Penci Sport plugin only working with the Soledad theme.

telugunewstoday com - Telugu News Today

Tag: telugunewstoday com

  • Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో నిలిపిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 24 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి.

    Delhi Car Blast |సాయంత్రం సమయంలో..

    పేలుడు సాయంత్రం 6:55 గంటల సమయంలో అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపు చేశాయి. పేలుడు ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ఈ-రిక్షాలు, ఆటోరిక్షాలు కాలి బూడిదయ్యాయి. ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి.

    కాగా.. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కారులో పేలుడు పదార్థాలు ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరైనా పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్, క్లూస్ టీంలతో పాటు ఎన్‌ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం కావడంతో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు సాధారణంగా తక్కువ రద్దీగా ఉంటాయి. దీంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేశారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సింఘు, టిక్రీ, బదర్‌పూర్ వంటి కీలక పాయింట్లలో అదనపు పోలీసు బలగాలు మోహరించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఇతర సున్నిత ప్రదేశాల్లో నిఘా పెంచారు.

    Delhi Car Blast |ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కేంద్ర హొం మంత్రి అమిత్​ షా చేరుకున్నారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

    Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • credit card payment | క్రెడిట్ కార్డు బిల్‌లో మినిమమ్ డ్యూ కడుతున్నారా.. ఇలా చేయడం మంచిదేనా? సిబిల్ స్కోర్ పడిపోతుందా..!

    credit card payment | క్రెడిట్ కార్డు బిల్‌లో మినిమమ్ డ్యూ కడుతున్నారా.. ఇలా చేయడం మంచిదేనా? సిబిల్ స్కోర్ పడిపోతుందా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: credit card payment | ప్రస్తుత కాలంలో క్రెడిట్​ కార్డుల వినియోగం సర్వసాధారణం అయిపోయింది. మాల్స్​, షోరూంలు, సూపర్​ మార్కెట్స్​ ఎక్కడికి వెళ్లినా క్రెడిట్​ కార్డుల ద్వారానే ప్రజలు బిల్లులు చెల్లింపులు చేస్తున్నారు. అయితే బిల్లు జనరేట్​ అయ్యాక చాలా మంది ఫుల్​ పేమెంట్​ చేస్తున్నా.. కొందరు మినిమమ్ డ్యూ కడుతుంటారు. అయితే ఇలా మినిమమ్ డ్యూ కట్టడం మంచిదేనా? దీని వలన సిబిల్ స్కోర్ పడిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం..

    నేటి కాలంలో చేతిలో డబ్బులు లేకపోయినా క్రెడిట్​ కార్డు ఉండడంతో ఏ వస్తువులైనా కొనుగోలు చేస్తున్నాయి. అయితే చాలా మంది సకాలంలో బిల్ పేమంట్ చేయలేక మినిమమ్ డ్యూ చెల్లిస్తుంటారు. ఇలా తరచూ చేయడం వల్ల క్రెడిట్​ స్కోర్​ దెబ్బతింటుందని, అలాగే మీరు కట్టే అమౌంట్​ ఇంట్రస్ట్​ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్​ కార్డు బిల్ పేమెంట్స్​​ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    credit card payment | మినిమమ్ డ్యూ అంటే..

    క్రెడిట్ కార్డు బిల్ పూర్తి పేమెంట్ చేయలేని వారికి వివిధ పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. మినిమమ్ పేమెంట్, పూర్తి అమౌంట్ కట్టడం, అదర్ అమౌంట్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. అయితే సకాలంలో బిల్ పే చేయలేని వారు మినిమమ్ డ్యూ కడుతుంటారు. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అసలు బిల్లులో 5 శాతాన్ని, మినిమమ్ డ్యూ గా చెల్లించేందుకు అనుమతిస్తాయి. బ్యాంకును బట్టి వీటిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

    credit card payment | లేట్​ ఫీ, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట

    క్రెడిట్ కార్డు యూజర్లు కొందరు మినిమమ్ డ్యూ కట్టడం వల్ల ఏ ఇబ్బంది ఉండదని భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. మినిమమ్ అమౌంట్​ పేమెంట్ చేయడం వలన కేవలం లేట్ ఫీజు, పెనాల్టీల నుంచి మాత్రమే ఊరట కలుగుతుంది. అయితే మీరు చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీని పడుతుంది.

    credit card payment | సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా?

    మినిమమ్ డ్యూ ఎక్కువ సార్లు పేమెంట్​ చేయడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అధిక వడ్డీలు, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా మీ అప్పు అనేది కూడా పెరిగిపోతుంది. అందుకే మినిమమ్ డ్యూ కట్టకపోవడం మంచిదంటులున్నారు. అదనపు ఛార్జీలు పడకుండా ఉండాలంటే మొత్తం బిల్ ఒకేసారి చెల్లించడం సరైందని పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుండా ఉండడం మూలంగా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోపై ప్రభావం చూపింది. దీని వలన సిబిల్ స్కోర్‌పై ప్రభావం ఉంటుంది. మినిమమ్ డ్యూ చాలా కాలంగా ఉంచడం వల్ల అప్పు పెరగడం, అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. దీంతో సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది.

    ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. 

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Smartphone Charging Tips | మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

    Smartphone Charging Tips | మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్‌టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Smartphone Charging Tips | నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ఫోన్​ కామన్​. ఫోన్​ లేకపోతే ఏ పని కాని పరిస్థితులు రోజులు వచ్చాయి. అయితే నిత్యం వాడే ఫోన్​ ఛార్జింగ్​ విషయంలో అనేక మంది పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ఫోన్​ బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ జాగ్రత్తలను పాటిస్తే ఫోన్​ను ఎక్కువ రోజుల పాటు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    Smartphone Charging Tips | ఇలా చేయకండి..

    మనం చేసే చిన్నచిన్న పొరపాట్లు ఫోన్​ బ్యాటరీని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు రాత్రంతా ఫోన్ ప్లగ్‌చేసి ఉంచడం.. చీప్ కేబుళ్లను వాడడం వల్ల బ్యాటరీ పనితీరును తగ్గించి.. లైఫ్​టైంను తగ్గిస్తాయి. అయితే బ్యాటరీలు సహజంగానే కాలక్రమేణా వాడుకతో దిగజారుతుంటాయి. కానీ కొన్ని తప్పులు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయని తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫోన్​ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.

    ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడం, పూర్తిగా డిశ్చార్జ్ చేయడం మానుకోవాలి. బ్యాటరీ పర్సెంటేజీ పూర్తిగా అయిపోయే వరకు చాలామంది ఛార్జింగ్​ పెట్టరు. అలాగే ఛార్జింగ్​ పెట్టాక 100 శాతం వరకు తొలగించారు. ఇది పాత నికెల్ బ్యాటరీల కాలం నాటి పద్ధతి. ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లలో లిథియం అయాన్ లేదా సిలికాన్ కార్బన్ బ్యాటరీలు ఉంటాయి. వీటికి పూర్తిగా ఛార్జ్ చేయడం లేదా పూర్తిగా డిశ్చార్జ్ చేయడం హానికరంగా మారుతుంది. అయితే 20 శాతం నుంచి 80 శాతం బ్యాటరీ మెయింటెయిన్​ చేయడం మంది. ఫోన్​ ఛార్జింగ్20 శాతంలోపు పడిపోతే తక్కువ వోల్టేజ్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే 20 శాతం రాగానే ఛార్జింగ్​ పెట్టాలి. అంతేకాకుండా బ్యాటరీ 90 శాతం –100 శాతం వద్ద అధిక వోల్టేజ్ వల్ల దెబ్బ తింటుంది. అందుకే 20–80 శాతం బ్యాటరీ మెయింటెన్​ చేయాలి.

    Smartphone Charging Tips | రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టొద్దు..

