తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Manasika Arogyam | నేటి బిజీబిజీ జీవితంలో నిత్య జీవితంలో మనిషి మానసిక ఒత్తిళ్లు కామన్ అయిపోయారు. ఒకవైపు ఆఫీస్‌లో పని ఒత్తిడి, మరోవైపు ఇంటి సమస్యలు ఇలా ఇతర ఇబ్బందులు మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయనేది మనందరికీ తెలిసిందే. యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో మానసికంగా ధృడంగా, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే బెటర్. అవేంటో తెలుసుకుందామా మరి..
మనిషి జీవితంలో మానిసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మనస్సు బాగుంటేనే శరీరం సైతం బాగుంటుంది. అందుకే మెంటల్ స్ట్రెస్‌ను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అది కొరవడితే ఉద్యోగం, వ్యాపారం, చదువు ఇలా ఎందులోనైనా రాణించాలంటే కష్టమవుతుంది. అంతేకాకుండా కుటుంబీ, స్నేహితులతో సంబంధాలు సైతం దెబ్బతినే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మన పరిస్థితి గురించి మనం అంచనా వేసుకుంటూ ఉండాలి.
Manasika Arogyam | ఒంటరితనం సమస్య..
ఒంటరితనం అనేది మానసికంగా కుంగదీస్తుంది. ఒక్కరే ఖాళీగా ఉండడం వల్ల అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. గతాన్ని తలచుకొని బాధపడడం, అలా చేసి ఉండకపోకపోతే బాగుండేదమో అంటూ దీర్ఘాలోచనలు మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇలాంటి ఆలోచనల వల్ల ఒరిగేదేమీ ఉండదు అని అర్ధం చేసుకోవాలి. దీనిని బయట పడాలంటే స్నేహితుల గడపాలి. లేదంటే పిల్లలతో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయాలి. ఒక్కరే ఉన్నట్లయితే కామెడీ చిత్రాలు చూడాలి. రోజూ కాసేపు ధ్యానం చేస్తే అనవసర ఆలోచనలు తగ్గుతాయని సలహా ఇస్తున్నారు. వీటితో పాటు స్నేహితులతో కూర్చుని ఆడే చదరంగం వంటి ఆటలు ఆడాలని సూచిస్తున్నారు. మనసుకు ఉల్లాసం కలిగే పనులు చేయడం వల్ల మానసికంగా ప్రశాతంగా ఉంటాం.
Manasika Arogyam | నవ్వుతో ఉపయోగాలెన్నో..
నవ్వు అనేది మన ఆయుష్షును పెంచుతుందని అందరికీ తెలిసిందే. ఎక్కువ కాలం జీవించే వారిని పరిశీలిస్తే వీరు నిత్యం జీవితంలో ఎక్కువగా నవ్వుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. భయం, కోపం వంటి ప్రతికూల భావనల ద్వారా మన శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు విడుదలవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. నవ్వును పుట్టించే హార్మోన్లు ఈ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండే పనులు చేయండి. స్నేహితులతో జోకులు వేయడం, కామెడీకి సంబంధించిన సినిమాలు, సన్నివేశాలు చూసి నవ్వుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు ఒత్తిడితో పాటు నిరాశ, ఆందోళనను తగ్గిస్తుందని mayoclinic అధ్యయనం తేల్చింది.

Manasika Arogyam: క్రమం తప్పకుండా ఇవి చేయండి..
మనిషి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, పుష్కలంగా నీరు తీసుకోవడం ముఖ్యం. వీటి వల్ల మనలోని శక్తి, దృష్టి మెరుగవుతుందని National Institute of Mental Health అధ్యయనం తెలిపారు. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా మానసిక స్థితి మెరుగడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకేం మరి ఈ టిప్స్ ఫాలో అయ్యి మానసికంగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేయండి.
గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చాం. వీటిని పాటించే ముందు మీరు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
ఈ క్రింది Clove Health Benefits: లవంగాలతో లాభాలెన్నో..! ఓ లుక్కేయండి..
Clove Health Benefits: లవంగాలతో లాభాలెన్నో..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!