తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Macbook pro m5 | దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ తన అభిమానులను ఆకట్టుకునేలా నూతన మ్యాక్‌బుక్ ప్రోను (Macbook pro m5) భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఎమ్5 చిప్‌తో అత్యాధునికమైన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్ చేసేవారికి అద్భుతమైన వేగాన్ని అందించనుంది. దీని ధర రూ. 1,69,900ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రొఫెషనల్స్‌తో పాటు క్రియేటర్లకు వారి పనిని మరింత సులభతరంగా మారుస్తుందని కంపెనీ పేర్కొంది.
Macbook pro m5 | వేగవంతమైన పనితీరు.
ఆపిల్ లాంచ్ చేసిన ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా.. మ్యాక్‌బుక్ లైనప్‌ను మరింత శక్తివంతం చేసింది. గతంలోని ఎం4 చిప్‌తో పోలిస్తే.. ఈ ఎం 5 చిప్ ఏఐ పనుల్లో 3.5 రెట్లు వేగవంతమైన పనితీరు చూపిస్తుంది. గ్రాఫిక్స్‌లో 1.6 రెట్లు మెరుగైన ప్రదర్శనను కనబరుస్తుంది. దీనివల్ల క్రియేటివ్ యాప్‌లలో ఏఐ టూల్స్ మరింత సులభంగా వర్క్ అవుతాయి. అంతేకాకుండా ఎస్‌ఎస్‌డీ పనితీరు 2 రెట్లు వేగవంతంగా పనిచేస్తుంది. బ్యాటరీ లైఫ్ 24 గంటల వరకు ఉంటుంది.
Macbook pro m5 | స్పెసిఫికేషన్లు, ఫీచర్స్ ఇవే..
నూతన మ్యాక్‌బుక్ ప్రో 14 ఇంచ్ మోడల్‌తో వస్తోంది. ఇందులో 14.2 ఇంచ్ లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే రిజల్యూషన్ 3024×1964 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కంపెనీ తెచ్చింది. నానో – టెక్స్చర్ గ్లాస్ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇది రిఫ్లెక్షన్లను తగ్గించి మెరుగైన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఎం5 చిప్‌లో 10-కోర్ సీయూ (4 పర్ఫార్మెన్స్ కోర్లు, 6 ఎఫిషియెన్సీ కోర్లు), 10-కోర్ జీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్లు ఉన్నాయి. మెమరీ 16 జీబీ నుంచి 24 జీబీ వరకు లభ్యవమవుతున్నాయి. స్టోరేజ్ 512 జీబీ నుంచి వన్ టీబీ వరకు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఇచ్చిన 12 ఎంపీ సెంటర్ స్టేజ్ కెమెరాతో పాటు సిక్స్-స్పీకర్ స్పెషల్ ఆడియో సిస్టమ్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్ మరింత సౌకర్యంగా మారనుంది. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, ఎస్‌డీ కార్డ్ స్లాట్, హెడ్‌ఫోన్ జ్యాక్, హెడ్‌ఎంఐ పోర్ట్‌లు సైతం ఇందులో ఉన్నాయి. కాగా.. ఈ ల్యాప్‌టాప్ macOS తాహో అనే ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఇందులో స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
Macbook pro m5 | మ్యాక్‌బుక్ ప్రో ధరలు ఇలా..
- 16జీబీ ర్యామ్ / 512జీబీ స్టోరేజ్: రూ. 1,69,900
- 16జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్: రూ. 1,89,900
- 24జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్: రూ. 2,09,900 వేరియంట్లు ఉన్నాయి.
Macbook pro m5 | డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..
అయితే స్టూడెంట్స్ కోసం డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. స్టూడెంట్స్ ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ ద్వారా రూ. 10,000 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రీ-ఆర్డర్ ఆపిల్ వెబ్‌సైట్, దేశంలోని నాలుగు ఆపిల్ స్టోర్లు, అథరైజ్డ్ రీసెల్లర్ల ద్వారా చేసుకోవచ్చు. ఇక అధికారిక సేల్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
Read aslo : Gmail account | మీ జీమెయిల్ ఖాతా హ్యాక్ అయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!