Penci Sport plugin only working with the Soledad theme.

టెక్నాలజీ - Telugu News Today

Category: టెక్నాలజీ

  • Moto G57 Power 5G | 7,000mAh భారీ బ్యాటరీతో మోటరోలా కొత్త బడ్జెట్ 5G ఫోన్.. మోటో G57 పవర్ లాంచ్!

    Moto G57 Power 5G | 7,000mAh భారీ బ్యాటరీతో మోటరోలా కొత్త బడ్జెట్ 5G ఫోన్.. మోటో G57 పవర్ లాంచ్!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Moto G57 Power 5G | బడ్జెట్ పరిధిలోనే గొప్ప బ్యాటరీ బ్యాకప్, మంచి పనితనం కావాలని చూస్తున్నారా? అయితే మోటరోలా తాజాగా భారత మార్కెట్‌లో “మోటో G57 పవర్ 5G” (Moto G57 Power 5G) ఫోన్​ను లాంఛ్​ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. బడ్జెట్ ధరలో లభ్యం అవుతుండడంతో ఈ ఫోన్ త్వరలోనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

    Moto G57 Power 5G | డిస్‌ప్లే

    6.72 అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్ (1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్) ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్మూత్ అనుభవం లభిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, స్మార్ట్ వాటర్ టచ్ 2.0 సాంకేతికత కూడా ఉన్నాయి.

    Moto G57 Power 5G | ప్రాసెసర్ & మెమరీ

    క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 (4nm ఆక్టా-కోర్) చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిపి మల్టీటాస్కింగ్, రోజువారీ ఉపయోగం సులువుగా ఉంటుంది.

    Moto G57 Power 5G | బిగ్​ బ్యాటరీ

    7,000mAh భారీ బ్యాటరీతో రెండు రోజుల వరకు సులువుగా బ్యాకప్ ఇస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడంతో త్వరగా ఛార్జ్ అవుతుంది.

    Moto G57 Power 5G

    Moto G57 Power 5G | కెమెరా

    • వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్
    • 50MP ప్రధాన సెన్సార్ (సోనీ LYT-600, f/1.8)
    • 8MP అల్ట్రావైడ్ లెన్స్ (f/2.2, 119.5° FOV)
    • టూ-ఇన్-వన్ లైట్ సెన్సార్
    • ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

    Moto G57 Power 5G | సాఫ్ట్‌వేర్

    ఆండ్రాయిడ్ 16 ఆధారిత My UX తో వస్తోంది. మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్, ఆటో స్మైల్ క్యాప్చర్, పోర్ట్రెయిట్ బ్లర్, స్కై రీప్లేస్‌మెంట్, రీఇమాజిన్ ఆటో ఫ్రేమ్ వంటి అనేక AI కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది.

    కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు

    5G, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైప్-C, అన్ని ప్రధాన సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి ఉన్నాయి.

    Moto G57 Power 5G

    డిజైన్ & బరువు

    166.23 × 76.50 × 8.60 mm కొలతలు, 210.6 గ్రాముల బరువు. మూడు అందమైన పాంటోన్ వేరియంట్స్ – రెగట్టా, ఫ్లూయిడిటీ, కోర్సెయిర్.

    ధర & ఆఫర్లు

    భారత్‌లో 8GB + 128GB వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. లాంచ్ స్పెషల్ ఆఫర్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

    సేల్​ ఎప్పటి నుంచంటే..

    డిసెంబర్ 3 మధ్యాహ్నం నుంచి అధికారిక సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. మూడు కలర్​ వేరియంట్స్​లో వస్తోంది.

    ఇది కూడా చదవండి..: X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్​ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​కు షాక్​ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్​కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు.

    X Chat | వాట్సప్​, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా..

    ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X Chatను లాంచ్ చేయనున్నారు. ఇందులో ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాట్ ఫాం.. డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​తో పాటు అడ్వాన్స్‌డ్ మెసేజ్ కంట్రోల్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా పాత డైరెక్ట్ మెసేజీలు (DM), కొత్త చాట్ ఫంక్షన్స్​ కోసం యూనిఫైడ్ ఇన్‌బాక్స్ అలాంటి స్పెషల్​ ఫీచర్స్​ ఉండడం దీని ప్రత్యేకత.

    X Chat

    త్వరలోనే లాంఛ్​..

    ఈ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారం త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌, ఆడియో, వీడియో కాల్స్​ వంటి ఫీచర్స్​తో కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఆవిష్కరించినట్లు ట్వీట్ చేశారు. కాగా.. ‘ఎక్స్’ను “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చే ఉద్దేశంలో ఉన్న మస్క్​.. త్వరలో ‘ఎక్స్ మనీ’ (X Money) కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. X Chatలో పంపిన మెసేజ్​లు, ఫైల్ షేరింగ్‌తో సహా అన్ని చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​ సౌకర్యం ఉంటుందని వివరించారు. కేవలం వీటిని పంపినవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ యాక్సెస్ చేయలేరని పేర్కొన్నారు.

    ఎడిటింగ్​ ఆప్షన్​

    త్వరలో లాంఛ్​ చేయనున్న ఈ మెసేజింగ్ యాప్​లో యూజర్లు తాము పంపిన మెసేజ్​లను తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చు, లేదంటే డిలిట్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని యాప్​ కల్పించనుంది. అవసరం అనుకుంటే డిసప్పియర్ చేసే వెసలుబాటు కూడా కల్పించనుంది. వాట్సాప్‌లో ఏదైనా సమాచారాన్ని డిలిట్ చేసినట్లయితే This Message was Deleted.. అని కనిపిస్తుంటుంది. కానీ ఎక్స్ చాట్​లో డిలిట్ చేసినట్లయితే ఇలా కనిపించదు.

    ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: AI Jobs in India | ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ (AI) వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుండగా.. మన దేశంలోనూ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టిస్తోంది. కానీ ఒకప్పుడు ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు ఏఐ జాబ్స్ విషయంలో వెనుకబడుతోంది. బెంగళూరు లాంటి సిటీలు దూసుకెళ్తుండగా.. హైదరాబాద్​ వెనుకబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

    AI Jobs in India | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బూమ్..

    ప్రపంచంలో ఏఐ రాక ఒక విప్లవం. ఈ టెక్నాలజీతో కంపెనీలు ఆటోమేషన్‌ ద్వార ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో కొత్త స్కిల్స్ ఉన్నవాళ్లకు డోర్లు తెరుచుకుంటున్నాయి. భారత్‌లో AI Jobs in India 2025లో మరింత పెరిగాయి. మార్కెట్ $20 బిలియన్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఐటీ సెక్టర్‌లో బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ఎప్పుడూ ముందుండేవి. కానీ ఏఐ విషయంలో డైనమిక్స్ మారాయి. స్టార్టప్‌లు, ఆర్&డీ సెంటర్లు ఇక్కడే పుట్టుకొస్తుండగా.. డిస్ట్రిబ్యూషన్ అసమానంగా ఉన్నాయి.

    AI Jobs in India | టాప్‌లో ఉన్న నగరాలు ఏమిటంటే..

    తాజా రిపోర్టుల ప్రకారం.. AI Jobsలో బెంగళూరు 26 శాతం షేర్‌తో ముందుంది. ఇక్కడ వేలాది ఏఐ స్టార్టప్‌లు, ఎంఎల్ ఇన్నోవేషన్లు జరుగుతున్నాయి. ఇక పుణె 17 శాతంతో రెండో స్థానం, ముంబై 13 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కేవలం 10 శాతంతో నాలుగో స్థానం నిలిచింది. అలాగే చెన్నై 7శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఆ తర్వాత ప్లేస్​లలో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ రంగంలో బలంగా ఉన్నా.. ఏఐ స్పెసిఫిక్ జాబ్స్‌లో మాత్రం వెనుకబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    AI Jobs in India

    AI Jobs in India | కొత్త పెట్టుబడులు

    విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయనున్నట్లు అక్టోబర్​లో గూగుల్​ ప్రకటించింది. ఈ నిధులతో ఏఐ డేటా సెంటర్ స్థాపించనుంది. ఇది 1.8 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చనే అంచనాలున్నాయి. అదానీ గ్రూప్ కూడా పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీతో కలిసి పనిచేస్తోంది. హైదరాబాద్‌లో కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటివి ఉన్నాయి. కానీ ఏఐ ఫోకస్ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. టైర్-2 సిటీలు ఇప్పుడు 14-16 శాతం ఏఐ హైరింగ్ చేస్తున్నాయి.

    హైదరాబాద్ పుంజుకుంటుందా..

    ఏఐ జాబ్స్​లో హైదరాబాద్ ప్రస్తుతం వెనుకబడినా.. వేగంగా పెరిగేందుకు అవకాశం ఉంది. టి-హబ్ లాంటి ఇన్‌క్యుబేటర్లు ఏఐ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఇది ఓవరాల్ AI Jobs in Indiaను పెంచుతుంది. యువత ఏఐపై స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటే.. హైదరాబాద్ తిరిగి టాప్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: vivo x300 | ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ వివో తన “ఫ్లాగ్‌షిప్ X300” సిరీస్‌ను త్వరలో భారత్​లో లాంఛ్​ చేయనుంది. ఈ విషయాన్ని “X” వేదికగా సంస్థ ప్రకటన చేసింది. చైనాలో గత అక్టోబర్​లో రీలీజ్​ చేసిన ఈ సిరీస్​లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో “వివో X300″తో పాటు “X300 ప్రో” తీసుకొచ్చింది. అయితే త్వరలోనే భారత్​లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌లో ఈ మోడళ్లకు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు వెల్లడించింది.

    vivo x300 | సూపర్​ ఫీచర్లతో..

    వివో “X300” సిరీస్​లో కీలక ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, V3+ ఇమేజింగ్ చిప్, ZEISSతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లతో భారత్​లో లాంఛ్​ చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్ “X300” మోడల్​ను స్పెషల్​గా రెడ్ కలర్​లో తీసుకు రానున్నామని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ రెండు మోడల్స్​ డిసెంబర్ 2న భారతదేశంలో విడుదల కానున్నాయి.

    vivo x300

    vivo x300 | ప్రాసెసర్, పనితీరు..

    వివో తీసుకురానున్న రెండు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (3nm) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది V3+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. “ప్రో” మోడల్‌లో అదనపు “ప్రో ఇమేజింగ్ చిప్ VS1” సైతం ఉండనుంది. 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం బాగుంటుంది. ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6పై రన్ అవుతంది.

    vivo x300 | కెమెరా ప్రత్యేకం..

    ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో కంపెనీ ఈ సిరీస్​లోని కెమెరా సిస్టమ్​ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. వివో “X300 ప్రో” మోడల్​లో 50MP (f/1.57) సోనీ LYT-828 మెయిన్ (ZEISS గింబాల్ – గ్రేడ్), 50MP (f/2.0) శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్, 200MP (f/2.67) HPB APO టెలిఫొటో ఫీచర్​తో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇక స్టాండర్డ్ “X300” మోడల్​లో 200MP (f/1.68) HPB మెయిన్ (OISతో), 50MP (f/2.57) సోనీ LYT-602 టెలిఫొటో (OISతో), 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఈ రెండు మెడళ్లలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం 50MP (f/2.0) శాంసంగ్ JN1 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

    ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: WhatsApp New Feature | మెటా మేసేజింగ్​ యాప్​ వాట్సాప్ ఒక సంచలన ఫీచర్‌ను (WhatsApp New Feature) తీసుకురాబోతోంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్‌తోనే గుర్తింపు ఇచ్చే వాట్సాప్.. ఇక నుంచి మీ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌ను కూడా అందులో వాడుకోవడానికి అవకాశం కల్పించనుంది. ఈ కొత్త యూజర్‌నేమ్ సిస్టమ్ మెటా ఖాతాలతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. అంటే, ఒకే యూజర్‌నేమ్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మూడింటా లాగిన్ కావొచ్చు..

    ఈ ఫీచర్ గురించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ దీనిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజా లీక్‌ల ప్రకారం.. వినియోగదారులు తమ ఇన్‌స్టా లేదా ఎఫ్‌బీ యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లోనూ రిజిస్టర్ చేసుకునే సౌలభ్యం త్వరలోనే వస్తుంది.

    WhatsApp New Feature

    WhatsApp New Feature | యూజర్‌నేమ్ ఫీచర్ అంటే ఏమిటి..?

    వాట్సాప్‌లో ఇప్పటివరకు ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వాళ్ల ఫోన్ నంబర్ తప్పనిసరి. కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) లాగా ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ (@username) సృష్టించుకోవచ్చు. దీంతో ఎవరికైనా చాట్ ప్రారంభించడానికి నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కేవలం యూజర్‌నేమ్ చూపిస్తే చాలు!

    WhatsApp New Feature | ఇలా పనిచేయనుందంటే..

    వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.34.3లో ఈ ఫంక్షన్‌ను టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపయోగిస్తున్న యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ దీనికి తప్పనిసరిగా ‘వెరిఫికేషన్’ చేయించుకోవాల్సి ఉంటుంది.

    WhatsApp New Feature

    WhatsApp New Feature | వెరిఫికేషన్ ప్రాసెస్ ఇలా..

    • మెటా అకౌంట్ సెంటర్ ద్వారా మీ యూజర్‌నేమ్‌ను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
    • వాట్సాప్ యాప్‌లో యూజర్‌నేమ్ ఎంచుకున్నప్పుడు ఆటోమాటిక్‌గా వెరిఫై అవసరమని అడుగుతుంది.
    • వెరిఫికేషన్ పూర్తయితే, ఆ యూజర్‌నేమ్ వాట్సాప్‌లో శాశ్వతంగా ఫిక్స్​ చేస్తుంది. దీంతో మరెవరూ ఈ యూజర్​ నేమ్​ను క్లెయిమ్ చేయలేరు.

    ఇది కూడా చదవండి..: Ola EV car | టాటా, ఎంజీలకు షాక్​.. చౌకైన ధరలో కారును అందుబాటులోకి తేనున్న ఓలా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Ola EV car | టాటా, ఎంజీలకు షాక్​.. చౌకైన ధరలో కారును అందుబాటులోకి తేనున్న ఓలా..!

    Ola EV car | టాటా, ఎంజీలకు షాక్​.. చౌకైన ధరలో కారును అందుబాటులోకి తేనున్న ఓలా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Ola EV car | ఓలా ఎలక్ట్రిక్ ఈవీ కార్లలో (Ola EV car) గేమ్‌ ఛేంజర్‌గా నిలవడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఒకప్పుడు దుమ్ము దులిపిన ఈ కంపెనీ, ఇప్పుడు కొత్త సవాల్‌ విసిరేందుకు సన్నద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి ముందడుగు వేసింది. కాంపాక్ట్​ డిజైన్​లో చౌకగా ఈవీ కారు తయారీకి తాజాగా పేటెంట్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. చూడాలి మరి టాటా, ఎంజీలకు ఓలా పోటీ ఇస్తుందా.. లేదా అనేది..

    Ola EV car | హ్యాచ్​బ్యాక్​ డిజైన్​లో..

    ఓలా దరఖాస్తు చేసిన పేటెంట్ చిత్రాలు చూస్తే.. ఈ కారు 5-డోర్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. మరియు ఇది టాటా, ఎంజీ, విన్‌ఫాస్ట్ వంటి మోడళ్లను నేరుగా టార్గెట్ చేయనున్నట్లు అర్థమవుతోంది. ఓలా ఇటీవల నిర్వహించిన తన ‘సంకల్ప్ 2025’ ఈవెంట్‌లో జెన్ 4 మాడ్యులర్​ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాట్‌ఫాం స్కూటర్లు, త్రీ వీలర్లు, కార్లు వంటి వివిధ రకాల వాహనాల తయారీకి అనుకూలంగా రూపొందించింది.

    Ola EV car

    Ola EV car | రూ. 10లక్షలలోపు ఉండనుందా..!

    ప్రస్తుతం దేశీయంగా బ్యాటరీ సెల్స్ కొరత ఉంది. కానీ ఓలా 4680 సిరీస్ సెల్స్ తయారీకి సన్నద్ధమవుతోంది. ఇవి నికెల్, మాంగనీస్, కోబాల్ట్‌తో తయారైన అత్యాధునిక సెల్స్ అని చెబుతున్నారు. అయితే రూ.10 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఓలా అడుగుపెడితే, పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో S1 సిరీస్ స్కూటర్లతో సాధించిన విజయం.. కార్ల రూపంలో తిరిగి పునరావృతం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Ola EV car

    Ola EV car | ఈవీ కార్ల ప్రాజెక్టుపై దృష్టి

    స్కూటర్లతో ప్రారంభమైన ఓలా.. ఇప్పుడు చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్ట్‌పై దృష్టి సారించింది. ఒకప్పుడు ప్రతి నెలా 50 వేలకు పైగా స్కూటర్లు అమ్మిన ఓలా.. ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. సరైన సర్వీస్ లేకపోవడం, వినియోగదారుల నమ్మకం కోల్పోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే సంస్థ మళ్లీ గేమ్‌లోకి రావడానికి సన్నద్ధమవుతోంది. చౌకైన ధరలో కొత్త కారును (Ola EV car) మార్కెట్​లోకి తీసుకువచ్చి ఇతర ప్రధాన కంపెనీలకు పోటీ ఇవ్వాలని భావిస్తోంది.

    ఇది కూడా చదవండి..: Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

    Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో సులభంగా పంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి, ఐఫోన్‌ వినియోగదారులు ఆపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని UIDAI “X” లో తెలిపింది.

    Aadhaar App : ఇప్పటికే “mAadhaar” యాప్‌ ఉన్నా.. “Aadhaar” అదనంగా తీసుకువచ్చింది. ఈ కొత్త యాప్‌లో డిజిటల్ కార్డ్ డౌన్‌లోడ్‌, PVC కార్డ్ ఆర్డర్‌, ఈ‌‌–మెయిల్, మొబైల్ వెరిఫికేషన్, వర్చువల్‌ ఐడీ వంటి ఫీచర్లు ఉండవు. ఇది ప్రధానంగా ఆధార్ వివరాలను స్టోర్ చేయడం, పంచుకోవడం కోసం తీసుకువచ్చారు.‌

    Aadhaar App | కొత్త యాప్‌లో ఉన్న ఫీచర్స్​ ఏమిటంటే..

    ఇక నుంచి ఆధార్ కార్డ్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లో ఈ యాప్​ ఉంటే చాలు. కొత్త యాప్‌ ద్వారా ఆధార్‌ కార్డు డిజిటల్‌గా అందుబాటులో ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆధార్‌లను సైతం ఈ యాప్​లో సేవ్ చేసుకోవచ్చు.

    Aadhaar App | భద్రత కూడా ఉంటుంది..

    ఈ యాప్​కు ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ ఉండడంతో ఇది మరింత సురక్షితం. ఎవరితో పంచుకోవాలో, ఏ వివరాలు షేర్ చేయాలో మీరు నిర్ణయించుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాలను లాక్ చేయడమో, అన్‌లాక్ చేయడమో కూడా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే ఆధార్‌ను చివరిసారిగా ఎక్కడ ఉపయోగించారో కూడా ఈ యాప్‌లో నమోదవుతుంది.

    Aadhaar App | యాప్​ను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

    ముందుగా Google Playstore లేదా Apple Store నుంచి “Aadhaar” యాప్‌ డౌన్‌లోడ్ చేయండి.
    అవసరమైన అనుమతులను ఇవ్వండి, షరతులను అంగీకరించండి.
    మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి.
    ఫేస్‌ అథెంటికేషన్ పూర్తి చేయండి.
    చివరగా సెక్యూరిటీ పిన్‌ సెట్ చేయండి.. అంతే! యాప్​ను ఉపయోగించవచ్చు.

    Aadhaar App | కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులో..

    ఈ కొత్త ఆధార్ యాప్‌ సింపుల్‌గానే కాదు, చాలా హెల్ప్‌ఫుల్‌ కూడా ఉంటుంది. ఫోన్‌లో ఆధార్ ఉంటే ఏదైనా వెరిఫికేషన్ కోసం వెంటనే చూపించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల ఆధార్​ వివరాలు సైతం ఇందులో నమోదు చేసుకోవచ్చు. దీంతో ఇక నుంచి ఫిజికల్ కాపీల ఇబ్బందులు ఉండవు. ఇంకేం మరి వెంటనే యాప్​ డౌన్​లోడ్​ చేసుకుని మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆధార్​ వివరాలు సేవ్​ చేసుకోండి.

    ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Smartphone Charging Tips | మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

    Smartphone Charging Tips | మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్‌టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Smartphone Charging Tips | నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ఫోన్​ కామన్​. ఫోన్​ లేకపోతే ఏ పని కాని పరిస్థితులు రోజులు వచ్చాయి. అయితే నిత్యం వాడే ఫోన్​ ఛార్జింగ్​ విషయంలో అనేక మంది పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ఫోన్​ బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ జాగ్రత్తలను పాటిస్తే ఫోన్​ను ఎక్కువ రోజుల పాటు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    Smartphone Charging Tips | ఇలా చేయకండి..

    మనం చేసే చిన్నచిన్న పొరపాట్లు ఫోన్​ బ్యాటరీని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు రాత్రంతా ఫోన్ ప్లగ్‌చేసి ఉంచడం.. చీప్ కేబుళ్లను వాడడం వల్ల బ్యాటరీ పనితీరును తగ్గించి.. లైఫ్​టైంను తగ్గిస్తాయి. అయితే బ్యాటరీలు సహజంగానే కాలక్రమేణా వాడుకతో దిగజారుతుంటాయి. కానీ కొన్ని తప్పులు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయని తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫోన్​ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.

    ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడం, పూర్తిగా డిశ్చార్జ్ చేయడం మానుకోవాలి. బ్యాటరీ పర్సెంటేజీ పూర్తిగా అయిపోయే వరకు చాలామంది ఛార్జింగ్​ పెట్టరు. అలాగే ఛార్జింగ్​ పెట్టాక 100 శాతం వరకు తొలగించారు. ఇది పాత నికెల్ బ్యాటరీల కాలం నాటి పద్ధతి. ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లలో లిథియం అయాన్ లేదా సిలికాన్ కార్బన్ బ్యాటరీలు ఉంటాయి. వీటికి పూర్తిగా ఛార్జ్ చేయడం లేదా పూర్తిగా డిశ్చార్జ్ చేయడం హానికరంగా మారుతుంది. అయితే 20 శాతం నుంచి 80 శాతం బ్యాటరీ మెయింటెయిన్​ చేయడం మంది. ఫోన్​ ఛార్జింగ్20 శాతంలోపు పడిపోతే తక్కువ వోల్టేజ్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే 20 శాతం రాగానే ఛార్జింగ్​ పెట్టాలి. అంతేకాకుండా బ్యాటరీ 90 శాతం –100 శాతం వద్ద అధిక వోల్టేజ్ వల్ల దెబ్బ తింటుంది. అందుకే 20–80 శాతం బ్యాటరీ మెయింటెన్​ చేయాలి.

    Smartphone Charging Tips | రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టొద్దు..

    రాత్రి పూట ఫోన్​ ఛార్జింగ్​ పెట్టి ఉదయం తీసేయడం సౌకర్యంగా ఉన్నా.. బ్యాటరీ ఆయుష్షు దెబ్బతీస్తుంది. ఫోన్​లో ఛార్జింగ్​ 100 శాతానికి చేరిన తర్వాత కూడా చిన్నచిన్న పవర్ డ్రా జరుగుతుంది. ఇది వేడిని పెంచి సెల్‌లను దెబ్బతీస్తుంది. అయితే iPhone‌లో Optimised Battery Charging, ఆండ్రాయిడ్​ అయితే Adaptive Charging ఆప్షన్‌ను ఆన్‌చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్​ ఛార్జింగ్​ను 80 శాతం వద్ద ఆపి, మీరు నిద్రలేచే సమయానికి పూర్తిచేస్తాయి.

    Smartphone Charging Tips | ఛార్జింగ్ సమయంలో గేమింగ్, స్ట్రీమింగ్ వద్దు..

    ఫోన్ ఛార్జ్ అవుతున్న సమయంలో గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం లేదా హై-పర్ఫార్మెన్స్ యాప్‌లు వాడడం మూలంగా బ్యాటరీపై పారాసిటిక్ లోడ్ (Parasitic Load) పడుతుంది. దీంతో వేడి పెరిగి బ్యాటరీ సైకిళ్లు అస్థిరంగా మారుతాయి. కాబట్టి ఛార్జింగ్ టైంలో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటివి నిలిపివేయడం ఉత్తమం.

    Smartphone Charging Tips | ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి..

    బ్యాటరీకి వేడి అనేది శత్రువు లాంటిది. అధిక ఉష్ణోగ్రతల్లో బ్యాటరీ కెపాసిటీ వేగంగా తగ్గిపోతుంది. అందుకే ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను బెడ్‌పై, దిండు కింద ఉంచకూడదు. అలాగే నేరుగా సూర్యకాంతి తగిలేలా పెట్టకూడదు.

    Smartphone Charging Tips | ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఎక్కువగా వాడొద్దు..

    ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యమైనదే.. అయినా దీర్ఘకాలంలో వేడి పెంచి బ్యాటరీకి హాని చేస్తుంది. ప్రతి రోజూ వాడడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అవసరమైన సమయంలో మాత్రమే వాడండి. రోజువారీగా నార్మల్ ఛార్జర్​ను ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. 

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Dak Sewa App | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

    Dak Sewa App | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Dak Sewa App | పోస్టల్‌ సేవలను తపాల​ శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్‌ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా వినియోగించుకునేలా ‘డాక్‌ సేవ’ పేరిట యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకోవచ్చు.

    Dak Sewa App | యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోండిలా..

    డాక్​ సేవక్​ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్‌ స్టోర్‌లో (Dak Sewa App) అందుబాటులో ఉంది. అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్‌ చేసి మొబైల్‌ నంబర్‌ లేదా ఈ-మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ కావాలి. ఓటీపీ ద్వారా లాగిన్‌ అయ్యి సేవలను వినియోగించుకోవచ్చు.

    Dak Sewa App | ఈ సౌకర్యాలు పొందవచ్చు..

    డాక్ సేవ యాప్‌ ద్వారా వివిధ సేవలను పొందవచ్చు. పార్సిల్‌ ట్రాకింగ్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెమెంట్‌, స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్టు బుకింగ్‌, పోస్టేజ్‌ కాలిక్యులేషన్‌, కంప్లైంట్‌ రిజిస్ట్రేషన్‌, ట్రాకింగ్‌ సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా మీకు దగ్గరలోని పోస్టాఫీసుల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే వినియోగదారులు రియల్ టైమ్‌లో పార్సిళ్లు, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్లను సైతం ట్రాక్ చేయవచ్చు. వినియోగదారులు ఎక్కువ క్యూలలో నిలబడకుండా మెయిల్ ఐటెమ్‌లు, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్శిల్‌లను బుక్ చేసుకోవడానికి దోహదం చేస్తుంది. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు. ఇలా డాక్​ సేవక్​ యాప్​ ద్వారా వివిధ సేవలను మొబైల్​ ద్వారానే వినియోగించుకోవచ్చు.

    ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. 

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Google Maps | గూగుల్ మ్యాప్స్ నుంచి అదిరిపోయే నయా ఫీచర్స్… అవేంటో తెలుసుకోండి..

    Google Maps | గూగుల్ మ్యాప్స్ నుంచి అదిరిపోయే నయా ఫీచర్స్… అవేంటో తెలుసుకోండి..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Google Maps | మనం తెలియన ప్రాంతాలకు వెళ్తే.. నావిగేషన్​ కోసం గూగుల్​ మ్యాప్స్​ వాడుతుంటాం. దీనివల్ల మనం గమ్యస్థానానికి చేరుకోవడం సులభం అవుతుంది. అయితే వినియోగదారుల మరింత సౌలభ్యంగా మార్చేందుకు గూగుల్స్​ మరిన్ని ఫీచర్స్​ తీసుకువచ్చింది. కొత్త AI ఫీచర్లతో మరిన్ని అప్‌డేట్స్ తెచ్చింది. ప్రత్యేకంగా భారతీయ యూజర్స్​ కోసం రూపొందించిన ఫీచర్స్ ఇవి. కొత్త అప్​డేట్స్​ ఏంటో తెలుసుకుందామా మరి..

    Google Maps | జెమినీ నావిగేషన్‌..

    జెమినీ నావిగేషన్​ అనేది డ్రైవింగ్ చేసే సమయంలో హ్యాండ్‌ఫ్రీ, సంభాషణాత్మక అనుభవాన్ని ఇస్తుంది. “దగ్గరలోని పెట్రోల్ పంప్ ఎక్కడ?” అని అడగడం వల్ల.. మనం వెళ్లే దారిలో పార్కింగ్ ఉందా అని తెలుసుకోవచ్చు. లేదంటే ఒక రెస్టారెంట్ వెతికి “సరే, అక్కడ వెళ్దాం” అని చెప్పొచ్చు. దీని మనను అక్కడకు తీసుకెళ్తుంది.

    Google Maps | సూచనలు కూడా ఇస్తుంది..

    కొత్త అప్​డేట్స్​ జెమినీ మ్యాప్స్ రివ్యూలు, వెబ్ కంటెంట్‌ను విశ్లేషిస్తుంది. అంతేకాకుండా ప్రాక్టికల్, స్పష్టమైన సూచనలు ఇస్తుంది. ఉదాహరణకు, హైదరాబాద్​లో ఏదైనా మార్కెట్ గురించి చూసినట్లయితే.. “అక్కడ బేరం ఆడొచ్చు” అని సూచిస్తుంది. లేదంటే ఆ ప్రాంతంలోని అత్యుత్తమ స్టాల్స్‌ను సైతం చెబుతుంది.

    Google Maps | మ్యాప్స్‌ని ప్రశ్నలు అడగొచ్చు..

    మ్యాప్స్​ యూజర్స్​ ఇక నుంచి ఒక ప్రాంతం గురించి ప్రశ్నలు అడగవచ్చు. జెమినీ ఏఐ ఫీచర్​ రివ్యూలు, ఫొటోలు, వెబ్ డేటాను పరిశీలించి చెబుతుంది. అక్కడ చూడాల్సిన ప్రదేశాలతో పాటు పార్కింగ్ వివరాలను సైతం సూచిస్తుంది.

    Google Maps | స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్​ అలర్ట్స్​..

    కొత్త ఫీచర్స్​ మనం ప్రయాణించే దారిలో స్పీడ్​ లిమిట్స్​ను సైతం చెబుతుంది. స్థానిక ట్రాఫిక్ అధికారుల డేటా ఆధారంగా రోడ్లపై స్పీడ్ లిమిట్‌ను చూపిస్తుంది. అయితే ఇది ప్రస్తుతానికి ముంబై, హైదరాబాద్, కోల్​కతా వంటి 9 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. అలాగే ప్రధాన రోడ్లలో డిజర్ప్షన్ లేదా డిలేల గురించి ఆటోమాటిక్ నోటిఫికేషన్లు అందిస్తుంది. నావిగేషన్ యూజ్​చేయకపోయినా సమాచారం వస్తుంది. ఇది కూడా ప్రస్తుతానికి ప్రధాన నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫీచర్​ అందుబాటులో ఉంది.

    Google Maps | NHAIతో భాగస్వామ్యం..

    గూగుల్​ మ్యాప్స్​ హైవేపై రోడ్​ క్లోజర్స్​తో పాటు రిపేర్ల గురించి రియల్ టైమ్ డేటా అందిస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో భాగస్వామ్యం ద్వారా ఈ వివరాలను ఇవ్వనుంది. అంతేకాకుండా రోడ్డు పక్కన రెస్ట్ రూమ్స్, పెట్రోల్ స్టేషన్ల సమాచారం కూడా అందిస్తుంది.

    ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai