తెలుగున్యూస్టుడే, ఇంర్నెట్డెస్క్: నేటి ఆయుధనిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగ్యమైంది. ఇది లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే వీటిలోని ఉండే అనేక ఫీచర్ల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఇందులో ‘ఫైట్ మోడ్’ కూడా ఒకటి. దీని గురించి కొందరికి తెలిసినా.. దీంతో ఉండే చాలా ఉపయోగాలు పూర్తిగా తెలియదు. మరి అవేంటో తెలుసుకుందామా..
మనం మామూలుగా విమానంలో ప్రయాణించే సమయంలో, నెట్‌వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తారని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఈ ఫ్లైట్ మోడ్ ద్వారా మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి.
Smartphone Flight Mode Uses : బ్యాటరీ లైఫ్ పెరుగుదల
ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఫోన్ నెట్‌వర్క్ సెర్చ్ చేయడం ఆపేస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా Wi-Fi, మొబైల్ డేటా, బ్లూటూత్, జీపీఎస్ లాంటి ఫీచర్లు డిసెబుల్ అవుతాయి. దీనివల్ల బ్యాటరీ 20-30 శాతం వరకు ఎక్కువ సేపు పనిచేస్తుంది. బ్యాటరీ తక్కువ ఉన్న సమయంలో తాత్కాలికంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం వల్ల పవర్ సేవ్ చేసుకోవచ్చు.
Smartphone Flight Mode Uses : ఛార్జింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు..
ఫైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టడం వల్ల వేగంగా అవుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇలా చేయడం ద్వారా ఫోన్ మూడు నుంచి నాలు రెట్లు ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్, Wi-Fi, నోటిఫికేషన్స్ పనిచేయవు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయి ఛార్జింగ్ వేగం పెరుగుతుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు.

నెట్‌వర్క్ రీసెట్ కోసం..
కొన్నిసార్లు మన ఫోన్లో సిగ్నల్ పోయి తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో ఫ్లైట్ మోడ్‌ను 10 సెకన్ల పాటు ఆన్ చేసి తిరిగి ఆఫ్ చేయాలి. దీంతో మొబైల్ నెట్‌వర్క్ అనేది ఆటోమేటిక్‌గా రీఫ్రెష్ అవుతుంది. అప్పుడు సిగ్నల్ సమస్య పరిష్కారమవుతుంది.
Smartphone Flight Mode Uses : నిద్రపోయే సమయంలో..
రాత్రి నిద్రకు ఉపక్రమించిన సమయంలో అత్యవసరం లేకపోతే ఫైట్మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఫోన్ దగ్గరగా పెట్టుకుని పడుకున్నట్లయితే సిగ్నల్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల రేడియేషన్ ఎమిషన్ తగ్గిపోతుంది. దీంతో నిద్ర నాణ్యత మెరుగవుతుంది.
Smartphone Flight Mode Uses : యాడ్స్ రాకుండా గేమ్స్ ఆడొచ్చు..
ఫైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. దీంతో ఆన్‌లైన్ యాడ్స్ రావు. కాబట్టి ఫ్లైట్ మోడ్‌లో గేమ్స్ ఆడితే యాడ్ డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల క్లియర్ గేమింగ్ అనుభవం పొందవచ్చు. అలాగే ఫైట్ మోడ్ ఫీచర్ ద్వారా డేటా సేవింగ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసి.. ఆ తర్వాత కేవలం Wi-Fi మాత్రమే ఆన్ చేయాలి. దీంతో మొబైల్ డేటా పూర్తిగా సేవ్ అవుతుంది. ఇలా ఈ ఫైట్ మోడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి.. Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్‌పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా?
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!
