తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Beaver Supermoon 2025 | ‘నింగికి జాబిలీ అందం.. నేలకు తొలకరి అందం’ అని జాబిలి అందాన్ని వర్ణించాడో కవి. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ ఒకప్పుడు అమ్మ చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేంది. ఇదంతా ఇప్పడెందుకు అనుకుంటున్నారా.. చందమామ మన గ్రహానికి దగ్గరగా రానున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ ఏడాదిలోనే అతిపెద్ద బీవర్ సూపర్ మూన్ కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆ రోజున చంద్రుడు భూమికి 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని చెబుతున్నారు. దీంతో చందమామ మరింత పెద్దగా, కాంతివంతంగా కనిపించనుందంటున్నారు. అయితే దీనిని చూసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని పేర్కొంటున్నారు. కాగా.. గత డిసెంబర్‌లో సైతం ఒక కోల్డ్ మూన్ కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఫిబ్రవరి 2019 తర్వాత అత్యంత దగ్గరగా వచ్చే పౌర్ణమి కానుందని చెబుతున్నారు.

Beaver Supermoon 2025 | మూడు సూపర్ మూన్లలో ఒకటి
బీవర్ మూన్ 2025లో వచ్చే మూడు సూపర్‌మూన్‌లలో ఇదీ ఒకటి. ఈ ఏడాది వచ్చిన మూడింటిలో ఇది రెండవది. అక్టోబర్‌లో వచ్చిన హార్వెస్ట్ మూన్ తర్వాత.. డిసెంబర్‌లో వచ్చే కోల్డ్ మూన్ కూడా సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తాయి. చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో సూపర్‌మూన్ అనేది సంభవిస్తుంది. అందుకే ఇది కొన్నిసార్లు పౌర్ణమి టైంలో భూమికి దగ్గరగా ఉన్న బిందువుకు చేరుకుంటుంది. నాసా ప్రకారం.. పౌర్ణమి సమయంలో 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి.. : Arattai End-to-End Chat Encryption |చాట్ ఎన్క్రిప్షన్ను తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!