Penci Sport plugin only working with the Soledad theme.

ఆరోగ్య చిట్కాలు - Telugu News Today

Tag: ఆరోగ్య చిట్కాలు

  • Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!

    Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గురక వస్తోందా..? అది సాధారణ సమస్యనే అనుకుంటున్నారా? కానీ.. రోజూ గురకపెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సిగ్నల్​గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్‌టెన్షన్, స్ట్రోక్ వంటి ముప్పుల తప్పించుకోవచ్చంటున్నారు.

    Snoring in Sleep |స్లీప్ అప్నియా ఎందుకు పెరుగుతోంది?

    స్లీప్ అప్నియా (Snoring in Sleep) అనేది నిద్రలో శ్వాస చాలాసార్లు ఆగిపోయి, తిరిగి ప్రారంభమయ్యే సాధారణమైన పరిస్థితి. ఇది శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. గురక, ఉదయం తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండవచ్చు, అయితే చికిత్స చేయించుకోకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    ఈ మధ్య కాలంలో స్లీప్ అప్నియా గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇది వృద్ధుల్లోనే కాకుండా యువతలోనూ సర్వసాధారణంగా మారుతోంది. డెస్క్ జాబ్స్, లేట్ నైట్ స్క్రీన్ టైం, వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి పెరుగుతున్నాయి. హార్ట్​ స్ట్రోక్ వచ్చిన 50-70 శాతంలో మందిలో స్లీప్ అప్నియా ఉంటుందని అంటున్నారు. యువకుల్లో కూడా రీకరెంట్ స్ట్రోక్స్ వస్తున్నాయట. అయితే లైఫ్‌స్టైల్ మార్చుకోకపోతే ఇది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందంటున్నారు.

    Snoring in Sleep ఏం జరుగుతుందంటే..!

    స్లీప్ అప్నియా వల్ల నిద్రలో మీ ఎయిర్‌వే రిపీటెడ్‌గా బ్లాక్ అవుతూ ఉంటుంది. రాత్రంతా అనేక సార్లు ఇలా జరగడం వల్ల మెదడు, శరీరానికి ఆక్సిజన్ అందదు. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ వెసెల్స్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఇది సైలెంట్‌గా స్ట్రోక్, హార్ట్ డిసీజ్‌లకు దారి తీస్తుందట.

    Snoring in Sleep లక్షణాలు ఇవే..

    చాలా మంది ఏళ్ల తరబడి స్లీప్​ అప్నియా లక్షణాలు గమనించరు. గురక వచ్చేవారు, నిద్రలో గ్యాస్పింగ్ లేదా చోకింగ్ ఫీలింగ్, రోజంతా టైర్డ్‌నెస్, మార్నింగ్ హెడేక్, డ్రై మౌత్, ఏకాగ్రత లేకపోవడం, మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఎదురైనట్లయితే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

    గురక తగ్గడానికి ఏం చేయాలంటే..

    గురక తగ్గాలంటే జీవనశైలి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. బెడ్​టైంకు ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అలాగే రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, అలాగే ఒకవైపు పడుకోవడం లాంటివి చేయాలి. వీటి వల్ల మార్పు వస్తే ఒకే. లేదంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చాం. వీటిని పాటించే ముందు మీరు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

    ఇది కూడా చదవండి..: Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Clove Health Benefits | లవంగాలతో లాభాలెన్నో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..!

    Clove Health Benefits | లవంగాలతో లాభాలెన్నో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Clove Health Benefits | లవంగం.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు అన్నీ కూరల్లో దీనిని వాడుతుంటాం. అయితే దీనిలోని ప్రయోజనాలు కేవలం ఆహారానికి రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కూరల్లోనే కాదు.. అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ప్రతి రోజూ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. లవంగాలతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పదండి..

    Clove Health Benefits

    Clove Health Benefits | ప్రయోజనాలివే..

    లవంగాలతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. వీటిలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, హైడ్రాలిక్ ఆసిడ్, సోడియం, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా నైజీరిసిన్ అనే సమ్మేళనం ఇందులో ఉంటుందట. ఇది డయాబెటిస్​ను నివారించడంతో పాటు ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నూతన కణాలను సైతం ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందట. బ్లడ్​లో షుగర్​ స్థాయిలను తగ్గించడంలో పనిచేస్తుందంటున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో లభిస్తాయట.

    Clove Health Benefits | భోజనం తర్వాత

    రోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుందట. అంతేకాకుండా శరీరంలోని అవాంఛిత కొవ్వును తొలగించడానికి దోహదం చేసుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత లవంగాలను నోటిలో వేసుకుని నమలడంతో నోటి దుర్వాసనను తగ్గించడంతో పాటు బ్యాక్టీరియాను చంపుతుందట. జలుబు దగ్గుకు లవంగం మంచి మందు అని చెబుతున్నారు.

    నోటి దుర్వాసన దూరం: లవంగం లాలాజలంలో కరిగి నోట్లోని బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది దుర్వాసనను తగ్గించి.. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తినడం వల్ల నోరు శుభ్రంగా, తాజాగా ఉంటుంది.

    Clove Health Benefits | దంతాల నొప్పికి ఉపశమనం..

    దంతాల నొప్పి, చిగుళ్ల వాపు నుంచి లవంగం ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని తేలికపాటి అనస్థీటిక్ ప్రభావం నొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్లను సైతం బలపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగుదల: లవంగం తినడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి పూట లవంగాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుంది. ఉదయం కడుపు తేలికగా అనిపిస్తుంది. అంతేకాకుండా శరీరానికి డిటాక్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుందట.

    Clove Health Benefits | రోగనిరోధక శక్తి పెరుగుదల

    లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వలన శరీరం ఇన్‌ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. చిన్న లవంగంలో ఉండే అనేక ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదా.. ఇక నుంచి రోజూ తినడం అలవాటు చేసుకోండి మరి.

    ‌గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం అందించాం. ఈ కథనం ఇంటర్నెట్‌లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఇచ్చాం. వీటిని పాటించే ముందుకు సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.

    ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai