Penci Sport plugin only working with the Soledad theme.

Natural Remedies - Telugu News Today

Tag: Natural Remedies

  • Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!

    Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!

    తెలుగున్యూస్​టుడే,ఇంటర్నెట్​ డెస్క్​: Winter Blues Natural Remedies | చలికాలం వచ్చిందంటే చాలామందికి అనేక సార్లు ఏదో బద్ధకం, నీరసం అనిపిస్తుంది. చల్లని గాలులు, త్వరగా చీకటి పడడం, రోజులో ఎక్కువ సమయం మంచంపైనే గడపాల్సి రావడం వల్ల మనసు కుంగిపోతుంది. ఉదయాన్నే లేవాలని, బయటకు అడుగుపెట్టాలనే ఉత్సాహం రాదు. ఇలాంటి భావోద్వేగాలు సాధారణంగా అందరిలోనూ కొంతమేర కనిపిస్తాయి. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్’ (SAD) లేదా ‘వింటర్ బ్లూస్’ అంటారు. ఈ సమస్య ప్రధానంగా శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండడం వల్ల వస్తుంది. ఇది మెదడులో సెరటోనిన్ (సంతోష హార్మోన్) స్థాయిలను తగ్గించి, మెలటోనిన్ (నిద్ర హార్మోన్)ను పెంచుతుంది. ఫలితంగా మూడ్ డౌన్ అవుతుంది.

    Winter Blues Natural Remedies | వింటర్ బ్లూస్ లేదా SAD లక్షణాలు ఏమిటి?

    • రోజంతా నీరసం, విచారం లేదా నిరుత్సాహం అనిపించడం
    • శక్తి స్థాయిలు తగ్గిపోవడం, అలసటగా ఉండడం
    • ఇష్టమైన పనులపై ఆసక్తి కోల్పోవడం
    • కార్బోహైడ్రేట్స్ ఆహారం అధికంగా తినడం, బరువు పెరగడం
    • ఏకాగ్రత సమస్యలు, దృష్టి కేంద్రీకరించలేకపోవడం
    • అపరాధ భావన, నిరాశ, తనను తాను విలువలేనివాడిగా భావించడం
    • అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమి
    • తీవ్రమైన సందర్భాల్లో జీవితం మీద విరక్తి కలగడం

    ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.

    Winter Blues Natural Remedies | మూడ్‌ను బూస్ట్ సూచనలు

    కొన్ని సహజమైన జీవనశైలి మార్పులతో వింటర్​ బ్లూస్​ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేయదగినవే.

    Winter Blues Natural Remedies | సూర్యకాంతిని ఎక్కువగా పొందండి..

    చలికాలంలో బయటకు వెళ్లి కాసేపు నడవడం లేదా పార్కులో గడపాలి. సూర్యకాంతి మెదడు రసాయనాలను సమతుల్యం చేసి, జీవ గడియారాన్ని సరిచేస్తుంది. రోజూ 20-30 నిమిషాలు బయట గడిపితే నిద్ర మెరుగవుతుంది. అంతేకాకుండా మూడ్ కూడా బాగుపడుతుంది.

    Winter Blues Natural Remedies | స్నేహితులు, కుటుంబంతో సమయం గడపండి

    ఒంటరితనం అనేది వింటర్ బ్లూస్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే స్నేహితులతో బయటకు వెళ్లండి. ఇష్టమైన సినిమాలు చూడడం, లేదా పుస్తకాలు చదడం చేయాలి. లేదంటే ఆటలు ఆడండి. ఇవి హ్యాపీ హార్మోన్స్​ను పెంచుతాయి.

    Winter Blues Natural Remedies | బాడీ డబ్లింగ్ టెక్నిక్..

    ఇది ఒక ఆసక్తికరమైన పద్ధతి. మరొకరి సమక్షంలో (ఫేస్ టు ఫేస్ లేదా వర్చువల్‌గా) పనులు చేయడం లాంటివి చేయాలి. ఉదాహరణకు, ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి పనులు పూర్తి చేయడం లేదా స్నేహితుడితో కలిసి ఒకే సినిమా చూడడం వల్ల నిరాశను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

    Winter Blues Natural Remedies | ధ్యానం, ప్రాణాయామం

    నిత్యం 10-15 నిమిషాలు ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అనేక అధ్యయనాల్లో ఇది మూడ్‌ను మెరుగుపరుస్తుందని నిరూపితమైంది. అలాగే ఇంట్లోనే యోగా, డ్యాన్స్ లేదా సాధారణ వాకింగ్ చేయండి. వ్యాయామం ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్లు) విడుదల చేసి, శక్తిని పెంచుతుంది.

    ఈ చిట్కాలు అన్నీ సహజమైనవి మరియు సులభంగా అమలు చేయదగినవి. అయితే లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా రోజువారీ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా మానసిక ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి.

    గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికినా సమాచారం ఆధారంగా ప్రచురితం చేశారు. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకోండి.

    ఇది కూడా చదవండి..: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Clove Health Benefits | లవంగాలతో లాభాలెన్నో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..!

    Clove Health Benefits | లవంగాలతో లాభాలెన్నో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Clove Health Benefits | లవంగం.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు అన్నీ కూరల్లో దీనిని వాడుతుంటాం. అయితే దీనిలోని ప్రయోజనాలు కేవలం ఆహారానికి రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కూరల్లోనే కాదు.. అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ప్రతి రోజూ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. లవంగాలతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పదండి..

    Clove Health Benefits

    Clove Health Benefits | ప్రయోజనాలివే..

    లవంగాలతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. వీటిలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, హైడ్రాలిక్ ఆసిడ్, సోడియం, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా నైజీరిసిన్ అనే సమ్మేళనం ఇందులో ఉంటుందట. ఇది డయాబెటిస్​ను నివారించడంతో పాటు ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నూతన కణాలను సైతం ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందట. బ్లడ్​లో షుగర్​ స్థాయిలను తగ్గించడంలో పనిచేస్తుందంటున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో లభిస్తాయట.

    Clove Health Benefits | భోజనం తర్వాత

    రోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుందట. అంతేకాకుండా శరీరంలోని అవాంఛిత కొవ్వును తొలగించడానికి దోహదం చేసుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత లవంగాలను నోటిలో వేసుకుని నమలడంతో నోటి దుర్వాసనను తగ్గించడంతో పాటు బ్యాక్టీరియాను చంపుతుందట. జలుబు దగ్గుకు లవంగం మంచి మందు అని చెబుతున్నారు.

    నోటి దుర్వాసన దూరం: లవంగం లాలాజలంలో కరిగి నోట్లోని బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది దుర్వాసనను తగ్గించి.. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తినడం వల్ల నోరు శుభ్రంగా, తాజాగా ఉంటుంది.

    Clove Health Benefits | దంతాల నొప్పికి ఉపశమనం..

    దంతాల నొప్పి, చిగుళ్ల వాపు నుంచి లవంగం ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని తేలికపాటి అనస్థీటిక్ ప్రభావం నొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్లను సైతం బలపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగుదల: లవంగం తినడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి పూట లవంగాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుంది. ఉదయం కడుపు తేలికగా అనిపిస్తుంది. అంతేకాకుండా శరీరానికి డిటాక్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుందట.

    Clove Health Benefits | రోగనిరోధక శక్తి పెరుగుదల

    లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వలన శరీరం ఇన్‌ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. చిన్న లవంగంలో ఉండే అనేక ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదా.. ఇక నుంచి రోజూ తినడం అలవాటు చేసుకోండి మరి.

    ‌గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం అందించాం. ఈ కథనం ఇంటర్నెట్‌లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఇచ్చాం. వీటిని పాటించే ముందుకు సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.

    ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​​: Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలిసిందే. దీంతో ఆరోగ్యమే కాదు.. సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఎన్నో పోషకాలు ఉండే ఈ గింజల్ని తీసుకోవడం వల్ల అనే లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, బాడీ డీటాక్స్ చేయాలన్నా.. ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యంతో పాటు అందానికి దోహదం చేసే సబ్జా గింజల గురించి తెలుసుకుందాం..

    సబ్జా గింజలు (Sabja Seeds) పోషకాలతో కూడిన సూపర్‌ఫుడ్. వీటిని ఎన్నో రకాల మెడిసిన్, వంటల్లో సైతం వాడుతుంటారు. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఐరన్​, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి పేగు కదలికలను పెంచుతాయి. అంతేకాకుండా ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటిని పరగడుపున తీసుకుంటే ఇంకా మంచిది. ఈ గింజలలో ఉండే సహజమైన డీటాక్స్ గుణాలు.. చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుందంటున్నారు.

    Sabja Seeds Benefits | డీటాక్సిఫికేషన్..

    సాధారణంగా వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. అంతేకాకుండా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు సరైన ఎంపిక అని అంటున్నారు. ఈ గింజల్లో ఉండే డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయని పేర్కొంటున్నారు. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.

    Sabja Seeds Benefits | చర్మం కాంతివంతంగా..

    సబ్జా గింజల్లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు దోహదం చేస్తుంది. అంతే కాకుండా ఈ గింజల్లో విటమిన్ ఏ, సీ, కాపర్, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి మనలో చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

    Sabja Seeds Benefits | ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేలా..

    కొంతమందికి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తే అంత త్వరగా తగ్గవు. అలాంటి వారు రెగ్యులర్​గా సబ్జా గింజలను తీసుకోవడం మంచిదట. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.

    గమనిక: మేం అందించిన ఈ సమాచారం కేవలం సాధారణ సలహా కోసమే. ఆహార మార్పులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.

    Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!