Penci Sport plugin only working with the Soledad theme.

OpenAI - Telugu News Today

Tag: OpenAI

  • ChatGPT Images | ఓపెన్ AI నుంచి మేజర్ అప్‌డేట్.. గూగుల్ ‘నానో బనానా ప్రో’కు పోటీగా అత్యాధునిక ఇమేజ్ జనరేషన్..

    ChatGPT Images | ఓపెన్ AI నుంచి మేజర్ అప్‌డేట్.. గూగుల్ ‘నానో బనానా ప్రో’కు పోటీగా అత్యాధునిక ఇమేజ్ జనరేషన్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ChatGPT Images: ఓపెన్‌ ఏఐ సంస్థ తన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్‌జీపీటీ నుంచి కీలక అప్​టేడ్​ వచ్చింది. ఇటీవల కంపెనీ తన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ “చాట్‌జీపీటీ ఇమేజెస్”కు గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందించింది. ఈ నూతన సంస్కరణ ఓపెన్‌ఏఐ అత్యంత అభివృద్ధి చెందిన ఇమేజ్ మోడల్ “జీపీటీ ఇమేజ్ 1.5” ఆధారంగా పనిచేస్తుంది. ఈ అప్‌డేట్​తో ఇమేజ్ సృష్టి ప్రక్రియ నాలుగు రెట్లు వేగవంతమవుతోంది. అదే సమయంలో వినియోగదారుల సూచనలను మరింత కచ్చితత్వంతో అనుసరిస్తుంది. ChatGPT Images ఇమేజ్‌లోని ముఖ్యమైన వివరాలను అలాగే ఉంచి కేవలం అవసరమైన భాగాలను మాత్రమే సవరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ChatGPT Images, ఈ కొత్త మోడల్ మునుపటి సంస్కరణల కంటే మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఫలితంగా.. వినియోగదారులు ఇచ్చే ప్రాంప్ట్‌లకు బాగా సమీపంగా ఉండే చిత్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇది గూగుల్ ‘నానో బనానా ప్రో’ మోడల్‌కు నేరుగా పోటీ ఇవ్వగల స్థాయిలో ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    చాట్‌జీపీటీ ఇమేజెస్ కొత్త అప్‌డేట్ స్పెషాలిటీలు

    జీపీటీ ఇమేజ్ 1.5 మోడల్ పాత ఇమేజ్ జనరేషన్ సిస్టమ్‌ను పూర్తిగా భర్తీ చేస్తుంది. దీని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. వినియోగదారులు కొత్త చిత్రాలు సృష్టించినా లేదా ఇప్పటికే ఉన్న ఫొటోలను సవరించినా.. మోడల్ సూచనలను బాగా అర్థం చేసుకుని కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఎడిటింగ్ సమయంలో లైటింగ్, కంపోజిషన్, వ్యక్తుల రూపు వంటి ముఖ్య అంశాలను మార్చకుండా ఉంచు.. కేవలం మార్పులను మాత్రమే అమలు చేస్తుంది.

    ChatGPT Images
    ChatGPT Images

    ChatGPT Images : ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?

    ముందుగా చాట్‌జీపీటీ యాప్ లేదా వెబ్‌సైట్ (chatgpt.com)ను తెరవాలి. సైడ్‌బార్‌లో కొత్తగా జోడించిన “ఇమేజెస్” ట్యాబ్‌ను గమనించవచ్చు. దీనిపై క్లిక్ చేసి.. “క్రియేట్” ఆప్షన్‌ను ఎంచుకోండి.

    కొత్త ఇమేజ్ సృష్టించడానికి..

    • మీకు కావాల్సిన చిత్రం గురించి వివరంగా ప్రాంప్ట్ టైప్ చేయండి.
    • ఎంటర్ నొక్కండి లేదా సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి.
    • కొత్త ఇంటర్‌ఫేస్‌లో ప్రీసెట్ స్టైల్స్, ఫిల్టర్స్ మరియు ట్రెండింగ్ ప్రాంప్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించి సృజనాత్మకతను సులభంగా అన్వేషించవచ్చు.

    ఇప్పటికే ఉన్న ఇమేజ్‌ను ఎడిట్ చేయడానికి..

