తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Benefits of smile | నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. అన్నాడో మహాకవి.. ఈ యాంత్రిక యుగంలో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్ర పోయే వరకు ఉరుకులు పరుగులు.. ఒకరినొకరు పలకరించుకోవడమే గగనమైపోయింది. ఎవరి గోల వారిదేలా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న చాలా జీవనశైలి సమస్యలకు మానసిక ప్రశాంతత కొరవడడమే కారణంగా మారుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎన్నో మానసిక సమస్యలకు నవ్వు నిజమైన ఔషధంగా పనిచేస్తుది. ఒక్క నవ్వుతో ఆనందాన్ని, ప్రశాంతతను సాధించొచ్చు. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం మన సొంతమవుతుంది.
నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఒకప్పటి మాట.. కానీ నవ్వు పలు విధాలా మంచిదనేది నేటి మాట. నవ్వడం (smile) వల్ల ఎన్నో మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కడుపు నిండా నవ్వడం.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం వంటి పదాలు చాలా మంది నోట వింటూ ఉంటాం. అంటే మనస్పూర్తిగా నవ్వడం అన్నట్లు. ఇలా ఎంత ఆహ్లాదకరమైన, సంతోషకరమైన స్థితిలో ఉంటే అంతలా నవ్వుతామన్నట్లు. ఇలా నవ్వడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, డొపమైన్, సెరెటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. మనం ఎంత నవ్వితే అంత ఎక్కువ ఆనంద హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మెదడు మరింతగా ఆనందిస్తుందన్నమాట. నవ్వడం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి..
Benefits of smile | ఔషధంగానూ పనిచేస్తుంది..
నవ్వడంలో పిల్లలు ఛాంపియన్లు. పిల్లలు రోజుకు సగటున 300 – 400 సార్లు నవ్వుతారని పరిశోధనలు పేర్కొంటున్నారు. ఇక పెద్దవారయితే రోజుకు దాదాపు 40-50 సార్లే నవ్వుతారు. పిల్లలు అంత సంతోషంగా, కల్మషం లేకుండా ఉండడానికి నవ్వే కారణమట. గతంలో వైద్యులు తమ వద్దకు చికిత్స కోసం వచ్చేవారికి మందులతో పాటు రోజుకు 500 సార్లు నవ్వాలని సూచించే వారట.. దీంతో మానసిక స్థితి మెరుగుపడి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆనాడే గ్రహించారనుందుకు ఇది నిదర్శనం.
Benefits of smile | మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది..
నవ్వు మన మెదడుతో పాటు శారీరానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆరోగ్యానికి అన్ని రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. నవ్వడం వల్ల ఎండార్ఫిన్‌లు విడుదలై మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో మానసిక ఒత్తిడి దూరమై మానసిక స్థితి ఎంతో మెరుగుపడుతుంది. నవ్వు ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప మార్గంగా చెప్పవచ్చు. నిరాశలో ఉన్న సమయంలో నవ్వు తెప్పించే పనులు చేయడం వల్ల ఎంతో రిలీఫ్ పొందవచ్చు.

Benefits of smile | ఒత్తిడిని తగ్గించే మార్గం..
నవ్వు అనేది ఒత్తిడిని తగ్గించడానికి ఒక గొప్ప మార్గంగా చెబుతుంటారు. మీరు నవ్విన సమయంలో మీ శరీరం హ్యాపీ హార్మోన్లను విడుదల చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇవి కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బలపడేలా చేస్తుంది. రక్తపోటు, హృదయం సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు ఫన్నీ సినిమాలు చూడడం.. హాస్యభరితమైన పుస్తకం చదవడం, లేదంటే మిమ్మల్ని నవ్వించే స్నేహితులతో సమయం గడపండి.
Benefits of smile | రోగనిరోధక శక్తి పెరుగుదల
నవ్వు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుందనే వాస్తవం. నవ్వు శరీరంలోని రోగనిరోధక కణాల సంఖ్యను పెంచుతుంది. మనం నవ్విన ప్రతి సారి శరీరం తెల్ల రక్త కణాలను విడుదల చేస్తుంది. దీని వల్ల రోగ నిరోధ శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Benefits of smile | హృదయనాళ పనితీరుపైనా ప్రభావం
ఆరోగ్యకరమైన హృదయానికి నవ్వు ఉత్తమ ఔషధం చెప్పవడచ్చు. ఎందుకంటే నవ్వు మీ హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తుంది. మీ హృదయ స్పందన రేటుతో పాటు రక్త ప్రవాహాన్ని పెంచడంవల్ల ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో దోహదం చేస్తుంది. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.
Benefits of smile | నొప్పిని తగ్గించే నవ్వు
నవ్వడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో నవ్విన వారిలో కలిగిన నొప్పి కంటే నవ్వని వారిలో నొప్పి అధికంగా కలిగినట్లు తేలింది. ఆర్థరైటిస్, తలనొప్పి, రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో నవ్వు సహాయపడుతుందని స్టడీస్ పేర్కొంటున్నాయి.
Benefits of smile | శక్తిని ఇవ్వడంలో కీలకం
మీరు నవ్వినప్పుడు మంచి అనుభూతిని కలిగించడమే కాదు.. మీలో శక్తిని కూడా పెంచుతుందట. నవ్విన సమయం కండరాలు సంకోచించబడడం వల్ల హృదయ స్పందన రేటు, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది. రోజుకు 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల 40 కేలరీల వరకు బర్న్ అవుతాయి. ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది. దీంతో మనలోని శక్తి పెరుగుతుంది.
Benefits of smile | మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..
నవ్వడం వల్ల మనలోని మెదడు పనితీరు సైతం మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, దృష్టిని పెంచడానికి సహాయం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో.. నవ్వడానికి విరామం తీసుకునే ఉద్యోగులు, నవ్వని వారి కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటారని తేలింది. నవ్వు దృష్టితో పాటు సృజనాత్మక, ఆలోచన శక్తిని పెంచుతుంది.
Benefits of smile | జీవిత కాలం పెంచుతుంది..
నవ్వు ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుందట. నవ్వు కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. నవ్వు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడడంతో యాంటీబాడీలు, పోరాట కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రక్త ప్రవాహంలో పెరుగుదల, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వల్ల ఆయుర్ధాయం మెరుగుపడుతుంది.
Benefits of smile | ఇతరులు నవ్వితే నవ్వకుండా ఉండలేరు..
ఎవరైనా నవ్వడం చూసినప్పుడు మనలోనూ ఆటోమెటిక్‌గా నవ్వు పుడుతుంది. మీరు ఒక సమూహంలో ఉన్న సమయంలో ఎవరైనా నవ్వడం మొదలుపెట్టారంటే.. ఇతరులు కూడా నవ్వడం ప్రారంభిస్తారు. ఇలా మొత్తం సమూహం నవ్వుతుంది. ఉదాహరణకు మీరు కామెడీ సినిమాను ఒంటరిగా చూసిన సమయంలో కంటే.. అందరితో కలిసి థియేటర్లో చూస్తే ఎక్కువగా నవ్వుతారు. ఒకరిని మరొకరికి నవ్వు పుడుతుందనడానికి చుట్టు పక్కల పరిస్థితులు కూడా దోహదం చేస్తాయి.
నవ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా.. కాబట్టి నిత్య జీవితంలో వీలైనంత ఎక్కువగా నవ్వండి.. ఆనందంగా ఉండండి.. నవ్వడం వల్ల పోయేదేముంది బాస్.. అనేక రోగాలు తప్పా.. అందుకే హాయిగా నవ్వేస్తూ జీవితాన్ని గడిపేద్దాం.. చిన్న చిరునవ్వుతో కథనాన్ని ముగిద్దాం..
గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!