Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today

Author: Harsha Vardhan

  • Leg Numbness Causes | కాళ్లలో తరచూ తిమ్మిర్లు వస్తున్నాయా..? ఇవి ఆరోగ్య సమస్యల సంకేతాలు కావచ్చు..!

    Leg Numbness Causes | కాళ్లలో తరచూ తిమ్మిర్లు వస్తున్నాయా..? ఇవి ఆరోగ్య సమస్యల సంకేతాలు కావచ్చు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Leg Numbness Causes | ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కాళ్లలో తిమ్మిర్లు రావడం సాధారణం. కాసేపు నడిచినట్లయితే ఈ బాధ తగ్గిపోతుంది. కానీ కొందరిలో ఈ సమస్య భంగిమతో సంబంధం లేకుండానే పదేపదే వస్తుంటుంది.

    చాలామంది దీన్ని నీరసం లేదా నీటి కొరతగా భావించి పట్టించుకోరు. ఇలాంటి తిమ్మిర్లు శరీరంలోని కొన్ని తీవ్రమైన ఆరోగ్య లోపాలను సూచించవచ్చని అయితే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన తిమ్మిర్లకు ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

    Leg Numbness Causes | పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD)

    నడిచినప్పుడు కాళ్లలో తీవ్రమైన తిమ్మిరి వచ్చి, ఆగిన వెంటనే తగ్గిపోతే అది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్‌కు సంకేతం కావచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం (ప్లాక్) వల్ల కాళ్లకు తగిన రక్తం, ఆక్సిజన్ అందకపోవడమే దీనికి మూల కారణం. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అధ్యయనాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

    సిరల సమస్యలు

    కాళ్లు బరువుగా అనిపించడం, నిలబడినప్పుడు నొప్పి పెరగడం, తిమ్మిరి లేదా జలదరింపు రావడం – ఇవన్నీ సిరల్లోని కవాటాలు సరిగా పనిచేయకపోవడం వల్ల జరుగుతాయి. రక్తం గుండె వైపు సాఫీగా ప్రవహించలేక కాళ్లలోనే నిలిచిపోతుంది. దీంతో రక్త ప్రసరణ దెబ్బతిని, నరాలపై ఒత్తిడి పెరిగి తిమ్మిర్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

    Leg Numbness Causes
    Leg Numbness Causes

    ఎలక్ట్రోలైట్ అసమతుల్యత

    శరీరంలో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఎలక్ట్రోలైట్‌ల స్థాయిలు తగ్గితే కండరాలు సరిగా సంకోచించలేక తిమ్మిర్లు, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రవిసర్జక మందులు వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా గోచరిస్తుందని మెడ్‌లైన్‌ప్లస్ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

    నరాల సంబంధిత లోపాలు

    సయాటికా, డయాబెటిక్ న్యూరోపతి లేదా వెన్నెముకపై ఒత్తిడి వంటి సమస్యలు కాళ్లలో మంట, తిమ్మిరి లేదా సూదులతో పొడిచినట్లు అనిపించేలా చేస్తాయి. నరాలు దెబ్బతిన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు మెదడుకు వెళ్లే సంకేతాలు అడ్డంపడతాయి.

    Leg Numbness Causes: మందుల దుష్ప్రభావాలు

    స్టాటిన్‌లు (కొలెస్ట్రాల్ మందులు), ఆస్తమా మందులు, యాంటీ-డిప్రెసెంట్స్ వంటివి కొందరిలో కండరాల తిమ్మిర్లకు కారణమవుతాయి. కొత్త మందు మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

    అధిక శ్రమ మరియు విశ్రాంతి లోపం

    ఎక్కువసేపు నిలబడి పనిచేయడం, తీవ్రమైన వ్యాయామం లేదా తగినంత నిద్ర లేకపోవడం వల్ల కండరాలు ఒత్తిడికి గురై బిగుసుకుపోతాయి. దీంతో తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. అంతేకాకుండా థైరాయిడ్ రుగ్మతలు, రక్తహీనత, విటమిన్ బి12 లేదా విటమిన్ డి లోపం వంటివి కూడా కాళ్లలో తిమ్మిర్లకు దారితీస్తాయి. ముఖ్యంగా బి12 లోపం వల్ల పాదాల్లో సూదులతో పొడవడం లాంటి తిమ్మిరి ఎక్కువగా కనిపిస్తుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధనలు చెబుతున్నాయి. కాళ్లలో తరచూ తిమ్మిర్లు వస్తున్నట్లయితే దాన్ని సాధారణంగా భావించకూడదు. సమయానికి వైద్య సలహా తీసుకోవడం ద్వారా దాగి ఉన్న సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలి.

    ఇది కూడా చదవండి..: సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

    1. Why Is My Leg Numb? 6 Possible Causes of Leg Numbness – (WebMD)
    2. Numbness in Legs: 8 Causes, Treatment – (Health.com)

  • Gupt Navratri 2026: నేటి నుంచి గుప్త నవరాత్రులు.. దీని విశిష్టత ఏమిటంటే..

    Gupt Navratri 2026: నేటి నుంచి గుప్త నవరాత్రులు.. దీని విశిష్టత ఏమిటంటే..

    Gupt Navratri 2026: నవరాత్రి పండుగ ప్రతియేటా నాలుగు సార్లు వస్తుంది. చైత్ర మాసం, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు సాధారణంగా ఎక్కువ మందికి తెలిసినవి. వీటిని ఘనంగా జరుపుకుంటారు. అయితే మాఘ మాసం, ఆషాఢ మాసంలో వచ్చే రెండు గుప్త నవరాత్రుల గురించి చాలా మందికి తెలియదు.

    Gupt Navratri 2026
    Gupt Navratri 2026

    గుప్త నవరాత్రులు ప్రధానంగా ఆధ్యాత్మిక సాధకులు, తాంత్రిక మార్గంలో నడిచే వారు రహస్యంగా ఆచరించే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దేవీ ఆరాధన ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించుకోవడం, జీవితంలోని అడ్డంకులను అధిగమించడం ప్రధాన ఉద్దేశంగా పండితులు చెబుతారు.

    Gupt Navratri 2026: నేటి నుంచి మాఘ గుప్త నవరాత్రులు

    2026లో మాఘ గుప్త నవరాత్రి జనవరి 19వ తేదీ ఆదివారం ప్రారంభమై జనవరి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. అష్టమి జనవరి 26, నవమి జనవరి 27, ఉపోషణ ముగింపు జనవరి 28న జరుగుతుంది.

    Gupt Navratri 2026
    Gupt Navratri 2026

    శుభ ముహూర్తాలు

    నవరాత్రి ప్రారంభంలో దేవీ ఆవాహనకు ఘటస్థాపన(కలశ స్థాపన) చేస్తారు. 2026లో మాఘ గుప్త నవరాత్రి ఘటస్థాపనకు శుభ సమయాలు ఇవే..

    • ఘటస్థాపన శుభ ముహూర్తం: జనవరి 19, 2026 ఉదయం 7:14 నుంచి 10:46 వరకు..
    • అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:11 నుంచి 12:53 వరకు..
    • ప్రతిపద తిథి: జనవరి 19 రాత్రి 1:21 నుంచి జనవరి 20 రాత్రి 2:14 వరకు..

    గుప్త నవరాత్రి అంటే ఏమిటి..

    “గుప్త” అంటే రహస్యమైనది అని అర్థం. సాధారణ నవరాత్రుల్లో ఊరేగింపులు, భజనలు, ప్రదర్శనలతో బహిరంగంగా జరుపుకుంటారు. కానీ గుప్త నవరాత్రి పూర్తిగా అంతర్ముఖమైన, రహస్య సాధనగా పేర్కొంటారు. తాంత్రిక విధానాలు, మంత్ర సాధన, దశ మహావిద్యల ఆరాధన ఇందులో ప్రధానంగా చెబుతుంటారు. రహస్యంగా చేసే ఆరాధనకు ఈ కాలంలో ప్రత్యేక శక్తి ఉంటుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. దేవీ దుర్గను సూక్ష్మ రూపాల్లో ఆరాధించడం ద్వారా జీవితంలోని అవరోధాలు తొలగుతాయని, అంతర్గత శక్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

    గుప్త నవరాత్రి ఎవరు ఆచరించాలి?

    ఈ పవిత్ర కాలం ప్రత్యేకంగా ఈ కింది వారికి అనుకూలం..

    • ఆధ్యాత్మిక సాధకులు, మంత్ర జపం-ధ్యానం చేసే వారు
    • జీవితంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నవారు
    • క్రమశిక్షణతో సాధన చేయాలని ఆసక్తి ఉన్న భక్తులు
    • బాహ్య గౌరవాల కంటే అంతర్గత బలాన్ని కోరుకునేవారు

    ఆచరించాల్సిన నియమాలు..

    • ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం
    • మొదటి రోజు చౌకీ ఏర్పాటు చేసి కలశ స్థాపన నిర్వహించడం
    • దుర్గా మంత్రాలు, దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశతి పారాయణం
    • ప్రతిరోజూ ఉదయం-సాయంత్రం ఆరతి నిర్వహించడం
    • ఉపవాసం ఆచరించేవారు పండ్లు, సాత్విక ఆహారం మాత్రమే సేవించడం

    గమనిక: మేం అందించిన ఈ కథనం ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం.. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    Top Links : ఇవి కూడా చదవండి

    1. Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!
    2. Times of India – Magha Gupt Navratri 2026: Date, Puja Muhurat, Rituals and Significance
    3. Economic Times – Gupt Navratri 2026 January: Dates, rituals, shubh muhurats, mantras…
  • BSNL New Offers Plans 2026: బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన నయా ఆఫర్​ ప్లాన్స్​.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

    BSNL New Offers Plans 2026: బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన నయా ఆఫర్​ ప్లాన్స్​.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: BSNL New Offers Plans 2026

    భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తన వినియోగదారులను ఆకర్షణీయమైన కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ టెలికాం సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలు వెల్లడించింది. ఈ ఆఫర్ బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ 50Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు సంబంధించినది. అలాగే అన్ని ఫైబర్ సేవలు పొందుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

    BSNL New Offers Plans 2026
    BSNL New Offers Plans 2026

    BSNL New Offers Plans 2026: స్పార్క్ ఫైబర్ ప్లాన్..

    కొత్తగా ప్రవేశపెట్టిన స్పార్క్ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ వినియోగదారులకు నెలకు రూ.399 చొప్పున 50Mbps వేగంతో 3,300 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా లభించనుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవు. ఈ ప్రత్యేక ధర మొదటి 12 నెలలకు మాత్రమే వర్తించనుంది.

    BSNL New Offers Plans 2026 ఈ నెల 13 నుంచి అదే సేవలకు నెలవారీ ఛార్జీ రూ.449కు పెరుగుతుంది.

    స్పార్క్ ప్లాన్‌ను ఎలా పొందాలి?

    ఈ ఆకర్షణీయ ఫైబర్ ఆఫర్‌ను పొందాలనుకునే వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వాట్సాప్ నంబర్ 1800 4444కు సాధారణంగా “HI” అని మెసేజ్ పంపడం ద్వారా ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

    BSNL New Offers Plans 2026 – మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లకు అదనపు డేటా

    ఫైబర్ సేవలతోపాటు మొబైల్ వినియోగదారులకు కూడా శుభవార్త అందించిన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లతో 0.5 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా మొదలైన ఈ ప్రయోజనం ఇప్పుడు 2026 జనవరి 31వరకు పొడిగించింది. ఈ అదనపు డేటా కోసం వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

    అదనపు డేటా అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లు

    ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ నాలుగు రీఛార్జ్ ప్లాన్‌లలో రోజువారీ డేటా పరిమాణాన్ని పెంచి అందిస్తోంది

    • రూ.225 ప్లాన్: రోజుకు 2.5 జీబీ నుంచి 3 జీబీకి పెంచింది. (30 రోజుల చెల్లుబాటు)

    • రూ.347 ప్లాన్: రోజుకు 2 జీబీ నుంచి 2.5 జీబీకి పెరిగింది. (50 రోజుల చెల్లుబాటు)

    • రూ.485 ప్లాన్: రోజుకు 2 జీబీ నుంచి 2.5 జీబీకి పెరుగుదల (72 రోజుల చెల్లుబాటు)

    • రూ.2399 ప్లాన్: రోజుకు 2 జీబీ నుంచి 2.5 జీబీకి పెంచింది. (365 రోజుల చెల్లుబాటు)

    ఈ మెరుగైన డేటా సౌకర్యాలు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదారులకు అందుతున్నాయి.

    Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

  • Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

    Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు శరీరం నీరసంగా అనిపిస్తుందా.. నిస్తేజంగా ఉండడంతో పాటు ఏ పనీ చేయాలనిపించడం లేదా..

    Constant Fatigue Reasons-1
    Constant Fatigue Reasons

     

    Constant Fatigue Reasons: ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

    అంతేకాకుండా చిన్నచిన్న విషయాలు కూడా జ్ఞాపకం రావడం లేదా.. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది నిద్ర తగ్గిందనో, పని ఒత్తిడి ఎక్కువైందనో అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఈ సమస్యలకు అసలైన కారణం శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు తగ్గిపోవడమే అయి ఉండవచ్చని వారు తెలియజేస్తున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణాల గురించి తెలుసుకుందాం..

    విటమిన్ బి12 కీలకం

    విటమిన్ బి12ను శరీరంలో శక్తి ఉత్పత్తికి కీలకమైన పోషకంగా నిపుణులు పరిగణిస్తారు. ఇది రక్తహీనతను నివారిస్తుంది. అలాగే నాడీ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా, డీఎన్ఏ సంశ్లేషణ, శక్తి ఉత్పాదన మరియు కేంద్ర నాడీ వ్యవస్థ సక్రమ పనితీరుకు ఇది అత్యవసరంగా నిపుణులు చెబుతుంటారు. ఆహారం ద్వారా ఈ విటమిన్ సరిపడా అందకపోతే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం.. ఉత్తర భారతదేశంలో దాదాపు 47 శాతం మంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.

    వీటిలో పుష్కలం

    విటమిన్ బి12 జంతు ఆహార పదార్థాల్లో లభిస్తుంది. మాంసం, చేపలు, గుడ్లు, పాలు మరియు పాల ఉత్పత్తులలో ఇది పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారంలో ఈ విటమిన్​ సహజంగా తక్కువగా ఉంటుంది. దీంతో శాఖాహారులు ఎక్కువగా ఈ విటమిన్​ లోపం ఏర్పడుతుంది. అయితే, తృణధాన్యాలు, న్యూట్రిషనల్ ఈస్ట్ విటమిన్ బి12తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శాఖాహారులకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.

    విటమిన్ బి12 ఉపయోగాలు..

    ఎర్ర రక్త కణాల ఆరోగ్యం: ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు బి12 కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంది.

    నాడీ వ్యవస్థ పరిరక్షణ: నాడుల చుట్టూ ఉండే మైలిన్ షీత్‌ను కాపాడి, మెదడు మరియు నాడీ వ్యవస్థ సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది.

    మెదడు ఆరోగ్యం: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలంలో మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

    గుండె ఆరోగ్యం: రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

    ఇతర ప్రయోజనాలు: మానసిక ఆరోగ్యం, ఎముకల బలం, చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బి12 ముఖ్య పాత్ర వహిస్తుంది.

    విటమిన్ బి12 లోపం లక్షణాలు

    ప్రముఖ ఆరోగ్య సంస్థల అధ్యయనాల ప్రకారం.. ఈ విటమిన్ లోపం వల్ల కింది లక్షణాలు కనిపిస్తాయి. నిరంతర అలసట మరియు నీరసం, చర్మం పాలిపోవడం లేదా పసుపు రంగు ఏర్పడడం, తరచుగా తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే మానసిక కుంగుబాటు లక్షణాలు, జీర్ణసంబంధిత ఇబ్బందులు, ఏకాగ్రత లోపించడం, నోటి పుండ్లు, నాలుక వాపు, ఆకస్మిక బరువు తగ్గడం లాంటివి కనబడతాయి.

    Constant Fatigue Reasons-2
    Constant Fatigue Reasons-2

    పైలక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా విటమిన్ బి12 స్థాయిలను తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సమస్యను నివారించవచ్చు.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.

    Healthy Diet – health tips: 30 ఏళ్లు దాటిన వాళ్ళు తప్పక తినవాలసిన Foods!

    Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

  • Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

    Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన గెలాక్సీ S26ను త్వరలో భారత మార్కెట్‌లో లాంఛ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా అనే మూడు మోడల్స్ ఉండనున్నాయి.

    Samsung Galaxy S26 Series-1
    Samsung Galaxy S26 Series

    వీటిలో ప్రాథమిక మోడల్​ గెలాక్సీ S26 ధరకు తగినట్టుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. ఇటీవల బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అధునాతన ట్రిపుల్ కెమెరా వ్యవస్థ వంటి అంశాలు ఉండవచ్చని సమాచారం. ఈ మోడల్ గురించి వివరాలను తెలుసుకుందాం..

    Samsung Galaxy S26 Series | కెమెరా, సాంకేతిక లక్షణాలు

    గెలాక్సీ S26లో అధునాతన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం కలిగిన 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చని తెలుస్తోంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది.

    Samsung Galaxy S26 Series-2
    Samsung Galaxy S26 Series

    సాంకేతిక లక్షణాల విషయానికొస్తే.. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీనికి 8 GB RAM మరియు 256 GB అంతర్గత నిల్వ సామర్థ్యం జతకలిసి ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత సామ్‌సంగ్ వన్ UI 8.5 ఇంటర్‌ఫేస్‌తో రానుంది. డిస్‌ప్లే విషయంలో 6.3 అంగుళాల QHD రిజల్యూషన్ OLED స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 2600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయి ఉండవచ్చు.

    Samsung Galaxy S26 Series | మెటల్ ఫ్రేమ్‌తో..

    డిజైన్ పరంగా గెలాక్సీ S26 ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్‌తో మరింత సన్నని బాడీని కలిగి ఉంటుంది. ఇది గతంలో వచ్చిన వాటికి ఈ మోడల్‌కు భిన్నంగా మరింత ఆధునికంగా కనిపించవచ్చు. రంగుల విషయంలో తెలుపు, నలుపు, నీలం ఆప్షన్లతో పాటు ఆరెంజ్ షేడ్ రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Samsung Galaxy S26 Series | భారత్​లో ఎప్పుడు విడుదల కానుందంటే..

    సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ మొత్తం గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్​ ఫిబ్రవరి 25న అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. భారత మార్కెట్‌లో గెలాక్సీ S26 ప్రారంభ ధర సుమారు రూ. 80,999గా ఉండవచ్చని నిపుణులు అంచనా చేస్తున్నారు.

    అయితే ఈ మోడల్​కు సంబంధించిన వివరాలు ప్రచారంలో ఉన్నాయి. అధికారికంగా విడుదలైన తర్వాత మార్పులు రావచ్చు. కాగా.. సామ్‌సంగ్ అభిమానులు ఈ కొత్త సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇది చదవండి..: change gmail address | ఇక జీమెయిల్ అడ్రస్​ను కూడా సులభంగా మార్చుకోవచ్చు.. మీ డేటాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండానే..!

  • Union Budget 2026 | కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్​..

    Union Budget 2026 | కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్​..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Union Budget 2026 | భారత ఆర్థిక చరిత్రలో అరుదైన సంఘటన ఆవిష్కృతం కానుంది. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం రోజు ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE)లు అసాధారణ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా వారాంతాల్లో మూసిఉండే మార్కెట్లు ఆదివారం పూర్తిస్థాయి ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి.

    ఈ మేరకు రెండు ఎక్స్‌ఛేంజ్‌లు సర్క్యులర్లు జారీ చేశాయి. ఆ రోజు ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు సాధారణ ట్రేడింగ్ జరుగనుంది. ప్రీ-ఓపెన్ సెషన్, బ్లాక్ డీల్స్ సహా అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. పెట్టుబడిదారులు, వ్యాపారులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

    Union Budget 2026 | ఫిబ్రవరి 1నే బడ్జెట్

    కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయబద్ధంగా ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీ కొనసాగిస్తోంది. అయితే సారి ఆదివారం రాగా.. తేదీని మారస్తారని భావించినా.. సంప్రదాయాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం.

    బడ్జెట్‌కు ముందు జనవరి 29న ఆర్థిక సర్వే నివేదిక విడుదల కానుంది. ఈ నివేదికలోని విశ్లేషణలు, సూచనలు బడ్జెట్‌లోని ముఖ్య విధానాలకు, కేటాయింపులకు ఆధారమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Union Budget 2026 | మార్కెట్‌పై ప్రభావం

    బడ్జెట్ ప్రకటనలు మార్కెట్‌పై తక్షణ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పన్ను విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూలధన మార్కెట్లకు సంబంధించిన నిర్ణయాలు షేర్ల ధరల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగా పెట్టుబడిదారులు బడ్జెట్‌పై మరింత ఆసక్తి చూపుతున్నారు.

    ఇది కూడా చదవండి..: Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

    Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Mauni Amavasya 2026 | సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైంది. అంతేకాకుండా మహోన్నతమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఇది మాఘ మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య. మాఘ అమావాస్య లేదా మాఘి అమావాస్య అనే పేర్లతో దీనిని పిలుస్తారు. ఈ ఏడాది మౌని అమావాస్య రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా సమకూరడంతో ఈ రోజు ఆధ్యాత్మిక మహత్త్వం మరింత ప్రముఖ్యత ఏర్పడింది.

    Mauni Amavasya 2026
    Mauni Amavasya 2026

    పుణ్యస్నానాలు, దానధర్మాలు..

    ఈ Mauni Amavasya 2026 రోజును దానధర్మాలు చేయడంతో పాటు పుణ్య స్నానాలు ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర దివ్య స్నానం ఆచరిస్తారు. కాగా.. 2026లో మౌని అమావాస్య జనవరి 18న రానుంది.

    మౌని అమావాస్య 2026 తేదీ, తిథి మరియు సమయం

    • మౌని అమావాస్య: జనవరి 18, 2026 (ఆదివారం)
    • అమావాస్య తిథి ప్రారంభం: జనవరి 18, 2026 రాత్రి 12:03 గంటల నుంచి..
    • అమావాస్య తిథి ముగింపు: జనవరి 19, 2026 రాత్రి 01:21 గంటల వరకు..

    మాఘ స్నానానికి ఎందుకు అంత ప్రాధాన్యం

    మౌని అమావాస్య రోజున దేవతలు స్వయంగా త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆదరించడం ద్వారా ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. మౌని అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల ఏర్పడే అద్భుతమైన ఖగోళ సంయోగం మోక్ష ప్రాప్తికి శుభప్రదమని భావిస్తారు.

    జన్మజన్మల పుణ్యఫలం

    ఈ రోజున మౌన వ్రతాన్ని ఆచరించి, భక్తి శ్రద్ధలతో సంగమ నీటిలో స్నానం చేసినవారి పాపాలన్నీ నశించి, పుణ్యఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈ రోజు ఎంతో పవిత్రమైందిగా చెబుతారు. దానధర్మాల విషయంలో నువ్వులు, ధాన్యాలు, వస్త్రాలు, గోదానం వంటివి చేయడం ఈ Mauni Amavasya 2026 రోజున ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.

    ఇది కూడా చదవండి..: Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

  • Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

    Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar box office collections | ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు (Dhurandhar box office collections) సృష్టిస్తోంది. రిలీజ్ అయి నాలుగు వారాలు పూర్తయినా సినిమా వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. నాలుగో వారంలో కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ద్వారా బాలీవుడ్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పరచింది.

    Dhurandhar box office collections | వరుసగా నాలుగో వారం..

    తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నాలుగో వీక్‌లో సుమారు రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు (Dhurandhar box office collections) సాధించి.. బాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా నాలుగో వారంలో ఇంత భారీ మొత్తాన్ని సాధించలేదు. ఇండియాలో మొత్తం నెట్ వసూళ్లు రూ.784 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు రూ.1164 కోట్లు దాటాయి.

    Dhurandhar box office collections | జవాన్​ రికార్డులను తిరగరాస్తూ..

    ఈ విజయంతో ‘ధురంధర్’ సినిమా.. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రం వసూళ్లను అధిగమించి, హిందీ సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అవతరించింది. భారత్‌లో హిందీ చిత్రాల్లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ఈ చిత్రం రికార్డు నమోదు చేసింది.

    Dhurandhar box office collections | రెండోస్థానంలో..

    ప్రస్తుతం భారత్‌లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పుష్ప 2 నిలిచింది. అయితే, థియేట్రికల్ రన్ ఇంకా బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే వీకెండ్‌లో పుష్ప 2ను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోయినప్పటికీ ఇంత భారీ విజయం సాధించడం విశేషం. సాధారణంగా బాలీవుడ్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ విడుదలై ఉంటే మరింత రూ.100 కోట్ల వసూళ్లు సులువుగా వచ్చేవని అంచనాలు ఉన్నాయి. అయినా సరే, భారత్ మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిత్రం అద్భుతంగా రాణిస్తోంది.

    రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణ తగ్గకపోవడం ద్వారా ఈ చిత్రం రూ.1200 కోట్ల మార్క్‌ను త్వరలోనే అందుకునే అవకాశం కనిపిస్తోంది. రాబోయే వీకెండ్‌లో ఈ మైలురాయిని చేరుకోవడం కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    త్వరలో సీక్వెల్​..

    ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలో వస్తోంది. ఈ ఏడాది వేసవిలో లేదా మార్చి నాటికి పార్ట్-2 థియేటర్లకు రావచ్చని సమాచారం. మొదటి భాగం ముగింపు ఉత్కంఠగా సాగడంతో సీక్వెల్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా మరింత ఆకర్షణీయంగా తెరకెక్కనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

    ఇక ఓటీటీ విషయానికొస్తే, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల చివరి నాటికి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని అంచనాలు ఉన్నాయి, అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • Vande Bharat Sleeper Train | రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రెయిన్​..

    Vande Bharat Sleeper Train | రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రెయిన్​..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Vande Bharat Sleeper Train | ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సరంలో గుడ్​న్యూస్​ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ప్రకటించారు. ఈ రైలు సుదూర ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఆధునిక శైలిలో తయారైంది.

    రైల్వే మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) అస్సాం రాష్ట్రంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరా (కోల్‌కతా) మధ్య నడవనుంది. 20 రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.

    Vande Bharat Sleeper Train | మరింత సులభతర ప్రయాణం

    వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్​ ఉంది. వీటిలో స్లీపర్ వెర్షన్ రాకతో రాత్రిపూట ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ రైలు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో గాజు గ్లాసులో నీటిని నింపి ఉంచినా.. అతివేగంలో కూడా అది కదలకుండా స్థిరంగా ఉండడం దాని అత్యాధునిక సాంకేతికతను తెలియజేస్తోంది.

    Vande Bharat Sleeper Train | అత్యాధునిక సౌకర్యాలు

    ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 త్రి టైర్​ ఏసీ, 4 టు టైర్​ ఏసీ, ఒక క్లాస్​ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు సాగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యాధునిక సస్పెన్షన్ వ్యవస్థ, ఆటోమేటిక్ తలుపులు, కవచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్, సీసీటీవీ నిఘా వంటి సౌకర్యాలు ప్రయాణికుల భద్రత, సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.

    Vande Bharat Sleeper Train | టికెట్ ధరల వివరాలివే..

    మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని టికెట్ ధరలు నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గువాహటి-హౌరా మధ్య ఒకవైపు ప్రయాణానికి..

    • మూడో శ్రేణి ఏసీ (3AC): సుమారు రూ. 2,300 (భోజనం సహా)
    • రెండో శ్రేణి ఏసీ (2AC): సుమారు రూ. 3,000
    • మొదటి శ్రేణి ఏసీ (1AC): సుమారు రూ. 3,600

    ఇదే మార్గంలో విమాన టికెట్ ధరలు రూ. 6,000 నుంచి రూ. 8,000 వరకు ఉండగా, ఈ రైలు ధరలు సగం కంటే తక్కువగా ఉండడం ప్రత్యేక ఆకర్షణ. రాబోయే నెలల్లో మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.