    • ఇమేజెస్ సెక్షన్‌లో మీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
    • కావాల్సిన మార్పులను ప్రాంప్ట్ రూపంలో రాయాలి. (ఉదా: ఒక వస్తువును జోడించడం, తొలగించడం లేదా స్టైల్ మార్చడం).
    • మోడల్ ఆ మార్పులను అమలు చేసి, మిగతా వివరాలను అలాగే ఉంచుతుంది.
    • అవసరమైతే మరిన్ని మార్పుల కోసం పునరావృత్తి చేయవచ్చు.

    ఓపెన్‌ఏఐ ఈ అప్‌డేట్ ద్వారా ఇమేజ్ సృష్టి, ఎడిటింగ్‌ను మరింత ఆహ్లాదకరంగా, సృజనాత్మకంగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫీచర్ ఫ్రీ, ప్లస్, ప్రో వంటి అన్ని సబ్‌స్క్రిప్షన్ స్థాయుల వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ మెరుగైన సాంకేతికతతో చాట్‌జీపీటీ ఇమేజెస్ ఇప్పుడు సృజనాత్మక పనులకు మరింత శక్తివంతమైన సాధనంగా మారింది.

    ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

    ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Chat GPT | చాట్​జీపీటీ యూజర్లకు ఓపెన్​ ఏఐ గుడ్​న్యూస్ చెప్పింది. భారత్​లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్​ను ఉచితంగా అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్​ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్​ ఏడాది పాటు చెల్లుబాటు కానుంది.

    Chat GPT | గతంలో నెలకు రూ.399

    ఈ ప్లాన్ గతంలో వినియోగించుకోవాలంటే నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఓపెన్​ఏఐకి భారత్​ రెండో అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో కంపెనీ తన AI టూల్స్​ను ఇక్కడ విస్తరించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. విద్య, వ్యాపారం, కోడింగ్, ఇతర ప్రాజెక్టుల కోసం చాట్​జీపీటీని ఉపయోగించే లక్షల మందికి ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.

    ChatGPT Go ప్రయోజనాలివే..

    ఓపెన్​ఏఐ తీసుకున్న నిర్ణయంతో AI వినియోగాన్ని మరింత ప్రోత్సహించనుంది. ఇప్పటి వరకు ఎక్కువగా మెట్రో నగరాల్లోనే వినియోగించగా.. తాజా నిర్ణయంతో ఇది గ్రామీణ ప్రాంతాల కూడా విస్తరించనుంది. “ChatGPT Go” మిడ్-లెవల్ ప్లాన్. ఇది GPT-5 మోడల్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఇది వేగవంతంగా, మరింత కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.

    • ఉచిత వెర్షన్ కంటే 10x ఎక్కువ మెసెజ్ లిమిట్​లు ఉంటాయి.
    • 10x ఎక్కువ ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్​లు చేసుకోవచ్చు.
    • 2x ఎక్కువ మెమరీ ఉంటుంది. దీని వల్ల చాట్‌బాట్ మునుపటి సంభాషణలను గుర్తుంచుకోవడానికి, వ్యక్తిగతీకరించిన సమాధానాలను అందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
    • దీర్ఘ సంభాషణలు, విశ్లేషణ, ఇమేజ్ క్రియేషన్​ ఉపయోగ పడుతుంది.

    ChatGPT Go

    ఇప్పటికే పెయిడ్​ సబ్​స్ర్కిప్షన్​ తీసుకున్న వారి సంగతేంటంటే..!

    భారత్​లో ఇప్పటికే “ChatGPT Go” సబ్​స్ర్కిప్షన్​ పొందిన వారు ఆటోమేటిక్​గా 12 నెలల ఉచిత ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. ఇందుకోసం తమ ప్లాన్​ను క్యాన్సిల్, రీ-అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఏడాది తర్వాత సాధారణ ధర వర్తించనుంది.

    ఆఫర్‌ను ఎలా పొందాలంటే..?

    “ChatGPT Go” ఆఫర్‌ను పొందాలంటే ChatGPT వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. లేదంటే.. సైన్ అప్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత, వినియోగదారులు “ChatGPT Go”ని ఉచితంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

    ఇది కూడా చదవండి..: Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai