తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: EPFO Passbook | గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పాస్‌బుక్‌లో (EPFO Passbook) 2025 సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన పాస్‌బుక్‌లు అప్‌డేట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది “నా ఖాతాలో మాత్రమే ఇలా జరిగిందా?” అని ఆందోళన చెందుతూ ఈపీఎఫ్‌వోను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ విషయంపై అధికారిక స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. ఈ సమస్య వల్ల ఎవరి డబ్బు కోల్పోలేదని, ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల వచ్చిన తాత్కాలిక ఇబ్బందేనని పేర్కొంది. ప్రస్తుతం కొత్తగా పునర్నిర్మించిన ఈసీఆర్ (ECR) లెడ్జర్‌లో డేటా పోస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల జమల వివరాలు పాస్‌బుక్‌లో ప్రతిబింబించడం ఆలస్యమవుతోంది. త్వరలోనే ఈ డేటా పూర్తిగా అప్‌డేట్ అయి సభ్యుల ఖాతాల్లో కనిపిస్తుందని ఈపీఎఫ్‌వో హామీ ఇచ్చింది. అందువల్ల సభ్యులు అనవసర ఆందోళన చెందాల్సిన పని లేదని, కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.
EPFO Passbook | పాస్‌బుక్ లైట్
ఇదే సమయంలో సభ్యుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్‌వో ఇటీవల ‘పాస్‌బుక్ లైట్’ అనే కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇకపై ప్రతిసారీ ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లోనే ‘పాస్‌బుక్ లైట్’ ఆప్షన్ ద్వారా ప్రస్తుత బ్యాలెన్స్, జమ, విత్‌డ్రా వివరాలు సులభంగా చూసుకోవచ్చు.
ప్రస్తుతం పాస్‌బుక్‌లో రెండు నెలల జమ కనిపించకపోయినా, ఇది కేవలం సాంకేతిక అప్‌డేషన్ ప్రక్రియలో భాగమే తప్ప ఎటువంటి నష్టం జరగలేదు. త్వరలోనే అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: F1 Visa | అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని ఆశపడే లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అమెరికా నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్-1 విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించడంలో అతిపెద్ద అడ్డంకిగా ఉన్న ‘తిరిగి స్వదేశానికి వెళ్లే ఉద్దేశం’ (Intent to Depart) నియమాన్ని పూర్తిగా తొలగించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు ప్రవేశపెట్టారు.
F1 Visa | ‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో..
‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో ఈ చట్ట ప్రతిపాదనను రూపొందించిన శాసనసభ్యులు, చదువు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవాల్సి అవసరం లేదనే విధానాన్ని మార్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎఫ్-1 వీసా ఇంటర్వ్యూలో కాన్సులర్ అధికారులు “చదువు అయిపోతే వెంటనే దేశం విడిచి వెళ్తారా?” అని ప్రశ్నిస్తున్నారు.. దానికి బలమైన ఆధారాలు లేకపోతే వీసాను నిరాకరిస్తున్నారు. సొంత దేశంలో ఆస్తులు, ఉద్యోగ ఆఫర్లు, కుటుంబ బంధాలు వంటి పత్రాలతో ఈ ఉద్దేశ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్లే గత కొంతకాలంగా, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల ఎఫ్-1 వీసాల తిరస్కార రేటు గణనీయంగా పెరిగింది.
F1 Visa | కొత్త చట్టం అమలయితే..
కొత్త చట్టం అమలయితే ఇకపై ‘చదువు అయిపోయాక తిరిగి స్వదేశానికి వెళ్తారా..’ ప్రశ్నే రాదు. విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగ అవకాశాలను వెతకడం, ఆప్ట్ (OPT) లేదా ఇతర వీసా రూట్ల ద్వారా దీర్ఘకాలికంగా ఉండే మార్గం సులువుగా మారనుంది. దీని ఫలితంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని ట్రంప్ పరిపాలన విభాగం భావిస్తోంది.
F1 Visa | ప్రస్తుతం బిల్లు దశలోనే…
ప్రస్తుతం ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. కాంగ్రెస్ రెండు సభల్లోనూ ఆమోదం లభించి, అధ్యక్షుడు సంతకం చేస్తేనే ఇది అధికారికంగా అమలులోకి వస్తుంది. అదే సమయంలో, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కూడా ఎఫ్-1 వీసాలకు సంబంధించి ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నుంచి ‘నిర్ణీత కాలపరిమితి’ వ్యవస్థకు మారే ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
ఈ రెండు మార్పులూ అమలులోకి వచ్చినట్లయితే అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు చాలా పెద్ద ఊరటగా మారనుంది. రానున్న నెలల్లో ఈ బిల్లు ఏ స్థాయిలో పురోగమిస్తుందని లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Telangana Panchayat Elections | తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ విషయాన్ని ప్రకటించారు.
రాష్ట్రంలోని మొత్తం 12,728 సర్పంచ్ పదవులకు, 1,12,242 వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు మూడు దశలుగా నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలింగ్ తేదీలు డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17గా నిర్ణయించారు. ప్రతి దశలోనూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కమిషనర్ వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదలతోపాటు మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చింది.
గతంలో సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో అక్టోబర్ 9న హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైందని రాణి కుముదిని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టు ఆమె తెలిపారు.
Telangana Panchayat Elections | దశలవారీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
తొలి దశ: 4,236 సర్పంచ్ పదవులు, 37,440 వార్డు మెంబర్ పదవులు
నామినేషన్లు: నవంబర్ 27 నుంచి
పోలింగ్: డిసెంబర్ 11
రెండో దశ: 4,333 సర్పంచ్ పదవులు, 38,350 వార్డు మెంబర్ పదవులు
నామినేషన్లు: నవంబర్ 30 నుంచి
పోలింగ్: డిసెంబర్ 14
మూడో దశ: 4,159 సర్పంచ్ పదవులు, 36,452 వార్డు మెంబర్ పదవులు
నామినేషన్లు: డిసెంబర్ 3 నుంచి
పోలింగ్: డిసెంబర్ 17
ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కొత్త నాయకత్వం ఎన్నిక కానుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Bank Holidays December 2025, డిసెంబర్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తాయి. పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఈ నెలలో బ్యాంకులు చాలా రోజుల పాటు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
దేశవ్యాప్తంగా చూస్తే డిసెంబర్‌లో మొత్తం 19 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, గోవా, సిక్కిం వంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. Bank Holidays December 2025 ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే.
Bank Holidays December 2025 |బ్యాంక్ సెలవులు ఎలా నిర్ణయిస్తారు?
RBI మూడు విధాలుగా సెలవులను వర్గీకరిస్తుంది ఇందులో 1) నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింది సాధారణ సెలవులు, 2) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సెలవులు, 3) బ్యాంకుల ఖాతాల మూసివేత సెలవులు.
మొదటి విభాగంలోని సెలవులు దేశవ్యాప్తంగా లేదా సంబంధిత ప్రాంతాల్లో అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి. డిసెంబర్ 2025 – ప్రాంతీయ బ్యాంక్ సెలవుల జాబితా – డిసెంబర్ 1 (సోమవారం) – రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం / ఇండిజినస్ ఫెయిత్ డే (ఇటానగర్, కోహిమా) – డిసెంబర్ 3 (బుధవారం) – ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (పనాజీ (గోవా) – డిసెంబర్ 12 (శుక్రవారం) – పా టోగన్ నెంగ్‌మింజా సాంగ్మా వర్ధంతి (షిల్లాంగ్) – డిసెంబర్ 18 (గురువారం) – యూ సోసో థామ్ వర్ధంతి (షిల్లాంగ్) – డిసెంబర్ 19 (శుక్రవారం) – గోవా విమోచన దినోత్సవం (పనాజీ) – డిసెంబర్ 20 (శనివారం) – లోసూంగ్ / నామ్‌సూంగ్ ఉత్సవాలు (ఐజ్వాల్) – డిసెంబర్ 22 (సోమవారం) – లోసూంగ్ / నామ్‌సూంగ్ ఉత్సవాలు (ఐజ్వాల్) – డిసెంబర్ 24 (బుధవారం) – క్రిస్మస్ ఈవ్ → కోహిమా, ఐజ్వాల్, షిల్లాంగ్, గాంగ్‌టక్ – డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్ → దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు – డిసెంబర్ 26 (శుక్రవారం) – క్రిస్మస్ ఉత్సవాలు / వర్ధంతి (ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్) – డిసెంబర్ 27 (శనివారం) – క్రిస్మస్ ఉత్సవాలు (కొన్ని ఈశాన్య రాష్ట్రాలు) – డిసెంబర్ 30 (మంగళవారం) – యూ కియాంగ్ నాంగ్‌బా (షిల్లాంగ్) – డిసెంబర్ 31 (బుధవారం) – న్యూ ఇయర్ ఈవ్ (ఐజ్వాల్)
ఆదివారాలు & శనివారాలు – డిసెంబర్ 7, 14, 21, 28 → ఆదివారాలు (దేశవ్యాప్తంగా సెలవు) – డిసెంబర్ 13, 27 → రెండో, నాలుగో శనివారాలు (అన్ని బ్యాంకులకు సెలవు)
Bank Holidays December 2025 :ముఖ్య గమనిక
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM, డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలు సాధారణంగా కొనసాగుతాయి. అయితే చెక్ క్లియరెన్స్, RTGS, NEFT (కొన్ని సందర్భాల్లో), బ్రాంచ్‌లో నేరుగా చేసే పనులు ఆగిపోతాయి. అందుకే ఈ నెలలో బ్యాంక్ పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Moto G57 Power 5G | బడ్జెట్ పరిధిలోనే గొప్ప బ్యాటరీ బ్యాకప్, మంచి పనితనం కావాలని చూస్తున్నారా? అయితే మోటరోలా తాజాగా భారత మార్కెట్‌లో “మోటో G57 పవర్ 5G” (Moto G57 Power 5G) ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. బడ్జెట్ ధరలో లభ్యం అవుతుండడంతో ఈ ఫోన్ త్వరలోనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
Moto G57 Power 5G | డిస్‌ప్లే
6.72 అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్ (1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్) ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్మూత్ అనుభవం లభిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, స్మార్ట్ వాటర్ టచ్ 2.0 సాంకేతికత కూడా ఉన్నాయి.
Moto G57 Power 5G | ప్రాసెసర్ & మెమరీ
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 (4nm ఆక్టా-కోర్) చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిపి మల్టీటాస్కింగ్, రోజువారీ ఉపయోగం సులువుగా ఉంటుంది.
Moto G57 Power 5G | బిగ్ బ్యాటరీ
7,000mAh భారీ బ్యాటరీతో రెండు రోజుల వరకు సులువుగా బ్యాకప్ ఇస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడంతో త్వరగా ఛార్జ్ అవుతుంది.
Moto G57 Power 5G | కెమెరా
వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్
50MP ప్రధాన సెన్సార్ (సోనీ LYT-600, f/1.8)
8MP అల్ట్రావైడ్ లెన్స్ (f/2.2, 119.5° FOV)
టూ-ఇన్-వన్ లైట్ సెన్సార్
ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
Moto G57 Power 5G | సాఫ్ట్‌వేర్
ఆండ్రాయిడ్ 16 ఆధారిత My UX తో వస్తోంది. మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్, ఆటో స్మైల్ క్యాప్చర్, పోర్ట్రెయిట్ బ్లర్, స్కై రీప్లేస్‌మెంట్, రీఇమాజిన్ ఆటో ఫ్రేమ్ వంటి అనేక AI కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది.
కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు
5G, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైప్-C, అన్ని ప్రధాన సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి ఉన్నాయి.
డిజైన్ & బరువు
166.23 × 76.50 × 8.60 mm కొలతలు, 210.6 గ్రాముల బరువు. మూడు అందమైన పాంటోన్ వేరియంట్స్ – రెగట్టా, ఫ్లూయిడిటీ, కోర్సెయిర్.
ధర & ఆఫర్లు
భారత్‌లో 8GB + 128GB వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. లాంచ్ స్పెషల్ ఆఫర్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.
సేల్ ఎప్పటి నుంచంటే..
డిసెంబర్ 3 మధ్యాహ్నం నుంచి అధికారిక సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. మూడు కలర్ వేరియంట్స్‌లో వస్తోంది.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: soft chapatis all day | చపాతీలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కానీ చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే.. అవి చేసినప్పుడు మెత్తగా వచ్చినా కొద్దిసేపటికే గట్టిపడిపోతాయి. మళ్లీ వేడి చేసినా పాత మెత్తదనం రాదు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఉదయం తయారు చేసిన చపాతీలు రాత్రి వరకూ కూడా రెండు వేళ్లతో సులువుగా మడతపెట్టేంత మెత్తగా ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక పదార్థాలు లేకుండా, ఇంట్లో ఉన్నవాటితోనే ఇలా చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..
soft chapatis all day | పిండి కలిపే సమయంలో ఇలా చేయండి..
సాధారణంగా గోధుమ పిండిని నీళ్లతోనే కలుపుతాం. కానీ మెత్తదనం కోసం ఒక చిన్న మార్పు చేయండి.
నీటిలో కొంత భాగం (సుమారు 25–౩౦ శాతం) పాలతో భర్తీ చేయండి. పాలలోని కొవ్వు, ప్రోటీన్ పిండిని తేమగా ఉంచుతాయి.
పాలు వాడకపోయినట్లయితే రెండు టీస్పూన్ల నూనె లేదా నెయ్యి కలిపి కలపండి. ఇలా చేయడంతో పిండి మరింత మృదువుగా మారుతుంది. మరియు చపాతీలు గట్టిపడకుండా ఉంటాయి.
పిండి మెత్తగా, మెరిసేలా కలిసే వరకూ బాగా పిసకండి
కలిపిన పిండిని కాసేపు పక్కన పెట్టండ
పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకండి. కనీసం 20–౩౦ నిమిషాల పాటు పక్కన పెట్టండి. తడిగా ఉన్న పత్తి గుడ్డతో లేదా మూత పెట్టిన గిన్నెలో ఉంచండి. ఈ విశ్రాంతి సమయంలో గ్లూటెన్ సడలి, తేమ సమానంగా పంపిణీ అవుతుంది. ఫలితంగా చపాతీలు బాగా పొంగుతాయి. ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి.
soft chapatis all day | సరైన మంటపై కాల్చండి..
చపాతీలు త్వరగా గట్టిపడిపోకుండా ఉండాలంటే పెనం (తవా) బాగా వేడిగా ఉండాలి
మీడియం–హై మంట మీద పెనం వేడి చేయండి (నీటి చుక్క వేస్తే తక్షణం ఆవిరైపోవాలి).
చపాతీని రెండు వైపులా కొద్దిసేపు కాల్చి, ఆ తర్వాత నేరుగా అగ్నిమీదికి తీసుకెళ్లి లేదా గుడ్డతో నొక్కుతూ పూరి లాగా పొంగేలా చేయండి.
తక్కువ మంట మీద నెమ్మదిగా కాల్చితే తేమ అంతా పోయి చపాతీలు త్వరగా గట్టిపడతాయి.
కాల్చేటప్పుడు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తే రుచి, మెత్తదనం రెట్టింపవుతాయి.
soft chapatis all day | నిల్వ చేసే విధానం..
ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. చాలా మంది ఈ దశలోనే తప్పు చేస్తారు
వేడి వేడి చపాతీలను నేరుగా స్టీల్ డబ్బా లేదా క్యాస్రోల్‌లో పెట్టొద్దు
ఆవిరి వల్ల మొదట తడిగా, తర్వాత రబ్బరు లాగా అవుతాయి.
శుభ్రమైన, పొడి కాటన్ క్లాత్‌ను డబ్బాలో వేయండి ప్రతి చపాతీని ఆ గుడ్డలో మడతపెట్టి పెట్టండి. మూత మూసిన తర్వాత గాలి ప్రవేశించదు. అదనపు తేమను గుడ్డ పీల్చేస్తుంది.
ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే మీ చపాతీలు ఎప్పుడూ దూదిలా మెత్తగా ఉంటాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించండి.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Loan rejection | మీ క్రెడిట్ స్కోర్ బాగుందా.. అయినా మీరు లోన్‌కు అప్లయ్ చేసినా రావడం లేదా.. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా రుణం ఎందుకు రావడం లేదని ఆలోచిస్తున్నారా.. బ్యాంకులు లోన్ మంజూరు చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. లోన్ ఇచ్చే టైంలో బ్యాంకర్లు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.. రుణం విషయంలో అవి ఎలా ప్రభావం చూపుతాయనే విషయం తెలుసుకుందాం..
చాలా మంది క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలు.. లోన్ తప్పకుండా వచ్చేస్తుందని భావిస్తారు. కానీ వాస్తవంగా అలా జరగదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్ మంజూరు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవు. అది కేవలం ఒక భాగం మాత్రమే. దరఖాస్తుదారుడి మొత్తం ఆర్థిక చిత్రాన్ని సమగ్రంగా పరిశీలిస్తారు. అందుకే 750–800 పైన స్కోర్ ఉన్నవారికి కూడా కొన్నిసార్లు లోన్ తిరస్కరణకు గురవుతుంటుంది. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలివే..
Loan rejection | స్థిరమైన ఆదాయం మరియు ఉద్యోగ స్థిరత్వం
మీ జీతం ఎంత స్థిరంగా వస్తోంది? గత రెండు-మూడేళ్లలో ఉద్యోగాలు తరచూ మార్చారా? కంపెనీ మారినప్పుడు జీతంలో పెద్ద తేడా వచ్చిందా? ఇలాంటి అస్థిరత ఉంటే బ్యాంకులు “ఈ వ్యక్తి నెలవారీ EMI చెల్లించగలడా?” అని సందేహపడతాయి.
Loan rejection | డెట్-టు-ఇన్‌కమ్ రేషియో (DTI)
మీ నెలవారీ ఆదాయంలో ఎంత శాతం ఇప్పటికే ఉన్న అప్పుల EMIలకు వెళ్తోంది? సాధారణంగా 40–50% పైన వెళ్తే బ్యాంకులు కొత్త లోన్ ఇవ్వడానికి జంకుతుంటాయి. ఎందుకంటే మిగిలిన డబ్బుతో జీవన ఖర్చులు తీర్చుకోవడం కష్టమవుతుందని వారి అంచనా వేస్తాయి.
Loan rejection | ఇప్పటికే ఉన్న రుణ భారం
బహుళ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, కారు లోన్, ఇల్లు లోన్ – ఇవన్నీ కలిపి చాలా ఎక్కువగా ఉంటే, మంచి స్కోర్ ఉన్నా కొత్త లోన్ ఆమోదం రాకపోవచ్చు. బ్యాంకులు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటాయి.
Loan rejection | ఇటీవలి క్రెడిట్ ఎంక్వైయిరీలు
చివరి 6–12 నెలల్లో ఎన్ని క్రెడిట్ కార్డులు, లోన్ల కోసం దరఖాస్తు చేశారు? ఎక్కువ దరఖాస్తులు ఉంటే “ఈ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాడేమో” అని బ్యాంకులు అనుమానిస్తాయి. అందుకే రుణం ఇచ్చే విషయంలో ఆలోచిస్తాయి.
Loan rejection | చెల్లింపు చరిత్రలో చిన్న లోపాలు
ఒక్కోసారి క్రెడిట్ కార్డు బిల్లు 29 రోజులకు బదులు 31వ రోజు చెల్లించినా, లేదా ఒక్క రోజు ఆలస్యమైనా కొన్ని బ్యాంకులు దాన్ని పెద్ద లోపంగా భావిస్తాయి. ఈఎంఐలు, బిల్లు చెల్లింపులు ఆలస్యం చేయడం కూడా ప్రభావం చూపిస్తాయి.
వయస్సు, రిటైర్మెంట్ దూరం
ఉద్యోగి రిటైర్మెంట్కు 5 నుంచి 7 ఏళ్లలోపు ఉన్నవారికి పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఆదాయం తగ్గే అవకాశం ఉంది. దీంతో డబ్బులు తిరిగి చెల్లిస్తారో లేదోనని సందేహిస్తాయి.
క్రెడిట్ హిస్టరీ
క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉండడం కూడా రుణం ఇవ్వకపోవడంపై ప్రభావం చూపిస్తుంది. తక్కువ క్రెడిట్ హిస్టరీ ఉన్నట్లయితే మీరు లోన్ తీసుకున్న తర్వాత చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనేది బ్యాంకులు అంచనా వేయడం కష్టమవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డులు రద్దు చేసుకుని విషయం కూడా ఒక సారి ఆలోచించాలి. క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవడం వల్ల క్రెడిట్ హిస్టరీ పోతుంది.
డాక్యుమెంటేషన్ లోపాలు
డాక్యుమెంటేషన్‌లో లోపాలు కూడా రుణ మంజూరులో కీలకమే. ఫారంలో చిన్న స్పెల్లింగ్ తప్పులు, సంతకం సరిగ్గా సరిపోకపోవడం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అసంపూర్ణంగా ఉండడం ఇవన్నీ కూడా తిరస్కరణకు కారణమవుతాయి.
క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక ఆరోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. జ్వరం లేదని చెప్పగలుగుతుంది. కానీ.. పూర్తి వ్యాధి నిర్ధారణ చేయలేదు. లోన్ మంజూరు కావాలంటే స్థిరమైన ఆదాయం, తక్కువ రుణ భారం, చెల్లింపు క్రమశిక్షణ, తగినంత క్రెడిట్ హిస్టరీ ఇవన్నీ ఉండాలి. కాబట్టి క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే నమ్ముకుని లోన్లకు దరఖాస్తు చేయవద్దు.
తెలుగున్యూస్టుడే,ఇంటర్నెట్ డెస్క్: Winter Blues Natural Remedies | చలికాలం వచ్చిందంటే చాలామందికి అనేక సార్లు ఏదో బద్ధకం, నీరసం అనిపిస్తుంది. చల్లని గాలులు, త్వరగా చీకటి పడడం, రోజులో ఎక్కువ సమయం మంచంపైనే గడపాల్సి రావడం వల్ల మనసు కుంగిపోతుంది. ఉదయాన్నే లేవాలని, బయటకు అడుగుపెట్టాలనే ఉత్సాహం రాదు. ఇలాంటి భావోద్వేగాలు సాధారణంగా అందరిలోనూ కొంతమేర కనిపిస్తాయి. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్’ (SAD) లేదా ‘వింటర్ బ్లూస్’ అంటారు. ఈ సమస్య ప్రధానంగా శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండడం వల్ల వస్తుంది. ఇది మెదడులో సెరటోనిన్ (సంతోష హార్మోన్) స్థాయిలను తగ్గించి, మెలటోనిన్ (నిద్ర హార్మోన్)ను పెంచుతుంది. ఫలితంగా మూడ్ డౌన్ అవుతుంది.
Winter Blues Natural Remedies | వింటర్ బ్లూస్ లేదా SAD లక్షణాలు ఏమిటి?
రోజంతా నీరసం, విచారం లేదా నిరుత్సాహం అనిపించడం
శక్తి స్థాయిలు తగ్గిపోవడం, అలసటగా ఉండడం
ఇష్టమైన పనులపై ఆసక్తి కోల్పోవడం
కార్బోహైడ్రేట్స్ ఆహారం అధికంగా తినడం, బరువు పెరగడం
ఏకాగ్రత సమస్యలు, దృష్టి కేంద్రీకరించలేకపోవడం
అపరాధ భావన, నిరాశ, తనను తాను విలువలేనివాడిగా భావించడం
అతిగా నిద్రపోవడం లేదా నిద్రలేమి
తీవ్రమైన సందర్భాల్లో జీవితం మీద విరక్తి కలగడం
ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.
Winter Blues Natural Remedies | మూడ్‌ను బూస్ట్ సూచనలు
కొన్ని సహజమైన జీవనశైలి మార్పులతో వింటర్ బ్లూస్ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేయదగినవే.
Winter Blues Natural Remedies | సూర్యకాంతిని ఎక్కువగా పొందండి..
చలికాలంలో బయటకు వెళ్లి కాసేపు నడవడం లేదా పార్కులో గడపాలి. సూర్యకాంతి మెదడు రసాయనాలను సమతుల్యం చేసి, జీవ గడియారాన్ని సరిచేస్తుంది. రోజూ 20-30 నిమిషాలు బయట గడిపితే నిద్ర మెరుగవుతుంది. అంతేకాకుండా మూడ్ కూడా బాగుపడుతుంది.
Winter Blues Natural Remedies | స్నేహితులు, కుటుంబంతో సమయం గడపండి
ఒంటరితనం అనేది వింటర్ బ్లూస్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే స్నేహితులతో బయటకు వెళ్లండి. ఇష్టమైన సినిమాలు చూడడం, లేదా పుస్తకాలు చదడం చేయాలి. లేదంటే ఆటలు ఆడండి. ఇవి హ్యాపీ హార్మోన్స్‌ను పెంచుతాయి.
Winter Blues Natural Remedies | బాడీ డబ్లింగ్ టెక్నిక్..
ఇది ఒక ఆసక్తికరమైన పద్ధతి. మరొకరి సమక్షంలో (ఫేస్ టు ఫేస్ లేదా వర్చువల్‌గా) పనులు చేయడం లాంటివి చేయాలి. ఉదాహరణకు, ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి పనులు పూర్తి చేయడం లేదా స్నేహితుడితో కలిసి ఒకే సినిమా చూడడం వల్ల నిరాశను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Winter Blues Natural Remedies | ధ్యానం, ప్రాణాయామం
నిత్యం 10-15 నిమిషాలు ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అనేక అధ్యయనాల్లో ఇది మూడ్‌ను మెరుగుపరుస్తుందని నిరూపితమైంది. అలాగే ఇంట్లోనే యోగా, డ్యాన్స్ లేదా సాధారణ వాకింగ్ చేయండి. వ్యాయామం ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్లు) విడుదల చేసి, శక్తిని పెంచుతుంది.
ఈ చిట్కాలు అన్నీ సహజమైనవి మరియు సులభంగా అమలు చేయదగినవి. అయితే లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా రోజువారీ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా మానసిక ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికినా సమాచారం ఆధారంగా ప్రచురితం చేశారు. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకోండి.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Karthika Amavasya | పవిత్రమైన కార్తీక మాసం అమావాస్యతో ముగియనుంది. ఈ మాసంలో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అయితే కార్తీక వ్రతం పూణ్య ఫలం దక్కాలంటే చివరి రోజైన అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు.. తిథి, శుభముహూర్తం వంటి విషయాలను తెలుసుకుందామా..
ప్రతి నెల వచ్చే అమావాస్య, పౌర్ణమిలకు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో పాటు అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి యేటా ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. పితృపూజకు కార్తీక అమావాస్యను అత్యంత పవిత్రమైందిగా భావిస్తుంటారు. ఈ రోజు నదీ స్నానాలు ఆచరిస్తారు. అంతే కాకుండా దానధర్మాలు చేస్తుంటారు. కార్తీక అమావాస్య రోజు శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్ముతారు.
Karthika Amavasya | అమావాస్య తిథి..
హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య తిథి నవంబర్ 19న ఉదయం 9:44 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం 12:17 గంటలకు ముగియనుంది. అయితే అయితే సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే నవంబర్ 20న కార్తీక అమావాస్య జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
Karthika Amavasya | అమావాస్య ప్రాముఖ్యత
కార్తీక అమావాస్య విశేషమైందిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు ఈ రోజున పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగిందుకు పితృ పూజలు, తిలా తర్పణం, పిండ దానం చేస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు శక్తికొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, సిరి సంపదలు, ఆనందం, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.
Karthika Amavasya | దీపారాధన
కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంటని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత.. నువ్వుల నూనెతో ఇంటి ముందు, దేవుడి వద్ద, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శ్రీమహావిష్ణువుకు తులసి మాలను సమర్పించడం విశిష్టమైందిగా చెబుతారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
Karthika Amavasya | ఉపవాస దీక్ష
అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అందుకే ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే కార్తీక మాసమంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక అమావాస్య నియమాలను శాస్త్రయుక్తంగా ఆచరిద్దాం.
గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: F-35 fighter jets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో సైనికంగా కీలక పరిణామాలు జరుగనున్నాయి. కాగా.. MBS ఏడేళ్ల తర్వాత అమెరికా రాజధాని సందర్శించడం గమనార్హం.
ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా మా గొప్ప మిత్రదేశం. వాళ్లు F-35 జెట్లు కొనాలని కోరుకుంటున్నారు.. మేం కచ్చితంగా అమ్ముతాం” అని స్పష్టం చేశారు. సౌదీ ఇప్పటికే 48 వరకు F-35 జెట్ల కోసం అభ్యర్థన పెట్టింది. ఇది బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందంగా మారనుందని తెలిపారు.
F-35 fighter jets | ఈ ఒప్పందంపై ఆందోళన
అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లోని కొందరు అధికారులు ఈ అమ్మకానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సౌదీ – చైనా సన్నిహిత సంబంధాలు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది చైనా సౌదీకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. రెండు దేశాలు సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. F-35లోని అత్యంత రహస్య సాంకేతికత చైనా చేతికి చిక్కే ప్రమాదం ఉందని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే కారణంతో గతంలో UAEకి F-35 అమ్మకం కూడా ఆలస్యమైంది.
F-35 fighter jets | మరో కీలక అంశం ఏమిటంటే..
ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యం (Qualitative Military Edge). అమెరికా చట్టం ప్రకారం ఇజ్రాయెల్‌కు మధ్యప్రాచ్యంలో ఎవరికీ లభించని సైనిక ప్రాధాన్యత ఉండాలి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో F-35లు ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే.
ట్రంప్ తన మొదటి టర్మ్‌లో సాధించిన అబ్రహం ఒడంబడికను (Abraham Accords) విస్తరించాలని భావిస్తున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ ద్వారా మధ్యప్రాచ్య శాంతిని సాధించవచ్చని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. “సౌదీ త్వరలోనే అబ్రహం ఒడంబడికలో చేరుతుందని ఆశిస్తున్నా” అని ట్రంప్ చెప్పారు.