తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Health benefits of dried fish | ఎండు చేపలు ఒకప్పుడు చాలా మంది రెగ్యులర్‌గా తినేవారు. కానీ ఇటీవల తగ్గించారు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తికి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా..
Health benefits of dried fish | ఆరోగ్య ప్రయోజనాలు..
ఎండు చేపలు ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D, కాల్షియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్ వంటి పోషకాలతో ఉంటాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె మంటను తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి. అంతేకాకుండా పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

ఎండు చేపల్లో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థతో పాటు కండరాలు, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఎండు చేపలు గర్భిణులకు మంచిదని చెబుతుంటారు. వీటిలో పాస్పరస్ పుష్కలంగా ఉండడంతో శరీరంలో ఎముకలు పుష్టిగా మారతాయి. అంతే కాకుండా దంతాల నిర్మాణాన్ని నిర్వహించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిలోని విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎండు చేపల్లో పుష్కలంగా ఉంటాయి.
Health benefits of dried fish | వీరు తీసుకోకూడదు..
గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, షుగర్ ఉన్నవారు ఎండు చేపలు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తినే ముందు నీటిలో నానబెట్టి ఉప్పును కడిగివేయాలి. కొన్ని రకాల ఎండు చేపల్లో పాదరసం లేదా పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నాణ్యమైన చేపలనే ఎంచుకోవాలి.
గమనిక: మేం అందించిన ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో లభ్యమైన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!