The Family Man-3 | స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
‘ఫ్యామిలీ మ్యాన్-3’ని అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. స్ట్రీమింగ్ వివరాలను పంచుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘టాస్క్’ సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్‌పేయి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సీజన్‌లో యాక్షన్, థ్రిల్, సస్పెన్స్, ఎమోషన్ కలిపి ఒక పీక్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా అందించనున్నట్లు తెలుస్తోంది.
The Family Man-3 | సిరీస్‌లో నటీనటులు వీరే..
శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) ప్రధాన పాత్రతో పాటు, తల్పాడే (షరీబ్ హష్మి), సుచిత్ర తివారీ (ప్రియమణి) ఉన్నారు. ధృతి తివారీ (ఆశ్లేష ఠాకూర్), అరవింద్ (శరద్ ఖేల్కర్) మేజర్ విక్రమ్ (సందీప్ కిషన్) పాత్రలు మరోసారి తెరపై కనిపించనున్నాయి. ఇక తాజా సీజన్‌లో మరికొంత మంది కీలక పాత్రల్లో అలరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆర్టికల్ కూడా చదవండి..: Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
