Penci Sport plugin only working with the Soledad theme.

హెల్త్ / లైఫ్ స్టైల్ - Telugu News Today

Category: హెల్త్ / లైఫ్ స్టైల్

  • soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

    soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: soft chapatis all day | చపాతీలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కానీ చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే.. అవి చేసినప్పుడు మెత్తగా వచ్చినా కొద్దిసేపటికే గట్టిపడిపోతాయి. మళ్లీ వేడి చేసినా పాత మెత్తదనం రాదు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఉదయం తయారు చేసిన చపాతీలు రాత్రి వరకూ కూడా రెండు వేళ్లతో సులువుగా మడతపెట్టేంత మెత్తగా ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక పదార్థాలు లేకుండా, ఇంట్లో ఉన్నవాటితోనే ఇలా చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..

    soft chapatis all day

    soft chapatis all day | పిండి కలిపే సమయంలో ఇలా చేయండి..

    • సాధారణంగా గోధుమ పిండిని నీళ్లతోనే కలుపుతాం. కానీ మెత్తదనం కోసం ఒక చిన్న మార్పు చేయండి.
    • నీటిలో కొంత భాగం (సుమారు 25–౩౦ శాతం) పాలతో భర్తీ చేయండి. పాలలోని కొవ్వు, ప్రోటీన్ పిండిని తేమగా ఉంచుతాయి.
    • పాలు వాడకపోయినట్లయితే రెండు టీస్పూన్ల నూనె లేదా నెయ్యి కలిపి కలపండి. ఇలా చేయడంతో పిండి మరింత మృదువుగా మారుతుంది. మరియు చపాతీలు గట్టిపడకుండా ఉంటాయి.
    • పిండి మెత్తగా, మెరిసేలా కలిసే వరకూ బాగా పిసకండి
    • కలిపిన పిండిని కాసేపు పక్కన పెట్టండ
    • పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకండి. కనీసం 20–౩౦ నిమిషాల పాటు పక్కన పెట్టండి. తడిగా ఉన్న పత్తి గుడ్డతో లేదా మూత పెట్టిన గిన్నెలో ఉంచండి. ఈ విశ్రాంతి సమయంలో గ్లూటెన్ సడలి, తేమ సమానంగా పంపిణీ అవుతుంది. ఫలితంగా చపాతీలు బాగా పొంగుతాయి. ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి.

    soft chapatis all day | సరైన మంటపై కాల్చండి..

    • చపాతీలు త్వరగా గట్టిపడిపోకుండా ఉండాలంటే పెనం (తవా) బాగా వేడిగా ఉండాలి
    • మీడియం–హై మంట మీద పెనం వేడి చేయండి (నీటి చుక్క వేస్తే తక్షణం ఆవిరైపోవాలి).
    • చపాతీని రెండు వైపులా కొద్దిసేపు కాల్చి, ఆ తర్వాత నేరుగా అగ్నిమీదికి తీసుకెళ్లి లేదా గుడ్డతో నొక్కుతూ పూరి లాగా పొంగేలా చేయండి.
    • తక్కువ మంట మీద నెమ్మదిగా కాల్చితే తేమ అంతా పోయి చపాతీలు త్వరగా గట్టిపడతాయి.
    • కాల్చేటప్పుడు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తే రుచి, మెత్తదనం రెట్టింపవుతాయి.

    soft chapatis all day

    soft chapatis all day | నిల్వ చేసే విధానం..

    • ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. చాలా మంది ఈ దశలోనే తప్పు చేస్తారు
    • వేడి వేడి చపాతీలను నేరుగా స్టీల్ డబ్బా లేదా క్యాస్రోల్‌లో పెట్టొద్దు
    • ఆవిరి వల్ల మొదట తడిగా, తర్వాత రబ్బరు లాగా అవుతాయి.
    • శుభ్రమైన, పొడి కాటన్​ క్లాత్​ను డబ్బాలో వేయండి ప్రతి చపాతీని ఆ గుడ్డలో మడతపెట్టి పెట్టండి. మూత మూసిన తర్వాత గాలి ప్రవేశించదు. అదనపు తేమను గుడ్డ పీల్చేస్తుంది.
    • ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే మీ చపాతీలు ఎప్పుడూ దూదిలా మెత్తగా ఉంటాయి.

    గమనిక: ఈ కథనం ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించండి.

    ఇది కూడా చదవండి..: Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!‌

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Winter Skin Care Tips | చలికాలంలో చర్మం పొడిబారుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే నిగనిలాడుతుంది..!

    Winter Skin Care Tips | చలికాలంలో చర్మం పొడిబారుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే నిగనిలాడుతుంది..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Skin Care Tips | చలికాలం వచ్చిందంటే చాలా మందికి చర్మ సంరక్షణ గురించి ఆందోళన మొదలవుతుంది. చల్లని గాలులు, పొడి వాతావరణం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. దీంతో నిస్తేజంగా మారిపోతుంది. పెదవులపై పగుళ్లు ఏర్పడడంతో పాటు చేతులు, ముఖం పొడి బారి సన్నని గీతలు ఏర్పడడం సాధారణం. ఈ సమయంలో రసాయనాలతో నిండిన క్రీములు, లోషన్లపై ఆధారపడితే తాత్కాలిక ఉపశమనం లభించినా.. దీర్ఘకాలంలో చర్మం మరింత దెబ్బతినే అవకాశం ఉంది.

    అందుకే సహజమైన, ఇంటి వద్దే అందుబాటులో ఉండే పదార్థాలతో చర్మ సంరక్షణ చేసుకోవడం ఉత్తమ మార్గం. ఈ చిట్కాలను పాటించడంతో చలికాలంలోనూ మీ చర్మం మృదువుగా, తేమతో నిండి, సహజ కాంతితో మెరిసిపోతుంది. అవేంటో తెలుసుకుందాం పదండి..

    Winter Skin Care Tips | రోజూ తగినంత నీరు తాగండి..

    చలికాలంలో దాహం అనిపించకపోవచ్చు గానీ శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది చర్మంపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో స్కిన్​ పొడి బారడం, నిస్తేజంగా కనిపించడం జరుగుతుంది. రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగే అలవాటు చేసుకోండి. గది ఉష్ణోగ్రతలో ఉండే నీరు లేదా గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి నుంచి హైడ్రేట్ అవుతుంది.

    Winter Skin Care Tips | చర్మ రకానికి తగిన మాయిశ్చరైజర్‌ ఎంపిక

    స్నానం తర్వాత లేదా ముఖం కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు షియా బట్టర్, కోకో బట్టర్ ఆధారిత క్రీములు, జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ ఆధారిత లేదా ఆలివ్ ఆయిల్ మిశ్రిత లైట్ లోషన్లు ఉపయోగించవచ్చు. రోజుకు రెండు సార్లు (ఉదయం–సాయంత్రం) అప్లయ్​ చేయాలి.

    Winter Skin Care Tips | తేనెతో సహజ మాయిశ్చరైజింగ్

    సహజ హ్యూమెక్టెంట్ అయిన తేనె చర్మంలోకి తేమను గ్రహిస్తుంది. శుభ్రమైన ముఖంపై సన్నని పొర తేనె రాసి 15–20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. వారంలో ఇలా మూడు సార్లు చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

    Winter Skin Care Tips | రాత్రిపూట నూనె మసాజ్

    కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె లేదా జోజోబా నూనెలలో ఏదో ఒకటి ఎంచుకోండి. పడుకునే ముందు 8–10 నిమిషాలు ముఖం, మెడ, చేతులకు సున్నితంగా మసాజ్ చేసి రాత్రంతా ఉంచండి. ఉదయం సాధారణ నీటితో కడిగేయండి. వారం–పది రోజుల్లోనే చర్మం మెరవడంతో పాటు మృదువుగా మారుతుంది.

    Winter Skin Care Tips | వేడి నీటికి ముఖం కడగొద్దు

    వేడి నీరు చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడి బారేలా చేస్తుంది. ముఖం కడుక్కునేందుకు ఎల్లప్పుడూ చల్లని లేదా గోరువెచ్చని నీటినే వాడండి.

    Winter Skin Care Tips | రోజ్​వాటర్​–గ్లిసరిన్–నిమ్మరసం మిశ్రమం

    ఒక చిన్న స్ప్రే బాటిల్‌లో రోజ్​వాటర్​, గ్లిసరిన్‌ను సమాన నిష్పత్తిలో కలపండి. ఐదు–ఆరు చుక్కల నిమ్మరసం వేసి బాగా షేక్ చేయండి. రాత్రి శుభ్రమైన ముఖంపై స్ప్రే చేసి లేదా కాటన్​తో తుడుచుకోండి. ఉదయానికి చర్మం సహజ కాంతితో నిండిపోతుంది.

    గమనిక: పైచిట్కాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి చర్మ రకం, ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ముందుగా డెర్మటాజిస్ట్​ను సంప్రదించి ఏవైనా వాడండి.

    ఇది కూడా చదవండి..: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!

    Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!

    తెలుగున్యూస్​టుడే,ఇంటర్నెట్​ డెస్క్​: Winter Blues Natural Remedies | చలికాలం వచ్చిందంటే చాలామందికి అనేక సార్లు ఏదో బద్ధకం, నీరసం అనిపిస్తుంది. చల్లని గాలులు, త్వరగా చీకటి పడడం, రోజులో ఎక్కువ సమయం మంచంపైనే గడపాల్సి రావడం వల్ల మనసు కుంగిపోతుంది. ఉదయాన్నే లేవాలని, బయటకు అడుగుపెట్టాలనే ఉత్సాహం రాదు. ఇలాంటి భావోద్వేగాలు సాధారణంగా అందరిలోనూ కొంతమేర కనిపిస్తాయి. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్’ (SAD) లేదా ‘వింటర్ బ్లూస్’ అంటారు. ఈ సమస్య ప్రధానంగా శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండడం వల్ల వస్తుంది. ఇది మెదడులో సెరటోనిన్ (సంతోష హార్మోన్) స్థాయిలను తగ్గించి, మెలటోనిన్ (నిద్ర హార్మోన్)ను పెంచుతుంది. ఫలితంగా మూడ్ డౌన్ అవుతుంది.

    Winter Blues Natural Remedies | వింటర్ బ్లూస్ లేదా SAD లక్షణాలు ఏమిటి?

    • రోజంతా నీరసం, విచారం లేదా నిరుత్సాహం అనిపించడం
    • శక్తి స్థాయిలు తగ్గిపోవడం, అలసటగా ఉండడం
    • ఇష్టమైన పనులపై ఆసక్తి కోల్పోవడం
    • కార్బోహైడ్రేట్స్ ఆహారం అధికంగా తినడం, బరువు పెరగడం
    • ఏకాగ్రత సమస్యలు, దృష్టి కేంద్రీకరించలేకపోవడం
    • అపరాధ భావన, నిరాశ, తనను తాను విలువలేనివాడిగా భావించడం
    • అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమి
    • తీవ్రమైన సందర్భాల్లో జీవితం మీద విరక్తి కలగడం

    ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.

    Winter Blues Natural Remedies | మూడ్‌ను బూస్ట్ సూచనలు

    కొన్ని సహజమైన జీవనశైలి మార్పులతో వింటర్​ బ్లూస్​ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేయదగినవే.

    Winter Blues Natural Remedies | సూర్యకాంతిని ఎక్కువగా పొందండి..

    చలికాలంలో బయటకు వెళ్లి కాసేపు నడవడం లేదా పార్కులో గడపాలి. సూర్యకాంతి మెదడు రసాయనాలను సమతుల్యం చేసి, జీవ గడియారాన్ని సరిచేస్తుంది. రోజూ 20-30 నిమిషాలు బయట గడిపితే నిద్ర మెరుగవుతుంది. అంతేకాకుండా మూడ్ కూడా బాగుపడుతుంది.

    Winter Blues Natural Remedies | స్నేహితులు, కుటుంబంతో సమయం గడపండి

    ఒంటరితనం అనేది వింటర్ బ్లూస్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే స్నేహితులతో బయటకు వెళ్లండి. ఇష్టమైన సినిమాలు చూడడం, లేదా పుస్తకాలు చదడం చేయాలి. లేదంటే ఆటలు ఆడండి. ఇవి హ్యాపీ హార్మోన్స్​ను పెంచుతాయి.

    Winter Blues Natural Remedies | బాడీ డబ్లింగ్ టెక్నిక్..

    ఇది ఒక ఆసక్తికరమైన పద్ధతి. మరొకరి సమక్షంలో (ఫేస్ టు ఫేస్ లేదా వర్చువల్‌గా) పనులు చేయడం లాంటివి చేయాలి. ఉదాహరణకు, ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి పనులు పూర్తి చేయడం లేదా స్నేహితుడితో కలిసి ఒకే సినిమా చూడడం వల్ల నిరాశను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

    Winter Blues Natural Remedies | ధ్యానం, ప్రాణాయామం

    నిత్యం 10-15 నిమిషాలు ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అనేక అధ్యయనాల్లో ఇది మూడ్‌ను మెరుగుపరుస్తుందని నిరూపితమైంది. అలాగే ఇంట్లోనే యోగా, డ్యాన్స్ లేదా సాధారణ వాకింగ్ చేయండి. వ్యాయామం ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్లు) విడుదల చేసి, శక్తిని పెంచుతుంది.

    ఈ చిట్కాలు అన్నీ సహజమైనవి మరియు సులభంగా అమలు చేయదగినవి. అయితే లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా రోజువారీ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా మానసిక ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి.

    గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికినా సమాచారం ఆధారంగా ప్రచురితం చేశారు. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకోండి.

    ఇది కూడా చదవండి..: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Karthika Amavasya | విశిష్టం.. కార్తీకమాస అమావాస్య.. ఈ రోజు చేయాల్సిన పనులివే..

    Karthika Amavasya | విశిష్టం.. కార్తీకమాస అమావాస్య.. ఈ రోజు చేయాల్సిన పనులివే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Karthika Amavasya | పవిత్రమైన కార్తీక మాసం అమావాస్యతో ముగియనుంది. ఈ మాసంలో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అయితే కార్తీక వ్రతం పూణ్య ఫలం దక్కాలంటే చివరి రోజైన అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు.. తిథి, శుభముహూర్తం వంటి విషయాలను తెలుసుకుందామా..

    ప్రతి నెల వచ్చే అమావాస్య, పౌర్ణమిలకు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో పాటు అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి యేటా ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. పితృపూజకు కార్తీక అమావాస్యను అత్యంత పవిత్రమైందిగా భావిస్తుంటారు. ఈ రోజు నదీ స్నానాలు ఆచరిస్తారు. అంతే కాకుండా దానధర్మాలు చేస్తుంటారు. కార్తీక అమావాస్య రోజు శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్ముతారు.

    Karthika Amavasya | అమావాస్య తిథి..

    హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య తిథి నవంబర్‌ 19న ఉదయం 9:44 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం 12:17 గంటలకు ముగియనుంది. అయితే అయితే సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే నవంబర్‌ 20న కార్తీక అమావాస్య జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

    Karthika Amavasya | అమావాస్య ప్రాముఖ్యత

    కార్తీక అమావాస్య విశేషమైందిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు ఈ రోజున పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగిందుకు పితృ పూజలు, తిలా తర్పణం, పిండ దానం చేస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు శక్తికొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, సిరి సంపదలు, ఆనందం, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.

    Karthika Amavasya

    Karthika Amavasya | దీపారాధన

    కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంటని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత.. నువ్వుల నూనెతో ఇంటి ముందు, దేవుడి వద్ద, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శ్రీమహావిష్ణువుకు తులసి మాలను సమర్పించడం విశిష్టమైందిగా చెబుతారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

    Karthika Amavasya | ఉపవాస దీక్ష

    అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అందుకే ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే కార్తీక మాసమంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక అమావాస్య నియమాలను శాస్త్రయుక్తంగా ఆచరిద్దాం.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    ఇది కూడా చదవండి..: Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Period Delay Pills |పీరియడ్స్​ ఆలస్యం కావడానికి పిల్స్​ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!

    Period Delay Pills |పీరియడ్స్​ ఆలస్యం కావడానికి పిల్స్​ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Period Delay Pills |యువతులు, మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. ఇది సహజమైన ప్రక్రియ. అయితే పండుగలు, వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో పీరియడ్స్​ను అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా సెంటిమెంట్ ప్రకారం వేడుకలకు దూరంగా ఉంటారు. ఇంకొంత మంది పీరియడ్స్ ఆలస్యమయ్యేలా టాబ్లెట్స్​ వాడుతుంటారు. ఇలా మాత్రలు వేసుకుని గతకొంతకాలం క్రితం ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మాత్రలు వేసుకోవడం వల్ల దుష్ర్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా..

    కొంతకాలం క్రితం ఓ 18 ఏళ్ల యువతి ఇంట్లో పూజ కోసం పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడింది. బ్లడ్ క్లాట్ కావడంతో వల్ల ప్రాణాలు కోల్పోయింది. దాదాపు మూడు రోజుల పాటు ఇలా పిల్స్ వేసుకుంది. కాళ్లు, చేతులలో వాపులు వచ్చి చివరకు చనిపోయిన విషయం తెలిసిందే.

    Period Delay Pills | పిల్స్ వాడుతున్నారా..

    అనేక మంది మహిళలు పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడుతుంటారు. వీటిలో కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ఇవి నెలసరి రాకుండా తాత్కాలికంగా ఆపుతాయి. ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకలు ఉన్న సమయంలో కొందరు మహిళలు వీటిని వినియోగిస్తుంటారు. ఇది కొన్ని సార్లు ప్రభావం చూపించకపోవచ్చు. కానీ కొన్ని సార్లు మాత్రం తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్లాట్స్ వచ్చే ముప్పు సైతం ఏర్పడుతుంది. ఉన్నట్టుండి హార్మోన్ల లెవెల్స్ పడిపోవడం వల్ల తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు.

    ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకున్నట్లే..!

    పిల్స్ వేసుకున్న సమయంలో బాడీలో హార్మోన్ల లెవెల్స్ మారిపోతాయి. నెలసరిని ప్రేరేపించే హార్మోన్స్​ అనేవి ఆగిపోతాయి. ఈ కారణంగా పీరియడ్స్ రావడం ఆలస్యం అవుతుంది. ఎన్ని రోజుల పాటు మెడిసిన్ తీసుకుంటే అన్ని రోజుల పాటు ఆగిపోతాయి. ఇలా చేయడం వల్ల సమస్యలు రావడంతో పాటు రక్తం పని తీరు కూడా మారిపోతుంది. ఈ మాత్రల్లో నోరెతిస్టెరాన్ ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టుకుపోవడానికి కారణం అవుతుంది. ఈ సమస్య మొదలైతే.. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.

    Period Delay Pills |ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటే..

    పీరియడ్స్​ డిలే కోసం పిల్స్​ వేసుకున్నట్లయితే నోరెతిస్టెరాన్ హార్మోన్ రక్త సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దీంతో బ్లడ్ క్లాట్స్ వస్తాయి. అదే సమయంలో రక్తం చిక్కబడుతుంది. అలాగే రక్తాన్ని పల్చగా ఉంచే ప్రొటీన్​లు అనేవి తగ్గిపోతాయి. దీని వల్ల రక్తం చిక్కబడుతుంది. సరైన విధంగా సరఫరా కాకపోవడం కారణంగా నరాల్లో గడ్డలు కడుతుంది. రక్తం గడ్డకట్టినప్పుడు కండరాలు వాపునకు గురవుతాయి. నొప్పి వస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు వస్తాయి.‌

    Period Delay Pills |ఎవరికి ముప్పు

    ఎప్పుడో ఓసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పిల్స్ వేసుకుంటే పరవాలేదు. కానీ ఎక్కువ రోజుల పాటు వాడినట్లయితే దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవు. అయితే.. కొన్ని రకాల సమస్యలున్న వాళ్లయితే వీటిని అసలు వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం అనేది కుటుంబంలో అంతకు ముందు ఇంకెవరికైనా ఉన్నట్లయితే వాళ్లు ఈ పిల్స్ వేసుకోకూడదు. అలాగే ఉబయకాయం ఉన్న వారు సైతం వాడకూడదని సూచిస్తున్నారు.

    Period Delay Pills |ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    తప్పనిసరి పరిస్థితుల్లో పిల్స్​ వాడాల్సి వస్తే వైద్యుల సలహా లేనిది వేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పిల్స్ తీసుకున్నా సరైన విధంగా హైడ్రేట్​గా ఉండాలి. నీరు బాగా తగడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసిన సమయంలో మధ్యలో కాస్త గ్యాప్ తీసుకోవాలంటున్నారు.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.

    child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

    child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: child safety tips | చిన్న పిల్లలు ఉంటే ఇల్లు కళకళాడుతుంది. ఇళ్లంతా సందడిగా ఉంటుంది. చిన్నారులంటే అందరికీ ముద్దే. కానీ వారి పెంచాలంటే ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి (child safety tips) ఉంటుంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సి అవసరం వస్తుంది. ముఖ్యంగా ఆడుకునేటప్పుడు వాళ్లు ఏది చూసినా నోట్లో పెట్టుకుంటుంటారు. బొమ్మల విడి భాగాలు, బ్యాటరీలు, నాణేలు, ఆట వస్తువుల్లాంటివి గొంతులో ఇరుక్కున్న సంఘటనలు చాలా చూస్తుంటాం. ఏదిపడితే అది నోట్ల పెట్టుకోవడం వల్ల శ్వాస ఆడకపోవడంతో ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తుంది. ఒక్కో సారి ప్రాణాలు పోయిన సంఘటనల వార్తలు కూడా చూస్తుంటా. అందుకే ఇంట్లో ఇలాంటి ప్రమాదాల్ని నివారించే సింపుల్ టిప్స్ పాటిద్దాం..

    child safety tips | ఒక్క నిమిషం జాప్యం – పెను ప్రమాదం

    చాలా మంది తల్లులు పిల్లలకు ఆట వస్తువులు ఇచ్చి.. వంటింట్లో లేదా ఇతర పనుల్లో మునిగిపోతారు. ఇలా చేయకూడదంటున్నారు నిపుణులు. మాగ్నెట్స్, బటన్ బ్యాటరీలు, పిన్స్ లాంటివి పిల్లల చేతికి అందకుండా దూరంగా పెట్టాలని సూచిస్తున్నారు. బొమ్మలు ఎప్పుడైనా విరిగిపోతే వాటిని ఉపయోగించకుండా పక్కన పెట్టేయాలని చెబుతున్నారు. మూతలు సడలిన డబ్బాలు, నోటికి సరిపడా చిన్న ప్లాస్టిక్ ముక్కలు, రేడియం బాల్స్ లాంటివన్నీ పిల్లల దృష్టిలో పడకుండా చూడాలంటున్నారు.

    child safety tips

    child safety tips | ఈ వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరపెట్టొద్దు

    నెలల నుంచి 5 ఏళ్ల లోపు పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతుండాలి. మెడలో సన్నని గొలుసు, పూసల దండలు వేయకూడదు. వీటిని నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే నాణేలు, చిన్న బ్యాటరీలు, బొమ్మల స్పేర్ పార్ట్స్, ఆభరణాలు, పెన్సిల్, రబ్బరు బిట్స్, పిన్స్ పిల్లల దగ్గర ఉండాకుండా చూసుకోవాలి. జామకాయ, ఆపిల్ లాంటి పండ్లు ముక్కలు చేసి పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మాంసం తినిపించినట్లయితే చేత్తో నలిపి ఎముకలు తీసేసి మెత్తగా చేసి ఇవ్వండి.

    child safety tips

    child safety tips | పరిస్థితి చేయిదాటకుండా చూసుకోండి

    పిల్లల గొంతులో ఇరుక్కుపోయిందని అనుమానం వస్తే బలవంతంగా లాగొద్దు. అంతేకాకుండా లోపలికి నెట్టొద్దని నిపుణులు సూచిస్తున్నారు. సున్నితంగా బయటకు తీసేలా ప్రయత్నించండి. గట్టిగా దగ్గిస్తే కొన్నిసార్లు బయటపడుతుంది. కానీ వాంతి పుట్టించేందుకు ఇంకో ఆహారం ఇవ్వడం, పొట్టపై గట్టిగా రుద్దడం లాంటివి చేయవద్దని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లోపల గాయాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం ఉత్తమం.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం. వీటిని పాటించే ముందుకు తప్పకుండా నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి..

    ఇది కూడా చదవండి..: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!‌

    Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!‌

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Coffee on Empty Stomach Risks |పొద్దున నిద్రలేవగానే కప్పు కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. దీంతో ఎనర్జిటిక్​గా అనిపిస్తుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా కడుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించారా..? ఈ అలవాటు మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా..

    ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఏమీ తినకుండా కాఫీ తాగడం వల్ల అది కడుపులోని ఆమ్ల స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది కడుపు గోడలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మంట, గ్యాస్, వికారం, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

    Coffee on Empty Stomach Risks |కాఫీలోని కెఫీన్ కారణంగా..

    కాఫీలోని కెఫీన్ మరో సమస్య. ఇది శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. దీనిని స్ట్రెస్​ హార్మోన్ అని కూడా అంటారు. దీని కారణంగా ఉదయం రిఫ్రెష్ అయిన ఫీలింగ్​కి బదులు ఆందోళన, చిరాకు లేదా టెన్షన్ అనిపించే అవకాశం ఉంటుంది. కాఫీ మీ మానసిక స్థితిని మరింత గందరగోళంగా మారుస్తుంది అన్నమాట.

    Coffee on Empty Stomach Risks |మొదట గ్లాస్​ నీళ్లు తాగండి..

    ఉదయం లేచిన తర్వాత మొదట ఒక గ్లాసు నీరు తాగడమే సరైన మార్గం. రాత్రి నిద్రలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అయితే నీరు తాగడం వల్ల తేమ తిరిగి వస్తుంది. మెటబాలిజం ప్రారంభమవడంతో పాటు జీర్ణక్రియ సిద్ధమవుతుంది. ఆ తర్వాత కాఫీ తాగాలనిపిస్తే.. ముందుగా కొంచెం లైట్ బ్రేక్‌ఫాస్ట్ లేదా ఫ్రూట్స్ తినండి. ఆ తర్వాత అరగంట ఆగి కాఫీ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆమ్ల ప్రభావం తగ్గుతుంది.‌

    Coffee on Empty Stomach Risks |సరైన సమయంలో తాగితే..

    కాఫీ అలవాటు అనేది పూర్తిగా చెడు చేస్తుందని కాదు. కానీ సరైన సమయంలో, సరైన విధానంలో తాగితే అది ఏకాగ్రత పెంచడంతో పాటు అలసట తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మూడ్‌ను మెరుగుపరుస్తుందట. కానీ ఖాళీ కడుపుతో తాగకపోవడం, మీ శరీర అవసరాలను గుర్తించడం చాలా కీలకం. ఇలాంటి చిన్న మార్పులతో మీ ఉదయాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు, దీర్ఘకాలంలో జీర్ణ ఆరోగ్యం, మానసిక బ్యాలెన్స్‌ను కాపాడుకోవచ్చు.‌

    ‌గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం అందించాం. ఈ కథనం ఇంటర్నెట్‌లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఇచ్చాం. వీటిని పాటించే ముందుకు సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.

    ఇది కూడా చదవండి: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Cracked Lips in Winter | చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు వస్తుంటాయి. చల్లటి గాలుల ప్రభావం ముఖ్యంగా మన పెదవులపై ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గులాబీ రంగులో మెరిసే పెదవులు ఈ సీజన్‌లో పొడిబారి, పగిలి, ఒక్కోసారి రక్తం కారేంతగా బాధిస్తాయి.

    ఈ సమస్యను తగ్గించడానికి చాలామంది ఖరీదైన లిప్ బామ్స్ లేదా క్రీములు వాడుతుంటారు. కానీ మన వంటింట్లోనే చిట్కాలు ఉన్నాయి. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా మార్చే 5 సహజ హోం రెమెడీస్‌ను ఇప్పుడు చూద్దాం.

    Cracked Lips in Winter | ప్రకృతి ఇచ్చిన ప్రసాదం తేనె

    తేనె రుచికోసం మాత్రమే కాదు.. సౌందర్య రహస్యాల్లో ప్రధానమైంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. యాంటీబాక్టీరియల్ గుణాల వల్ల పగుళ్లతో వచ్చే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. స్వచ్ఛమైన తేనెను కొద్దిగా తీసుకుని పెదవులపై పలుచగా రాయండి. రోజులో రెండు లేదా మూడు సార్లు ఇలా చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే కడిగేస్తే, పెదవులు వెన్నలా మృదువవుతాయి.

    Cracked Lips in Winter | సహజ రక్షణ కవచం కొబ్బరి నూనె

    కొబ్బరి నూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్​ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి తేమను నిలిపి ఉంచుతాయి. చల్లని గాలుల ప్రభావం నుంచి పెదవులను కాపాడతాయి. కొద్దిగా నూనెను వేళ్లతో తీసుకుని రోజంతా అప్లయ్​ చేయండి. ఇది పెదవులకు సహజ మెరుపును ఇస్తుంది.

    Cracked Lips in Winter |వెన్నలాంటివి కావాలా.. పాలమీగడ

    పాల మీగడలో ఉండే సహజ కొవ్వులు, లాక్టిక్ యాసిడ్ పొడిబారిన పెదవులను పునరుజ్జీవింపజేస్తాయి. రాత్రి నిద్రకు ముందు రాసుకుని, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయండి. పెదవులు పట్టులా మారిపోతాయి.

    Cracked Lips in Winter | చక్కెర – ఆలివ్ నూనె స్క్రబ్..

    పొడిబారిన పెదవులు మృత కణాలతో నిండిపోతాయి. వాటిని తొలగించడానికి ఒక సులభమైన స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఒక చెంచా చక్కెరలో కొద్దిగా ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేయండి. ఒక నిమిషం వలయాకారంలో రుద్దాలి. గోరువెచ్చని నీటితో కడిగేసి నెయ్యి లేదా నూనె రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

    Cracked Lips in Winter | దోసకాయ రసం

    దోసకాయలోని నీటిశాతం పెదవులకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. పగుళ్ల వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. దోసకాయ ముక్కను లేదా దాని రసాన్ని పెదవులపై 10–15 నిమిషాలు ఉంచండి. వెంటనే చల్లదనం, సాంత్వన కలుగుతుంది.

    ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

    Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Health benefits of dried fish | ఎండు చేపలు ఒకప్పుడు చాలా మంది రెగ్యులర్​గా తినేవారు. కానీ ఇటీవల తగ్గించారు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తికి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా..

    Health benefits of dried fish | ఆరోగ్య ప్రయోజనాలు..

    ఎండు చేపలు ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D, కాల్షియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్ వంటి పోషకాలతో ఉంటాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె మంటను తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి. అంతేకాకుండా పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

    Health benefits of dried fish

    ఎండు చేపల్లో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థతో పాటు కండరాలు, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుంది. ఎండు చేపలు గర్భిణులకు మంచిదని చెబుతుంటారు. వీటిలో పాస్పరస్ పుష్కలంగా ఉండడంతో శరీరంలో ఎముకలు పుష్టిగా మారతాయి. అంతే కాకుండా దంతాల నిర్మాణాన్ని నిర్వహించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిలోని విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎండు చేపల్లో పుష్కలంగా ఉంటాయి.

    Health benefits of dried fish |  వీరు తీసుకోకూడదు..

    గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, షుగర్ ఉన్నవారు ఎండు చేపలు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తినే ముందు నీటిలో నానబెట్టి ఉప్పును కడిగివేయాలి. కొన్ని రకాల ఎండు చేపల్లో పాదరసం లేదా పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నాణ్యమైన చేపలనే ఎంచుకోవాలి.

    గమనిక: మేం అందించిన ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో లభ్యమైన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

    ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

    Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Pickles storage | వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని కాసింత నెయ్యి వేసి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటే.. ఆహా రుచే అమోఘం. చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా.. అదే మరి ఊరగాయ స్పెషాలిటీ. తెలుగు వారింట పచ్చడి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట పచ్చళ్లు వాడుతుంటారు.

    అయితే పచ్చళ్లను భద్రపరిచే విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. వీటిని చాలా మంది ప్లాస్టిక్​ డబ్బాల్లో స్టోర్​ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం వల్ల ప్లాస్టిక్​ డబ్బాల్లో స్టోర్​ చేయవద్దని సూచిస్తున్నారు.

    Pickles storage

    Pickles storage | ప్లాస్టిక్​ డబ్బాల్లో భద్రపరిస్తే ఏమవుతుందంటే..

    పచ్చళ్లను ప్లాస్టిక్​ డబ్బాల్లో స్టోర్​ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చళ్లలో ఉండే ఆమ్లాలు ప్లాస్టిక్‌తో చర్య జరిపి, హానికర రసాయనాలను ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుందంటున్నారు. ప్లాస్టిక్ డబ్బాల నుంచి రసాయనాలు ఆహారంలోకి ప్రవేశించే ఛాన్స్​ ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరంలోని హార్మోన్స్​ను డిస్ట్రబ్​ చేయవచ్చు. దీనివల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. క్యాన్సర్​కు సంబంధించిన రిస్క్​ను పెంచే అవకాశం ఉంటుంది.

    Pickles storage

    Pickles storage | ఎలా స్టోర్​ చేయాలంటే..

    ఒకప్పుడు మన పెద్దలుపచ్చళ్లను స్టోర్​ చేసేందుకు వాడిన పద్ధతి అనేది ఉత్తమం. పచ్చళ్లను నిల్వ చేయడానికి గాలి చొరబడకుండా ఉండే గాజు డబ్బాలు ఉపయోగించవచ్చు. అలాగే పింగాణీతో చేసిన డబ్బాలు కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల ప్లాస్టిక్‌ డబ్బాల్లో స్టోర్​ చేసినా ఇబ్బంది లేకపోయినా.. పచ్చళ్లలోని ఆమ్లాలు ప్లాస్టిక్‌లోని రసాయనాలను గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో నిల్వ చేయకపోవడమే ఉత్తమం. మరో విషయం ఏమిటంటే.. లోహపు డబ్బాల్లో పచ్చళ్లను నిల్వ చేయరాదు. ఎందుకంటే పచ్చళ్లలోని ఆమ్లాలు లోహంతో చర్య జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చళ్లను నిల్వ చేసే విషయం జాగ్రత్తలు తీసుకోండి.

    ఇది కూడా చదవండి..: Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai