తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Samantha Marriage | సమంత రూత్ ప్రభు మరోసారి దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. ప్రముఖ నటి సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-2 దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 1వ తేదీ సోమవారం తెల్లవారుజామున తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది.
Samantha Marriage | ఎరుపు రంగు చీరలో సమంత
వధువు సమంత సాంప్రదాయ ఎరుపు రంగు చీరలో కనిపించగా.. వరుడు రాజ్ నిడిమోరు క్రీమ్-బంగారు రంగుల కుర్తా పైజమాలో సొగసుగా ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యులు, అతి సన్నిహితుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు ఈశా ఫౌండేషన్ అధికారికంగా శుభాకాంక్షలు తెలియజేసింది.
Samantha Marriage | ‘భూత శుద్ధి వివాహం’గా..
ఈ వివాహాన్ని ‘భూత శుద్ధి వివాహం’గా నిర్వహించినట్లు ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో వెల్లడించింది. యోగ శాస్త్రంలో అత్యంత పవిత్రమైన ఈ విధానం.. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేస్తూ ఆధ్యాత్మిక స్థాయిలో లోతైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందని పేర్కొంది. భౌతిక, మానసిక, భావోద్వేగ స్థాయులకు అతీతంగా ఇద్దరి మధ్య శాశ్వతమైన సామరస్యాన్ని, ఆధ్యాత్మిక ఐక్యతను కలిగించేందుకు ఈ ప్రత్యేక వివాహ క్రతువు రూపొందించబడిందని ఫౌండేషన్ వివరించింది.
Samantha Marriage | గతే రెండేళ్లు వీరి మధ్య స్నేహం
గత రెండేళ్లుగా సమంత, రాజ్ నిడిమోరు మధ్య సన్నిహిత స్నేహం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘సిటాడెల్: హనీ బన్నీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వంటి ప్రాజెక్టుల సెట్స్‌లోనే వీరి అనుబంధం మొదలైందని ఇండస్ట్రీలో టాక్. అలాగే సమంత నిర్మాణ సంస్థ ‘శుభం’ పరిధిలో వచ్చిన చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆ చిత్రం విజయోత్సవ వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
వివాహం తర్వాత సమంత స్వయంగా సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు ఈ శుభవార్తను తెలియజేశారు. ఆ పోస్టులకు క్షణాల్లోనే లక్షలాది మంది నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెట్టారు.
ఇది కూడా చదవండి..: Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
