Penci Sport plugin only working with the Soledad theme.

food storage tips - Telugu News Today

Tag: food storage tips

  • stainless steel containers | స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడని ఫుడ్​ ఐటమ్స్​ ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

    stainless steel containers | స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడని ఫుడ్​ ఐటమ్స్​ ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: stainless steel containers | ప్రాచీన కాలంలో మన పూర్వీకులు వంటకు, నిల్వకు మట్టి పాత్రలే వాడేవారు. కానీ ఆధునిక జీవనశైలితో పాటు అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఇళ్లలో ఎక్కువైపోయాయి. గ్రామాల్లో కూడా ఇప్పుడు స్టీల్ వస్తువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. శుభ్రం చేయడం సులువు. అయితే ఈ సౌలభ్యం వెనుక కొన్ని ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు.

    స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, కొన్ని ఆమ్ల (యాసిడ్) లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో రసాయనిక చర్య జరిగి, స్టీల్‌లోని లోహ అంశాలు (క్రోమియం, నికిల్, ఇనుము మొ.) స్వల్ప మోతాదులో ఆహారంలో కలిసే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యానికి హానికరం కావొచ్చు, రుచి–వాసన కూడా మారిపోతుంది. అందుకే కొన్ని ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాల్లో ఎక్కువ సేపు నిల్వ చేయడం మానేయడం మంచిది.

    stainless steel containers

    stainless steel containers | పచ్చళ్లు

    భారతీయ వంటలో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉప్పు, మసాలా, నూనెతో పాటు పుల్లని రసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్లత్వం, ఉప్పు స్టీల్‌తో స్పందించి పాత్రను తుప్పు పట్టిస్తుంది. ఫలితంగా లోహ రేణువులు పచ్చడిలో కలిసి ఆరోగ్యానికి హాని చేకూర్చవచ్చు. అందుకే ఎప్పటి నుంచో మన పెద్దలు పచ్చళ్లను గాజు లేదా పింగాణీ వాటిల్లోనే నిల్వ చేసేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించడం ఉత్తమం.

    stainless steel containers | పుల్లని ఆహార పదార్థాలు

    నిమ్మకాయ, టమాటో, చింతపండు, ఉసిరి వంటి పుల్లని పదార్థాల్లో సిట్రిక్ యాసిడ్, మరియు మాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని స్టీల్ డబ్బాలో ఎక్కువ సేపు నిల్వ చేస్తే ఆమ్లం స్టీల్‌ను కరిగించి విషకరమైన సమ్మేళనాలు ఏర్పరుస్తుంది. ఫలితంగా ఆహారం చేదుగా మారడంతో పాటు గుండెల్లో మంట, అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి పుల్లని గ్రేవీలు, రసాలను గాజు బాటిల్స్ లేదా ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో మాత్రమే భద్రపరచాలి.

    stainless steel containers

    stainless steel containers | పెరుగు, పెరుగుతో చేసిన వంటకాలు

    పెరుగు సహజంగానే ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. స్టీల్ డబ్బాలో నిల్వ చేస్తే త్వరగా పులిసిపోతుంది. రుచి–వాసన పోతుంది, పోషక విలువలు కూడా తగ్గుతాయి. అందుకే మన ఇళ్లలో ఇప్పటికీ పెరుగును మట్టి లేదా గాజు పాత్రలోనే పెట్టే సంప్రదాయం ఉంది. మట్టి పాత్ర అయితే పెరుగు చల్లగా, తాజాగా ఎక్కువ రోజులు ఉంటుంది.

    stainless steel containers | తాజా పండ్లు (ముఖ్యంగా ఆమ్లత్వం ఎక్కువ ఉన్నవి)

    ఆపిల్, నారింజ, ద్రాక్ష, కివీ వంటి పండ్లను స్టీల్ డబ్బాలో పెడితే త్వరగా నల్లబడతాయి లేదా మృదువుగా మారి పాడైపోతాయి. స్టీల్ ఉపరితలం తేమను పీల్చుకుని పండ్లలో ఆక్సిడేషన్ వేగంగా జరిగేలా చేస్తుంది. అందుకే ఫ్రిజ్‌లో ఉన్నా సరే, పండ్లను ప్లాస్టిక్ లేదా గాజు ట్రేల్లోనే ఉంచడం మంచిది.

    stainless steel containers | తేనె

    తేనెలో సహజ ఆమ్లాలు ఉంటాయి. స్టీల్‌తో ఎక్కువ కాలం సంబంధం ఉంటే స్వల్పంగా లోహ రుచి వచ్చే అవకాశం ఉంది. అందుకే సంప్రదాయంగా తేనెను గాజు బాటిల్స్‌లోనే నిల్వ చేస్తారు.

    స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వంటకు, సాధారణ నిల్వకు ఎంతో ఉపయోగకరం అయినప్పటికీ, ఆమ్లత్వం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలతో జాగ్రత్త అవసరం. గాజు, మట్టి, లేదా ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ పాత్రలు ఈ సందర్భాల్లో ఎప్పుడూ సురక్షితమైన, ఆరుచికరమైన ఎంపికలు. చిన్న జాగ్రత్తతోనే మన ఆహారం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

    ఇది కూడా చదవండి..: soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

    Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Storing eggs in the fridge | ‘సండే హోయా మండే.. రోజ్​ కావో అండే..’ ఇది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటన. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ప్రజలకు వివరించేందుకు గతంలో ఈ ప్రకటన ఇచ్చేది. గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఉంటాయన్న మాట. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే గుడ్లను ఎలా నిల్వచేయాలనేది కూడా ముఖ్యం.

    చాలా మంది మార్కెట్ నుంచి తీసుకువచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తుంటారు. ఇలా వీటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్​లో ఉంచి తినటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్​లో గుడ్లు ఎన్ని రోజులు పెట్టవచ్చు. అసలు వీటిని అలా నిల్వ చేయవచ్చా.. ఫ్రీజ్​లో ఉంచిన గుడ్లు ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
    సాధారణంగా అందరి ఇళ్లలో గుడ్లను ఫ్రిజ్​లో నిల్వ చేయడం చూస్తుంటాం. గుడ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని అలా ఫ్రిజ్‌లో పెడుతుంటాయి. అయితే, వీటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే.. వాటిలో ఉండే పోషకాలు చాలా వరకు తగ్గిపోతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. దీంతో గుడ్ల వల్ల శరీరానికి లభించే ప్రయోజనాల కన్నా.. నష్టం ఎక్కువ జరుగుతుందంటున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకుండా చూసుకోవడం ఉత్తమం. తప్పనిసరి అయితే.. చాలా తక్కువ రోజులు ఉంచాలని సూచిస్తున్నారు.

    Storing eggs in the fridge | ఎక్కువ రోజులు ఉంచినట్లయితే..

    గుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్​లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటిలోని పోషకాలు అందవట. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట. గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదని చెబుతున్నారు. గుడ్లను నిల్వ చేయాలనుకుంటే ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి ఉంచాలి. అయితే ఫ్రిజ్‌లో పెట్టే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి.

    Storing eggs in the fridge అయితే గుడ్లను అవసరమైన వరకు ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా పోషకాలు అందుతాయంటున్నారు.

    గమనిక: మేం అందించిన ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో లభ్యమైన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటిని పాటించే ముందుకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

    FAQ: Storing eggs in the fridge

    1. గుడ్లను ఫ్రిజ్‌లో సరిగ్గా ఎలా దాచాలి?

    • ముందుగా, గుడ్లను అసలు కార్టన్‌లోనే ఉంచండి,

      ఫ్రిజ్ తలుపు మీద కాకుండా, మధ్య షెల్ఫ్‌లో పెట్టండి.

    2. గుడ్లు బయట ఉంచితే ఎన్ని రోజులకు చెడిపోతాయి ?

    • ప్యాక్ తేదీ నుంచి + 30 రోజులు.

    ఈ  Samsung Wallet లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai