Penci Sport plugin only working with the Soledad theme.

తాజా వార్తలు - Telugu News Today

Category: తాజా వార్తలు

  • RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: RBI interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

    దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.

    RBI interest Rates | ఈ ఏడాది నాలుగోసారి..

    ఈ ఏడాది ఇప్పటివరకు ఇది నాలుగో రేటు కోత కావడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. ప్రస్తుతం మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో మొత్తం 1.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించినట్లయింది. ఈ నిరంతర కోతలతో హోం లోన్, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు ఈఎంఐ భారం నుంచి మరింత ఉపశమనం లభించనుంది.

    గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రూపాయి మారకం విలువలో కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం చాలా గతంలో లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఆర్థిక వృద్ధి ఊపందుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు” అని వివరించారు.

    RBI interest Rates | సమీక్షలో ప్రకటించిన మరిన్ని ముఖ్య అంశాలు..

    • 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి భారీగా పెంచుతూ ఆర్‌బీఐ ఆశాజనక సంకేతాలు ఇచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, వినియోగం పెరుగుదల కారణంగా రెండో త్రైమాసికంలోనే 8.2 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది.
    • ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2.0 శాతానికి తగ్గించారు. ఇది సామాన్య ప్రజలకు మరింత ధరల స్థిరత్వాన్ని సూచిస్తుంది.
    • ద్రవ్యత పెంచేందుకు రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
    • ఇక దేశీయ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది రాబోయే 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నట్లు గవర్నర్ చెప్పారు.

    RBI interest Rates | రుణగ్రహీతలకు ఊరట

    వరుసగా వడ్డీ రేటులో కోత విధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మరింత పెరిగి, పెట్టుబడులు, వినిమయం ఊపందుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా ఈ తగ్గింపును తమ లోన్ రేట్లకు త్వరగా అనుసంధానం చేయాలని ఆర్‌బీఐ ఒత్తిడి తెస్తోంది. సామాన్య రుణగ్రహీతలకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది.

    ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్​క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    Akhanda 2 release postponed | సోషల్​ మీడియాలో పోస్ట్​

    ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక భావోద్వేగ పోస్టు ద్వారా తెలియజేసింది. “అనివార్యమైన కారణాల వల్ల అఖండ 2ని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేకపోతున్నామని తీవ్ర బాధతో తెలియజేస్తున్నాం. ఈ క్షణం మాకు అత్యంత వేదననిచ్చింది. ప్రతి బాలయ్య అభిమాని, సినీ ప్రేమికుడు ఎదుర్కొనే నిరాశను మేం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం” అని పేర్కొంది. అలాగే వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించి సానుకూల వార్తతో మళ్లీ వస్తామని పేర్కొంది.

    ఈ ఆకస్మిక వాయిదాకు ఆర్థికపరమైన చిక్కులే కారణమని ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి ప్రీమియర్ షోలను రద్దు చేయడం, ఆ తర్వాత విడుదలను వాయిదా వేయడం చర్చకు దారి తీసింది.

    Akhanda 2 release postponed | కొత్త తేదీ​ ఎప్పుడో..

    కొత్త రిలీజ్ తేదీ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం లేదా వీకెండ్‌లోపు స్పష్టమైన ప్రకటన రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రూపొందిన ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మళ్లీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అఘోరగా మరో సారి శక్తివంతమైన పాత్రలో తెరపై అఖండ తాండవం చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, హర్షాలీ మల్హోత్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

    ఇది కూడా చదవండి..: Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్​మ్యాన్​.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!

    Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్​మ్యాన్​.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Rohit Sharma | భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సొంత మైదానంలో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న రోహిత్.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీ20 జెర్సీ ధరించనున్నాడు. అయితే ఇది అంతర్జాతీయ టీ20 కాదు.. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడే అవకాశం ఉందని సమాచారం.

    Rohit Sharma | అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు.. కానీ..

    2024 టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశవాళీ టోర్నమెంట్లలో ఆడడానికి ఆయనకు అభ్యంతరం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.

    Rohit Sharma | నాకౌట్ దశలోనే రంగంలోకి దిగే అవకాశం

    టోర్నమెంట్‌లో లీగ్ దశ ఇప్పటికే జోరుగా సాగుతోంది. అయితే రోహిత్ షెడ్యూల్ దృష్ట్యా లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. బదులుగా డిసెంబర్ 12, 14, 16 తేదీల్లో ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే నాకౌట్ (ప్రీ-క్వార్టర్, క్వార్టర్, సెమీ-ఫైనల్) మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

    Rohit Sharma | ముంబై జట్టు ఫామ్ అద్భుతం

    ఎలైట్ గ్రూప్-ఎలో ఆడుతున్న ముంబై జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లో ఐదింట్లో విజయం సాధించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. కేరళతో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఈ ఫామ్‌తో నాకౌట్ దశకు అడుగుపెట్టిన ముంబైకి రోహిత్ శర్మ జాయిన్ కావడం జట్టుకు భారీ బూస్ట్‌గా మారనుంది.

    ఇది కూడా చదవండి..: Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Greater Hyderabad expansion | మరింత విస్తరించిన మహా నగరం.. 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనం

    Greater Hyderabad expansion | మరింత విస్తరించిన మహా నగరం.. 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనం

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్:  Greater Hyderabad expansion | హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న 20 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో సమ్మిళితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది. దీంతో హైదరాబాద్ మహానగర సరిహద్దులు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాయి. నవంబర్ 25న మంత్రివర్గం ఈ విస్తరణకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా జీహెచ్ఎంసీ చట్టం మరియు తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణలకు గవర్నర్ సమ్మతి తెలపడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెంటనే నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 2 నుంచి ఈ 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో భాగమైనట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు.

    Greater Hyderabad expansion | విలీన ప్రక్రియకు ఆదేశాలు

    గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా విలీన ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానమైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సమీప జోనల్ కమిషనర్లకు ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.

    అంతేకాకుండా.. ఈ 27 సంస్థల ఖాతాలను తక్షణమే స్తంభింపజేసి, నిధులను జీహెచ్ఎంసీ ఖాతాకు బదలాయించాలని ఆదేశించారు. అదనంగా, 9 రకాల ప్రొఫార్మాలను సిద్ధం చేయించారు. ఉద్యోగుల వివరాలు, స్థిర మరియు చరాస్తులు, పెట్టుబడులు, పన్నులు, కొనసాగుతున్న పనులు, చెల్లింపులు, గత మూడు సంవత్సరాల్లో భవనాలు మరియు లేఔట్లకు ఇచ్చిన అనుమతులు వంటి సమాచారాన్ని ఈ ప్రొఫార్మాల్లో నమోదు చేసి, మరుసటి రోజు నాటికి సమర్పించాలని కమిషనర్​ ఆదేశాలు ఇచ్చారు.

    ఇది కూడా చదవండి..: India Q2 GDP | దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. అంచనాలను మించిన జీడీపీ గణాంకాలు

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Avatar 3 | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ విజువల్ స్పెక్టాకిల్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ (Avatar: Fire and Ash) మూడో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులను ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ విజువల్​ వండర్​ మూవీ డిసెంబర్​ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్స్​బుకింగ్స్​కు సంబంధించి కీలక అప్​డేట్​ వెలువడింది.

    Avatar 3 | టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ తేదీ నిర్ణయం

    భారతదేశంలో ‘అవతార్ 3’ (Avatar 3) సినిమా టికెట్ల ముందస్తు బుకింగ్ డిసెంబర్ 5, 2025 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ బుకింగ్స్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజ్​ అవనుంది. గత రెండు భాగాల మాదిరే ఈ చిత్రానికి కూడా అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Avatar 3

    Avatar 3 | IMAX వెర్షన్​ కసం..

    ఈ చిత్రాన్ని అత్యంత భారీ తెరపై అనుభవించాలనుకునే అభిమానుల కోసం IMAX వెర్షన్ భారతదేశంలో విడుదల చేయనున్నారు. అయితే, IMAX ఫార్మాట్ కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లోకే పరిమితం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో IMAX వెర్షన్ లేదు.

    Avatar 3

    Avatar 3 | జేమ్స్ కామెరూన్ సంచలన ప్రకటన

    ఇటీవల ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైతే ‘అవతార్’ సిరీస్‌ను శాశ్వతంగా ముగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కథాంశం, సాంకేతిక ప్రమాణాలపై ఆయనకున్న గట్టి నమ్మకాన్ని ఈ ప్రకటన తెలియజేస్తోంది. ఈ వ్యాఖ్యలు చిత్రంపై ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి.

    ఇది కూడా చదవండి..: Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్​..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్​..

    Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్​..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Samantha Marriage | సమంత రూత్ ప్రభు మరోసారి దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. ప్రముఖ నటి సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-2 దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 1వ తేదీ సోమవారం తెల్లవారుజామున తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది.

    Samantha Marriage | ఎరుపు రంగు చీరలో సమంత

    వధువు సమంత సాంప్రదాయ ఎరుపు రంగు చీరలో కనిపించగా.. వరుడు రాజ్ నిడిమోరు క్రీమ్-బంగారు రంగుల కుర్తా పైజమాలో సొగసుగా ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యులు, అతి సన్నిహితుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు ఈశా ఫౌండేషన్ అధికారికంగా శుభాకాంక్షలు తెలియజేసింది.

    Samantha Marriage | ‘భూత శుద్ధి వివాహం’గా..

    ఈ వివాహాన్ని ‘భూత శుద్ధి వివాహం’గా నిర్వహించినట్లు ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో వెల్లడించింది. యోగ శాస్త్రంలో అత్యంత పవిత్రమైన ఈ విధానం.. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేస్తూ ఆధ్యాత్మిక స్థాయిలో లోతైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందని పేర్కొంది. భౌతిక, మానసిక, భావోద్వేగ స్థాయులకు అతీతంగా ఇద్దరి మధ్య శాశ్వతమైన సామరస్యాన్ని, ఆధ్యాత్మిక ఐక్యతను కలిగించేందుకు ఈ ప్రత్యేక వివాహ క్రతువు రూపొందించబడిందని ఫౌండేషన్ వివరించింది.

    Samantha Marriage | గతే రెండేళ్లు వీరి మధ్య స్నేహం

    గత రెండేళ్లుగా సమంత, రాజ్ నిడిమోరు మధ్య సన్నిహిత స్నేహం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘సిటాడెల్: హనీ బన్నీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వంటి ప్రాజెక్టుల సెట్స్‌లోనే వీరి అనుబంధం మొదలైందని ఇండస్ట్రీలో టాక్​. అలాగే సమంత నిర్మాణ సంస్థ ‘శుభం’ పరిధిలో వచ్చిన చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆ చిత్రం విజయోత్సవ వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

    వివాహం తర్వాత సమంత స్వయంగా సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు ఈ శుభవార్తను తెలియజేశారు. ఆ పోస్టులకు క్షణాల్లోనే లక్షలాది మంది నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెట్టారు.

    ఇది కూడా చదవండి..: Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • India Q2 GDP | దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. అంచనాలను మించిన జీడీపీ గణాంకాలు

    India Q2 GDP | దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. అంచనాలను మించిన జీడీపీ గణాంకాలు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: India Q2 GDP | భారతదేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్) (India Q2 GDP) జీడీపీ గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. అనేక మంది ఆర్థిక నిపుణుల అంచనాలను మించి, ఈ త్రైమాసికంలో భారత్ రియల్ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు కావడం దేశ ఆర్థిక బలోపేతాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

    ఈ ఘనత సాధించడానికి ప్రధాన కారకాలుగా దేశీయ వినియోగదారుల ఖర్చు (డిమాండ్) బలోపేతం కావడం, తయారీ రంగంలో పురోగతి సాధించడం పనిచేశాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధిని నమోదు చేసుకోవడం భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని, దాని స్వతంత్ర డ్రైవ్‌ను చాటి చెబుతోంది.

    India Q2 GDP

    India Q2 GDP | గణాంకాలపై ఓ లుక్కేయండి..

    • రెండో త్రైమాసికం రియల్ జీడీపీ వృద్ధి: 8.2 శాతం
    • నామినల్ జీడీపీ వృద్ధి: 8.7 శాతం
    • మొదటి అర్ధ సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్) సగటు రియల్ జీడీపీ వృద్ధి: 8.0 శాతం
      (గత ఏడాది ఇదే కాలంలో 6.1 శాతం మాత్రమే)

    India Q2 GDP | రంగాల వారీగా పనితీరు..

    • తయారీ రంగం: 9.1 శాతం
    • నిర్మాణ రంగం: 7.2 శాతం
    • ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ & ప్రొఫెషనల్ సర్వీసెస్: 10.2 శాతం
    • వ్యవసాయం & సంబంధిత రంగాలు: 3.5 శాతం
    • విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మొదలైన యుటిలిటీ సేవలు: 4.4 శాతం

    India Q2 GDP

    India Q2 GDP | ఆ రంగంలో రెండంకెల వృద్ధి

    తయారీ రంగంతో పాటు సేవల రంగంలోని ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు రెండంకెల వృద్ధిని సాధించి మొత్తం ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాయి. మొత్తం గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA) వృద్ధి 8.1 శాతంగా నమోదు కాగా.. వ్యవసాయ రంగంలో కొంత మందగమనం కనిపించింది.

    ఈ అద్భుత ప్రదర్శన ద్వారా భారత్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. దేశీయ డిమాండ్, పెట్టుబడులు, ఉత్పాదక రంగాల సమ్మిళిత ప్రయత్నంతో ఈ విజయం సాధ్యమైందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇది కూడా చదవండి..:  2026 Holidays List | 2026 సెలవుల జాబితా విడుదల.. మొత్తం ఎన్ని రోజులు హాలీడేస్​ అంటే..!

  • Side Effects of Mobile Phones | స్మార్ట్‌ఫోన్లలో బందీ అవుతున్న బాల్యం.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

    Side Effects of Mobile Phones | స్మార్ట్‌ఫోన్లలో బందీ అవుతున్న బాల్యం.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Side Effects of Mobile Phones | గతంలో పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు జానపద కథలు, జోలపాటలు, ఊయలలూగిస్తూ ఆడించేవారు. కానీ ఈ రోజుల్లో ఆ ఓపిక తల్లిదండ్రులకు లేకపోవడం, లేదా ఇంటర్నెట్ యుగంలో పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచే సులభమైన మార్గంగా స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చేస్తున్నారు. ఫలితంగా చిన్న పిల్లల చేతిలో ఎప్పుడూ మొబైల్ ఫోన్ ఉంటూ, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మునిగిపోతున్న దృశ్యం ప్రతి ఇంటా కనిపిస్తోంది. ఇది పిల్లల శారీరక, మానసిక, మేధో అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తోందని పలు అధ్యయనాలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలు ఈ డిజిటల్ వ్యసనానికి ఎక్కువగా బలవుతున్నారు.

    Side Effects of Mobile Phones | కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

    అధిక స్క్రీన్ టైం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. కళ్లు పొడిబారడం, ఎర్రబారడం, నీళ్లు కారడం, తలనొప్పి, కంటి మంట – ఇవన్నీ సాధారణ లక్షణాలుగా మారాయి. అతి చిన్న వయసులోనే మయోపియా (దూరదృష్టి లోపం) పెరుగుతోంది. నిపుణుల అంచనా ప్రకారం.. పదేళ్ల లోపు పిల్లల్లో సగం మందికి పైగా దృష్టి సంబంధిత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎనిమిదేళ్ల వరకు కంటి అభివృద్ధి కొనసాగుతుంది. ఈ కీలక దశలో మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ రెటీనాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది శాశ్వత దృష్టి లోపాలకు దారితీస్తుంది.

    Side Effects of Mobile Phones | మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్​

    స్క్రీన్ అడిక్షన్ కేవలం కళ్లకే పరిమితం కాదు. అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనాలు పేర్కొన్నట్లు, పిల్లల్లో మొబైల్ వాడకం అధికమైతే ఆందోళన, నిరాశ, ప్రవర్తనా రుగ్మతలు పెరుగుతాయి. సృజనాత్మకత, స్వతంత్ర ఆలోచనా శక్తి క్రమంగా తగ్గిపోతాయి. ఎప్పుడూ షార్ట్ వీడియోలు చూస్తూ ఉండడం వల్ల శ్రద్ధావ్యవధి (attention span) తగ్గుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది. ఇది విద్యార్థుల పరిణామాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

    Side Effects of Mobile Phones | తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    నిపుణులు స్పష్టంగా చెబుతున్న ఒక్కటే మాట – ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా దూరంగా ఉంచాలి. ఆ తర్వాత కూడా నియంత్రితంగా, పర్యవేక్షణలో మాత్రమే అనుమతించాలి.

    కొన్ని ముఖ్యమైన సూచనలు..

    • రంగురంగుల పుస్తకాలు, ఆట వస్తువులు, పజిల్స్, బొమ్మలతో ఆడుకునేలా ప్రోత్సహించండి.
    • పిల్లలకు ఏ విషయంపై ఆసక్తి ఉందో గమనించి, ఆ దిశగా మళ్లించండి
    • డ్రాయింగ్, సంగీతం, నృత్యం, క్రీడలు లేదా ఏదైనా సృజనాత్మక కార్యకలాపాలు.
    • తల్లిదండ్రులు ముందు ఆదర్శంగా ఉండాలి. మీరే భోజనం చేస్తూ, మాట్లాడుతూ ఫోన్ పట్టుకుంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు.
    • ప్రతిరోజూ కనీసం ఒక గంట సేపయినా బయట ఆటలు ఆడేలా, పరుగులు పెట్టేలా, శారీరక శ్రమ ఉండేలా చూడండి.
    • ఇంట్లో ‘స్క్రీన్ ఫ్రీ జోన్స్’ (భోజనాల సమయం, పడుకునే గది) ఏర్పాటు చేయండి.

    చివరగా.. ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా నిషేధించడం కష్టమే అయినప్పటికీ, బాల్యాన్ని రక్షించడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల చేతిలో ఫోన్ ఉంచి నిశ్శబ్దం కొనుగోలు చేయడం కంటే, కొంచెం సమయం కేటాయించి వారితో గడిపిన ప్రతి నిమిషం భవిష్యత్తులో ఎంతో విలువైనదిగా మిగిలిపోతుంది.

    గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న సమాచారం వైద్య నిపుణులు, అధ్యయనాల ఆధారంగా అందించబడింది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా పిల్లల వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోగలరు.

    ఇది కూడా చదవండి..: Winter Skin Care Tips | చలికాలంలో చర్మం పొడిబారుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే నిగనిలాడుతుంది..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

    Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Gajakesari Yoga | జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన రాజయోగాలలో గజకేసరి యోగం ఒకటి. ఈ అద్భుత యోగం డిసెంబర్ 8న మళ్లీ ఏర్పడబోతోంది. ఈ రోజున చంద్రుడు తన స్వరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో గురుడు ఉండడంతో చంద్ర-గురు సంయోగం జరిగి గజకేసరి రాజయోగం పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ అరుదైన యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ధనవృష్టి, ఆరోగ్యవృద్ధి, సర్వతోముఖ శ్రేయస్సు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడు రాశులకు ఈ యోగం అత్యంత శుభఫలదాయకంగా పరిణమించనుంది.

    గజకేసరి యోగం ఏర్పడినప్పుడు జీవితంలో స్థిరత్వం, గౌరవం, ఆదాయ వృద్ధి, మానసిక ప్రశాంతత వంటి అనేక శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ఈ యోగం వల్ల అత్యధిక లాభం పొందబోయే మూడు రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం..

    Gajakesari Yoga | మిథున రాశి

    మిథున రాశి వారికి డిసెంబర్ 8 తర్వాత ఆర్థిక ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టిన అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తవుతుంది. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. ఇంటి వాతావరణం సంతోషంగా, సౌమ్యంగా ఉంటుంది.

    Gajakesari Yoga | కర్కాటక రాశి

    ఈ గజకేసరి యోగం కర్కాటక రాశి వారికి స్వయంగా జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆర్థికంగా బలమైన స్థితి ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ధనలాభం, ఆస్తి విషయాల్లో శుభవార్తలు వినిపిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం, ఆనందం నిండుతాయి. విద్యార్థులకు పరీక్షల్లో రాణించే అవకాశం, పోటీ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించే యోగం కలిసివస్తుంది. ఏ పని చేపట్టినా అడ్డంకులు తొలగి సునాయాసంగా పూర్తవుతాయి.

    Gajakesari Yoga | కన్యా రాశి

    కన్యా రాశి వారికి ఈ యోగం ఆరోగ్యం, ధనం, సంతానం, వైవాహిక జీవితం రంగాల్లో అద్భుత ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఇంట శుభకార్యాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చి వివాహం కుదిరే అవకాశం బలంగా కనిపిస్తోంది. వ్యాపారులకు ఊహించని లాభాలు, కొత్త ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా పూర్తవుతాయి. మొత్తంమ్మీద ఈ రాశి వారి జీవితంలో సువర్ణ అధ్యాయం మొదలుకానుంది.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    ఇది కూడా చదవండి..: Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!

    Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Shukra Maudhyam 2025 | జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడతాడు. సుఖం, సంతోషం, వైవాహిక జీవితం, సంపద, సౌందర్యం, కళలు, విలాసాలు.. ఇవన్నీ శుక్రుని ఆధీనంలో ఉంటాయి. అయితే ఈ శుక్ర గ్రహం కొన్ని రోజుల పాటు సూర్యునికి అత్యంత సమీపంలోకి వచ్చి, భూమి నుంచి చూసినప్పుడు దాదాపు కనిపించని స్థితికి చేరుకుంటాడు. ఈ కాలాన్నే ‘శుక్ర మౌఢ్యం’ (Shukra Maudhyam) అంటారు. ఈ సమయంలో శుక్రుడు తన సహజ బలాన్ని, ప్రకాశాన్ని కోల్పోయినట్టు భావించి, అతని ప్రభావం బాగా తగ్గిపోతుందని పండితుల అభిప్రాయం.

    2025 సంవత్సరంలో ఈ శుక్ర మౌఢ్యం (Shukra Maudhyam) నవంబరు 26 నుంచి ప్రారంభమై.. 2026 ఫిబ్రవరి 7 లేదా 17వ తేదీ వరకు (వివిధ పంచాంగాల ప్రకారం స్వల్ప తేడా ఉండవచ్చు) సుమారు 83 రోజుల పాటు కొనసాగనుంది. ఈ దీర్ఘ వ్యవధి మూలంగా దాదాపు రెండున్నర నెలల పాటు శుభకార్యాలకు ‘లాంగ్ బ్రేక్’ ఏర్పడనుంది.

    Shukra Maudhyam 2025

    Shukra Maudhyam 2025 | ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు ఉండవంటే..

    జ్యోతిష్య శాస్త్రంలో గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి చాలా దగ్గరలో ఉన్నప్పుడు వాటి శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుందని భావిస్తారు. ముఖ్యంగా శుక్రుడు సంపూర్ణంగా బలహీనుడైన ఈ మౌఢ్య సమయంలో వివాహం, గృహప్రవేశం, సీమంతం, అక్షరాభ్యాసం, కొత్త వ్యాపార ప్రారంభం, భూమి పూజ, బావి తవ్వడం, వాహన కొనుగోలు వంటి మంగళ కార్యాలు చేయడం శ్రేయస్కరం కాదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఈ కార్యాలు శుక్రుడి అనుగ్రహంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. శుక్రుడు బలహీనుడైతే ఆ కార్యాలు దీర్ఘకాలంలో కష్టాలు, అవాంఛిత ఫలితాలు ఇవ్వవచ్చని ప్రజలు ఆందోళన చెందుతారు.

    Shukra Maudhyam 2025 | ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు?

    ఈ కాలం పూర్తిగా నిషేధం అని కాదు. నిత్య పూజలు, దైనందిన ధార్మిక కర్మలు, శివాభిషేకం, లక్ష్మీ పూజ, గణపతి హోమం, కొన్ని ప్రత్యేక వ్రతాలు (ఉదా: వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి వంటివి) సాధారణంగా చేసుకోవచ్చు. గ్రహశాంతి, నవగ్రహ హోమాది జప-తప-హోమాలు కూడా అనుమతించబడతాయి. కానీ కొత్తగా మంగళ కార్యాలు ప్రారంభించడం, ముహూర్తాలు పెట్టడం మాత్రం పూర్తిగా వాయిదా వేయడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

    Shukra Maudhyam 2025 | మౌఢ్యం అంటే ఏమిటి?

    ఖగోళ శాస్త్ర దృక్కోణంలో చూస్తే శుక్రుడు సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమి-సూర్యుడి మధ్యలోకి వచ్చినప్పుడు భూమి నుంచి చూస్తే సూర్యకాంతిలో దాక్కొని కనిపించడు. దీన్నే ‘అధిక మౌఢ్యం’ (Superior Conjunction) అంటారు. ఈ సమయంలో శుక్రుడు వెనుకకు (రెట్రోగ్రేడ్) కదులుతున్నట్టు కనిపిస్తాడు కాబట్టి జ్యోతిష్యంలో దీనిని ‘మౌఢ్యం’గా పరిగణిస్తారు.

    జ్యోతిష్యంలో ఇది శుక్రుడి బలహీన కాలంగా గుర్తించబడుతుంది. అందుకే శుభకార్యాలను ఈ 83 రోజుల పాటు వాయిదా వేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai