తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Pickles storage | వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని కాసింత నెయ్యి వేసి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటే.. ఆహా రుచే అమోఘం. చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా.. అదే మరి ఊరగాయ స్పెషాలిటీ. తెలుగు వారింట పచ్చడి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట పచ్చళ్లు వాడుతుంటారు.
అయితే పచ్చళ్లను భద్రపరిచే విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. వీటిని చాలా మంది ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం వల్ల ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేయవద్దని సూచిస్తున్నారు.

Pickles storage | ప్లాస్టిక్ డబ్బాల్లో భద్రపరిస్తే ఏమవుతుందంటే..
పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చళ్లలో ఉండే ఆమ్లాలు ప్లాస్టిక్‌తో చర్య జరిపి, హానికర రసాయనాలను ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుందంటున్నారు. ప్లాస్టిక్ డబ్బాల నుంచి రసాయనాలు ఆహారంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరంలోని హార్మోన్స్‌ను డిస్ట్రబ్ చేయవచ్చు. దీనివల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. క్యాన్సర్‌కు సంబంధించిన రిస్క్‌ను పెంచే అవకాశం ఉంటుంది.

Pickles storage | ఎలా స్టోర్ చేయాలంటే..
ఒకప్పుడు మన పెద్దలుపచ్చళ్లను స్టోర్ చేసేందుకు వాడిన పద్ధతి అనేది ఉత్తమం. పచ్చళ్లను నిల్వ చేయడానికి గాలి చొరబడకుండా ఉండే గాజు డబ్బాలు ఉపయోగించవచ్చు. అలాగే పింగాణీతో చేసిన డబ్బాలు కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసినా ఇబ్బంది లేకపోయినా.. పచ్చళ్లలోని ఆమ్లాలు ప్లాస్టిక్‌లోని రసాయనాలను గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో నిల్వ చేయకపోవడమే ఉత్తమం. మరో విషయం ఏమిటంటే.. లోహపు డబ్బాల్లో పచ్చళ్లను నిల్వ చేయరాదు. ఎందుకంటే పచ్చళ్లలోని ఆమ్లాలు లోహంతో చర్య జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చళ్లను నిల్వ చేసే విషయం జాగ్రత్తలు తీసుకోండి.
ఇది కూడా చదవండి..: Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!
