • అమావాస్య తిథి ముగింపు: జనవరి 19, 2026 రాత్రి 01:21 గంటల వరకు..

    మాఘ స్నానానికి ఎందుకు అంత ప్రాధాన్యం

    మౌని అమావాస్య రోజున దేవతలు స్వయంగా త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆదరించడం ద్వారా ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. మౌని అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల ఏర్పడే అద్భుతమైన ఖగోళ సంయోగం మోక్ష ప్రాప్తికి శుభప్రదమని భావిస్తారు.

    జన్మజన్మల పుణ్యఫలం

    ఈ రోజున మౌన వ్రతాన్ని ఆచరించి, భక్తి శ్రద్ధలతో సంగమ నీటిలో స్నానం చేసినవారి పాపాలన్నీ నశించి, పుణ్యఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈ రోజు ఎంతో పవిత్రమైందిగా చెబుతారు. దానధర్మాల విషయంలో నువ్వులు, ధాన్యాలు, వస్త్రాలు, గోదానం వంటివి చేయడం ఈ Mauni Amavasya 2026 రోజున ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.

    ఇది కూడా చదవండి..: Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

  • Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి దేవతలు భువికి దిగొచ్చే పవిత్రమైన రోజు..!

    Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి దేవతలు భువికి దిగొచ్చే పవిత్రమైన రోజు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.. ఈ విశిష్టమైన రోజు హిందూ సంప్రదాయంలో అత్యంత మహోన్నతమైన పర్వ దినాలలో ఒకటి. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేస్తారని భక్తుల విశ్వాసం. సాధారణంగా మార్గశిరశుద్ధ ఏకాదశి లేదా పుష్యశుద్ధ ఏకాదశి రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకతలు ఏమిటి? ఆచరించాల్సిన నియమాలను తెలుసుకుందాం..

    Vaikunta Ekadashi | ముక్కోటి ఏకాదశి విశిష్టత

    సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు వస్తాయి. అన్నీ పవిత్రమే అయినప్పటికీ, ముక్కోటి ఏకాదశి అత్యంత విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోని శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా గుర్తిస్తారు. శాస్త్రాల ప్రకారం.. ఈ రోజు మూడు కోట్ల దేవతలు భూమిపై అవతరిస్తారని నమ్మకం.

    Vaikunta Ekadashi | ఉత్తర ద్వార దర్శనం

    భక్తుల కోరికలను నెరవేర్చి, మోక్ష ప్రదానం చేసే ఈ తిథికి మోక్షదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చి, మూడు కోట్ల దేవతలతో పాటు భక్తులను అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

    Vaikunta Ekadashi | ఆచరించాల్సిన నియమాలు

    ధనుర్మాసంలో ఆధ్యాత్మికతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఈ పర్వదినం రోజు కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తుంటారు.

    • బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం ఉత్తమం. నదీ స్నానం చేయడం శ్రేష్ఠమైన ఫలితాన్ని ఇస్తుంది. అది సాధ్యం కాని వారు స్నాన జలంలో గంగాజలం కలిపి లేదా సమస్త పుణ్య నదులను ధ్యానంతో ఆవాహన చేసుకుని స్నానం చేయవచ్చు.
    • ఇంటి పూజాగృహాన్ని శుభ్రం చేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శ్రీ లక్ష్మీ నారాయణులను తులసి దళాలు, గంధం, పుష్పాలతో అలంకరించి షోడశోపచార పూజలు సమర్పించాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన చక్రపొంగలి నివేదన చేయడం మంచిది. ఆ తర్వాత వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవాలి. ఈ దర్శనం సర్వశుభాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అదనంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మోక్షాన్ని కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
    • ఈ రోజు ఉపవాసం ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోవడం వర్జితం. పగలంతా నిరాహారంగా ఉండి, సాయంత్రం చంద్రుడు ఉదయించకముందు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం స్వీకరించడం శ్రేష్ఠం.
    • రాత్రివేళ భగవంతుని నామస్మరణ, భజనలు, కీర్తనలు మరియు భాగవత చర్చలతో జాగరణ చేయాలి. ఈ జాగరణ వల్ల మూడు కోట్ల జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు తెలిపాయి.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    ఇది కూడా చదవండి..: Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

     

  • Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

    Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

    Horoscope 2026 | కొత్త సంవత్సరం 2026 అందరికీ కొత్త ఆశలు, అవకాశాలు మరియు అనుభవాలను తీసుకురానుంది. గ్రహాల స్థానచలనం ఆధారంగా కొందరికి ఈ ఏడాది అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా.. మరికొందరు కష్టపడి మెరుగైన ఫలితాలను సాధించాల్సి రానుంది. జీవితంలో అనుకూల దశలు, బలహీన సమయాలు ఎప్పుడు వస్తాయో ముందుగా తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రాశిఫలాలు మీకు 2026లో ఏ రంగాల్లో జాగ్రత్త అవసరం, ఏ సమయంలో చర్య తీసుకోవాలి అనే విషయాలను సూచిస్తాయి.

    Horoscope 2026

    Horoscope 2026 | మేష రాశి (Aries)

    2026లో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. వృత్తి రంగంలో కఠిన పరిశ్రమ అవసరం, అయినా ఫలితాలు కొంత ఆలస్యంగా లేదా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ పొదుపు కష్టమవుతుంది. ఆస్తి, వాహన సంబంధిత విషయాలు సాధారణంగానే సాగిపోతాయి. విద్యార్థులకు ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. ప్రేమ, వివాహ జీవితం సాధారణంగా సాగుతుంది. పెళ్లి కాని వారికి మాత్రం మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ వాతావరణంలో అప్పుడప్పుడు ఒడిదొడుకులు రావొచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

    Horoscope 2026 | వృషభ రాశి (Taurus)

    వృషభ రాశి వారికి 2026 చాలా అనుకూలమైన సంవత్సరంగా కనిపిస్తుంది. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా, మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. కార్యాలయంలో సహకారంతో పని చేస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. పొదుపు కూడా సాధ్యమవుతుంది. ఆస్తి, వాహన విషయాలు సాధారణంగా సాగుతాయి.. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ, వివాహ జీవితంలో సంతృప్తి, ఆనందం ప్రధానంగా ఉంటాయి. కుటుంబంలో శాంతి, సామరస్యం నెలకొంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది, సరైన జాగ్రత్తలతో ఎటువంటి సమస్యలు రావు.

    Horoscope 2026 | మిథున రాశి (Gemini)

    మిథున రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అయితే ఎక్కువగా సానుకూలంగానే ఉంటాయి. వృత్తి లేదా వ్యాపారంలో కొంత ఒడిదొడుకులు ఎదురైనా, ఓర్పుతో అధిగమిస్తే విజయం సాధ్యమవుతుంది. ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, వాహన విషయాలు సాధారణంగా సాగిపోతాయి. విద్యార్థులకు చదువులో మంచి సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది. అవివాహితులకు మంచి ప్రతిపాదనలు వస్తాయి. వివాహితులు సంబంధాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఆనందం, సామరస్యం ప్రధానంగా ఉంటాయి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది.

    Horoscope 2026 | కర్కాటక రాశి (Cancer)

    కర్కాటక రాశి వారికి 2026 కొంత సవాళ్లతో కూడిన సంవత్సరంగా ఉండవచ్చు. జాగ్రత్తగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. వృత్తి రంగంలో పనిభారం పెరిగినా, వ్యూహాత్మక నిర్ణయాలతో విజయం సాధించవచ్చు. ఆర్థికంగా ఆదాయం మంచిగా ఉంటుంది కానీ పొదుపు కష్టం. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. దృష్టి కేంద్రీకరిస్తే సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి. ప్రేమ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. సంవత్సరం రెండవ భాగం వివాహితులకు, వివాహ వయసు వారికి మంచిది. ఆరోగ్యం సాధారణంగా మంచిగా ఉంటుంది.

    Horoscope 2026 | సింహ రాశి (Leo)

    సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. సంవత్సరం మొదటి భాగం బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి రంగంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి విజయం సాధిస్తారు. ఆర్థికంగా మొదటి భాగంలో ఆదాయం, పొదుపు బాగుంటాయి. రెండవ భాగంలో ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి విషయాలు సాధారణం. విద్యార్థులకు మొదటి భాగం అనుకూలం, రెండవ భాగం దూరంగా చదువుకునే వారికి మంచిది. ప్రేమ, వివాహ జీవితం మొదటి భాగంలో బాగుంటుంది. కుటుంబ జీవితం సాధారణం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

    Horoscope 2026 | కన్య రాశి (Virgo)

    కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొన్ని రంగాల్లో లాభాలు, మరికొన్నింట్లో సవాళ్లు ఎదురవుతాయి. వృత్తి రంగంలో జాగ్రత్తగా పని చేస్తే విజయం సాధ్యం. ఆర్థికంగా బలోపేతం అవుతుంది. ఆస్తి కొనుగోళ్లకు అనుకూలం. విద్యార్థులు తమ కృషికి తగిన ఫలితాలు పొందుతారు. సంవత్సరం చివరి భాగంలో వివాహ, వైవాహిక విషయాలు శుభప్రదంగా ఉంటాయి. డిసెంబర్‌లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆరోగ్యంపై ఏడాది పొడవునా శ్రద్ధ వహించాలి.

    Horoscope 2026 | తులా రాశి (Libra)

    తులా రాశి వారికి 2026 ఎక్కువగా అనుకూలమైన సంవత్సరం. కొన్ని చిన్న సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలు లభిస్తాయి. వృత్తి రంగంలో ప్రయత్నాలకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా సమస్యలు ఉండవు. ఆస్తి కొనుగోళ్లకు మంచి సమయం. విద్యార్థులు కొద్దిగా దృష్టి తగ్గించవచ్చు. ప్రేమ సంబంధాల్లో కొన్ని అపార్థాలు రావచ్చు. వివాహ, వైవాహిక జీవితం శుభప్రదం. కుటుంబ జీవితం సమతుల్యంగా ఉంటుంది. సరైన ఆహారం, జీవనశైలితో ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

    Horoscope 2026 | వృశ్చిక రాశి (Scorpio)

    వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు. మొదటి భాగం కొంత సవాలుగా, రెండవ భాగం మరింత అనుకూలంగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్‌లో జాగ్రత్త అవసరం. వృత్తి రంగంలో అడ్డంకులు ఎదురైనా అనుభవంతో అధిగమించవచ్చు. ఆర్థికంగా రెండో భాగం మంచిది. ఆస్తి కొనుగోళ్లలో ఆటంకాలు రావచ్చు. విద్యార్థులు కష్టపడాలి. ప్రేమ సంబంధాల్లో సమతుల్యత కాపాడుకోవాలి; రెండవ భాగం అనుకూలం. కుటుంబ జీవితం శాంతియుతంగా ఉంటుంది. ఆరోగ్యం సున్నితంగా ఉండవచ్చు, జాగ్రత్త అవసరం.

    Horoscope 2026 | ధనుస్సు రాశి (Sagittarius)

    ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఏడాది పొడవునా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి రంగంలో అంకితభావం, దృష్టి అవసరం. ఆర్థికంగా సాధారణం; ఆస్తి పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులు కృషికి తగిన ఫలితాలు పొందుతారు. మొదటి భాగం సాధారణ విద్యార్థులకు, రెండో భాగం ఉన్నత చదువులకు మంచిది. ప్రేమ, వివాహ జీవితంలో సామరస్యం ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతం. ఆరోగ్యంపై రెండవ భాగంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి.

    Horoscope 2026 | మకర రాశి (Capricorn)

    మకర రాశి వారికి సాధారణంగా అనుకూలమైన సంవత్సరం. కొన్ని సవాళ్లు ఎదురైనా సానుకూల ఫలితాలు ఎక్కువ. వృత్తి, వ్యాపారంలో ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తి కొనుగోళ్లకు కొంత ప్రయత్నం అవసరం. విద్యార్థులు అంకితభావంతో ఫలితాలు పొందుతారు. ప్రేమ సంబంధాల్లో గౌరవం కాపాడితే మంచిది. రెండవ భాగం శుభప్రదం. కుటుంబంలో అపార్థాలు నివారించాలి. సమతుల్య ఆహారంతో ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

    Horoscope 2026 | కుంభ రాశి (Aquarius)

    కుంభ రాశి వారికి కొంత సవాలుతో కూడిన సంవత్సరం. జాగ్రత్తగా సాగితే సమతుల్య ఫలితాలు లభిస్తాయి. వృత్తి రంగంలో అంకితభావం అవసరం. ఆర్థికంగా అస్థిరత ఉండవచ్చు, పొదుపు కష్టం. ఆస్తి పెట్టుబడులకు అనుకూలం కాదు. విద్యార్థులకు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు. ప్రేమ, వివాహ జీవితంలో మొదటి భాగం బాగుంటుంది. రెండవ భాగంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న అవాంతరాలు రావొచ్చు. ఆరోగ్యంపై ఏడాది పొడవునా శ్రద్ధ వహించాలి.

    Horoscope 2026 | మీన రాశి (Pisces)

    మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొన్ని రంగాల్లో సానుకూలంగా ఉంటుంది. మరికొన్నింట్లో పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఆరోగ్యం మధ్య సమతుల్యత కాపాడుకోవాలి. ఆర్థికంగా రెండవ భాగం మంచిది. విద్యార్థులకు రెండో భాగం విజయవంతం. ప్రేమ, వివాహ విషయాలు జులై నుంచి డిసెంబర్ వరకు శుభప్రదమైన సమయం. కుటుంబ సంబంధాలు అవగాహనతో నిర్వహిస్తే సామరస్యం ఉంటుంది. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

  • Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

    Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Gajakesari Yoga | జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన రాజయోగాలలో గజకేసరి యోగం ఒకటి. ఈ అద్భుత యోగం డిసెంబర్ 8న మళ్లీ ఏర్పడబోతోంది. ఈ రోజున చంద్రుడు తన స్వరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో గురుడు ఉండడంతో చంద్ర-గురు సంయోగం జరిగి గజకేసరి రాజయోగం పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ అరుదైన యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ధనవృష్టి, ఆరోగ్యవృద్ధి, సర్వతోముఖ శ్రేయస్సు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడు రాశులకు ఈ యోగం అత్యంత శుభఫలదాయకంగా పరిణమించనుంది.

    గజకేసరి యోగం ఏర్పడినప్పుడు జీవితంలో స్థిరత్వం, గౌరవం, ఆదాయ వృద్ధి, మానసిక ప్రశాంతత వంటి అనేక శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ఈ యోగం వల్ల అత్యధిక లాభం పొందబోయే మూడు రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం..

    Gajakesari Yoga | మిథున రాశి

    మిథున రాశి వారికి డిసెంబర్ 8 తర్వాత ఆర్థిక ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టిన అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తవుతుంది. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. ఇంటి వాతావరణం సంతోషంగా, సౌమ్యంగా ఉంటుంది.

    Gajakesari Yoga | కర్కాటక రాశి

    ఈ గజకేసరి యోగం కర్కాటక రాశి వారికి స్వయంగా జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆర్థికంగా బలమైన స్థితి ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ధనలాభం, ఆస్తి విషయాల్లో శుభవార్తలు వినిపిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం, ఆనందం నిండుతాయి. విద్యార్థులకు పరీక్షల్లో రాణించే అవకాశం, పోటీ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించే యోగం కలిసివస్తుంది. ఏ పని చేపట్టినా అడ్డంకులు తొలగి సునాయాసంగా పూర్తవుతాయి.

    Gajakesari Yoga | కన్యా రాశి

    కన్యా రాశి వారికి ఈ యోగం ఆరోగ్యం, ధనం, సంతానం, వైవాహిక జీవితం రంగాల్లో అద్భుత ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఇంట శుభకార్యాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చి వివాహం కుదిరే అవకాశం బలంగా కనిపిస్తోంది. వ్యాపారులకు ఊహించని లాభాలు, కొత్త ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా పూర్తవుతాయి. మొత్తంమ్మీద ఈ రాశి వారి జీవితంలో సువర్ణ అధ్యాయం మొదలుకానుంది.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    ఇది కూడా చదవండి..: Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai