Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today

Author: Telugu News Today

  • UIDAI | రెండు కోట్ల ఆధార్ కార్డులు డియాక్టివేట్​.. మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలు..!

    UIDAI | రెండు కోట్ల ఆధార్ కార్డులు డియాక్టివేట్​.. మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: UIDAI | దేశంలో సుమారు రెండు కోట్ల మంది ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు UIDAI వెల్లడించింది. చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర సేవలను అక్రమంగా పొందకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఆధార్ డేటాబేస్‌లోని అదనపు వివరాలను తొలగించడానికి దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సుమారు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది.

    ఆధార్ నిబంధనల ప్రకారం.. ఒకసారి జారీ చేసిన నంబర్‌ను మరొకరికి ఎప్పటికీ కేటాయించరు. అయినప్పటికీ మరణించిన వ్యక్తుల వివరాలు సకాలంలో తొలగించకపోతే డూప్లికేట్ లావాదేవీలు, మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. దీనిని నివారించేందుకు UIDAI దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టింది.

    UIDAI మరణ వివరాలు ఎలా సేకరిస్తున్నారంటే..

    UIDAI ప్రస్తుతం కింది విభాగాలతో సమన్వయం చేసుకుని మరణించిన వ్యక్తుల జాబితాను సేకరించనుంది.

    • రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI)
    • రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
    • ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)
    • జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP)
    • ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు

    ‌భవిష్యత్తులో బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు వంటి ప్రైవేట్ రంగ సంస్థలతో కూడా డేటా షేరింగ్ ఒప్పందాలు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వివిధ వనరుల నుంచి సేకరించిన మరణ ధ్రువీకరణ పత్రాలను ఆధార్ డేటాబేస్‌తో సరిపోల్చి, ధ్రువీకరించిన తర్వాత సంబంధిత నంబర్లను డియాక్టివేట్​ చేయనున్నారు.

    కుటుంబ సభ్యులకు ఆన్‌లైన్ సౌకర్యం
    ఈ ఏడాది ప్రారంభం నుంచి ‘మై ఆధార్’ పోర్టల్‌లో ప్రత్యేకమైన సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు తమ ఇంటి సభ్యుడు మరణిస్తే స్వయంగా ఆన్‌లైన్‌లోనే ఆ వ్యక్తి ఆధార్ డియాక్టివేషన్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల ఎన్నో కుటుంబాలు ఇంటి నుంచే ఈ పని పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోంది.


    ప్రక్రియ విధానం ఇలా..
    1. myAadhaar.gov.in పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి

    2. ‘Report Deceased Aadhaar’ సేవను ఎంచుకోవాలి

    3. మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, మరణ ధ్రువీకరణ పత్రం నంబరు, తేదీ మొదలైన వివరాలు అప్‌లోడ్ చేయాలి

    4. అధికారులు ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత ఆధార్ నంబర్‌ను శాశ్వతంగా నిష్క్రియం చేస్తారు.10:

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Telangana Panchayat Elections |ఎన్నికల సంగ్రామానికి పల్లెలు సిద్ధం.. నేటి నుంచే తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

    Telangana Panchayat Elections |ఎన్నికల సంగ్రామానికి పల్లెలు సిద్ధం.. నేటి నుంచే తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Telangana Panchayat Elections |తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల జోష్ మొదలైంది. మొదటి దశలో భాగంగా ఈ రోజు (నవంబర్ 27) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 25వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు ఈ రోజు నోటీసులు జారీ చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

    Telangana Panchayat Elections

    నామినేషన్ కేంద్రాల్లో ఆయా పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రదర్శించనున్నారు. అభ్యర్థులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

    Telangana Panchayat Elections : ఒక అభ్యర్థి ఒకే వార్డు నుంచి..

    ఒక అభ్యర్థి ఒకే వార్డు నుంచి మాత్రమే పోటీ చేయాలి. నామినేషన్‌తో పాటు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, ఇతర బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించాలి. ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, గ్రామ సేవకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అలాగే, ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా ఇటీవల చట్ట సవరణ ప్రకారం పోటీ చేయవచ్చు.

    Telangana Panchayat Elections : మొదటి దశలో ఎన్ని పంచాయతీలు?

    మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలలోని మొత్తం 37,450 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల గడువు నవంబర్ 29 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. 30న నామినేషన్ల పరిశీలన జరిగి, చెల్లుబాటు అయిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై డిసెంబర్ 1న అప్పీళ్లు స్వీకరిస్తారు. అనంతరం డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అధికారిక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

    పోలింగ్, ఫలితాలు ఒకే రోజు..
    డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు పూర్తవుతుంది.

    ఎన్నికల ఖర్చు పరిమితి
    2011 జనాభా లెక్కల ప్రకారం 5,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.2.5 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలు మించి ఖర్చు చేయకూడదు. 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు రూ.1.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30 వేలు మాత్రమే ఖర్చు పరిమితిగా నిర్ణయించారు.

    హైదరాబాద్, Telangana Panchayat Elections మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలు మినహా మిగతా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల నియమాల ఉల్లంఘనలపై ఫిర్యాదులు SEC వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్​ పోర్టల్ ద్వారా లేదా 92400 21456 కాల్ సెంటర్‌కు సమర్పించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. రెండో దశ ప్రక్రియ నవంబర్ 30 నుంచి, మూడో దశ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.

    EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Bank Holidays December 2025 |బ్యాంకులకు వరుసగా సెలవులు..!

    Bank Holidays December 2025 |బ్యాంకులకు వరుసగా సెలవులు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bank Holidays December 2025, డిసెంబర్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తాయి. పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఈ నెలలో బ్యాంకులు చాలా రోజుల పాటు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

    దేశవ్యాప్తంగా చూస్తే డిసెంబర్‌లో మొత్తం 19 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, గోవా, సిక్కిం వంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. Bank Holidays December 2025 ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే.

    Bank Holidays December 2025 |బ్యాంక్ సెలవులు ఎలా నిర్ణయిస్తారు?

    RBI మూడు విధాలుగా సెలవులను వర్గీకరిస్తుంది ఇందులో 1) నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింది సాధారణ సెలవులు, 2) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సెలవులు, 3) బ్యాంకుల ఖాతాల మూసివేత సెలవులు.

    మొదటి విభాగంలోని సెలవులు దేశవ్యాప్తంగా లేదా సంబంధిత ప్రాంతాల్లో అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.
    డిసెంబర్ 2025 – ప్రాంతీయ బ్యాంక్ సెలవుల జాబితా
    – డిసెంబర్ 1 (సోమవారం) – రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం / ఇండిజినస్ ఫెయిత్ డే (ఇటానగర్, కోహిమా)
    – డిసెంబర్ 3 (బుధవారం) – ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (పనాజీ (గోవా)
    – డిసెంబర్ 12 (శుక్రవారం) – పా టోగన్ నెంగ్‌మింజా సాంగ్మా వర్ధంతి (షిల్లాంగ్)
    – డిసెంబర్ 18 (గురువారం) – యూ సోసో థామ్ వర్ధంతి (షిల్లాంగ్)
    – డిసెంబర్ 19 (శుక్రవారం) – గోవా విమోచన దినోత్సవం (పనాజీ)
    – డిసెంబర్ 20 (శనివారం) – లోసూంగ్ / నామ్‌సూంగ్ ఉత్సవాలు (ఐజ్వాల్)
    – డిసెంబర్ 22 (సోమవారం) – లోసూంగ్ / నామ్‌సూంగ్ ఉత్సవాలు (ఐజ్వాల్)
    – డిసెంబర్ 24 (బుధవారం) – క్రిస్మస్ ఈవ్ → కోహిమా, ఐజ్వాల్, షిల్లాంగ్, గాంగ్‌టక్
    – డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్ → దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు
    – డిసెంబర్ 26 (శుక్రవారం) – క్రిస్మస్ ఉత్సవాలు / వర్ధంతి (ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్)
    – డిసెంబర్ 27 (శనివారం) – క్రిస్మస్ ఉత్సవాలు (కొన్ని ఈశాన్య రాష్ట్రాలు)
    – డిసెంబర్ 30 (మంగళవారం) – యూ కియాంగ్ నాంగ్‌బా (షిల్లాంగ్)
    – డిసెంబర్ 31 (బుధవారం) – న్యూ ఇయర్ ఈవ్ (ఐజ్వాల్)

    ఆదివారాలు & శనివారాలు
    – డిసెంబర్ 7, 14, 21, 28 → ఆదివారాలు (దేశవ్యాప్తంగా సెలవు)
    – డిసెంబర్ 13, 27 → రెండో, నాలుగో శనివారాలు (అన్ని బ్యాంకులకు సెలవు)

    Bank Holidays December 2025 :ముఖ్య గమనిక

    బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM, డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలు సాధారణంగా కొనసాగుతాయి. అయితే చెక్ క్లియరెన్స్, RTGS, NEFT (కొన్ని సందర్భాల్లో), బ్రాంచ్‌లో నేరుగా చేసే పనులు ఆగిపోతాయి. అందుకే ఈ నెలలో బ్యాంక్ పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

    ఇది కూడా చదవండి..: X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Telangana Orange Alert |తెలంగాణను వణికిస్తున్న చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే రెండ్రోజుల జాగ్రత్త

    Telangana Orange Alert |తెలంగాణను వణికిస్తున్న చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే రెండ్రోజుల జాగ్రత్త

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Telangana Orange Alert తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయితే రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. సాధారణం కన్నా 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

    Telangana Orange Alert |అత్యల్పంగా ఆసిఫాబాద్​

    రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం అర్ధరాత్రి అత్యల్పంగా ఆసిఫాబాద్​లో 7 డిగ్రీలు, సంగారెడ్డిలో 7.1, ఆదిలాబాద్​ 7.7 డిగ్రీలు నమోదైంది. ఆ తర్వాత వికారాబాద్​ 8.1, రంగారెడ్డి 8.2, సిరిసిల్ల 8.4, కామారెడ్డి 8.5, నిజామాబాద్​ 8.9, జిగిత్యాల 9, మెదక్​ 9.3, నిర్మల్​ 9.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.

    Telangana Orange Alert |హైదరాబాద్​లోనూ గణనీయంగా చలితీవ్రత

    రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. హెచ్‌సీయూ శేరిలింగంపల్లి ప్రాంతంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాబోయే రెండు రోజుల పాటు నగరంలో 8-10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    Telangana Orange Alert |వణికిపోతున్న ప్రజలు

    చలి తీవ్రత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. స్వెట్టర్లు లేనిది ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కాగా.. రానున్న రోజుల్లో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    Telangana Orange Alert | పలు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​

    రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.రాబోయే రెండు రోజుల పాటు అత్యంత తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉన్నందుని పేర్కొంది. 10 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6- 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, భూపాలపల్లి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా చలి ఉంటుందని పేర్కొంది. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారు తప్పనిసరిగా వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలని అధికారులు సూచించారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రయాణాలను తగ్గించుకోవాలని చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Period Delay Pills |పీరియడ్స్​ ఆలస్యం కావడానికి పిల్స్​ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!

    Period Delay Pills |పీరియడ్స్​ ఆలస్యం కావడానికి పిల్స్​ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Period Delay Pills |యువతులు, మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. ఇది సహజమైన ప్రక్రియ. అయితే పండుగలు, వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో పీరియడ్స్​ను అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా సెంటిమెంట్ ప్రకారం వేడుకలకు దూరంగా ఉంటారు. ఇంకొంత మంది పీరియడ్స్ ఆలస్యమయ్యేలా టాబ్లెట్స్​ వాడుతుంటారు. ఇలా మాత్రలు వేసుకుని గతకొంతకాలం క్రితం ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మాత్రలు వేసుకోవడం వల్ల దుష్ర్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా..

    కొంతకాలం క్రితం ఓ 18 ఏళ్ల యువతి ఇంట్లో పూజ కోసం పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడింది. బ్లడ్ క్లాట్ కావడంతో వల్ల ప్రాణాలు కోల్పోయింది. దాదాపు మూడు రోజుల పాటు ఇలా పిల్స్ వేసుకుంది. కాళ్లు, చేతులలో వాపులు వచ్చి చివరకు చనిపోయిన విషయం తెలిసిందే.

    Period Delay Pills | పిల్స్ వాడుతున్నారా..

    అనేక మంది మహిళలు పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడుతుంటారు. వీటిలో కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ఇవి నెలసరి రాకుండా తాత్కాలికంగా ఆపుతాయి. ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకలు ఉన్న సమయంలో కొందరు మహిళలు వీటిని వినియోగిస్తుంటారు. ఇది కొన్ని సార్లు ప్రభావం చూపించకపోవచ్చు. కానీ కొన్ని సార్లు మాత్రం తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్లాట్స్ వచ్చే ముప్పు సైతం ఏర్పడుతుంది. ఉన్నట్టుండి హార్మోన్ల లెవెల్స్ పడిపోవడం వల్ల తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు.

    ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకున్నట్లే..!

    పిల్స్ వేసుకున్న సమయంలో బాడీలో హార్మోన్ల లెవెల్స్ మారిపోతాయి. నెలసరిని ప్రేరేపించే హార్మోన్స్​ అనేవి ఆగిపోతాయి. ఈ కారణంగా పీరియడ్స్ రావడం ఆలస్యం అవుతుంది. ఎన్ని రోజుల పాటు మెడిసిన్ తీసుకుంటే అన్ని రోజుల పాటు ఆగిపోతాయి. ఇలా చేయడం వల్ల సమస్యలు రావడంతో పాటు రక్తం పని తీరు కూడా మారిపోతుంది. ఈ మాత్రల్లో నోరెతిస్టెరాన్ ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టుకుపోవడానికి కారణం అవుతుంది. ఈ సమస్య మొదలైతే.. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.

    Period Delay Pills |ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటే..

    పీరియడ్స్​ డిలే కోసం పిల్స్​ వేసుకున్నట్లయితే నోరెతిస్టెరాన్ హార్మోన్ రక్త సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దీంతో బ్లడ్ క్లాట్స్ వస్తాయి. అదే సమయంలో రక్తం చిక్కబడుతుంది. అలాగే రక్తాన్ని పల్చగా ఉంచే ప్రొటీన్​లు అనేవి తగ్గిపోతాయి. దీని వల్ల రక్తం చిక్కబడుతుంది. సరైన విధంగా సరఫరా కాకపోవడం కారణంగా నరాల్లో గడ్డలు కడుతుంది. రక్తం గడ్డకట్టినప్పుడు కండరాలు వాపునకు గురవుతాయి. నొప్పి వస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు వస్తాయి.‌

    Period Delay Pills |ఎవరికి ముప్పు

    ఎప్పుడో ఓసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పిల్స్ వేసుకుంటే పరవాలేదు. కానీ ఎక్కువ రోజుల పాటు వాడినట్లయితే దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవు. అయితే.. కొన్ని రకాల సమస్యలున్న వాళ్లయితే వీటిని అసలు వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం అనేది కుటుంబంలో అంతకు ముందు ఇంకెవరికైనా ఉన్నట్లయితే వాళ్లు ఈ పిల్స్ వేసుకోకూడదు. అలాగే ఉబయకాయం ఉన్న వారు సైతం వాడకూడదని సూచిస్తున్నారు.

    Period Delay Pills |ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    తప్పనిసరి పరిస్థితుల్లో పిల్స్​ వాడాల్సి వస్తే వైద్యుల సలహా లేనిది వేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పిల్స్ తీసుకున్నా సరైన విధంగా హైడ్రేట్​గా ఉండాలి. నీరు బాగా తగడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసిన సమయంలో మధ్యలో కాస్త గ్యాప్ తీసుకోవాలంటున్నారు.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.

    child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

    Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: టాలీవుడ్​లో రీరిలీజ్​ల ట్రెండ్​ కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు నవంబర్‌ నెలలో పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్‌పై మళ్లీ రీ రిలీజ్​ల హడావుడి మొదలైంది. రానున్న 15 రోజుల్లో అరడజన్​ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని తప్పక చూడాల్సిన క్లాసిక్స్‌ ఉండగా.. మరికొన్ని ఎమోషనల్‌ కనెక్షన్‌ కలిగిన మూవీస్‌ ఉన్నాయి. మూవీ లవర్స్​కు పండుగ తీసుకురానున్నాయి.

    Upcoming Movies 2025 |నవంబర్ 14 – నాగార్జున ‘శివ’

    నాగార్జున కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ మూవీ ‘శివ’. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ కల్ట్‌ క్లాసిక్‌ ఇప్పుడు సరికొత్తగా 4K ప్రింట్‌, డాల్బీ అటామస్​ సౌండ్‌తో థియేటర్లలోకి రానుంది. నవంబర్​ 14న రీ రిలీజ్​ కానుంది. నాలుగేళ్ల పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌ టీం ఈ రీమాస్టరింగ్‌పై నిశితంగా పని చేసింది. మీడియా ప్రివ్యూలు చూసిన వారు ఇప్పటికే “వావ్‌!” అన్నట్లు తెలుస్తోంది. నాగార్జున గెటప్‌, వర్మ రా ప్రెజెంటేషన్‌, ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవన్నీ మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై మళ్లీ మాయ చేయనున్నాయి.

    నవంబర్ 15 – సిద్దార్థ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’

    ‘శివ’ తర్వాతి రోజే మరో ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ప్రేక్షకులను అలరించనుంది. ప్రభుదేవా డైరెక్ట్​ చేసిన ఈ సినిమా అప్పట్లో యువతలో విపరీతమైన ఆదరణ పొందింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు, సిద్దార్థ్‌–త్రిష కెమిస్ట్రీ ఈ సినిమాను టైమ్‌లెస్‌ రొమాంటిక్‌ క్లాసిక్‌గా నిలబెట్టాయి. అందుకే ఫ్యాన్స్​ ఈ మూవీ రీ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

    నవంబర్ 21 – చిరంజీవి ‘కొదమసింహం’

    1990లో విడుదలైన తెలుగు సినిమాల్లో కౌబాయ్‌ థీమ్‌తో చేసిన అరుదైన ప్రయోగం మెగాస్టార్‌ చిరంజీవి ‘కొదమసింహం’ మూవీ. అప్పట్లో భారీగా కమర్షియల్‌ విజయం సాధించకపోయినా, క్రమంగా ఈ చిత్రం కల్ట్‌ స్టేటస్‌ను సంపాదించింది. మెగాస్టార్‌ మాస్‌ లుక్‌, కీరవాణి సంగీతం, సాహస సన్నివేశాలు అలరించాయి. నేటి తరం థియేటర్‌లో ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించింది.

    Upcoming Movies 2025 |నవంబర్ 22 – కార్తీ ‘ఆవారా’

    తమిళ నటుడు కార్తీ నటించిన ‘ఆవారా’ సినిమా కూడా రీ రిలీజ్‌ కానుంది. ఒకసారి షెడ్యూల్‌ చేసి వాయిదా వేసిన ఈ మూవీ ఇప్పుడు తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులో కూడా సమాంతరంగా వస్తోంది. యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్‌ల మిశ్రమంగా వచ్చి ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చింది. కొత్త సాంకేతిక మెరుగులతో, ఈసారి థియేటర్లలో ఆవారా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

    Upcoming Movies 2025 |నవంబర్ 28 – సూర్య ‘సికందర్’

    సూర్య ‘సికందర్’ మొదటిసారి రిలీజ్‌ అయినప్పుడు పెద్దగా సక్సెస్‌ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు రీ ఎడిట్‌ చేసి, సరికొత్త కట్‌తో, ఫ్రెష్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వనున్నట్లు దర్శక–నిర్మాతలు చెబుతున్నారు.

    Upcoming Movies 2025 |నవంబర్ 29 – మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’

    మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే ఎక్స్​పీరియన్స్​ ఇచ్చింది బిజినెస్​ మెన్​ సినిమా. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్‌ నవంబర్​ 29న రీ రిలీజ్‌ కానుంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా గ్రాండ్‌ షెడ్యూల్‌తో వస్తోంది.

    ఈ నెలలో ఇన్ని రీ రిలీజ్​ సినిమాలు ఉండడంతో మూవీ లవర్స్​కు ఇది ఒక పెద్ద ఫీస్ట్‌ అనే చెప్పుకోవాలి. రీ రిలీజ్​లతో నవంబర్‌ నెల సినీ ప్రేమికులకు బంపర్‌ మంత్‌గా మారబోతోంది.

    ఇది కూడా చదవండి: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!‌

    Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!‌

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Coffee on Empty Stomach Risks |పొద్దున నిద్రలేవగానే కప్పు కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. దీంతో ఎనర్జిటిక్​గా అనిపిస్తుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా కడుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించారా..? ఈ అలవాటు మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా..

    ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఏమీ తినకుండా కాఫీ తాగడం వల్ల అది కడుపులోని ఆమ్ల స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది కడుపు గోడలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మంట, గ్యాస్, వికారం, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

    Coffee on Empty Stomach Risks |కాఫీలోని కెఫీన్ కారణంగా..

    కాఫీలోని కెఫీన్ మరో సమస్య. ఇది శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. దీనిని స్ట్రెస్​ హార్మోన్ అని కూడా అంటారు. దీని కారణంగా ఉదయం రిఫ్రెష్ అయిన ఫీలింగ్​కి బదులు ఆందోళన, చిరాకు లేదా టెన్షన్ అనిపించే అవకాశం ఉంటుంది. కాఫీ మీ మానసిక స్థితిని మరింత గందరగోళంగా మారుస్తుంది అన్నమాట.

    Coffee on Empty Stomach Risks |మొదట గ్లాస్​ నీళ్లు తాగండి..

    ఉదయం లేచిన తర్వాత మొదట ఒక గ్లాసు నీరు తాగడమే సరైన మార్గం. రాత్రి నిద్రలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అయితే నీరు తాగడం వల్ల తేమ తిరిగి వస్తుంది. మెటబాలిజం ప్రారంభమవడంతో పాటు జీర్ణక్రియ సిద్ధమవుతుంది. ఆ తర్వాత కాఫీ తాగాలనిపిస్తే.. ముందుగా కొంచెం లైట్ బ్రేక్‌ఫాస్ట్ లేదా ఫ్రూట్స్ తినండి. ఆ తర్వాత అరగంట ఆగి కాఫీ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆమ్ల ప్రభావం తగ్గుతుంది.‌

    Coffee on Empty Stomach Risks |సరైన సమయంలో తాగితే..

    కాఫీ అలవాటు అనేది పూర్తిగా చెడు చేస్తుందని కాదు. కానీ సరైన సమయంలో, సరైన విధానంలో తాగితే అది ఏకాగ్రత పెంచడంతో పాటు అలసట తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మూడ్‌ను మెరుగుపరుస్తుందట. కానీ ఖాళీ కడుపుతో తాగకపోవడం, మీ శరీర అవసరాలను గుర్తించడం చాలా కీలకం. ఇలాంటి చిన్న మార్పులతో మీ ఉదయాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు, దీర్ఘకాలంలో జీర్ణ ఆరోగ్యం, మానసిక బ్యాలెన్స్‌ను కాపాడుకోవచ్చు.‌

    ‌గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం అందించాం. ఈ కథనం ఇంటర్నెట్‌లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఇచ్చాం. వీటిని పాటించే ముందుకు సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.

    ఇది కూడా చదవండి: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

    Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో సులభంగా పంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి, ఐఫోన్‌ వినియోగదారులు ఆపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని UIDAI “X” లో తెలిపింది.

    Aadhaar App : ఇప్పటికే “mAadhaar” యాప్‌ ఉన్నా.. “Aadhaar” అదనంగా తీసుకువచ్చింది. ఈ కొత్త యాప్‌లో డిజిటల్ కార్డ్ డౌన్‌లోడ్‌, PVC కార్డ్ ఆర్డర్‌, ఈ‌‌–మెయిల్, మొబైల్ వెరిఫికేషన్, వర్చువల్‌ ఐడీ వంటి ఫీచర్లు ఉండవు. ఇది ప్రధానంగా ఆధార్ వివరాలను స్టోర్ చేయడం, పంచుకోవడం కోసం తీసుకువచ్చారు.‌

    Aadhaar App | కొత్త యాప్‌లో ఉన్న ఫీచర్స్​ ఏమిటంటే..

    ఇక నుంచి ఆధార్ కార్డ్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లో ఈ యాప్​ ఉంటే చాలు. కొత్త యాప్‌ ద్వారా ఆధార్‌ కార్డు డిజిటల్‌గా అందుబాటులో ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆధార్‌లను సైతం ఈ యాప్​లో సేవ్ చేసుకోవచ్చు.

    Aadhaar App | భద్రత కూడా ఉంటుంది..

    ఈ యాప్​కు ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ ఉండడంతో ఇది మరింత సురక్షితం. ఎవరితో పంచుకోవాలో, ఏ వివరాలు షేర్ చేయాలో మీరు నిర్ణయించుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాలను లాక్ చేయడమో, అన్‌లాక్ చేయడమో కూడా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే ఆధార్‌ను చివరిసారిగా ఎక్కడ ఉపయోగించారో కూడా ఈ యాప్‌లో నమోదవుతుంది.

    Aadhaar App | యాప్​ను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

    ముందుగా Google Playstore లేదా Apple Store నుంచి “Aadhaar” యాప్‌ డౌన్‌లోడ్ చేయండి.
    అవసరమైన అనుమతులను ఇవ్వండి, షరతులను అంగీకరించండి.
    మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి.
    ఫేస్‌ అథెంటికేషన్ పూర్తి చేయండి.
    చివరగా సెక్యూరిటీ పిన్‌ సెట్ చేయండి.. అంతే! యాప్​ను ఉపయోగించవచ్చు.

    Aadhaar App | కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులో..

    ఈ కొత్త ఆధార్ యాప్‌ సింపుల్‌గానే కాదు, చాలా హెల్ప్‌ఫుల్‌ కూడా ఉంటుంది. ఫోన్‌లో ఆధార్ ఉంటే ఏదైనా వెరిఫికేషన్ కోసం వెంటనే చూపించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల ఆధార్​ వివరాలు సైతం ఇందులో నమోదు చేసుకోవచ్చు. దీంతో ఇక నుంచి ఫిజికల్ కాపీల ఇబ్బందులు ఉండవు. ఇంకేం మరి వెంటనే యాప్​ డౌన్​లోడ్​ చేసుకుని మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆధార్​ వివరాలు సేవ్​ చేసుకోండి.

    ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Cracked Lips in Winter | చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు వస్తుంటాయి. చల్లటి గాలుల ప్రభావం ముఖ్యంగా మన పెదవులపై ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గులాబీ రంగులో మెరిసే పెదవులు ఈ సీజన్‌లో పొడిబారి, పగిలి, ఒక్కోసారి రక్తం కారేంతగా బాధిస్తాయి.

    ఈ సమస్యను తగ్గించడానికి చాలామంది ఖరీదైన లిప్ బామ్స్ లేదా క్రీములు వాడుతుంటారు. కానీ మన వంటింట్లోనే చిట్కాలు ఉన్నాయి. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా మార్చే 5 సహజ హోం రెమెడీస్‌ను ఇప్పుడు చూద్దాం.

    Cracked Lips in Winter | ప్రకృతి ఇచ్చిన ప్రసాదం తేనె

    తేనె రుచికోసం మాత్రమే కాదు.. సౌందర్య రహస్యాల్లో ప్రధానమైంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. యాంటీబాక్టీరియల్ గుణాల వల్ల పగుళ్లతో వచ్చే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. స్వచ్ఛమైన తేనెను కొద్దిగా తీసుకుని పెదవులపై పలుచగా రాయండి. రోజులో రెండు లేదా మూడు సార్లు ఇలా చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే కడిగేస్తే, పెదవులు వెన్నలా మృదువవుతాయి.

    Cracked Lips in Winter | సహజ రక్షణ కవచం కొబ్బరి నూనె

    కొబ్బరి నూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్​ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి తేమను నిలిపి ఉంచుతాయి. చల్లని గాలుల ప్రభావం నుంచి పెదవులను కాపాడతాయి. కొద్దిగా నూనెను వేళ్లతో తీసుకుని రోజంతా అప్లయ్​ చేయండి. ఇది పెదవులకు సహజ మెరుపును ఇస్తుంది.

    Cracked Lips in Winter |వెన్నలాంటివి కావాలా.. పాలమీగడ

    పాల మీగడలో ఉండే సహజ కొవ్వులు, లాక్టిక్ యాసిడ్ పొడిబారిన పెదవులను పునరుజ్జీవింపజేస్తాయి. రాత్రి నిద్రకు ముందు రాసుకుని, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయండి. పెదవులు పట్టులా మారిపోతాయి.

    Cracked Lips in Winter | చక్కెర – ఆలివ్ నూనె స్క్రబ్..

    పొడిబారిన పెదవులు మృత కణాలతో నిండిపోతాయి. వాటిని తొలగించడానికి ఒక సులభమైన స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఒక చెంచా చక్కెరలో కొద్దిగా ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేయండి. ఒక నిమిషం వలయాకారంలో రుద్దాలి. గోరువెచ్చని నీటితో కడిగేసి నెయ్యి లేదా నూనె రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

    Cracked Lips in Winter | దోసకాయ రసం

    దోసకాయలోని నీటిశాతం పెదవులకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. పగుళ్ల వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. దోసకాయ ముక్కను లేదా దాని రసాన్ని పెదవులపై 10–15 నిమిషాలు ఉంచండి. వెంటనే చల్లదనం, సాంత్వన కలుగుతుంది.

    ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai