Penci Sport plugin only working with the Soledad theme.

Tech Tips - Telugu News Today

Tag: Tech Tips

  • Laptop Charging | ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    Laptop Charging | ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    Laptop Charging |ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: నేటి ఆధునిక యుగంలో కాలేజీ స్టుడెంట్​ నుంచి సాఫ్ట్​వేర్​ ఉద్యోగి వరకు ల్యాప్​టాప్​ తప్పనిసరి అయిపోయింది. నిత్యం జీవితంలో ఇది కూడా ఓ భాగంగా మారిపోయింది. ఆఫీస్​ వర్క్​, ప్రాజెక్ట్స్​ ఇలా ఏదీ చేయాలన్నా దీని అవసరం తప్పదు. ఈ నేపథ్యంలో ల్యాప్​టాప్​ను భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వాడే డివైజ్​ ఏ కంపెనీకి చెందినదైనా సరే.. దానిని నిర్వహణ అనేది ఎంతో ముఖ్యం. కొన్ని జాగ్రత్‌తలు తీసుఉకుంటూ వాడితే సుదీర్ఘకాలం బాగుంటుంది. ల్యాప్​టాప్​ నిర్వహణలో ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించాలో తెలుసుకుందామా మరి..

    Laptop Charging |ఇలా ఓపెన్ చేయకండి..

    ల్యాప్​టాప్​ను కొందరు ఒక మూల నుంచి తెరుస్తుంటారు. ఈజీగా ఉంటుందని ఇలా ఓపెన్ చేస్తుంటారు. అయితే తరచూ ఇలా చేయడం వల్ల పైభాగంలోని డిస్​ప్లే ఒకవైపు వంగిపోతుంది. దీంతో ఇటీవల కొన్ని ల్యాప్​టాప్​లను ఓపెన్ చేసేందుకు స్పెషల్​గా ‘బంప్’ ఇస్తున్నారు. ల్యాప్​టాప్​ను ఎప్పుడైనా సరే మధ్యలో నుంచే తెరవాలి. అంతేకాకుండా ల్యాప్​టాప్​లను ఒకవైపు నుంచి ఇతరులకు ఇవ్వడం.. ఒంటి చేతితో పట్టుకెళ్లడం సురక్షితం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. మెటల్​ బాడీ ఉండే డివైజ్​లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా.. ప్లాస్టిక్​తో చేసిన బాడీ ఉన్నవయితే కొన్ని సార్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

    Laptop Charging |వెంటిలేషన్​ ఉండేలా చూసుకోవాలి..

    ల్యాప్​టాప్​లకు వెంటిలేషన్​ ఉండేలా చూసుకోవడం అవసరం. బయటి గాలి లోపలికి వెళ్లడం, లోపలి గాలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ల్యాప్​టాప్​లలో ఫ్యాన్లు కింది వైపు ఉంటాయి. మనం ల్యాప్​టాప్​ను సోఫా, బెడ్, తొడలు, మెత్త(దిండు)పై ఉంచి వాడినట్లయితే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. దీంతో అవి త్వరగా వేడెక్కుతాయి. ఈ కారణంగా వాటి పనితీరు మందగించి ‘హ్యాంగ్’ అవుతూ ఉంటుంది.‌

    Laptop Charging |దుమ్ము దూళి లోపలికి వెళ్లకుండా..

    చాలామంది సాధారణంగా ల్యాప్​టాప్​ను షట్​డౌన్ చేసిన అనంతరం దానిని మూసివేయకుండా అలాగే వదిలేస్తారు. దీంతో దుమ్ము, ధూళి, చిన్నచిన్న అణువులు కీబోర్డు, స్పీకర్ల ద్వారా లోపలికి వెళ్తాయి. అవి హార్డ్​వేర్ కాంపోనెంట్లలోకి చేరడం మూలంగా పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే ల్యాప్​టాప్​ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

    ఇలా క్లీన్​ చేయండి..
    చాలామంది ల్యాప్​టాప్​ కీబోర్డుల్లో చేరిన దుమ్మును క్లీన్ చేయడానికి టూత్​బ్రష్ లాంటివి వాడుతుంటారు. అయితే ఇలా చేయకుండా మార్కెట్​లో అందుబాటులో ఉన్న ‘ల్యాప్​టాప్ క్లీనింగ్ కిట్’ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కీబోర్డు పాడవకుండా, డస్ట్ లోనికి వెళ్లకుండా తెరలు సైతం అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే​ స్క్రీన్​లను శుభ్రం చేయడానికి వాటర్ స్ప్రేలను వాడుతుంటారు. అలా చేయకూడదు. నీరు ల్యాప్​టాప్​ లోపలికి వెళ్లి హార్డ్​వేర్ కాంపోనెంట్ల ద్వారా షార్ట్​సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది.
    ల్యాప్‌టాప్ ఛార్జింగ్

    బ్యాటరీ విషయంలో జాగ్రత్తలు..
    సాధారణంగా చాలా మంది ల్యాప్​టాప్​లను వంద శాతం ఛార్జింగ్ చేస్తుంటారు. అలాగే జీీరో అయ్యే వరకూ వాడుతుంటారు. ఇది బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 20 – 80 శాతం ఛార్జింగ్ సురక్షితమని పేర్కొంటున్నారు. ల్యాప్​టాప్ కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఛార్జర్​ను వాడాలని సూచిస్తున్నారు. Laptop Charging :థర్డ్​పార్టీ సాఫ్ట్​వేర్​లు వినియోగించొద్దు..
    ​నెట్​లో కనిపించే థర్డ్​పార్టీ యాప్​లను చాలామంది ఇన్​స్టాల్ చేస్తుంటారు. అయితే ఇది వ్యక్తిగత గోప్యతతో పాటు ల్యాప్​టాప్​ పనితీరును దెబ్బతీస్తుంది. సంబంధిత మైక్రోసాఫ్ట్ స్టోర్, ప్లేస్టోర్​, యాప్​స్టోర్ ద్వారానే యాప్​లను ఇన్​స్టాల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్​వేర్​ ఇన్​స్టాలింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

    సమస్యలు వస్తే..
    ల్యాప్​టాప్​లలో సమస్యలు తలెత్తినసమయంలో దగ్గరలోని సర్వీస్ సెంటర్లకు వెళుతుంటారు. ఇలా చేయవద్దు. సంబంధిత కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే రిపేర్​కు ఇవ్వాలి. ముందు బయట రిపేర్ చేయించి.. అనంతరం ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్​కు వెళ్లడం వల్ల ఏడాది వరకు ఉండే వారంటీని సైతం నిరాకరిస్తారని నిపుణులు చెబుతున్నారు. (x.com/ze_rusty)

    Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Improve WiFi Speed |మీ ఇంట్లో వైఫై వేగం తగ్గిందా..? ఈ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోండి..!

    Improve WiFi Speed |మీ ఇంట్లో వైఫై వేగం తగ్గిందా..? ఈ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: మీ ఇంట్లో వై-ఫై వేగం సాధారణం కంటే నెమ్మదిగా వస్తోందా..? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసే ముందు.. మీరు స్వయంగా కొన్ని సులభతరమైన పరీక్షలు చేయవచ్చు. చిన్నచిన్న టెక్నిక్స్​ ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా..

    Improve WiFi Speed | మీ రౌటర్ స్థానం చెక్​ చేయండి..

    వై-ఫై వేగం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రౌటర్ అమర్చిన స్థానం. ఒకవేళ మీ రౌటర్ ఇంటి మూలలో లేదంటే విడిగా ఉన్న ప్రాంతంలో ఉంటే అది సిగ్నల్ బలంతో పాటు కనెక్టివిటీపై ప్రభావితం చూపిస్తుంది. వైర్‌లెస్ రౌటర్ మాములుగా ఒక అంతస్తు ఇంటిని కవర్ చేయగలదు. కానీ, మీరు బహుళ అంతస్తుల ఇంట్లో ఉన్నట్లయితే సిగ్నల్​ కవరేజ్ కోసం వైఫై ఎక్స్‌టెండర్లు లేదా మెష్ రౌటర్లను వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే రౌటర్‌ను సిగ్నల్స్ గోడలు, తలుపులు లాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వ్యాప్తి చెందే స్థానంలో ఉంచాలి.

    ‌How to Improve WiFi Speed : రౌటర్‌ను ఇంటి మధ్యలో ఉంచాలి..

    మీ వైఫై రౌటర్‌ను ఏర్పాటు చేయడానికి ఇంటి మధ్య భాగం అనువైన స్థలం. సాధారణంగా హాల్​ లేదా లివింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఇల్లు మొత్తం సిగ్నల్​ సమానంగా వస్తుంది. అంతేకాకుండా రౌటర్‌ను బుక్‌షెల్ఫ్ లేదా క్యాబినెట్ పైభాగం లాంటి ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేయడం మంచిది. ఇలా పెట్టడం వల్ల రౌటర్లు తక్కువ అడ్డంకులను ఎదుర్కోవడంతో పాటు సిగ్నల్​ను సమర్థవంతంగా ప్రసారం చేస్తుంది. దీని వల్ల వేగం బాగా ఉంటుంది.

    Improve WiFi Speed : రౌటర్‌ను ఈ ప్రదేశాల్లో పెట్టొద్దు..

    చాలా మంది రౌటర్‌ను టీవీల వెనుక లేదంటే ఫర్నిచర్ వెనుక, గృహోపకరణాల వెనుక ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సిగ్నల్​ కొంత వీక్​గా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. మైక్రోవేవ్ ఓవెన్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాల రౌటర్​ ఏర్పాటు చేయడం వల్ల సిగ్నల్ ప్రసారానికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి రౌటర్​ చుట్టు పక్కల ఇలాంటి పరికరాలు లేకుండా ఖాళీ ప్రదేశంలో ఉంచాలి.

    ఇలాంటి చిన్నచిన్న టిప్స్​ పాటించి మీ రౌటర్​ వేగాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు పాటించినా కూడా వైఫ్​ వేగం పెరగకపోయినట్లతే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంప్రదించాల్సి ఉంటుంది.

    Improve WiFi Speed
    Improve WiFi Speed

    Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!

    Follow Us : Whatsapp, Facebook, Twitter