    రాత్రి పూట ఫోన్​ ఛార్జింగ్​ పెట్టి ఉదయం తీసేయడం సౌకర్యంగా ఉన్నా.. బ్యాటరీ ఆయుష్షు దెబ్బతీస్తుంది. ఫోన్​లో ఛార్జింగ్​ 100 శాతానికి చేరిన తర్వాత కూడా చిన్నచిన్న పవర్ డ్రా జరుగుతుంది. ఇది వేడిని పెంచి సెల్‌లను దెబ్బతీస్తుంది. అయితే iPhone‌లో Optimised Battery Charging, ఆండ్రాయిడ్​ అయితే Adaptive Charging ఆప్షన్‌ను ఆన్‌చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్​ ఛార్జింగ్​ను 80 శాతం వద్ద ఆపి, మీరు నిద్రలేచే సమయానికి పూర్తిచేస్తాయి.

    Smartphone Charging Tips | ఛార్జింగ్ సమయంలో గేమింగ్, స్ట్రీమింగ్ వద్దు..

    ఫోన్ ఛార్జ్ అవుతున్న సమయంలో గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం లేదా హై-పర్ఫార్మెన్స్ యాప్‌లు వాడడం మూలంగా బ్యాటరీపై పారాసిటిక్ లోడ్ (Parasitic Load) పడుతుంది. దీంతో వేడి పెరిగి బ్యాటరీ సైకిళ్లు అస్థిరంగా మారుతాయి. కాబట్టి ఛార్జింగ్ టైంలో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటివి నిలిపివేయడం ఉత్తమం.

    Smartphone Charging Tips | ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి..

    బ్యాటరీకి వేడి అనేది శత్రువు లాంటిది. అధిక ఉష్ణోగ్రతల్లో బ్యాటరీ కెపాసిటీ వేగంగా తగ్గిపోతుంది. అందుకే ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను బెడ్‌పై, దిండు కింద ఉంచకూడదు. అలాగే నేరుగా సూర్యకాంతి తగిలేలా పెట్టకూడదు.

    Smartphone Charging Tips | ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఎక్కువగా వాడొద్దు..

    ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యమైనదే.. అయినా దీర్ఘకాలంలో వేడి పెంచి బ్యాటరీకి హాని చేస్తుంది. ప్రతి రోజూ వాడడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అవసరమైన సమయంలో మాత్రమే వాడండి. రోజువారీగా నార్మల్ ఛార్జర్​ను ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. 

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Dak Sewa App | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

    Dak Sewa App | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Dak Sewa App | పోస్టల్‌ సేవలను తపాల​ శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్‌ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా వినియోగించుకునేలా ‘డాక్‌ సేవ’ పేరిట యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకోవచ్చు.

    Dak Sewa App | యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోండిలా..

    డాక్​ సేవక్​ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్‌ స్టోర్‌లో (Dak Sewa App) అందుబాటులో ఉంది. అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్‌ చేసి మొబైల్‌ నంబర్‌ లేదా ఈ-మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ కావాలి. ఓటీపీ ద్వారా లాగిన్‌ అయ్యి సేవలను వినియోగించుకోవచ్చు.

    Dak Sewa App | ఈ సౌకర్యాలు పొందవచ్చు..

    డాక్ సేవ యాప్‌ ద్వారా వివిధ సేవలను పొందవచ్చు. పార్సిల్‌ ట్రాకింగ్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెమెంట్‌, స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్టు బుకింగ్‌, పోస్టేజ్‌ కాలిక్యులేషన్‌, కంప్లైంట్‌ రిజిస్ట్రేషన్‌, ట్రాకింగ్‌ సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా మీకు దగ్గరలోని పోస్టాఫీసుల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే వినియోగదారులు రియల్ టైమ్‌లో పార్సిళ్లు, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్లను సైతం ట్రాక్ చేయవచ్చు. వినియోగదారులు ఎక్కువ క్యూలలో నిలబడకుండా మెయిల్ ఐటెమ్‌లు, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్శిల్‌లను బుక్ చేసుకోవడానికి దోహదం చేస్తుంది. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు. ఇలా డాక్​ సేవక్​ యాప్​ ద్వారా వివిధ సేవలను మొబైల్​ ద్వారానే వినియోగించుకోవచ్చు.

    ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. 

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..

    Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్​న్యూస్​ చెప్పింది. రెగ్యులర్​ రైళ్ల బుకింగ్స్​ ఫుల్​ కావడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్​ ట్రెయిన్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ, నాందేడ్​, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి.

    Sabarimala special Trains | కొనసాగుతున్న బుకింగ్స్​

    ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లకు దక్షిణ మధ్య రైల్వే శనివారం నుంచి అవకాశం కల్పించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 20 వరకు రాకపోకలు సాగించనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కేరళలోని కొల్లాం, కొట్టాయం వైపు మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్ నుంచి ట్రైన్ అందుబాటులో ఉండనుంది.

    Sabarimala special Trains | చర్లపల్లి – కొల్లాం స్పెషల్​ రైలు (ట్రైన్ నెంబర్ 07113/07114)

    చర్లపల్లి – కొల్లాం (07113) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 13వ తేదీ వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి స్టేషన్‌ నుంచి వెళ్లనుంది. కొల్లాం – చర్లపల్లి (07114) ట్రైన్​ నవంబర్ 20 నుంచి జనవరి 15 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఈ రైలు సేవలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల భక్తులకు ఉపయోగకరం కానున్నాయి.

    Sabarimala special Trains | కాకినాడ టౌన్ – కొట్టాయం రైలు ( ట్రైన్ నంబర్ 07109/07110)

    సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలో కాకినాడ టౌన్ – కొట్టాయం (07109) ట్రైన్​ నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 19 వరకు ప్రతి సోమవారం నడవనుంది. అలాగే కొట్టాయం – కాకినాడ టౌన్ (07110) రైలు నవంబర్ 18 నుంచి జనవరి 20 వరకు ప్రతి మంగళవారం తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది.

    Sabarimala special Trains | నాందేడ్ – కొల్లాం రైలు ( ట్రైన్ నంబర్ 07111/07112)

    భక్తుల రద్దీ దృష్ట్యా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కూడా స్పెషల్​ ట్రైన్​ను ప్రకటించారు. హజర్​ సాహెబ్​ నాందేడ్‌ – కొల్లాం (07111), కొల్లాం-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (07112) మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ఈ రైళ్లు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంత భక్తులకు సౌకర్యంగా మారనున్నాయి.

    ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Google Maps | గూగుల్ మ్యాప్స్ నుంచి అదిరిపోయే నయా ఫీచర్స్… అవేంటో తెలుసుకోండి..

    Google Maps | గూగుల్ మ్యాప్స్ నుంచి అదిరిపోయే నయా ఫీచర్స్… అవేంటో తెలుసుకోండి..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Google Maps | మనం తెలియన ప్రాంతాలకు వెళ్తే.. నావిగేషన్​ కోసం గూగుల్​ మ్యాప్స్​ వాడుతుంటాం. దీనివల్ల మనం గమ్యస్థానానికి చేరుకోవడం సులభం అవుతుంది. అయితే వినియోగదారుల మరింత సౌలభ్యంగా మార్చేందుకు గూగుల్స్​ మరిన్ని ఫీచర్స్​ తీసుకువచ్చింది. కొత్త AI ఫీచర్లతో మరిన్ని అప్‌డేట్స్ తెచ్చింది. ప్రత్యేకంగా భారతీయ యూజర్స్​ కోసం రూపొందించిన ఫీచర్స్ ఇవి. కొత్త అప్​డేట్స్​ ఏంటో తెలుసుకుందామా మరి..

    Google Maps | జెమినీ నావిగేషన్‌..

    జెమినీ నావిగేషన్​ అనేది డ్రైవింగ్ చేసే సమయంలో హ్యాండ్‌ఫ్రీ, సంభాషణాత్మక అనుభవాన్ని ఇస్తుంది. “దగ్గరలోని పెట్రోల్ పంప్ ఎక్కడ?” అని అడగడం వల్ల.. మనం వెళ్లే దారిలో పార్కింగ్ ఉందా అని తెలుసుకోవచ్చు. లేదంటే ఒక రెస్టారెంట్ వెతికి “సరే, అక్కడ వెళ్దాం” అని చెప్పొచ్చు. దీని మనను అక్కడకు తీసుకెళ్తుంది.

    Google Maps | సూచనలు కూడా ఇస్తుంది..

    కొత్త అప్​డేట్స్​ జెమినీ మ్యాప్స్ రివ్యూలు, వెబ్ కంటెంట్‌ను విశ్లేషిస్తుంది. అంతేకాకుండా ప్రాక్టికల్, స్పష్టమైన సూచనలు ఇస్తుంది. ఉదాహరణకు, హైదరాబాద్​లో ఏదైనా మార్కెట్ గురించి చూసినట్లయితే.. “అక్కడ బేరం ఆడొచ్చు” అని సూచిస్తుంది. లేదంటే ఆ ప్రాంతంలోని అత్యుత్తమ స్టాల్స్‌ను సైతం చెబుతుంది.

    Google Maps | మ్యాప్స్‌ని ప్రశ్నలు అడగొచ్చు..

    మ్యాప్స్​ యూజర్స్​ ఇక నుంచి ఒక ప్రాంతం గురించి ప్రశ్నలు అడగవచ్చు. జెమినీ ఏఐ ఫీచర్​ రివ్యూలు, ఫొటోలు, వెబ్ డేటాను పరిశీలించి చెబుతుంది. అక్కడ చూడాల్సిన ప్రదేశాలతో పాటు పార్కింగ్ వివరాలను సైతం సూచిస్తుంది.

    Google Maps | స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్​ అలర్ట్స్​..

    కొత్త ఫీచర్స్​ మనం ప్రయాణించే దారిలో స్పీడ్​ లిమిట్స్​ను సైతం చెబుతుంది. స్థానిక ట్రాఫిక్ అధికారుల డేటా ఆధారంగా రోడ్లపై స్పీడ్ లిమిట్‌ను చూపిస్తుంది. అయితే ఇది ప్రస్తుతానికి ముంబై, హైదరాబాద్, కోల్​కతా వంటి 9 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. అలాగే ప్రధాన రోడ్లలో డిజర్ప్షన్ లేదా డిలేల గురించి ఆటోమాటిక్ నోటిఫికేషన్లు అందిస్తుంది. నావిగేషన్ యూజ్​చేయకపోయినా సమాచారం వస్తుంది. ఇది కూడా ప్రస్తుతానికి ప్రధాన నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫీచర్​ అందుబాటులో ఉంది.

    Google Maps | NHAIతో భాగస్వామ్యం..

    గూగుల్​ మ్యాప్స్​ హైవేపై రోడ్​ క్లోజర్స్​తో పాటు రిపేర్ల గురించి రియల్ టైమ్ డేటా అందిస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో భాగస్వామ్యం ద్వారా ఈ వివరాలను ఇవ్వనుంది. అంతేకాకుండా రోడ్డు పక్కన రెస్ట్ రూమ్స్, పెట్రోల్ స్టేషన్ల సమాచారం కూడా అందిస్తుంది.

    ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

    Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా ఏమైనా అని ఆలోచించారా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా..

    ఆకాశంలో విమానాలు వెళ్తున్న సమయంలో తెల్లని గీతలు ఏర్పడుతుంటాయి. అయితే వీటిని “కాంట్రైల్స్” (Contrails) లేదా “కండెన్సేషన్ ట్రైల్స్” (Condensation Trails) అంటారని నిపుణులు చెబుతున్నారు. విమానాలు ఎగిరే ఎత్తు చాలా ఎక్కువగా ఉండడం వల్ల.. వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంటుందట. కానీ విమానం ఇంజన్లు మాత్రం అత్యంత వేడిగా.. 500 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి. అయితే Contrails ఈ వేడి వాయువులు చల్లని గాలిని తాకినసమయంలో వాటిలోని నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే చిన్న మంచు కణాలు కలసి తెల్లని చారలు రూపంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ తెల్లని గీతలనే వాస్తవానికి మంచు స్ఫటికాల సమాహారం. పొగ లేదా కాలుష్యం కావు.

    Contrails అన్ని విమానాల్లో ఇలాగే జరుగుతుందా..


    అన్ని విమానాలు ఇలాంటి కాంట్రైల్స్‌ను సృష్టించవని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రధానంగా.. విమానం ఎగురుతున్న ఎత్తు, ఇంజిన్ నుంచి వెలువడే వేడి, గాలిలోని తేమ, ఉష్ణోగ్రతలు సరిగ్గా కలిసినప్పుడు సమయంలో మాత్రమే కండెన్సేషన్ ట్రైల్స్ ఏర్పడతాయట. అయితే విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరినా.. లేదంటే పొడి వాతావరణంలో ఉన్నా కూడా ఈ గీతలు కనిపించవని చెబుతున్నారు.

    ఇక నుంచి ఎప్పుడైనా విమానం వెళ్తున్న సమయంలో గీతలు కనిపిస్తే దానిని కాలుష్యం అనుకోకండి. అది కేవలం ఘనీభవించిన నీటి ఆవిరి మాత్రమే. తెలుసుకున్నారుగా సైన్స్​ ఎంత ఆశ్చరమైనదో.. గొప్పదో అని..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ సోషల్​మీడియా యాప్​ ఇన్​స్టాగ్రాం నయా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్​కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్​స్టా తీసుకున్న వచ్చిన ఈ కొత్త ఫీచర్​ ఈ సమస్యకు చెక్​ పెట్టనుంది. ‘వాచ్​ హిస్టరీ’ ఫీచర్​ ద్వారా మనం గతంలో చూసి రీల్​ను మళ్లీ చూసేయవచ్చు. దీని గురించి తెలుసుకుందామా..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన సోషల్​ మీడియా ప్లాట్​ఫాం. సామాన్య వినియోగదారుల నుంచి ప్రముఖుల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. కొందరైతే గంటల కొద్దీ స్క్రోల్​ చేస్తూ గడిపేస్తున్నారు. అయితే, ఒకసారి స్క్రోల్ చేసిన తర్వాత ఆ రీల్‌ను మళ్లీ చూడాలనుకుంటే పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఇన్‌స్టా కొత్త ఫీచర్​ను లాంఛ్​ చేసింది. ఇది తన వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం ఉపయోగపడనుంది.

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఏమన్నారంటే..

    ఈ కొత్త ఫీచర్​పై ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మొస్సేరి ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో ఏమన్నారంటే.. “ఇకపై మీరు గతంలో చూసిన రీల్స్‌ను సులభంగా కనుగొనవచ్చు. ఈ ఫీచర్‌ మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

    ఎలా యాక్సెస్ చేయాలంటే..

    Instagram History Feature ఇన్​స్టా గ్రాం తీసుకున్న వచ్చిన కొత్త ఫీచర్​ను ఉపయోగించడం ఎంతో సులభం. ఈ స్టెప్స్​ ఫాలో అయితే గత రీల్స్​ జాబితాను చూసేయవచ్చు.

    • ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్​ చేయండి
    • సెట్టింగ్స్​లోకి (Settings) వెళ్లండి.
    • తర్వాత Your Activity ఎంపికను ఎంచుకోండి.
    • అక్కడ ‘వాచ్ హిస్టరీ’ (Watch History) అనే ఆప్షన్​ ఎంపిక కనిపిస్తుంది.
    • ఈ విభాగంలోకి వెళ్లాక.. మీరు గతంలో చూసిన రీల్స్ చేసేయవచ్చు.

    ఈ ఫీచర్ ఎందుకంటే..

    ఎంతో మంది వినియోగదారులు రీల్ చూస్తున్న టైం ఫోన్ కాల్ వచ్చినా లేదా యాప్‌ను రిఫ్రెష్ చేసినా.. ఆ రీల్‌ను తిరిగి దొరకక నిరాశకు గురవుతుండేవారు. ఈ సమస్యపై యూజర్స్​ నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇన్‌స్టా ఈ ఫీచర్​ను డెవలప్​ చేసింది. మీరు కూడా ఈ కొత్త ఫీచర్‌ను ట్రై చేయండి.. మీకు నచ్చిన రీల్స్‌ను సులభంగా తిరిగి చూసేయండి..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai