తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు షాక్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్‌కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు.
X Chat | వాట్సప్, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా..
ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X Chatను లాంచ్ చేయనున్నారు. ఇందులో ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాట్ ఫాం.. డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో పాటు అడ్వాన్స్‌డ్ మెసేజ్ కంట్రోల్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా పాత డైరెక్ట్ మెసేజీలు (DM), కొత్త చాట్ ఫంక్షన్స్ కోసం యూనిఫైడ్ ఇన్‌బాక్స్ అలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉండడం దీని ప్రత్యేకత.

త్వరలోనే లాంఛ్..
ఈ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారం త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫైల్ ట్రాన్స్‌ఫర్, ఆడియో, వీడియో కాల్స్ వంటి ఫీచర్స్‌తో కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఆవిష్కరించినట్లు ట్వీట్ చేశారు. కాగా.. ‘ఎక్స్’ను “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చే ఉద్దేశంలో ఉన్న మస్క్.. త్వరలో ‘ఎక్స్ మనీ’ (X Money) కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. X Chatలో పంపిన మెసేజ్‌లు, ఫైల్ షేరింగ్‌తో సహా అన్ని చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యం ఉంటుందని వివరించారు. కేవలం వీటిని పంపినవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ యాక్సెస్ చేయలేరని పేర్కొన్నారు.
ఎడిటింగ్ ఆప్షన్
త్వరలో లాంఛ్ చేయనున్న ఈ మెసేజింగ్ యాప్‌లో యూజర్లు తాము పంపిన మెసేజ్‌లను తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చు, లేదంటే డిలిట్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని యాప్ కల్పించనుంది. అవసరం అనుకుంటే డిసప్పియర్ చేసే వెసలుబాటు కూడా కల్పించనుంది. వాట్సాప్‌లో ఏదైనా సమాచారాన్ని డిలిట్ చేసినట్లయితే This Message was Deleted.. అని కనిపిస్తుంటుంది. కానీ ఎక్స్ చాట్‌లో డిలిట్ చేసినట్లయితే ఇలా కనిపించదు.
ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!
