Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today - Page 2 of 4

Author: Telugu News Today

  • Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో నిలిపిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 24 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి.

    Delhi Car Blast |సాయంత్రం సమయంలో..

    పేలుడు సాయంత్రం 6:55 గంటల సమయంలో అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఏడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపు చేశాయి. పేలుడు ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ఈ-రిక్షాలు, ఆటోరిక్షాలు కాలి బూడిదయ్యాయి. ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి.

    కాగా.. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కారులో పేలుడు పదార్థాలు ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరైనా పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్, క్లూస్ టీంలతో పాటు ఎన్‌ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం కావడంతో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు సాధారణంగా తక్కువ రద్దీగా ఉంటాయి. దీంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేశారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సింఘు, టిక్రీ, బదర్‌పూర్ వంటి కీలక పాయింట్లలో అదనపు పోలీసు బలగాలు మోహరించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఇతర సున్నిత ప్రదేశాల్లో నిఘా పెంచారు.

    Delhi Car Blast |ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కేంద్ర హొం మంత్రి అమిత్​ షా చేరుకున్నారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

    Health benefits of dried fish | ఎండు చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    తెలుగున్యూస్​టుడే, ఇంర్నెట్​డెస్క్​: నేటి ఆయుధనిక యుగంలో స్మార్ట్​ఫోన్​ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగ్యమైంది. ఇది లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్​ ఉండాల్సిందే. అయితే వీటిలోని ఉండే అనేక ఫీచర్ల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఇందులో ‘ఫైట్​ మోడ్’​ కూడా ఒకటి. దీని గురించి కొందరికి తెలిసినా.. దీంతో ఉండే చాలా ఉపయోగాలు పూర్తిగా తెలియదు. మరి అవేంటో తెలుసుకుందామా..

    మనం మామూలుగా విమానంలో ప్రయాణించే సమయంలో, నెట్‌వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తారని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఈ ఫ్లైట్ మోడ్‌ ద్వారా మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి.

    Smartphone Flight Mode Uses : బ్యాటరీ లైఫ్ పెరుగుదల

    ఫ్లైట్ మోడ్‌ ఆన్ చేయడం వల్ల ఫోన్ నెట్‌వర్క్ సెర్చ్ చేయడం ఆపేస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా Wi-Fi, మొబైల్ డేటా, బ్లూటూత్‌, జీపీఎస్​ లాంటి ఫీచర్లు డిసెబుల్ అవుతాయి. దీనివల్ల బ్యాటరీ 20-30 శాతం వరకు ఎక్కువ సేపు పనిచేస్తుంది. బ్యాటరీ తక్కువ ఉన్న సమయంలో తాత్కాలికంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం వల్ల పవర్‌ సేవ్ చేసుకోవచ్చు.

    Smartphone Flight Mode Uses : ఛార్జింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు..

    ఫైట్​ మోడ్​ ఆన్​ చేసి ఛార్జింగ్​ పెట్టడం వల్ల వేగంగా అవుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇలా చేయడం ద్వారా ఫోన్ మూడు నుంచి నాలు రెట్లు ఫాస్ట్​గా ఛార్జ్ అవుతుంది. ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్, Wi-Fi, నోటిఫికేషన్స్​ పనిచేయవు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయి ఛార్జింగ్ వేగం పెరుగుతుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఫ్లైట్ మోడ్‌ ఆన్​ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు.

    నెట్‌వర్క్ రీసెట్‌ కోసం..
    కొన్నిసార్లు మన ఫోన్​లో సిగ్నల్ పోయి తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో ఫ్లైట్ మోడ్‌ను 10 సెకన్ల పాటు ఆన్ చేసి తిరిగి ఆఫ్ చేయాలి. దీంతో మొబైల్ నెట్‌వర్క్ అనేది ఆటోమేటిక్‌గా రీఫ్రెష్ అవుతుంది. అప్పుడు సిగ్నల్ సమస్య పరిష్కారమవుతుంది.

    Smartphone Flight Mode Uses : నిద్రపోయే సమయంలో..
    రాత్రి నిద్రకు ఉపక్రమించిన సమయంలో అత్యవసరం లేకపోతే ఫైట్​మోడ్​ ఆన్​ చేసుకోవచ్చు. ఫోన్​ దగ్గరగా పెట్టుకుని పడుకున్నట్లయితే సిగ్నల్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల రేడియేషన్ ఎమిషన్ తగ్గిపోతుంది. దీంతో నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

    Smartphone Flight Mode Uses : యాడ్స్​ రాకుండా గేమ్స్ ఆడొచ్చు..
    ఫైట్​ మోడ్​ ఆన్​ చేయడం వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. దీంతో ఆన్‌లైన్ యాడ్స్ రావు. కాబట్టి ఫ్లైట్ మోడ్‌లో గేమ్స్ ఆడితే యాడ్ డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల క్లియర్ గేమింగ్ అనుభవం పొందవచ్చు. అలాగే ఫైట్​ మోడ్​ ఫీచర్​ ద్వారా డేటా సేవింగ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసి.. ఆ తర్వాత కేవలం Wi-Fi మాత్రమే ఆన్ చేయాలి. దీంతో మొబైల్ డేటా పూర్తిగా సేవ్ అవుతుంది. ఇలా ఈ ఫైట్​ మోడ్​ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

    ఇది కూడా చదవండి.. Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్​పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా?

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్​పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా? – వాటి అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..!

    Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్​పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా? – వాటి అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: మనం ఇష్టంగా కొనుకున్న షర్టు కొద్ది రోజుల్లోని కలర్​ మారిపోయిందా.. మీకు నచ్చిన ప్యాంటు త్వరగా చిరిగిపోయిందా.. బ్రాండెడ్​వి కొన్నా ఇలా ఎందుకు జరిగిందో మీకు అర్థంకావడం లేదా.. ఇందుకు కారణం ఉంది. మనం దుస్తుల తీరును సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉతకడం, ఐరన్​ చేయడం, బ్లీచ్ వేయడం, వాషింగ్​ మెషీన్​లో వేయడం వల్ల ఇలా జరుగుతుంది. Laundry Symbols Explained దుస్తుల తీరును బట్టి మనం ఉతకడం, ఐరన్​ చేయడం లాంటి చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దుస్తులు భద్రంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందామా..

    Laundry Symbols Explained దుస్తులపై ఉండే గుర్తులు కీలకం..

    కొత్త దుస్తులను వేసుకునే ముందు వాటిపై ఉండే ట్యాగ్​లను పరిశీలించాలి. ఇవి సాధారణంగా కాలర్ లేదా లోపలి భాగంలో ఉంటాయి. వీటిపై కొన్ని చిన్న గుర్తులు, ప్రత్యేక చిహ్నాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని బట్టి మనం వాషింగ్​, బ్లీచింగ్​, ఐరన్​ చేయాలని సూచిస్తున్నారు.

    O సర్కిల్ గుర్తు ఉంటే..

    కోట్​​లతో పాటు కొన్ని ప్రత్యేక దుస్తులను మామూలు నీటితో ఉతికితే పాడవుతాయి. అయితే వీటిని డ్రై క్లీన్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దుస్తుల ట్యాగ్​పై సర్కిల్ గుర్తు ఉన్నట్లయితే డ్రైక్లీన్ చేయాలని అర్థం. ఒకవేళ ఇంటూ గుర్తు ఉన్నట్లయితే డ్రైక్లీన్ చేయాల్సిన పనిలేదు.

    🧺 బకెట్ చిహ్నం ఉంటే..

    సున్నితమైన దుస్తులను వాషింగ్​మెషీన్​లో వేయడం వల్ల త్వరగా దెబ్బతింటాయి. ఇలాంటి కేటగిరీలోకి సిల్క్, ఉన్ని, కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్​తోఓ తయారైనవి వస్తాయి. అయితే దుస్తుల ట్యాగ్​పై ఒక చెయ్యిన నీటితో ఉన్న బకెట్​లో ఉంచినట్లు కనిపించినట్లయితే దానిని చేతితోనే శుభ్రం చేయాలని అర్థం చేసుకోవాలి.

    🔥ఐరన్​ బాక్స్​.. Laundry Symbols Explained

    దుస్తులను ఇస్త్రీ చేసే సమయంలో తగిన ఉష్ణోగ్రత చేసుకోవాలి. కొన్ని రకాల దుస్తులు ఎక్కువ వేడిని తట్టుకోవు. దీనికి సూచనగా ట్యాగ్​పై ఇనుపగుర్తు చుక్కలు ఉంటాయి. మూడు డాట్స్​ ఉంటే కొంచెం ఎక్కువ వేడితో ఐరన్​ చేయాలని అర్థం. ఒక డాట్​ ఉంటే తక్కువ వేడితో చేయాల్సి ఉంటుంది.

    🔺 త్రిభుజం మార్క్​ ఉన్నట్లయితే..

    త్రిభుజం గుర్తు బ్లీచింగ్ వినియోగించాలా? వద్దా? అనే విషయాన్ని తెలుపుతుంది. ఖాళీ త్రిభుజం గుర్తు కనిపిస్తే బ్లీచింగ్​ను వాడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ త్రిభుజంలో ఇంటూ గుర్తు ఉన్నట్లయితే బ్లీచింగ్ వాడొద్దని అర్థం. త్రిభుజం లోపల రేఖలు ఉంటే కొన్నిసార్లు వాడవచ్చు.. కానీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.

    చతురస్రాకారం..

    చతురస్రాకారం గుర్తు లోపల వృత్తం ఉన్నట్లయితే వాషింగ్​మెషీన్​లో ఆరబెట్టాలని సూచిస్తుంది. దానిపై ఇంటూ గుర్తు ఉంటే ఎండలో ఆరబెట్టవచ్చని తెలుసుకోవాలి.

    ఇది కూడా చదవండి.. : Laundry Symbols Explained

    No Bleach Triangle Explained

    30°C Wash Symbol GuideDry

    ఇది కూడా చదవండి..: Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!

    Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గురక వస్తోందా..? అది సాధారణ సమస్యనే అనుకుంటున్నారా? కానీ.. రోజూ గురకపెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సిగ్నల్​గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్‌టెన్షన్, స్ట్రోక్ వంటి ముప్పుల తప్పించుకోవచ్చంటున్నారు.

    Snoring in Sleep |స్లీప్ అప్నియా ఎందుకు పెరుగుతోంది?

    స్లీప్ అప్నియా (Snoring in Sleep) అనేది నిద్రలో శ్వాస చాలాసార్లు ఆగిపోయి, తిరిగి ప్రారంభమయ్యే సాధారణమైన పరిస్థితి. ఇది శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. గురక, ఉదయం తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండవచ్చు, అయితే చికిత్స చేయించుకోకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    ఈ మధ్య కాలంలో స్లీప్ అప్నియా గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇది వృద్ధుల్లోనే కాకుండా యువతలోనూ సర్వసాధారణంగా మారుతోంది. డెస్క్ జాబ్స్, లేట్ నైట్ స్క్రీన్ టైం, వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి పెరుగుతున్నాయి. హార్ట్​ స్ట్రోక్ వచ్చిన 50-70 శాతంలో మందిలో స్లీప్ అప్నియా ఉంటుందని అంటున్నారు. యువకుల్లో కూడా రీకరెంట్ స్ట్రోక్స్ వస్తున్నాయట. అయితే లైఫ్‌స్టైల్ మార్చుకోకపోతే ఇది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందంటున్నారు.

    Snoring in Sleep ఏం జరుగుతుందంటే..!

    స్లీప్ అప్నియా వల్ల నిద్రలో మీ ఎయిర్‌వే రిపీటెడ్‌గా బ్లాక్ అవుతూ ఉంటుంది. రాత్రంతా అనేక సార్లు ఇలా జరగడం వల్ల మెదడు, శరీరానికి ఆక్సిజన్ అందదు. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ వెసెల్స్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఇది సైలెంట్‌గా స్ట్రోక్, హార్ట్ డిసీజ్‌లకు దారి తీస్తుందట.

    Snoring in Sleep లక్షణాలు ఇవే..

    చాలా మంది ఏళ్ల తరబడి స్లీప్​ అప్నియా లక్షణాలు గమనించరు. గురక వచ్చేవారు, నిద్రలో గ్యాస్పింగ్ లేదా చోకింగ్ ఫీలింగ్, రోజంతా టైర్డ్‌నెస్, మార్నింగ్ హెడేక్, డ్రై మౌత్, ఏకాగ్రత లేకపోవడం, మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఎదురైనట్లయితే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

    గురక తగ్గడానికి ఏం చేయాలంటే..

    గురక తగ్గాలంటే జీవనశైలి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. బెడ్​టైంకు ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అలాగే రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, అలాగే ఒకవైపు పడుకోవడం లాంటివి చేయాలి. వీటి వల్ల మార్పు వస్తే ఒకే. లేదంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చాం. వీటిని పాటించే ముందు మీరు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

    ఇది కూడా చదవండి..: Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Water Heater Precautions | వాటర్​ హీటర్​ వినియోగిస్తున్నారా.. అయితే జాగ్రత్తలు పాటించండి..!

    Water Heater Precautions | వాటర్​ హీటర్​ వినియోగిస్తున్నారా.. అయితే జాగ్రత్తలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Water Heater Precautions | చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, నీళ్లు వేడి చేసుకోవడానికి కొందరు గీజర్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకా కొందరైతే వాటర్ హీటర్​తో నీటిని వేడి చేస్తుంటారు. అయితే.. ఎక్కువ మంది మాత్రం వాటర్ హీటరే వాడుతుంటారు. ఎందుకంటే వాటర్​ హీటర్​ అందుబాటులో ధరలో లభిస్తుంది. తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడం వల్ల చాలామంది దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే దీనిని ఉపయోగించే సమయంలో కొందరు పొరపాట్లు చేస్తూ ప్రాణాల మీదకు ముప్పు తెచ్చుకుంటారు. కాబట్టి వీటిని వాడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం..!

    కొనుగోలు సమయంలో జాగ్రత్త

    హీటర్​ కొనుగోలు సమయంలో ఐఎస్ఐ మార్క్ ఉన్నవి, బ్రాండెడ్ కంపెనీలవే కొనుగోలు చేయాలి. హీటర్ కాయిల్స్​పై ఉండే సిలికా కోటింగ్ రెండేళ్ల తర్వాత తొలగిపోతుంది. ఆ సమయంలో పాతది పక్కన పెట్టేసి.. కొత్త దానిని వినియోగించాలి.

    Water Heater Precautions : బకెట్​ కూడా ముఖ్యమే..

    చాలామంది హీటర్​ను ప్లాస్టిక్ బకెట్లలో పెట్టి నీటిని వేడి చేస్తుంటారు. అంతేకాకుండా బకెట్​కు హీటర్ హుక్​ను తగిలిస్తుంటారు. దీనివల్ల వేడికి ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్లాస్టిక్​ బకెట్​పై ఒక సన్నటి చెక్క (కట్టె) పెట్టి ఉపయోగించవచ్చు. అల్యూమినియం బకెట్ వినియోగిస్తున్నట్లయితే హీటర్​ను నేరుగానే పెట్టవచ్చు. అయితే విద్యుత్తు షాక్ తగిలే ప్రమాదం ఉన్నందున ఇనుప బకెట్​ను యూజ్​ చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    బకెట్​ నీటిని ఎంతవరకు పట్టాలంటే..

    బకెట్​లో నింపిన తర్వాత హీటర్​ను నీళ్లలో పెట్టాలి. అయితే హీటింగ్​ కాయిల్​ అనేది మునిగేలా చూసుకోవాలి. అనంతరం ప్లగ్​ను పవర్​ సాకెట్​కు పెట్టి స్విచ్​ ఆన్​ చేసుకోవాలి. మీరు వాడే హీటర్​పై దానిని ఎంత వరకు ముంచాలనే మార్క్​ ఉంటుంది. దానిని చూసుకుని బకెట్​లో వాటర్​ నింపుకోవాలి.

    Water Heater Precautions | కొన్ని విషయాల్లో జాగ్రత్తం

    హీటర్​ ఆన్​ చేసిన కొద్దిసేపటికి నీళ్లు వేడి అయ్యాయా లేదా చెక్​ చేయడానికి పవర్​ సాకెట్​ను స్విచ్​ ఆఫ్​ చేసి ప్లగ్​ తీసేసిన తర్వాతే నీటిని వేడి చూడాలి. అయితే కొందరు ఏమరపాటులో స్విచ్​ ఆఫ్​ చేయకుండా చూస్తుంటారు. ఇలా చేయడం ప్రాణాల మీదకు తెస్తుంది.

    Water Heater Precautions : కొందరు వాటర్ హీటర్స్ బాత్​రూమ్స్​లో వినియోగిస్తుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా 2 ఇన్ 1 కనెక్షన్ ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల.. ఒక్కోసారి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయి బాత్​రూంలోకి వెళ్తే.. తేమ వల్ల విద్యుత్​ షాక్​కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

    మరో విషయం ఏమిటంటే పిల్లలున్న ఇళ్లలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు తిరిగే ప్రదేశాల్లో వీటిని అస్సలు పెట్టకూడదు. ఎవరూ వెళ్లని ఓ మూల చూసుకుని హీటర్​ పెట్టాలి. లేదంటే ప్రత్యేకంగా ఓ గదిలో నీటిని వేడి పెట్టుకోవడం ఉత్తమం.

    గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం అరట్టై యాప్ డౌన్​లోడ్స్​లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్​కు ఎన్​క్రిప్షన్​ అందుబాటులో ఉండగా.. చాట్​ కోసం మాత్రం లేదు. కాగా.. దీనిపై దృష్టి సారించిన సంస్థ త్వరలోనే చాట్‌ల కోసం వాట్సాప్ లాంటి ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్​ వెంబు తెలిపారు.‌

    Arattai End-to-End Chat Encryptionచివరి ఫీచర్​ టెస్టింగ్​!

    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్​ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ చివరి పరీక్ష దశలో ఉన్నట్లు సమాచారం. దీనిని వినియోగదారుల కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అందుబాటులోకి వచ్చినట్లయితే అరట్టై యాప్ వాట్సాప్‌కు మరింత బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వినియోగదారుల చాట్​లను లేదా డేటాను గోప్యంగా ఉంచుతుంది.‌

    ‌Arattai End-to-End Chat Encryption త్వరలో జోహో పే..!
    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు, UPI-ఆధారిత చెల్లింపు వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జోహో పేను ప్లాట్‌ఫామ్‌లోకి ఇంటిగ్రేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులు యాప్‌లోనే డబ్బు పంపడం, స్వీకరించడం తదితర సౌకర్యాలు కలుగనున్నాయి. ఇది మనం వాట్సాప్‌ లాగే.. మల్టీ-యుటిలిటీ కమ్యూనికేషన్ సాధనంగా మారనుంది.

    Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Excess Salt Side Effects |ఉప్పు విషయంలో ఈ తప్పు చేయొద్దు.. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందంటే..!

    Excess Salt Side Effects |ఉప్పు విషయంలో ఈ తప్పు చేయొద్దు.. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందంటే..!

    తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: ‘అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు’ అంటుందట ఉప్పు. కూరలో ఎన్ని వేసినా ఉప్పు వేస్తేనే రుచి వస్తుందనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఉప్పు ఈ విషయంలో కొన్ని తప్పులు చేయవద్దంటున్నారు నిపుణులు. మితిమీరిన వాడకం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీతో పాటు కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, వస్తాయంటున్నారు. ఉప్పు ఎంత వాడాలి.. ఎలా వాడాలి.. ఎక్కువ వాడుతున్నామా అనేది ఎలా తెలుస్తుంది లాంటి విషయాలు తెలుసుకుందాం పదండి..

    Excess Salt Side Effects ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..

    మధుమేహం సమస్య లేకపోయినా తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే.. మోతాదు కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నారా అనేది చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. రాత్రి సమయంలో వెళుతుంటే ఆహారంలో ఉప్పు వాడకంపై నియంత్రణ పాటించాలంటున్నారు. అయితే అధిక రక్తపోటు ఉన్న వారిలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు వాష్​రూం వెళ్తుంటారట.

    Excess Salt Side Effects ఊరికే దాహం వేస్తోందా..

    ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయట. దీనివల్ల మన శరీరంలో నీటి స్థాయి సమతుల్యతపై ప్రభావం పడుతుంది. దీని వల్ల ఎక్కువగా దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    Excess Salt Side Effects శరీరంలో వాపులు

    సాధారణంగా హైబీపీ బాధితుల్లో శరీర భాగాల్లో వాపు కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో కూడా వాపు రావడం గమినించవచ్చంటున్నారు. ముఖ్యంగా.. పాదాల్లో నీరు పెరిగి ఉబ్బుతాయట. మనం తీసుకునే ఫుడ్​లో ఉప్పు తగ్గిస్తే క్రమంగా బయటపడవచ్చని చెబుతున్నారు.

    Excess Salt Side Effects నొప్పులు, తిమ్మిర్లు రావడం..

    ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. అయితే ఇది మన శరీరంలోని కాల్షియం స్థాయిల్లో కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా బోన్స్​ బలహీనపడతాయని పేర్కొంటున్నారు. అలాగే తిమ్మిర్లు, నొప్పులు వస్తాయని అంటున్నారు.

    Excess Salt Side Effects ఉప్పు తగ్గించుకునే మార్గాలివే..

    నిత్య జీవితంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు దూరంగా ఉండవచ్చు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

    – సూపర్ మార్కెట్లు, మాల్స్​, షాప్​లలో ఏ పదార్థం కొన్నా, అందులో సోడియం స్థాయిలు ఎంత మేర ఉన్నాయో తీసుకోవాలి. ఫుడ్ లేబుల్ చూసి తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ఇచ్చాం. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

    Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Silver Loan |బంగారమే కాదు.. ఇక వెండిపైనా బ్యాంకు లోన్​ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..!

    Silver Loan |బంగారమే కాదు.. ఇక వెండిపైనా బ్యాంకు లోన్​ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Silver Loan : అత్యవసర పరిస్థితుల్లో చాలామంది డబ్బులు కాలంటే గోల్డ్​ లోన్​ తీసుకుంటుంటారు.. వీటిపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుందనే అందరికీ తెలిసిందే. బంగారం వ్యాల్యూ ప్రకారం.. బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు పెట్టి లోన్లు తీసుకునేవారి కోసం ఆర్బీఐ గుడ్​న్యూస్​ చెప్పింది. ఇక నుంచి బంగారమే వెండి సైతం తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చని తెలిపింది. ఇది 2026 ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

    గత కొన్ని నెలలు బంగారం రేట్లు భారీగా పెరిగాయి. అంతేకాకుండా వెండి సైతం అదే బాటలో పయనిస్తోంది. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యింది. కాగా.. ప్రస్తుతం కాస్త ధర తగ్గింది. అయితే ఇప్పుడు వెండి ఆభరణాలు, నాణేలు సైతం బ్యాంకులో పెట్టి లోన్​ తీసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. కొత్త మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని వాణిజ్య బ్యాంకులతో పాటు బ్యాంకింగేంతర ఆర్థిక సంస్థలకు స్పష్టం చేసింది.

    Silver Loan : ఎంత వరకు చెల్లిస్తారంటే..

    ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు వెండి విలువ ఆధారంగా రుణ పరిమితిని నిర్ణయిస్తాయి. దీనినే లోన్‌ టు వాల్యూ రేట్​ అంటారు. ఇది వెండి మార్కెట్‌ విలువలో ఎంత శాతం వరకు రుణం పొందవచ్చో నిర్దేశిస్తుంది. రూ.2.5 లక్షల వరకు.. వెండి మార్కెట్‌ విలువలో 85 శాతం వరకు లోన్​ ఇస్తారు. అదే రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అయితే విలువలో 8‌‌0 శాతం రుణం అందిస్తారు. రూ.5 లక్షలకు పైబడితే 75 శాతం వరకు మాత్రమే లోన్​ ఇవ్వనున్నారు. కాగా.. Silver Loan ఒక్క వ్యక్తి గరిష్ఠంగా 10 కిలోల వరకు వెండిని తాకట్టు పెట్టవచ్చు. వెండి నాణేలు అయితే 500 గ్రాముల వరకే అర్హమవుతాయి.

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. కూడా చదివేయండి.

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ మొబైల్స్​ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరో ట్యాబ్​లెట్​ను లాంఛ్​ చేసింది. ఇది బడ్జెట్‌ ధరలో వైఫై, LTE కనెక్టివిటీతో లభ్యమవుతోంది. వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ 11 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 9340mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాంకుడా ఈ ట్యాబ్​లో క్వాడ్‌ స్పీకర్‌ యూనిట్‌ సైతం ఉంది. ఇందులో Kids Space ఫీచర్‌ను కూడా ఇచ్చారు. Budget Tablets Under 15000 India ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలివే…

    Top 7 Budget Tablets Under 15000 | రూ.15,999 నుంచి ప్రారంభం..

    వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ ప్రస్తుతం అమెజాన్​లో లభ్యమవుతోంది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీతో వచ్చే ఈ ట్యాబ్​ (Wi-Fi) ధర రూ.15,999గా ఉంది. అలాగే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ డివైజ్​ (Wi-Fi + 4G LTE) ధర రూ.17,999గా లభ్యమవుతోంది.

    Top 7 Budget Tablets Under 15000 |స్పెసిఫికేషన్స్​ ఇవే..

    90Hz రీఫ్రెష్‌ రేట్​ 11 ఇంచెస్​ HD+ LCD డిస్‌ప్లేతో ఈ ట్లాబ్లెట్‌ వస్తోంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ఉంది. ఈ డిస్‌ప్లే Low Blue Light, ఫ్లిక్కర్‌ ఫ్రీతో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్‌ కలిగి ఉంటుంది.

    ఆండ్రాయిడ్‌ 15 ఓస్..

    ఈ ట్యాబ్​ మీడియాటెక్ హీలియో G100 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1పై వర్క్​ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 5MP కెమెరా ఉంటుంది. ముందు వైపు 5MP కెమెరా వస్తుంది.

    Top 7 Budget Tablets Under 15000 | భారీ బ్యాటరీ

    ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్​ అనేది 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో పాటు 9340mAh బ్యాటరీతో లభిస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్​ చేస్తే 80 గంటల మ్యూజిక్ ప్లే టైం, లేదంటే 11 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 54 రోజుల స్టాండ్‌బై టైంను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

    ఈ బడ్జెట్​ ట్యాబ్​ Hi – Res ఆడియో గోల్డ్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్​తో కూడిన క్వాడ్ స్పీకర్‌ యూనిట్‌ కలిగి ఉంటుంది. ఇందులో షేరింగ్ ఫీచర్‌.. కిడ్స్‌ మోడ్​ సైతం ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi, 4G LTE, బ్లూటూత్ 5.4 కలిగి ఉంది.

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. కూడా చదివేయండి.

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Credit Card Rules Changes |నవంబర్​ 1 నుంచి మారనున్న బ్యాంక్​, క్రెడిట్​ కార్డు రూల్స్​.. అవేంటో తెలుసుకోండి..!

    Credit Card Rules Changes |నవంబర్​ 1 నుంచి మారనున్న బ్యాంక్​, క్రెడిట్​ కార్డు రూల్స్​.. అవేంటో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన బ్యాకింగ్​ సవరణ చట్టం వల్ల నవంబర్​ 1 నుంచి కొన్ని కీలకమైన మార్పులు రానున్నాయి. బ్యాంక్​ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. కాగా.. క్రెడిట్​ కార్డ్​ రూల్స్​, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన లైఫ్​ సర్టిఫికెట్​ గడువు కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మారనున్న నిబంధలను గురించి తెలుసుకుందాం.

    Credit Card Rules Changes : ఖాతాదారులకు నలుగురు నామినీలు..

    బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి గతంలో ఒక్కరే నామినీగా ఉండేవారు. కాగా.. బ్యాంకింగ్​ సవరణ చట్టం కారణంగా.. ఇక నుంచి నలుగురిని నామినీగా ఎంచుకునే వీలుంది. కేంద్రం తెచ్చి ఈ కొత్త నిబంధన నవంబరరు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్​ వల్ల ఖాతాదారుడు మరణించినట్లయితే.. డబ్బు విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలు తగ్గనున్నాయి.

    Credit Card Rules Changes
    : లావాదేవీలకు ఒక శాతం ఫీజు..!
    ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు వినియోగించే వారు కొత్త మార్పును గమనించాలి. ఇక నుంచి ఎడ్యుకేషన్​ ఫీజు చెల్లింపులు, వాలెట్​ లోడింగ్​కు సంబంధించి కొత్త ఛార్జెస్​ అమలులోకి రానున్నాయి. క్రెడ్​, ఫోన్​పే, మొబిక్విక్​ వంటి థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా ఎడ్యుకేషన్​ ఫీజు చెల్లిస్తే ఒక శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీ వెబ్​సైట్లు, పీవోఎస్​ మెషీన్ల ద్వారా చెల్లించినట్లయితే ఈ ఫీజు వర్తించదు. వాలెట్​లో రూ.1000 మించి చేసే లావాదేవీలకు సైతం ఒక శాతం ఫీజు వర్తించనుంది.

    Credit Card Rules Changes : లైఫ్‌ సర్టిఫికెట్‌..
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్‌ పొందడానికి నవంబర్‌ 1 నుంచి 30లోపు లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. పింఛన్​ పొందే వ్యక్తులు తాము జీవించి ఉన్నట్లుగా ఈ పత్రాన్ని సమర్పించాలి. ఈ ప్రక్రియ ప్రతియేటా కొనసాగుతుంది. కాగా.. 80 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు అక్టోబర్‌ 1 నుంచే ప్రక్రియ ప్రారంభమైంది.

    సిలిండర్‌ రేటులో మార్పు
    ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లోనూ నవంబర్‌ 1న మార్పు రానుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్​ సంస్థలు వీటి ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే.. కొన్ని నెలలుగా గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మార్పూ చేయలేదు. కానీ.. కమర్షియల్​ సిలిండర్‌ రేటులో మాత్రం హెచ్చుతగ్గులు జరిగే అవకాశం ఉంది.

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. కూడా చదివేయండి.

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai