తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Movies releasing this week | సినిమా ప్రియులకు ఈ వారం మంచి ఎంట్రటైన్మెంట్ లభించనుంది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి పెద్దగా ప్రచారం లేదు. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందామా..
Movies releasing this week | థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు
సకుటుంబానాం – డిసెంబర్ 19
గుర్రం పాపిరెడ్డి – డిసెంబర్ 19
మిస్ టీరియస్ – డిసెంబర్ 19
అవతార్: ఫైర్ అండ్ యాష్ – డిసెంబర్ 19
Movies releasing this week | ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు, సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
ప్రేమంటే – డిసెంబర్ 19 నుంచి..
రాత్ అఖేలీ హై – డిసెంబర్ 19 నుంచి..
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 – డిసెంబర్ 18 నుంచి..
అమెజాన్ ప్రైమ్ వీడియో
ధామా (హిందీ) – డిసెంబర్ 16 నుంచి..
ఫాలౌట్ – డిసెంబర్ 17 నుంచి..
ఏక్ దివానే కీ దివానీయత్ (హిందీ) – డిసెంబర్ 16 నుంచి..
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (వెబ్ సిరీస్) – డిసెంబర్ 19 నుంచి..
జీ5
నయనం – డిసెంబర్ 19 నుంచి..
డొమినిక్ అండ్ లేడీస్ వర్సెస్ – డిసెంబర్ 19 నుంచి..
డిస్నీ+ హాట్‌స్టార్
మిసెస్ దేశ్ పాండే (హిందీ సిరీస్) – డిసెంబర్ 19 నుంచి..
ఈ వారం థియేటర్లలో నాలుగు చిత్రాలు, ఓటీటీలో 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. ఇవి ప్రేక్షకులకు మంచి ఎంట్రటైన్మెంట్ అందించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Google Translater | ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్.. ఇటీవల తన గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఒక కొత్త బీటా ఫీచర్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇది యూజర్లు తమ హెడ్‌ఫోన్ల ద్వారా నిజ సమయంలో అనువాదాలను వినే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఫీచర్ సాధారణ హెడ్‌ఫోన్లను లైవ్ అనువాద సాధనంగా మారుస్తుంది. వివిధ భాషల్లో జరిగే సంభాషణలు, ఉపన్యాసాలు లేదా మీడియా కంటెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.
ఈ రియల్-టైమ్ అనువాదం మాట్లాడే వ్యక్తి టోన్, లయను కాపాడుతుంది. దీనివల్ల ఎవరు మాట్లాడుతున్నారో, ఏమి చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫీచర్ 70కి పైగా భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇది వైర్డు లేదా వైర్‌లెస్ ఏ హెడ్‌ఫోన్లతోనైనా పనిచేస్తుంది.
ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ పరికరాల్లో అమెరికా, మెక్సికో, భారత్‌లో అందుబాటులో ఉంది. 2026లో ఐవోఎస్‌లోనూ అందుబాటులోకి తేనుంది. అలాగే మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
Plus, we’re rolling out a beta version of live translation that brings real-time, natural-sounding translations to your headphones with the help of Gemini’s native speech-to-speech translation capabilities. 🎧 See everything that’s new in Google Translate ↓…
Google Translater | ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం..
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను తెరవండి.
హెడ్‌ఫోన్లను కనెక్ట్ చేయండి.
“లైవ్ ట్రాన్స్‌లేట్” ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
మూల భాషను, అనువాదించాల్సిన భాషను ఎంచుకోండి.
వినడం ప్రారంభించండి – అనువాదిత ఆడియో నేరుగా మీ హెడ్‌ఫోన్లలో వినిపిస్తుంది.
ఈ ఫీచర్ ప్రత్యక్ష సంభాషణలు, ఉపన్యాసాలు, లెక్చర్లు లేదా ప్రయాణంలో విదేశీ భాషా కంటెంట్ ట్రాన్స్లేషన్ కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Google Translater | జెమినీ ఏఐతో మరింత మెరుగైన ట్రాన్స్లేషన్
గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో జెమినీ ఏఐ సాంకేతికతను అనుసంధానం చేస్తోంది. ఇది మరింత సహజంగా, ఉత్తమ ట్రాన్స్‌లేషన్‌ను అందిస్తుంది. ముఖ్యంగా స్లాంగ్, ఇడియమ్స్, స్థానిక వ్యక్తీకరణలకు సంబంధించి బాగా పనిచేస్తుంది.
Google Translater | నిజమైన అర్థం ఇచ్చేలా..
ఉదాహరణకు.. “స్టీలింగ్ మై థండర్” వంటి ఇంగ్లిష్ ఇడియమ్‌ను అక్షరాలా అనువదించకుండా.. దాని నిజమైన అర్థాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఈ అప్‌డేట్ అమెరికా, భారత్‌లో ఇంగ్లిష్ నుంచి దాదాపు 20 భాషలకు (హిందీ, అరబిక్, జపనీస్, జర్మన్, స్పానిష్, చైనీస్ వంటివి) అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
Listen up 🔊 We’ve made some updates to our Gemini Audio models and capabilities:
— Gemini’s live speech-to-speech translation capability is rolling out in a beta experience to the Google Translate app, bringing you real-time audio translation that captures the nuance of human… pic.twitter.com/0ssdUS51XE
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: ragi rotti | ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. అందుకే చాలామంది పోషకాలు పుష్కలంగా ఉండే సాంప్రదాయ ఆహార పదార్థాల వైపు మళ్లుతున్నారు. అలాంటి వాటిలో రాగి రొట్టెలు ప్రముఖమైనవి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారితో పాటు మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
అయితే రాగి రొట్టెలు తయారు చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పిండి ముద్ద గట్టిగా అయిపోవడం లేదా చపాతి చేస్తున్నప్పుడు చిట్లిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ సరైన పద్ధతిని అనుసరిస్తే, గోధుమ రొట్టెల్లా మెత్తగా, పొరలు పొరలుగా సులభంగా చేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలతో దూది మెత్తని రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా..!
ragi rotti | కావాల్సిన పదార్థాలు
రాగి పిండి – ఒక కప్పు
నీళ్లు – ఒక కప్పు
నూనె లేదా నెయ్యి – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
ragi rotti | తయారీ విధానం
ముందుగా గిన్నెలో ఒక కప్పు నీటిని స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఆ తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేయండి. నూనె వేయడం ద్వారా రొట్టెలు ఎక్కువ సేపు సాఫ్ట్‌గా ఉంటాయి.
నీళ్లు బాగా మరిగిన తర్వాత మంటను తగ్గించి లేదా స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే రాగి పిండిని ఆ వేడి నీటిలో కలపండి. గరిటె లేదా విస్క్‌తో ముద్దలు లేకుండా బాగా కలియబెట్టారు. ఆ తర్వాత గిన్నెకు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు పక్కన ఉంచండి.
పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్‌లోకి తీసుకోవాలి. చేతులతో బాగా మర్దించి పిసకండి. ఎంత ఎక్కువగా పిసికితే రొట్టె అంత సాఫ్ట్‌గా వస్తుంది. చేతికి కొద్దిగా నూనె రాసుకుని మెత్తని ముద్దలా తయారు చేసుకోండి.
ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. పొడి రాగి పిండి లేదా గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో మెల్లగా తాల్వండి. వేడి నీటిలో కలిపినందువల్ల రొట్టె అంచులు పగలకుండా చక్కగా ఉంటుంది.
పెనం వేడెక్కిన తర్వాత రొట్టెను వేసి, ఒక వైపు బుడగలు వచ్చాక మరో వైపు తిప్పండి. రెండు వైపులా కాలిన తర్వాత మెత్తటి గుడ్డతో అంచులు ఒత్తితే బాగా పొంగుతుంది. లేదా నేరుగా మంట మీద కాల్చినా పూరీలా ఉబ్బుతుంది.
ragi rotti | టెస్టీగా..
ఈ రాగి రొట్టెలను పప్పు, పచ్చళ్లు, వంకాయ కూర లేదా ఏదైనా కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లో పెట్టుకుపోయినా గంటల తర్వాత కూడా సాఫ్ట్‌గానే ఉంటాయి. ఈ సులభమైన చిట్కాతో ఆరోగ్యవంతమైన రాగి రొట్టెలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: BB9 Telugu Double Elimination: ఇప్పుడు తుది దశకు చేరింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే కావడంతో.. ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఈ సీజన్‌లో చివరిది కానుంది. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల నుంచి ఎవరు బయటకు వెళ్తారని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈ ట్విస్ట్‌తో ఒక బలమైన కంటెస్టెంట్ కూడా హౌస్‌ను వీడనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుత హౌస్‌లో ఏడుగురు సభ్యులు : BB9 Telugu Double Elimination
సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో సెలబ్రిటీలు, కామన్ పీపుల్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. గత 13 వారాలుగా సింగిల్, డబుల్ ఎలిమినేషన్లు ఇలా మొత్తం 15 మంది హౌస్ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి, సంజనా, డీమాన్ పవన్ మిగిలారు.
14వ వారంలో ఆరుగురు నామినేట్
ఈ వారం నామినేషన్లలో మొదటి ఫైనలిస్ట్ కల్యాణ్ మినహా మిగిలిన ఆరుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో సంజనా, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, సుమన్ శెట్టి, భరణి ఉన్నారు. అయితే ఫినాలే వీక్‌లో సాధారణంగా టాప్ ఐదుగురు మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం.
అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ : BB9 Telugu Double Elimination
సోమవారం నుంచి శుక్రవారం వరకు సోషల్ మీడియా, యూట్యూబ్ పోల్స్‌లో తనూజ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, భరణి, సంజనా ఉన్నారు. ఇక సుమన్ శెట్టి అనధికారిక ఓటింగ్‌లో అట్టడుగు స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఆఖరు స్థానాల్లో ఉన్నవారే బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
BB9 Telugu Double Elimination : శనివారం ఒకరు, ఆదివారం మరొకరు!
తాజా సమాచారం ప్రకారం.. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్‌లో భరణి శంకర్ బయటకు వెళ్తారని బిగ్‌బాస్ వ్యూవర్స్ చర్చించుకుంటున్నారు. సుమన్ శెట్టి ఎలిమినేషన్ చాలామంది ఊహిస్తున్నారు. కానీ భరణి పేరు తెరపైకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Dekh Lenge Saala Song Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకుడిగా దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి దశలో ఉంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పాటల ద్వారా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.
ఉర్రూతలూగిస్తున్న సాంగ్ :Dekh Lenge Saala Song Release
ఇందులో భాగంగా నేడు ‘దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ట్రాక్‌కు భాస్కరభట్ల రచించిన సాహిత్యం అందించారు. ప్రముఖ గాయకుడు విశాల్ దడ్లానీ గాత్రం అందించారు.
సినిమాపై హైప్ పెంచుతున్న పాట : Dekh Lenge Saala Song Release
ఈ పాటకు సంబంధించి లిరిక్ షీట్‌ను లక్ష మంది అభిమానులు కలిసి ఆవిష్కరించడం విశేషం. చిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ లిరికల్ వీడియోను చూసి సంబరపడుతున్నారు. రిలీజ్ అయిన నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నారు. ఈ నేపథ్యంలో పాట మరింత హైప్‌ను సృష్టిస్తోంది.
ముఖ్య పాత్రలు: సంయుక్త మేనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, శ్వేతా చటర్జీ, విజి చంద్రశేఖర్ తదితరులు
సంగీతం: ఎస్. తమన్
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
కూర్పు: తమ్మిరాజు
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, ఇషాన్ సక్సేనా
సమర్పణ: ఎం. తేజస్విని నందమూరి
కథ, మాటలు, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల : డిసెంబర్ 12, 2025
‘అఖండ’ సృష్టించిన అదే ఉద్వేగం, అదే భక్తి రసం, అదే మాస్ జ్వరంతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల్ని కలిసింది. Akhanda 2 Review మొదటి భాగం ఎంతటి బ్లాక్‌బస్టర్ అయిందో అందరికీ గుర్తుంది కదా! ఇప్పుడు ఆ కొనసాగింపుగా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ అంచనాల్ని అందుకుందా? థియేటర్‌లో బాలయ్య అభిమానులు మళ్లీ దద్దరిల్లేలా చేశాడా? చూద్దాం..
Akhanda 2 Review | కథ సారాంశం..
కథ టిబెట్ సరిహద్దు నుంచి ఆరంభమవుతుంది. భారతీయుల హిందూ నమ్మకాల్ని, సనాతన ధర్మాన్ని ఛిన్నాభిన్నం చేయాలని శత్రు దేశం (చైనా) ఒక ఘోర కుట్ర పన్నుతుంది. కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులపై బయోలాజికల్ దాడి చేస్తారు. ఫలితంగా వేలాది మంది కోమాలోకి జారుకుంటారు. దీనికి ప్రతి విరుగుడుగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. కానీ శత్రువులు ఆ ల్యాబ్‌ను ధ్వంసం చేసి శాస్త్రవేత్తలందరినీ హతమార్చేస్తారు ఉంటారు. ఆ బృందంలోని యువ శాస్త్రవేత్త జనని (హర్షాలీ మల్హోత్రా) మాత్రమే ఆ వ్యాక్సిన్‌తో సహా ప్రాణాలతో బయటపడుతుంది.
ఆమెను వెంటాడే శత్రు బలగాల నుంచి కాపాడే బాధ్యత రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) తీసుకుంటాడు. అదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ (మరో బాలకృష్ణ) డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ రెండు ట్రాక్‌లు ఎలా ముడిపడతాయి? అఘోరాకు జనని గురించి తెలిసింది ఎలా? చివరికి భారత గౌరవాన్ని, హిందూ ధర్మ గొప్పతనాన్ని ఆయన ఎలాంటి తాండవంతో నిలబెట్టాడు? అనేది మిగతా కథ.
సినిమా ఎలా సాగింది?
బోయపాటి శ్రీను ఈసారి కథను దేశ సరిహద్దులకు మించి తీసుకెళ్లారు. అఘోరా పాత్రకు మరింత శక్తి కల్పించి, ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని కలిపి ఒక భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించారు. మొదటి భాగంలో ఫ్యాక్షనిజం మీద యుద్ధమైతే ఇక్కడ డ్రగ్స్ మాఫియా, బయో టెర్రరిజం, సరిహద్దు దాడులతో సహా జాతీయ భద్రత విషయాలు కలిశాయి.
ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగినా, బాలమురళీకృష్ణ పరిచయం, ఆయన ఎంట్రీ సీక్వెన్స్‌లు అదిరిపోతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమా ఒక్కసారిగా గేర్ మార్చి, రెండో భాగంలో అఘోరా రూపంలో బాలకృష్ణ పూర్తి జోష్‌తో దండయాత్ర చేస్తాడు. హిమాలయాల్లో సర్జికల్ స్ట్రైక్, తాంత్రికుడైన నేత్రతో ఎదుర్కొనే సన్నివేశాలు, హనుమాన్-శివుడి రూపాల్లో అఘోరా, తల్లి సెంటిమెంట్ – ప్రతి ఎపిసోడ్ ఒక్కటే గూస్‌బంప్స్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భారత్ గొప్పతనం, వేదభూమి మహత్యం గురించిన సంభాషణలు థియేటర్‌ను ఉర్రూతలూగిస్తాయి.
నటన, సాంకేతిక విభాగాలు
ఈ చిత్రం పూర్తిగా బాలకృష్ణ వన్ మేన్ ఆర్మీ. రెండు పాత్రల్లోనూ ఆయన విశ్వరూపం చూపించారు. అఘోరా రూపంలో భక్తి-ఆవేశం, బాలమురళీకృష్ణగా స్టైల్-సంభాషణ – రెండూ అద్భుతం. ఆయన మాటల డెలివరీ, యాక్షన్ ఘట్టాలు ఒక్కసారిగా సీట్ల నుంచి లేపేస్తాయి.
Akhanda2 Release Date Fix
సంయుక్త మేనన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా గ్లామర్‌తో ఆకట్టుకుంది. హర్షాలీ మల్హోత్రా కథలో కీలక పాత్ర, ఆమె నటన సహజంగా కనిపించింది. విలన్లలో ఆది పినిశెట్టి (నేత్ర) మాత్రమే కొంత గుర్తుండిపోతాడు, మిగతా వారు రొటీన్. తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ ఎమోషనల్ ఘట్టాలకు బలం చేకూర్చారు.
సాంకేతికంగా తమన్ సంగీతం సినిమాకు ప్రాణవాయువు. పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. రాంప్రసాద్ ఛాయాగ్రహణం గ్రాండ్, ముఖ్యంగా కుంభమేళా, హిమాలయ సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. నిర్మాణ విలువలు పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు : Akhanda 2 Review
బాలకృష్ణ డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్
రెండో భాగంలో అఘోరా తాండవం, ఎలివేషన్ సీన్లు
తమన్ బీజీఎం, భావోద్వేగ ఘట్టాలు
దేశభక్తి-హిందూ ధర్మ గొప్పతనం చాటిన సన్నివేశాలు
మైనస్ పాయింట్లు: Akhanda 2 Review
ప్రథమార్ధంలో కొన్ని సీన్లు కాస్త సాగతీతగా అనిపించడం
విలన్లకు పెద్దగా బలం లేకపోవడం
చివరగా.. ‘అఖండ 2: తాండవం’ అంటే బాలకృష్ణ అభిమానులకు పండుగ, మాస్ ప్రేక్షకులకు పూనకాలు. మొదటి భాగం ఫార్ములానే అనుసరించినా, దాన్ని మరింత గ్రాండ్ స్థాయికి తీసుకెళ్లినందుకు బోయపాటి శ్రీనుకు, బాలయ్యకు జోహార్లు. థియేటర్‌లో గూస్‌బంప్స్, ఉద్వేగం, భక్తి రసం కావాలంటే ఈ చిత్రం మిస్ కాకూడదు.
రేటింగ్: 3.75/5 : Akhanda 2 Review
(గమనిక: ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Home remedies for mouth ulcers | విటమిన్ల లోపం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మహిళల్లో నెలసరి సమయంలో హార్మోన్ల అసమతుల్యత, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలో అధిక వేడి, ఇలాంటి అనేక కారణాల వల్ల చాలా మంది నోటి పుండ్ల బారిన పడుతుంటారు. ఈ చిన్న పుండ్లు మాట్లాడడం, తినడం, నీళ్లు తాగడం కూడా కష్టతరం చేస్తాయి. మందుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లోనే ఉన్న సహజ పదార్థాలతో ఈ ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Home remedies for mouth ulcers | తులసి ఆకులు..
పవిత్రమైన తులసి మొక్క ఆరోగ్యానికి అద్భుత ఔషధం. దీని ఆకుల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ 4-5 సార్లు 8-10 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమలడం లేదా ఆకులను నీళ్లలో మెత్తగా నమిలి ఆ నీటితో పుక్కిలించడం వల్ల నోటి పుండ్లు త్వరగా తగ్గుతాయి. అనేక అంతర్జాతీయ పరిశోధనలు తులసిని నోటి రుగ్మతలకు సహజ చికిత్సగా గుర్తించాయి.
Home remedies for mouth ulcers | సహజ తేనె..
తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. నోటి పుండ్లపై రోజూ 3-4 సార్లు కాస్త తేనె రాయడం వల్ల నొప్పి, మంట తగ్గి, ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది. మరింత శక్తినిచ్చేందుకు చిటికెడు పసుపును తేనెలో కలిపి రాయవచ్చు. పిల్లల్లో కూడా తేనె సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్సగా నిరూపితమైంది.
Home remedies for mouth ulcers | కొబ్బరి – బహుముఖ ఔషధం
కొబ్బరి నూనెను పుండ్లపై సున్నితంగా రాయడం వల్ల తేమ నిలువరించి, నొప్పి తగ్గుతుంది. ఎండు కొబ్బరి ముక్కలు నమలడం లేదా రోజూ రెండు మూడు లేత కొబ్బరి బోండాల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గి, పుండ్లు త్వరగా మాయమవుతాయి.
Home remedies for mouth ulcers | గసగసాలు
శరీర వేడిని తగ్గించడంలో గసగసాలకు ఎటువంటి సాటి లేదు. ఒక టీస్పూన్ గసగసాల పొడిని అంతే మోతాదు పంచదారతో కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే నోటి పుండ్లు గణనీయంగా తగ్గుతాయి.
Home remedies for mouth ulcers | ఇతర సహజ సలహాలు
పుండ్లపై ఐస్ ముక్కలతో సున్నితంగా రుద్దితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
లవంగం నమలడం లేదా లవంగం నూనె రాయడం వల్ల యాంటీ-బ్యాక్టీరియల్ ప్రభావం వలన నొప్పి తగ్గుతుంది.
రోజూ గోరువెచ్చని నీటితో ఎక్కువసార్లు పుక్కిలించడం అత్యంత సులభమైన మార్గం.
మజ్జిగ ఎక్కువగా తాగడం లేదా పుండ్లపై నెయ్యి రాయడం కూడా ఉపయోగకరం.
పచ్చి ఉల్లిపాయలు తినడం, విటమిన్ సి, బి12 అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం సహాయకారి.
టీ, కాఫీ, మాంసాహారం, అధిక మసాలా ఆహారం తాత్కాలికంగా తగ్గించడం మంచిది.
ప్రతిరోజూ రెండుసార్లు పళ్లు శుభ్రంగా తోముకోవడం, ఫ్లాసింగ్ చేయడం, మూడు నెలలకోసారి బ్రష్ మార్చడం వంటి నోటి పరిశుభ్రత అలవాట్లు పుండ్లు రాకుండా కాపాడతాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Akhanda2 Release Date Fix |ఐదు రోజులుగా సోషల్ మీడియా నుంచి వార్తా ఛానెళ్ల వరకు అన్నీ ‘అఖండ 2’ వాయిదా వార్తలతో నిండిపోయాయి. వివిధ రకాల ప్రచారాలు, వదంతులు, ఆరోపణలు, అభిమానుల ఆందోళనలు కలిసి ఈ విషయం రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. కాగా.. నిర్మాణ సంస్థ సినిమా విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. డిసెంబర్ 12న చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
Akhanda2 Release Date Fix | అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్.. డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్
‘‘డబుల్ బ్లాక్‌బస్టర్ అనుభవాన్ని అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం” అని నిర్మాతలు పేర్కొన్నారు. అదనంగా డిసెంబర్ 11 రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటి నుంచి మరే మార్పు ఉండదని, చెప్పిన సమయానికి సమయానికే షోలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
Akhanda2 Release Date Fix : 11న ప్రీమియర్ షోస్
ప్రస్తుతం అభిమానులందరి దృష్టి డిసెంబర్ 11 అర్ధరాత్రి వచ్చే ఫస్ట్ షో టాక్ మీదే నెలకొని ఉంది. ఈ సందర్భంగా ప్రత్యేక రిలీజ్ ట్రైలర్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త మీనన్ తదితరులు ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించారు.
మొదట్లో వాయిదా వార్త ఎంతోమంది అభిమానుల్లో నెగటివ్ భావన కలిగించినప్పటికీ, క్రమంగా ఈ నిర్ణయం సినిమా నాణ్యత కోసమే అని గ్రహించిన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ డిసెంబర్ 25 వరకు వెళ్తే ఇంకా ఆలస్యమవుతుందనే ఆందోళన కలిగిన వారికి ఈ ప్రకటన ఊరట కలిగించింది.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: stainless steel containers | ప్రాచీన కాలంలో మన పూర్వీకులు వంటకు, నిల్వకు మట్టి పాత్రలే వాడేవారు. కానీ ఆధునిక జీవనశైలితో పాటు అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఇళ్లలో ఎక్కువైపోయాయి. గ్రామాల్లో కూడా ఇప్పుడు స్టీల్ వస్తువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. శుభ్రం చేయడం సులువు. అయితే ఈ సౌలభ్యం వెనుక కొన్ని ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు.
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, కొన్ని ఆమ్ల (యాసిడ్) లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో రసాయనిక చర్య జరిగి, స్టీల్‌లోని లోహ అంశాలు (క్రోమియం, నికిల్, ఇనుము మొ.) స్వల్ప మోతాదులో ఆహారంలో కలిసే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యానికి హానికరం కావొచ్చు, రుచి–వాసన కూడా మారిపోతుంది. అందుకే కొన్ని ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాల్లో ఎక్కువ సేపు నిల్వ చేయడం మానేయడం మంచిది.
stainless steel containers | పచ్చళ్లు
భారతీయ వంటలో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉప్పు, మసాలా, నూనెతో పాటు పుల్లని రసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్లత్వం, ఉప్పు స్టీల్‌తో స్పందించి పాత్రను తుప్పు పట్టిస్తుంది. ఫలితంగా లోహ రేణువులు పచ్చడిలో కలిసి ఆరోగ్యానికి హాని చేకూర్చవచ్చు. అందుకే ఎప్పటి నుంచో మన పెద్దలు పచ్చళ్లను గాజు లేదా పింగాణీ వాటిల్లోనే నిల్వ చేసేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించడం ఉత్తమం.
stainless steel containers | పుల్లని ఆహార పదార్థాలు
నిమ్మకాయ, టమాటో, చింతపండు, ఉసిరి వంటి పుల్లని పదార్థాల్లో సిట్రిక్ యాసిడ్, మరియు మాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని స్టీల్ డబ్బాలో ఎక్కువ సేపు నిల్వ చేస్తే ఆమ్లం స్టీల్‌ను కరిగించి విషకరమైన సమ్మేళనాలు ఏర్పరుస్తుంది. ఫలితంగా ఆహారం చేదుగా మారడంతో పాటు గుండెల్లో మంట, అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి పుల్లని గ్రేవీలు, రసాలను గాజు బాటిల్స్ లేదా ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో మాత్రమే భద్రపరచాలి.
stainless steel containers | పెరుగు, పెరుగుతో చేసిన వంటకాలు
పెరుగు సహజంగానే ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. స్టీల్ డబ్బాలో నిల్వ చేస్తే త్వరగా పులిసిపోతుంది. రుచి–వాసన పోతుంది, పోషక విలువలు కూడా తగ్గుతాయి. అందుకే మన ఇళ్లలో ఇప్పటికీ పెరుగును మట్టి లేదా గాజు పాత్రలోనే పెట్టే సంప్రదాయం ఉంది. మట్టి పాత్ర అయితే పెరుగు చల్లగా, తాజాగా ఎక్కువ రోజులు ఉంటుంది.
stainless steel containers | తాజా పండ్లు (ముఖ్యంగా ఆమ్లత్వం ఎక్కువ ఉన్నవి)
ఆపిల్, నారింజ, ద్రాక్ష, కివీ వంటి పండ్లను స్టీల్ డబ్బాలో పెడితే త్వరగా నల్లబడతాయి లేదా మృదువుగా మారి పాడైపోతాయి. స్టీల్ ఉపరితలం తేమను పీల్చుకుని పండ్లలో ఆక్సిడేషన్ వేగంగా జరిగేలా చేస్తుంది. అందుకే ఫ్రిజ్‌లో ఉన్నా సరే, పండ్లను ప్లాస్టిక్ లేదా గాజు ట్రేల్లోనే ఉంచడం మంచిది.
stainless steel containers | తేనె
తేనెలో సహజ ఆమ్లాలు ఉంటాయి. స్టీల్‌తో ఎక్కువ కాలం సంబంధం ఉంటే స్వల్పంగా లోహ రుచి వచ్చే అవకాశం ఉంది. అందుకే సంప్రదాయంగా తేనెను గాజు బాటిల్స్‌లోనే నిల్వ చేస్తారు.
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వంటకు, సాధారణ నిల్వకు ఎంతో ఉపయోగకరం అయినప్పటికీ, ఆమ్లత్వం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలతో జాగ్రత్త అవసరం. గాజు, మట్టి, లేదా ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ పాత్రలు ఈ సందర్భాల్లో ఎప్పుడూ సురక్షితమైన, ఆరుచికరమైన ఎంపికలు. చిన్న జాగ్రత్తతోనే మన ఆహారం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Apple Fitness Plus | ఆపిల్ కంపెనీ తన ప్రముఖ ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ సేవ ‘ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్’ను ఈ నెల 15వ తేదీ నుంచి భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి తెస్తోంది. 2020లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఒకేసారి 17 కొత్త దేశాలు, ప్రాంతాలకు విస్తరిస్తూ, ఇదే తన చరిత్రలో అతిపెద్ద విస్తరణగా ఆపిల్ పేర్కొంది.
ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ అంటే కేవలం వర్కౌట్ యాప్ మాత్రమే కాదు. ఇది ఆపిల్ ఎకోసిస్టమ్‌లోని పరికరాలతో పూర్తిగా అనుసంధానమై పనిచేసే సమగ్ర డిజిటల్ ఫిట్‌నెస్ వేదిక. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీలలోని ఫిట్‌నెస్ యాప్ ద్వారా దీన్ని సులువుగా ఉపయోగించవచ్చు. ఆపిల్ వాచ్ ఉంటే మీ హృదయ స్పందన రేటు, కేలరీల ఖర్చు, యాక్టివిటీ రింగ్స్ ప్రోగ్రెస్ వంటి వ్యక్తిగత డేటా రియల్ టైమ్‌లో స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో 3తో కలిపి ఉపయోగిస్తే ఈ అనుభవం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
ప్రస్తుతం 12 రకాల వ్యాయామ శైలులు ఈ సేవలో అందుబాటులో ఉన్నాయి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT), పిలేట్స్, డాన్స్, సైక్లింగ్, కిక్‌బాక్సింగ్, మెడిటేషన్, ట్రెడ్‌మిల్ / రన్నింగ్, రోయింగ్, కోర్ ట్రైనింగ్, మైండ్‌ఫుల్ కూల్‌డౌన్ వంటివి ఉన్నాయి. ప్రతి వ్యాయామం 5 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉంటుంది. కొత్తగా వచ్చే వినియోగదారుల నుంచి అనుభవజ్ఞుల వరకు అందరికీ అనుగుణంగా రూపొందించారు.
Apple Fitness Plus | ప్రత్యేక ఫీచర్స్
కస్టమ్ ప్లాన్స్: మీకు ఇష్టమైన వ్యాయామ రకం, సమయం, ట్రైనర్, సంగీతం ఆధారంగా వారంవారీ వ్యక్తిగత షెడ్యూల్ తయారు చేస్తుంది.
స్టే కన్సిస్టెంట్, పుష్ ఫర్దర్, గెట్ స్టార్టెడ్ వంటి రెడీమేడ్ ప్రోగ్రామ్స్.
ఆపిల్ మ్యూజిక్‌తో లోతైన అనుసంధానం.. హిప్-హాప్, లాటిన్, K-పాప్ సహా ఎన్నో జానర్ల ప్లేలిస్ట్‌లు.
‘రన్ యువర్ ఫస్ట్ 5K’, ‘పిలేట్స్ ఫర్ మోర్ దెన్ యువర్ కోర్’ వంటి లక్ష్యాధారిత కలెక్షన్స్.
12 రకాల మెడిటేషన్ థీమ్స్ – కామ్, స్లీప్, సౌండ్ మొదలైనవి.
Apple Fitness Plus | ధర & లభ్యత:
భారత్‌లో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.149, వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.999కు లభిస్తుంది. ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఐదుగురు కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ షేరింగ్ ద్వారా) ఉపయోగించుకోవచ్చు.
కొత్తగా ఆపిల్ వాచ్, ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీ, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లేదా పవర్‌బీట్స్ ప్రో 2 కొనుగోలు చేసిన వినియోగదారులకు మొదటి మూడు నెలలు పూర్తిగా ఉచితం.
Apple Fitness Plus | ఈ సేవ ఏ పరికరాల్లో పనిచేస్తుంది?
ఐఫోన్ 8 లేదా తదుపరి మోడల్స్
ఆపిల్ వాచ్ సిరీస్ 3 లేదా తర్వాతి వెర్షన్లు
ఐప్యాడ్ (ఏదైనా తరం)
ఆపిల్ టీవీ
డిసెంబర్ 15 నుంచి భారత్‌తో పాటు చిలీ, హాంకాంగ్, నెదర్లాండ్స్, నార్వే, ఫిలిప్పీన్స్, పోలాండ్, సింగపూర్, స్వీడన్, తైవాన్, వియత్నాం మొదలైన 17 దేశాలు/ప్రాంతాల్లో ఈ సేవ అందుబాటులోకి వస్తోంది. ఈ సందర్భంగా జర్మన్, స్పానిష్ భాషల్లో డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్‌తో భారతీయ వినియోగదారులు ఇకపై తమ ఆరోగ్య లక్ష్యాలను మరింత సులువుగా, ఆసక్తికరంగా సాధించే అవకాశం లభించనుంది.