Penci Sport plugin only working with the Soledad theme.

Tollywood News - Telugu News Today

Tag: Tollywood News

  • Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.

    Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు

    సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన నిర్మాణ సంస్థ.. “అఖండ-2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేం మా వంతు అన్నీ ప్రయత్నాలు చేశాం. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఊహించని రీతిలో పరిస్థితులు మారిపోతాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ గారికి, దర్శకుడు బోయపాటి శ్రీను గారికి మా కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.

    Akhanda 2 release update

    Akhanda 2 release update | ఎన్నో పుకార్లు..

    ముందుగా డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేసిన ఈ చిత్రం, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఆలస్యం చుట్టూ ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇటీవలే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వదంతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను సద్దుమణిగేందుకు చొరవ తీసుకున్న వారిలో ఆయన కూడా ఒకరని సమాచారం.

    Akhanda 2 release update | నిర్మాత పోస్ట్​

    ప్రస్తుతం చిత్ర బృందం అన్ని అడ్డంకులను అధిగమించి, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని నిర్మాత రామ్​ ఆచంట సైతం ట్విట్టర్​లో స్పష్టం చేశారు.

  • Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్​క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    Akhanda 2 release postponed | సోషల్​ మీడియాలో పోస్ట్​

    ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక భావోద్వేగ పోస్టు ద్వారా తెలియజేసింది. “అనివార్యమైన కారణాల వల్ల అఖండ 2ని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేకపోతున్నామని తీవ్ర బాధతో తెలియజేస్తున్నాం. ఈ క్షణం మాకు అత్యంత వేదననిచ్చింది. ప్రతి బాలయ్య అభిమాని, సినీ ప్రేమికుడు ఎదుర్కొనే నిరాశను మేం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం” అని పేర్కొంది. అలాగే వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించి సానుకూల వార్తతో మళ్లీ వస్తామని పేర్కొంది.

    ఈ ఆకస్మిక వాయిదాకు ఆర్థికపరమైన చిక్కులే కారణమని ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి ప్రీమియర్ షోలను రద్దు చేయడం, ఆ తర్వాత విడుదలను వాయిదా వేయడం చర్చకు దారి తీసింది.

    Akhanda 2 release postponed | కొత్త తేదీ​ ఎప్పుడో..

    కొత్త రిలీజ్ తేదీ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం లేదా వీకెండ్‌లోపు స్పష్టమైన ప్రకటన రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రూపొందిన ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మళ్లీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అఘోరగా మరో సారి శక్తివంతమైన పాత్రలో తెరపై అఖండ తాండవం చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, హర్షాలీ మల్హోత్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

    ఇది కూడా చదవండి..: Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Varanasi Movie | మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్​లో SSMB29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​ మూవీ టీం మహేశ్ పోస్టర్​తో పాటు టైటిల్, గ్లింప్స్​ను రివీల్ చేశారు. ఈ గ్లింప్స్​ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. నందీశ్వరుడిపై మహేశ్​ బాబు విజువల్స్​ అదరగొట్టాయి.

    Varanasi Movie | నందీశ్వరుడిపై మహేశ్​ ఎంట్రీ

    ఈవెంట్​లో స్టేజ్​పైకి మహేశ్ ఎంట్రీ నెక్ట్స్ లెవెల్​గా నిలిచింది. ఆయన సినిమా క్యాస్టూమ్ ధరించి నందీశ్వ‌రుడిపై కూర్చుని ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 50 ఫీట్ల ఎత్తులో క్రేన్​పై నిల్చుని అభిమానుల‌కు అభివాదం చేశారు. భారీ పబ్లిక్ ఈవెంట్​లో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఏ హీరోకైనా గ్రేట్ అచీవ్​మెంట్ అనే చెప్పాలి.

    Varanasi Movie

    Varanasi Movie | నా డ్రీమ్​ ప్రాజెక్టు

    గ్లోబ్​ ట్రాటర్​ ఈవెంట్​కు హాజరైన మహేశ్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ఇది ఒక నటుడికి లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ లాంటిందని పేర్కొన్నారు. ‘మీ అందర్నీ (ఫ్యాన్స్​) కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడకు నార్మల్​గానే వస్తానని చెప్పాను. కానీ, రాజమౌళి కుదరదని చెప్పి నాతో ఇలా స్పెషల్​గా చేయించారు. నన్ను పౌరాణిక సినిమా చేయ‌మ‌ని నాన్న‌గారు చాలాసార్లు అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు. ఈ సినిమా కోసం ఎంత కావాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అంద‌రూ గర్వించేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళి గారిని’ అని మహేశ్​ పేర్కొన్నారు.

    ‘వార‌ణాసి విడుద‌లైన అనంతరం దేశం మొత్తం గ‌ర్వంగా ఫీల‌వుతుంది. ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్ర‌మే. మున్ముందు ఎలా ఉండ‌బోతోందనేది మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నా. మీ మద్దతు ఎల్లపుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌ అనేది చాలా చిన్న మాటే. మీ అభిమానం మాటల్లో చెప్పలేను. ఈవెంట్‌ సజావుగా సాగడానికి సహకరించిన పోలీసు శాఖకు నా ధన్యవాదాలు’ అని మహేశ్ అన్నారు.

    Varanasi Movie

    Varanasi Movie | రాముడిగా మహేశ్‌..: రాజమౌళి

    దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా ప్రారంభించే ముందు ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా విశేషాలు చెబుతాను. అయితే, అన్నింటికీ చెప్పలేదు. కథకు ఉన్న ప్రాధాన్యం ఆధారంగా అది జరుగుతుంది. ఈ మూవీ గురించి మాటల్లో చెప్పలేం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక మాట చెప్పకుండా వీడియో చేద్దామని భావించాం. మార్చిలో ఈవెంట్‌ నిర్వహించి విడుదల చేద్దామని అనుకున్నా కుదరలేదు. జూన్‌, జులై నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు నవంబరు 15న మీ ముందుకు ఈ వీడియోను తెచ్చాం’ అని అన్నారు.

    ‘‘చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం నాకు అంతగా తెలియదు. ఎక్కువగా ఎన్టీఆర్‌ సినిమాలు చూస్తుండేవాడిని చూసేవాడిని. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే కృష్ణగారి గురించి అర్థమైంది. ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ ఆయన సినిమాల వల్లనే పరిచయమైంది. మనం తీసే సినిమాలను స్కోప్​లో తీసి.. ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు బ్లో అప్‌ చేస్తాం. కానీ అది నిజమైన ఐమ్యాక్స్‌ కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను అసలైన ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈవెంట్‌ కోసం మా టీం ఎంతో కష్టపడింది. మేం విడుదల చేసే వీడియో చూసి, ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలవ్వాలని అనుకున్నాం.’

    ‘ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. సినిమాలో మహేశ్‌బాబు పాత్ర.. ఇందుకు ఆయన పడిన కష్టం గురించి ప్రస్తుతం మాట్లాడను. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడతా.. మహేశ్​ నుంచి నేర్చుకునే లక్షణం ఒకటి ఉంది. మనం సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేం. కానీ, మహేశ్‌బాబు షూటింగ్‌కు వస్తే.. అస్సలు మొబైల్​ చూడరు. కారులోనే ఫోన్‌ను పెట్టేసి వస్తారు. ఏడెనిమిది గంటలైనా దాని జోలికి పోరు. నేను కూడా అలా ఉండేందుకు ప్రయత్నిస్తా. అది కచ్చితంగా నేర్చుకుంటా’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.

    ఇది కూడా చదవండి..: Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai