Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Budget Cars |కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సవరించడం కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కారు కొనాలనే కల నెరవేర్చుకుంటున్నారు. జీఎస్టీ తగ్గులతో ఇప్పటికే ఎంతో మంది కొత్త కార్లు కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది కొనుగోలుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండడంతో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజీని అందించే కార్లపై ఓ లుక్కేయండి..
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్లు ఇవే..
చిన్న కార్లు చిన్న కుటుంబాలతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా సిటీ డ్రైవింగ్‌కు కూడా అనువుగా ఉంటాయి. అందుకే పెద్ద కార్లతో పోలిస్తే వీటి సేల్స్ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్ ధరలో లభించడంతో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతీ ఆల్టో K10
రెనాల్ట్ క్విడ్
దేశీయ మార్కెట్లో అతి తక్కువ ధర కలిగిన కారు రెనాల్ట్ క్విడ్. సరసమైన కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. దీని ప్రస్తుత ఎక్స్-షోరూం ధర రూ. 4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ 999 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటర్‌కు 22.3 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. స్టైలిష్ లుక్, మంచి మైలేజీ, తక్కువ బడ్జెట్లో లభించే బడ్జెట్ కారు.
మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనేది ఈ కంపెనీ అందిస్తున్న రెండో చౌకైన కారు. రూ. 5 లక్షల లోపు కారు కొనాలని భావించే వారికి మంచి ఛాయిస్. Budget Cars లో ఎస్-ప్రెస్సో ఎక్స్-షోరూం ప్రైస్ వచ్చేసి రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 998 సీసీ ఇంజిన్‌తో శక్తిని ఇస్తుంది. లీటర్‌కు 25.3 కి.మీ. మైలేజ్ అందిస్తుంది.
బడ్జెట్ ధరల్లో కారు కొనాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక అవుతాయి. అయితే కొనుగోలు చేసే ముందు వీటి గురించి పూర్తిగా తెలుసుకోని ముందుకు వెళ్లడం ఉత్తమం. ఇక మరో విషయం ఏమిటంటే.. ప్రాంతాల ఆధారంగా ఎక్స్ షోరూం ప్రైస్ ధర, ఆన్ రోడ్ ధరలు మారుతుంటాయి. అంతేకాకుండా వివిధ మోడల్స్, వేరియంట్లను బట్టి రేట్లు ఛేంజ్ అవుతుంటాయి. అందుకే పూర్తి సమాచారం కోసం మీ సమీపంలోని షో రూంను సంప్రదించడం మంచిది.
ఒకసారి ఈ క్రింది ఇంస్టాగ్రామ్ కొత్త ఫీచర్ గురించి కూడా తెలుసుకోండి.
| Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో.. |
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!