తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. తన వాలెట్‌లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్ వాలెట్‌లో ఇక నుంచి పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా శాంసంగ్ యూజర్లు బయోమెట్రిక్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా చెల్లింపు చేసే సౌకర్యం తేనుంది. దీంతో ప్రతి ట్రాన్సాక్షన్‌కు పీన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
Samsung Wallet | ఇక నుంచి ఆ అవసరం ఉండదు..
కొత్త ఫీచర్లపై శాంసంగ్ ఇండియా సర్వీసెస్ అండ్ యాప్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ మధుర్ చతుర్వేది స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఫీచర్‌ను డిసెంబర్ నుంచి అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. “శాంసంగ్ వాలెట్ అథెంటికేషన్ అనుభవం మరింత మెరుగుపడింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, డివైస్ ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా రోజువారీ చెల్లింపులకు PIN ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు” అని వివరించారు. “యూజర్లు గెలాక్సీ డివైస్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా యాప్ ఓపెన్ చేసి UPI పేమెంట్స్ చేయవచ్చు.” అని పేర్కొన్నారు.
Samsung Wallet | వీటికి సైతం..
సామ్‌సంగ్ వాలెట్ త్వరలో క్రెడిట్, డెబిట్ కార్డులు, కీ మర్చంట్లలో ఆన్లైన్లో ఉపయోగించడానికి సపోర్ట్ చేయనుంది. యూజర్లు గూడ్స్, సర్వీసెస్ కొనుగోలు చేసిన సమయంలో శాంసంగ్ వాలెట్ ద్వారా సేఫ్‌గా టోకెనైజ్ చేసిన కార్డులతో సీమ్‌లెస్‌గా పేమెంట్ చేయవచ్చు. అంతేకాకుండా కార్డ్ డీటెయిల్స్ మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చెక్‌అవుట్‌ను మరింత వేగవంతం చేస్తుంది.
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!