తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టిక్కెట్ల రీఫండ్ విధానాల్లో పెద్ద మార్పులు చేయడానికి ప్రణాళికలు ప్రతిపాదించింది. ప్రయాణికులకు అనుకూలంగా, వేగంగా రీఫండ్ పొందేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి.
డీజీసీఏ ప్రతిపాదించిన ప్రకారం.. ఇక నుంచి మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. కాగా.. ఇప్పటి వరకు విమానయాన సంస్థలు టికెట్ల రద్దు, లేదంటే మార్పు కోసం భారీగా ఛార్జీలను వసూలు చేసేవి. తాజాగా.. DGCA తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యకు చెక్‌పడనుంది.
డీజీసీఏ ప్రతిపాదనలు అమలులోకి వస్తే.. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు క్యాన్సిల్ చేసుకోవడం లేదంటే తేదీ మార్చుకోవడం ఈజీగా మారనుంది. ఈ సమయంలో కాన్సిలేషన్ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి. అయితే కొత్త టికెట్ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే.. ప్రయాణికుడు ధర తేడాను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అనేది డొమెస్టిక్ విమాన టిక్కెట్లకు ఐదు రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు వర్తిస్తుంది. ఇక ఇంటర్నేషనల్ టిక్కెట్లకు 15 రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు వర్తించనుంది. బుకింగ్ చేసిన వెంటనే మార్పు అవసరం వచ్చినా.. ఇకపై ఎయిర్‌లైన్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయబోవు.

Flight Ticket Cancellation | రీఫండ్ బాధ్యత ఎయిర్‌లైన్స్‌దే..
డీజీసీఏ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. టిక్కెట్లను ఏజెంట్, ట్రావెల్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినా.. రీఫండ్ బాధ్యత అనేది ఎయిర్‌లైన్‌దేనని స్పష్టం చేసింది. ఏజెంట్లను ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధులుగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతో ఇకపై టికెట్ రద్దు చేసిన తర్వాత రీఫండ్ ఆలస్యం అయినా.. అందకపోయినా ప్రయాణికుడు ఎయిర్‌లైన్‌ను నేరుగా సంప్రదించవచ్చు.
కాగా.. ఇటీవల కాలంలో టికెట్ రద్దు ఛార్జీలు, రీఫండ్‌లు, ఏజెంట్ సమస్యలు వంటి అంశాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో DGCA ఈ చర్య తీసుకుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే.. భారతదేశంలో విమాన ప్రయాణం ప్రయాణికులకు మరింత అనుకూలంగా మారనుంది.
ఇది కూడా చదవండి : Arattai End-to-End Chat Encryption |చాట్ ఎన్క్రిప్షన్ను తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!