Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today - Page 4 of 4

Author: Telugu News Today

  • Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై బుకింగ్ అయిన టికెట్ తేదీలనూ మార్చుకోవచ్చు..

    Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై బుకింగ్ అయిన టికెట్ తేదీలనూ మార్చుకోవచ్చు..

    తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Railway tickets | రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. మీరు బుకింగ్ చేసుకున్న టికెట్ తేదీలనూ మార్చుకునే వెసులుబాటును కల్పించనుంది.

    Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

    రైల్వే ప్రయాణికులు ఇప్పటి వరకు జర్నీ కోసం ముందస్తు రిజర్వేషన్ బుక్ చేసుకుంటే.. అనుకోని కారణాల వల్ల ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే టికెట్ కాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తర్వాత మళ్లీ మరో తేదీన బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను గుర్తించిన రైల్వే శాఖ ఈ విధానానికి స్వస్తి పలకనుంది. ఇకపై కన్ఫామ్డ్ ట్రెయిన్ టిక్కెట్ల ప్రయాణ తేదీని ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకునే అవకాశం కల్పించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే జనవరి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
    Railway tickets | ప్రస్తుత నిబంధనలు..

    ప్రస్తుతం ముందస్తుగా బుక్ చేసుకున్న రైల్వే టిక్కెట్లకు సంబంధించిన జర్నీ డేట్ను మార్చుకోవడానికి అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణాన్ని కాన్సిల్ చేసుకోవాల్సి వస్తే టికెట్ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఛార్జీలను ప్రయాణ తేదీ, టికెట్ కాన్సిల్ చేసుకునే సమయం ఆధారంగా భరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం డబ్బులను కట్ చేసుకున్న తర్వాతే మిగతా అమౌంట్ను రీఫండ్ అవుతుంది.
    Railway tickets | ఏం మార్చారంటే..
    ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రయాణికుల ప్రయోజనాలు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అందుకే వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త విధానాన్ని అమలుఓకి తేనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానంలో కన్ఫామ్డ్ టికెట్ల తేదీలను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే మార్చుకోవచ్చునని తెలిపారు. ప్రయాణిలు జర్నీ తేదీని మార్చుకునే సౌకర్యం కల్పించనున్నామని వివరించారు.

  • EV vehicles | ఈవీ కార్లు కొనాలనుకునే వారి గుడ్​న్యూస్​.. త్వరలో తగ్గనున్న ధరలు..!

    EV vehicles | ఈవీ కార్లు కొనాలనుకునే వారి గుడ్​న్యూస్​.. త్వరలో తగ్గనున్న ధరలు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: EV vehicles | గత కొంతకాలంగా ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా కూడా పెట్రోల్​ వాహనాలతో పోలిస్తే చాలా తక్కువగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ఛార్జీలు స్టేషన్లు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో పాటు వీటి ధరలు అధికంగా ఉండడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. పెట్రోల్​ కార్లతో పోలిస్తే రేట్లు ఎక్కువ కావడంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపించడంలేదు. కాగా.. ఈ క్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలో ఈవీ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

    EV vehicles | ఎందుకు తగ్గనున్నాయంటే..

    ప్రస్తుతం పెట్రోల్‌ వెహికిల్స్​ రేట్ల కంటే ఎలక్ట్రికల్​ వెహికిల్స్​ ధరలు అధికంగా ఉంటున్నాయి. అయితే ఈవీల ప్రొడక్షన్​ పెరగడం.. వినియోగం సైతం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 4–6 నెల్లలో పెట్రోల్​, ఈవీ వాహనాల మధ్య అంతరం తగ్గిపోనుందని పేర్కొన్నారు. 20వ ఫిక్కీ హైయర్‌ ఎడ్యుకేషన్‌ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు.

    EV vehicles | మూడో అతిపెద్ద దేశంగా భారత్​

    భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుందని గడ్కరీ తెలిపారు. అమెరికా రూ.78 లక్షల కోట్లు, చైనా రూ.47 లక్షల కోట్లు తర్వాతి స్థానంలో రూ.14 లక్షల కోట్లుతో మనం మూడో ప్లేస్​లో ఉన్నాయని వివరించారు. అయితే రానున్న ఐదేళ్లలో భారత వాహన పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

    EV vehicles | శిలాజ ఇంధనాలతో పర్యావరణానికి ముప్పు

    శిలాజ ఇంధనాలపై ఆధారపడడం మన దేశానికి ఆర్థిక భారమని గడ్కరీ వివరించారు. ప్రతియే పెట్రో ఉత్పతుల దిగుమతులపై రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికీ ముప్పు కలుగుతోందన్నారు. అందుకే దశ పురోగతి కోసం శుద్ధ ఇంధనాన్ని అందిపుచ్చుకోవడం కీలకమని చెప్పారు. ఇథనాల్​ను ఉత్పత్తి చేస్తుండడం వల్ల కొంత భారం తగ్గిందన్నారు. జొన్న నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ.45,000 కోట్లు సంపాదించారని వివరించారు. 2027 నాటికి రహదారుల నిర్మాణంలో ఘన వ్యర్థాలను వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. తద్వారా వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Gaza war | గాజా – ఇజ్రాయిల్ వార్​కు రెండేళ్లు.. ఈ యుద్ధం ముగిసేదెన్నడు..!

    Gaza war | గాజా – ఇజ్రాయిల్ వార్​కు రెండేళ్లు.. ఈ యుద్ధం ముగిసేదెన్నడు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Gaza war | సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ప్రపంచం ఉలిక్కిపడింది. 2023 అక్టోబర్ 7న హమాస్​ ముష్కరులు ఎవరూ ఊహించని రీతిలో ఇజ్రాయిలోకి చొచ్చుకొచ్చారు. ఓ ఈవెంట్​లో పాల్గొన్న వారిని పిట్టల్లా కాల్చారు. సుమారు 1200 మందిని హతమార్చారు. అంతేకాకుండా దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుని తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటన యావత్​ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. నాటి ఘటన ఇంకా కళ్లముందు కదలాడుతోంది.

    Gaza War | విరుచుకుపడ్డ ఇజ్రాయిల్​

    హమాస్​ దాడితో షాక్​కు గురైన ఇజ్రాయిల్​ వెంటనే తేరుకుంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడింది. దాడితో సంబంధం ఉన్న హమాస్ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టింది. ఇజ్రాయిల్​ సైన్యం పాలస్తీనాలోకి చొచ్చుకెళ్లి అడుగడుగు జల్లెడ పట్టి మరీ హమాస్​ ఉగ్రమూకలను హతమార్చింది. ఈ క్రమంలో చాలా మంది సామాన్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతోంది.

    Gaza War | ఎటు చూసినా శవాలు.. కూలిన బంగ్లాలు..

    హమాస్​ ఉగ్రవాదులు మట్టుబెడతామని ప్రతిన బూనిన ఇజ్రాయిల్​ గత రెండేళ్లు పాలస్తీనాలో భీకర దాడులు చేస్తోంది. ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు చేస్తూ.. ఉగ్రవాదులను ఏరివేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఇజ్రాయిల్​ దాడులు (Gaza war) కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాలస్తీనా శవాల దిబ్బగా మారింది. అంతేకాకుండా ఎటువైపుచూసినా కూలిపోయిన బంగ్లాలతో కళావిహీనంగా మారిపోయింది. కాగా.. గత ఆరునెలల క్రితం మాత్రమే కొన్ని రోజుల పాటు కాల్పులకు బ్రేక్​ ఇచ్చింది. ఈ సమయంలో హమాస్​ – ఇజ్రాయిల్​ మధ్య జరిగిన ఒప్పదం ప్రకారం.. కొందరు బందీలను విడుదల చేశారు.

    Gaza War | శాంతికి 20 పాయింట్ల ప్రణాళిక

    మిడిల్​ ఈస్ట్​లో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ యత్నిస్తున్నారు. హమాస్​ – ఇజ్రాయిల్​ మధ్య శాంతి ఒప్పందం కోసం 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. కాగా.. దీనిని ఇజ్రాయెల్-హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. బందీలను విడుదల చేసేందుకు హమాస్ ఒప్పుకుంది. అంతేకాకుండా పాలస్తీనా ఖైదీలను సైతం విడుదల చేసేందుకు ఇజ్రాయిల్ కూడా అంగీకారం తెలిపింది. అయితే ట్రంప్​ రంగంలోకి దిగడంతో శాంతి చర్చలు సఫలమై యుద్ధం ముగుస్తుందా అనేది చూడాలి.

  • Gold price | ఆగని పసిడి పరుగులు.. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు..

    Gold price | ఆగని పసిడి పరుగులు.. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Gold price | బంగారం ధరలు (Gold prices) గత కొద్ది రోజులు రాకెట్​ వేగంతో దూసుకుపోతున్నాయి. పట్టపగ్గాలు లేనట్లు పరుగులు పెడుతున్నాయి.

    Gold price | బంగారం పెరుగుదలకు కారణాలేమిటి..!

    చూస్తుండగానే ధరలు రికార్డులు బ్రేక్​ చేస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, పలు దేశాలు బంగారం కొనుగోలును పెంచడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేట్ల పెరుగుదలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

    భారత మార్కెట్​లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.84వేలు ఉండగా.. నేడు రూ. లక్షా 2‌‌0వేలకు చేరింది. అంటే దాదాపు గత ఎనిమిది నెలల్లో రూ. 36వేలు ధర పెరిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు అమెరికర: డాలర్ బలపడడం, అలాగే రూపాయి విలువ క్షీణించడం లాంటివి ధరల పెరుగుదలకు కారణాలుగా మారుతున్నాయి. పెట్టుబడి దారులు సురక్షితమైన ఇన్వెస్ట్​మెంట్​గా భావిస్తుండడంతో ధరలు రాకెట్​ వేగంతో దూసుకుపోతున్నాయి.

    Gold price | మరింత పెరగనుందా..

    అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ కొనసాగడం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు నిధులను లోహాలపైకి మళ్లిస్తున్నారు. దీంతో ధరలు పెరుగుదల కొనసాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రూ. లక్షా 25 వేలకు వరకు వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు సైతం పసిడితో పాటు పరుగులు పెడుతున్నాయి.

    Gold price | రూ.1,20,000కు చేరిన ధర

    బంగారం ధరలు మంగళవారం గరిష్టాన్ని తాకాయి. 24 క్యారెట్ల 1‌‌0 గ్రాముల బంగారం ధర రూ.1,20,780కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,10,710గా న‌మోదైంది. ఇక వెండి ధర కిలోకు రూ. 1,67,100 పలికింది.