Penci Sport plugin only working with the Soledad theme.

ఆరోగ్య సలహాలు - Telugu News Today

Tag: ఆరోగ్య సలహాలు

  • Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

    Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు శరీరం నీరసంగా అనిపిస్తుందా.. నిస్తేజంగా ఉండడంతో పాటు ఏ పనీ చేయాలనిపించడం లేదా..

    Constant Fatigue Reasons-1
    Constant Fatigue Reasons

     

    Constant Fatigue Reasons: ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

    అంతేకాకుండా చిన్నచిన్న విషయాలు కూడా జ్ఞాపకం రావడం లేదా.. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది నిద్ర తగ్గిందనో, పని ఒత్తిడి ఎక్కువైందనో అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఈ సమస్యలకు అసలైన కారణం శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు తగ్గిపోవడమే అయి ఉండవచ్చని వారు తెలియజేస్తున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణాల గురించి తెలుసుకుందాం..

    విటమిన్ బి12 కీలకం

    విటమిన్ బి12ను శరీరంలో శక్తి ఉత్పత్తికి కీలకమైన పోషకంగా నిపుణులు పరిగణిస్తారు. ఇది రక్తహీనతను నివారిస్తుంది. అలాగే నాడీ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా, డీఎన్ఏ సంశ్లేషణ, శక్తి ఉత్పాదన మరియు కేంద్ర నాడీ వ్యవస్థ సక్రమ పనితీరుకు ఇది అత్యవసరంగా నిపుణులు చెబుతుంటారు. ఆహారం ద్వారా ఈ విటమిన్ సరిపడా అందకపోతే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం.. ఉత్తర భారతదేశంలో దాదాపు 47 శాతం మంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.

    వీటిలో పుష్కలం

    విటమిన్ బి12 జంతు ఆహార పదార్థాల్లో లభిస్తుంది. మాంసం, చేపలు, గుడ్లు, పాలు మరియు పాల ఉత్పత్తులలో ఇది పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారంలో ఈ విటమిన్​ సహజంగా తక్కువగా ఉంటుంది. దీంతో శాఖాహారులు ఎక్కువగా ఈ విటమిన్​ లోపం ఏర్పడుతుంది. అయితే, తృణధాన్యాలు, న్యూట్రిషనల్ ఈస్ట్ విటమిన్ బి12తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శాఖాహారులకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.

    విటమిన్ బి12 ఉపయోగాలు..

    ఎర్ర రక్త కణాల ఆరోగ్యం: ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు బి12 కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంది.

    నాడీ వ్యవస్థ పరిరక్షణ: నాడుల చుట్టూ ఉండే మైలిన్ షీత్‌ను కాపాడి, మెదడు మరియు నాడీ వ్యవస్థ సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది.

    మెదడు ఆరోగ్యం: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలంలో మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

    గుండె ఆరోగ్యం: రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

    ఇతర ప్రయోజనాలు: మానసిక ఆరోగ్యం, ఎముకల బలం, చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బి12 ముఖ్య పాత్ర వహిస్తుంది.

    విటమిన్ బి12 లోపం లక్షణాలు

    ప్రముఖ ఆరోగ్య సంస్థల అధ్యయనాల ప్రకారం.. ఈ విటమిన్ లోపం వల్ల కింది లక్షణాలు కనిపిస్తాయి. నిరంతర అలసట మరియు నీరసం, చర్మం పాలిపోవడం లేదా పసుపు రంగు ఏర్పడడం, తరచుగా తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే మానసిక కుంగుబాటు లక్షణాలు, జీర్ణసంబంధిత ఇబ్బందులు, ఏకాగ్రత లోపించడం, నోటి పుండ్లు, నాలుక వాపు, ఆకస్మిక బరువు తగ్గడం లాంటివి కనబడతాయి.

    Constant Fatigue Reasons-2
    Constant Fatigue Reasons-2

    పైలక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా విటమిన్ బి12 స్థాయిలను తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సమస్యను నివారించవచ్చు.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.

    Healthy Diet – health tips: 30 ఏళ్లు దాటిన వాళ్ళు తప్పక తినవాలసిన Foods!

    Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

  • Manasika Arogyam | మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్​ మీకోసమే..!

    Manasika Arogyam | మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్​ మీకోసమే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Manasika Arogyam | నేటి బిజీబిజీ జీవితంలో నిత్య జీవితంలో మనిషి మానసిక ఒత్తిళ్లు కామన్​ అయిపోయారు. ఒకవైపు ఆఫీస్​లో పని ఒత్తిడి, మరోవైపు ఇంటి సమస్యలు ఇలా ఇతర ఇబ్బందులు మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయనేది మనందరికీ తెలిసిందే. యాంగ్జైటీ, డిప్రెషన్​ లాంటివి రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో మానసికంగా ధృడంగా, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్స్​ ఫాలో అయితే బెటర్​. అవేంటో తెలుసుకుందామా మరి..

    మనిషి జీవితంలో మానిసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మనస్సు బాగుంటేనే శరీరం సైతం బాగుంటుంది. అందుకే మెంటల్​ స్ట్రెస్​ను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అది కొరవడితే ఉద్యోగం, వ్యాపారం, చదువు ఇలా ఎందులోనైనా రాణించాలంటే కష్టమవుతుంది. అంతేకాకుండా కుటుంబీ, స్నేహితులతో సంబంధాలు సైతం దెబ్బతినే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మన పరిస్థితి గురించి మనం అంచనా వేసుకుంటూ ఉండాలి.

    Manasika Arogyam | ఒంటరితనం సమస్య..

    ఒంటరితనం అనేది మానసికంగా కుంగదీస్తుంది. ఒక్కరే ఖాళీగా ఉండడం వల్ల అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. గతాన్ని తలచుకొని బాధపడడం, అలా చేసి ఉండకపోకపోతే బాగుండేదమో అంటూ దీర్ఘాలోచనలు మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇలాంటి ఆలోచనల వల్ల ఒరిగేదేమీ ఉండదు అని అర్ధం చేసుకోవాలి. దీనిని బయట పడాలంటే స్నేహితుల గడపాలి. లేదంటే పిల్లలతో కాసేపు సరదాగా టైం స్పెండ్​ చేయాలి. ఒక్కరే ఉన్నట్లయితే కామెడీ చిత్రాలు చూడాలి. రోజూ కాసేపు ధ్యానం చేస్తే అనవసర ఆలోచనలు తగ్గుతాయని సలహా ఇస్తున్నారు. వీటితో పాటు స్నేహితులతో కూర్చుని ఆడే చదరంగం వంటి ఆటలు ఆడాలని సూచిస్తున్నారు. మనసుకు ఉల్లాసం కలిగే పనులు చేయడం వల్ల మానసికంగా ప్రశాతంగా ఉంటాం.

    ‌Manasika Arogyam | నవ్వుతో ఉపయోగాలెన్నో..

    నవ్వు అనేది మన ఆయుష్షును పెంచుతుందని అందరికీ తెలిసిందే. ఎక్కువ కాలం జీవించే వారిని పరిశీలిస్తే వీరు నిత్యం జీవితంలో ఎక్కువగా నవ్వుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. భయం, కోపం వంటి ప్రతికూల భావనల ద్వారా మన శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు విడుదలవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. నవ్వును పుట్టించే హార్మోన్లు ఈ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండే పనులు చేయండి. స్నేహితులతో జోకులు వేయడం, కామెడీకి సంబంధించిన సినిమాలు, సన్నివేశాలు చూసి నవ్వుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు ఒత్తిడితో పాటు నిరాశ, ఆందోళనను తగ్గిస్తుందని mayoclinic అధ్యయనం తేల్చింది.

    Manasika Arogyam: క్రమం తప్పకుండా ఇవి చేయండి..

    మనిషి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, పుష్కలంగా నీరు తీసుకోవడం ముఖ్యం. వీటి వల్ల మనలోని శక్తి, దృష్టి మెరుగవుతుందని National Institute of Mental Health అధ్యయనం తెలిపారు. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు వాకింగ్​ చేయడం ద్వారా మానసిక స్థితి మెరుగడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకేం మరి ఈ టిప్స్​ ఫాలో అయ్యి మానసికంగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేయండి.
    ‌‌
    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చాం. వీటిని పాటించే ముందు మీరు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

    ఈ క్రింది Clove Health Benefits: లవంగాలతో లాభాలెన్నో..! ఓ లుక్కేయండి..

    Clove Health Benefits: లవంగాలతో లాభాలెన్నో..

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai