Penci Sport plugin only working with the Soledad theme.

టెక్నాలజీ - Telugu News Today

Category: టెక్నాలజీ

  • Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

    Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Hello UPI | ప్రస్తుత కాలంలో మనం ఎక్కడి వెళ్లి ఏది కొనుగోలు చేసినా డిజిటల్​ పేమెంట్స్​ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్​ విధానం వచ్చిన తర్వాత డబ్బుల చెల్లింపు చాలా ఈజీ అయ్యింది. ఇక దీనిని మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇందులో ఉన్న వాయిస్ అసిస్టెంట్​ ఫీచర్​తో మనం పేమెంట్స్​ చేయడం మరింత సులువుగా మారింది. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

    “హలో యూపీఐ” ఉపయోగాలివే..

    Hello UPI ద్వారా భారతీయ ప్రాంతీయ భాషల్లో పేమెంట్స్‌ చేయవచ్చు. ఈ ఫీచర్​ సీనియర్ సిటిజెన్స్, డిజిటల్ నిరక్షరాస్యులు, దృష్టి లోపం ఉన్నవారికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.

    ఏ ఫోన్లలో సపోర్ట్ చేస్తుందంటే..

    Hello UPI అనేది ఫీచర్ ఫోన్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్లు రెండింటిలో పనిచేస్తుంది. యూపీఐ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లో UPI కన్వర్సేషనల్ పేమెంట్స్ చేయవచ్చు.

    ఎవరికి బెస్ట్ అంటే..

    పెద్దవాళ్లు: బటన్ నొక్కడం కష్టమా? వాయిస్‌లో చెప్పండి, పని అయిపోతుంది.

    కళ్లు బాగా కనిపించని వాళ్లు: స్క్రీన్ చూడకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి.

    గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లు: ఇంగ్లీష్ రాదా? మీ తల్లిభాషలోనే మాట్లాడండి.

    టైప్ చేయడం ఇష్టం లేని యంగ్‌స్టర్స్: “హలో UPI, రమేష్‌కి 500 పంపు” అనండి – అంతే!

    ఎందులో ఎలా పనిచేస్తుందంటే..

    స్మార్ట్‌ఫోన్: PhonePe, Google Pay, Paytm – ఏ యాప్ అయినా

    బటన్ ఫోన్: ఫీచర్ ఫోన్‌లో కూడా వాయిస్ పేమెంట్

    కాల్ చేసి: IVR మెనూ విని నంబర్ నొక్కి

    స్మార్ట్ గాడ్జెట్స్: స్పీకర్, టీవీ, ఫ్రిజ్ – రేపటి నుంచి!

    ఎలా పనిచేస్తుంది?

    యాప్ ఓపెన్ చేయండి → “హలో UPI” అని పలకండి.

    వాయిస్ అసిస్టెంట్ మీతో మాట్లాడుతుంది – “ఎంత పంపాలి? ఎవరికి?”

    UPI పిన్ చెప్పండి (లేదా నొక్కండి).

    గమనిక: భద్రత కోసం UPI పిన్ ఇప్పటికీ అవసరమే. వాయిస్‌లో చెప్పినా, టైప్ చేసినా – రెండూ సేఫ్.

    Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    తెలుగున్యూస్​టుడే, ఇంర్నెట్​డెస్క్​: నేటి ఆయుధనిక యుగంలో స్మార్ట్​ఫోన్​ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగ్యమైంది. ఇది లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్​ ఉండాల్సిందే. అయితే వీటిలోని ఉండే అనేక ఫీచర్ల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఇందులో ‘ఫైట్​ మోడ్’​ కూడా ఒకటి. దీని గురించి కొందరికి తెలిసినా.. దీంతో ఉండే చాలా ఉపయోగాలు పూర్తిగా తెలియదు. మరి అవేంటో తెలుసుకుందామా..

    మనం మామూలుగా విమానంలో ప్రయాణించే సమయంలో, నెట్‌వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తారని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఈ ఫ్లైట్ మోడ్‌ ద్వారా మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి.

    Smartphone Flight Mode Uses : బ్యాటరీ లైఫ్ పెరుగుదల

    ఫ్లైట్ మోడ్‌ ఆన్ చేయడం వల్ల ఫోన్ నెట్‌వర్క్ సెర్చ్ చేయడం ఆపేస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా Wi-Fi, మొబైల్ డేటా, బ్లూటూత్‌, జీపీఎస్​ లాంటి ఫీచర్లు డిసెబుల్ అవుతాయి. దీనివల్ల బ్యాటరీ 20-30 శాతం వరకు ఎక్కువ సేపు పనిచేస్తుంది. బ్యాటరీ తక్కువ ఉన్న సమయంలో తాత్కాలికంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం వల్ల పవర్‌ సేవ్ చేసుకోవచ్చు.

    Smartphone Flight Mode Uses : ఛార్జింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు..

    ఫైట్​ మోడ్​ ఆన్​ చేసి ఛార్జింగ్​ పెట్టడం వల్ల వేగంగా అవుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇలా చేయడం ద్వారా ఫోన్ మూడు నుంచి నాలు రెట్లు ఫాస్ట్​గా ఛార్జ్ అవుతుంది. ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్, Wi-Fi, నోటిఫికేషన్స్​ పనిచేయవు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయి ఛార్జింగ్ వేగం పెరుగుతుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఫ్లైట్ మోడ్‌ ఆన్​ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు.

    నెట్‌వర్క్ రీసెట్‌ కోసం..
    కొన్నిసార్లు మన ఫోన్​లో సిగ్నల్ పోయి తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో ఫ్లైట్ మోడ్‌ను 10 సెకన్ల పాటు ఆన్ చేసి తిరిగి ఆఫ్ చేయాలి. దీంతో మొబైల్ నెట్‌వర్క్ అనేది ఆటోమేటిక్‌గా రీఫ్రెష్ అవుతుంది. అప్పుడు సిగ్నల్ సమస్య పరిష్కారమవుతుంది.

    Smartphone Flight Mode Uses : నిద్రపోయే సమయంలో..
    రాత్రి నిద్రకు ఉపక్రమించిన సమయంలో అత్యవసరం లేకపోతే ఫైట్​మోడ్​ ఆన్​ చేసుకోవచ్చు. ఫోన్​ దగ్గరగా పెట్టుకుని పడుకున్నట్లయితే సిగ్నల్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల రేడియేషన్ ఎమిషన్ తగ్గిపోతుంది. దీంతో నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

    Smartphone Flight Mode Uses : యాడ్స్​ రాకుండా గేమ్స్ ఆడొచ్చు..
    ఫైట్​ మోడ్​ ఆన్​ చేయడం వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. దీంతో ఆన్‌లైన్ యాడ్స్ రావు. కాబట్టి ఫ్లైట్ మోడ్‌లో గేమ్స్ ఆడితే యాడ్ డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల క్లియర్ గేమింగ్ అనుభవం పొందవచ్చు. అలాగే ఫైట్​ మోడ్​ ఫీచర్​ ద్వారా డేటా సేవింగ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసి.. ఆ తర్వాత కేవలం Wi-Fi మాత్రమే ఆన్ చేయాలి. దీంతో మొబైల్ డేటా పూర్తిగా సేవ్ అవుతుంది. ఇలా ఈ ఫైట్​ మోడ్​ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

    ఇది కూడా చదవండి.. Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్​పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా?

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

    ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Chat GPT | చాట్​జీపీటీ యూజర్లకు ఓపెన్​ ఏఐ గుడ్​న్యూస్ చెప్పింది. భారత్​లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్​ను ఉచితంగా అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్​ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్​ ఏడాది పాటు చెల్లుబాటు కానుంది.

    Chat GPT | గతంలో నెలకు రూ.399

    ఈ ప్లాన్ గతంలో వినియోగించుకోవాలంటే నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఓపెన్​ఏఐకి భారత్​ రెండో అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో కంపెనీ తన AI టూల్స్​ను ఇక్కడ విస్తరించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. విద్య, వ్యాపారం, కోడింగ్, ఇతర ప్రాజెక్టుల కోసం చాట్​జీపీటీని ఉపయోగించే లక్షల మందికి ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.

    ChatGPT Go ప్రయోజనాలివే..

    ఓపెన్​ఏఐ తీసుకున్న నిర్ణయంతో AI వినియోగాన్ని మరింత ప్రోత్సహించనుంది. ఇప్పటి వరకు ఎక్కువగా మెట్రో నగరాల్లోనే వినియోగించగా.. తాజా నిర్ణయంతో ఇది గ్రామీణ ప్రాంతాల కూడా విస్తరించనుంది. “ChatGPT Go” మిడ్-లెవల్ ప్లాన్. ఇది GPT-5 మోడల్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఇది వేగవంతంగా, మరింత కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.

    • ఉచిత వెర్షన్ కంటే 10x ఎక్కువ మెసెజ్ లిమిట్​లు ఉంటాయి.
    • 10x ఎక్కువ ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్​లు చేసుకోవచ్చు.
    • 2x ఎక్కువ మెమరీ ఉంటుంది. దీని వల్ల చాట్‌బాట్ మునుపటి సంభాషణలను గుర్తుంచుకోవడానికి, వ్యక్తిగతీకరించిన సమాధానాలను అందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
    • దీర్ఘ సంభాషణలు, విశ్లేషణ, ఇమేజ్ క్రియేషన్​ ఉపయోగ పడుతుంది.

    ChatGPT Go

    ఇప్పటికే పెయిడ్​ సబ్​స్ర్కిప్షన్​ తీసుకున్న వారి సంగతేంటంటే..!

    భారత్​లో ఇప్పటికే “ChatGPT Go” సబ్​స్ర్కిప్షన్​ పొందిన వారు ఆటోమేటిక్​గా 12 నెలల ఉచిత ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. ఇందుకోసం తమ ప్లాన్​ను క్యాన్సిల్, రీ-అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఏడాది తర్వాత సాధారణ ధర వర్తించనుంది.

    ఆఫర్‌ను ఎలా పొందాలంటే..?

    “ChatGPT Go” ఆఫర్‌ను పొందాలంటే ChatGPT వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. లేదంటే.. సైన్ అప్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత, వినియోగదారులు “ChatGPT Go”ని ఉచితంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

    ఇది కూడా చదవండి..: Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ బ్రాండ్​ శాంసంగ్​.. తన వాలెట్​లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్​ వాలెట్​లో ఇక నుంచి పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్​ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా శాంసంగ్​ యూజర్లు బయోమెట్రిక్​ లేదా ఫేషియల్​ రికగ్నిషన్​ ద్వారా చెల్లింపు చేసే సౌకర్యం తేనుంది. దీంతో ప్రతి ట్రాన్​సాక్షన్​కు పీన్​ నంబర్​ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.

    Samsung Wallet | ఇక నుంచి ఆ అవసరం ఉండదు..

    కొత్త ఫీచర్లపై శాంసంగ్ ఇండియా సర్వీసెస్ అండ్ యాప్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ మధుర్ చతుర్వేది స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఫీచర్​ను డిసెంబర్ నుంచి అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. “శాంసంగ్​ వాలెట్ అథెంటికేషన్ అనుభవం మరింత మెరుగుపడింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, డివైస్ ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్‌ ద్వారా రోజువారీ చెల్లింపులకు PIN ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు” అని వివరించారు. “యూజర్లు గెలాక్సీ డివైస్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్‌ ద్వారా యాప్ ఓపెన్ చేసి UPI పేమెంట్స్ చేయవచ్చు.” అని పేర్కొన్నారు.

    Samsung Wallet | వీటికి సైతం..

    సామ్‌సంగ్ వాలెట్ త్వరలో క్రెడిట్, డెబిట్ కార్డులు, కీ మర్చంట్లలో ఆన్‌లైన్​లో ఉపయోగించడానికి సపోర్ట్ చేయనుంది. యూజర్లు గూడ్స్, సర్వీసెస్ కొనుగోలు చేసిన సమయంలో శాంసంగ్ వాలెట్‌ ద్వారా సేఫ్‌గా టోకెనైజ్ చేసిన కార్డులతో సీమ్‌లెస్‌గా పేమెంట్​ చేయవచ్చు. అంతేకాకుండా కార్డ్ డీటెయిల్స్ మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చెక్‌అవుట్‌ను మరింత వేగవంతం చేస్తుంది.

    Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం అరట్టై యాప్ డౌన్​లోడ్స్​లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్​కు ఎన్​క్రిప్షన్​ అందుబాటులో ఉండగా.. చాట్​ కోసం మాత్రం లేదు. కాగా.. దీనిపై దృష్టి సారించిన సంస్థ త్వరలోనే చాట్‌ల కోసం వాట్సాప్ లాంటి ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్​ వెంబు తెలిపారు.‌

    Arattai End-to-End Chat Encryptionచివరి ఫీచర్​ టెస్టింగ్​!

    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్​ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ చివరి పరీక్ష దశలో ఉన్నట్లు సమాచారం. దీనిని వినియోగదారుల కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అందుబాటులోకి వచ్చినట్లయితే అరట్టై యాప్ వాట్సాప్‌కు మరింత బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వినియోగదారుల చాట్​లను లేదా డేటాను గోప్యంగా ఉంచుతుంది.‌

    ‌Arattai End-to-End Chat Encryption త్వరలో జోహో పే..!
    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు, UPI-ఆధారిత చెల్లింపు వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జోహో పేను ప్లాట్‌ఫామ్‌లోకి ఇంటిగ్రేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులు యాప్‌లోనే డబ్బు పంపడం, స్వీకరించడం తదితర సౌకర్యాలు కలుగనున్నాయి. ఇది మనం వాట్సాప్‌ లాగే.. మల్టీ-యుటిలిటీ కమ్యూనికేషన్ సాధనంగా మారనుంది.

    Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!

    Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!

    తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది పెట్రోల్​ వాహనాల కంటే ఈవీ వెహికిల్స్​ వైపే మొగ్గుచూపుతున్నారు. డ్రైవింగ్​కు సైతం ఈజీగా ఉండడంతో వీటిని ప్రిఫర్​ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి, సిటీలో డ్రైవింగ్​కు కన్వీనియెంట్​గా ఉండడంతో కొనుగోళ్లు బాగా పెరిగాయి. అయితే కొన్ని ఎలక్ట్రిక్​ స్కూటర్ల ధర ఎక్కువగా ఉన్నా.. మరికొన్ని మోడల్స్​ రూ. లక్షలో లభిస్తుండడంతో వీటి సేల్స్​ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణించడంతో పాటు పెట్రోల్​ అవసరం లేకపోవడంతో కొనుగోలు చేస్తున్నారు. అయితే రూ. లక్షలో బడ్జెట్​లో మార్కెట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్​ ఈవీ వెహికిల్స్​ గురించి తెలుసుకుందాం..

    Electric scooters |ఓలా S1 X

    ఓలా ఎలక్ట్రిక్ మోడల్స్​లో ఇది బడ్జెట్​ స్కూటర్. దీని ఎక్స్-షోరూం ధర రూ. 94,999గా ఉంది. 2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వేరియంట్‌తో వస్తుంది. దీనికి IDC 108 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తోంది. 101 kph గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. 4.3-అంగుళాల LCD కన్సోల్, మూడు రైడ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

    Electric scooters |టీవీఎస్ ఆర్బిటర్

    టీవీఎస్​ ఇటీవల కొత్త ఆర్బిటర్ స్కూటర్​ను లాంచ్​ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్​ వచ్చేసి రూ. 1.05 లక్షలుగా ఉంది. కానీ PM E-డ్రైవ్ పథకంతో దీనిని రూ. లక్ష కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 158 కిలోమీటర్ల రేంజ్‌తో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ వంటి ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ ఉండడం విశేషం. అలాగే 5.5-అంగుళాల LCD కన్సోల్, హిల్-హోల్డ్ కంట్రోల్, USB ఛార్జింగ్, OTA అప్‌డేట్‌లు వంటి అధునాతన ఫీచర్స్​ ఉన్నాయి.

    ఆంపియర్ మాగ్నస్ నియో ఈ జాబితాలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూం ప్రైస్​ రూ. 84,999గా ఉంది. ఇందులో 2.3 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది 85-95 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ కలిగి ఉంది. కంపెనీ ఈ స్కూటర్​కు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లు వారంటీ ఇస్తోంది.

    Electric scooters| విడా V2 ప్లస్

    హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ డివిజన్ స్కూటర్​ విడా. ఇది లాంగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎక్స్​ షోరూం ప్రైస్​ వచ్చేసి ధర రూ. 85,300గా ఉంది. 3.44 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ARAI-సర్టిఫైడ్ క్లెయిమ్డ్ రేంజ్ 143 కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది. కీలెస్ స్టార్ట్-స్టాప్, 7-అంగుళాల కన్సోల్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్​ ఉన్నాయి. ఇది 6 kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది.

    గమనిక: మేం అందించిన ఈ వివరాలు అవగాహన కోసం మాత్రమే. అంతేకాకుండా ఇవి ఎక్స్​ షోరూం ధరలు. అలాగే ఇవి ప్రాంతాల వారీగా కూడా మారుతూ ఉంటాయి. ధరలు, ఇతర ఫీచర్స్​, ఇతర పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోనూ షోరూంలో సంప్రదించండి..

    ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. బెస్ట్​ మైలేజ్​ ఇచ్చే వెహికిల్స్​పై ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. బెస్ట్​ మైలేజ్​ ఇచ్చే వెహికిల్స్​పై ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Budget Cars |కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సవరించడం కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కారు కొనాలనే కల నెరవేర్చుకుంటున్నారు. జీఎస్టీ తగ్గులతో ఇప్పటికే ఎంతో మంది కొత్త కార్లు కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది కొనుగోలుకు ప్లాన్​ చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉండడంతో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజీని అందించే కార్లపై ఓ లుక్కేయండి..

    ఎక్కువ మైలేజ్​ ఇచ్చే బెస్ట్ కార్లు ఇవే..

    చిన్న కార్లు చిన్న కుటుంబాలతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా సిటీ డ్రైవింగ్​కు కూడా అనువుగా ఉంటాయి. అందుకే పెద్ద కార్లతో పోలిస్తే వీటి సేల్స్​ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్​ ధరలో లభించడంతో పాటు అత్యధిక మైలేజ్​ ఇచ్చే కార్ల గురించి తెలుసుకుందాం.

    మారుతీ ఆల్టో K10

    రెనాల్ట్ క్విడ్

    దేశీయ మార్కెట్​లో అతి తక్కువ ధర కలిగిన కారు రెనాల్ట్ క్విడ్. సరసమైన కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. దీని ప్రస్తుత ఎక్స్-షోరూం ధర రూ. 4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ 999 సీసీ ఇంజిన్‌ ఉంటుంది. ఇది లీటర్‌కు 22.3 కిలోమీటర్ల మైలేజ్​ అందిస్తుంది. స్టైలిష్ లుక్, మంచి మైలేజీ, తక్కువ బడ్జెట్​లో లభించే బడ్జెట్ కారు.

    మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో

    మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనేది ఈ కంపెనీ అందిస్తున్న రెండో చౌకైన కారు. రూ. 5 లక్షల లోపు కారు కొనాలని భావించే వారికి మంచి ఛాయిస్​. Budget Cars లో ఎస్-ప్రెస్సో ఎక్స్-షోరూం ప్రైస్​ వచ్చేసి రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 998 సీసీ ఇంజిన్‌తో శక్తిని ఇస్తుంది. లీటర్​కు 25.3 కి.మీ. మైలేజ్​ అందిస్తుంది.

    బడ్జెట్​ ధరల్లో కారు కొనాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక అవుతాయి. అయితే కొనుగోలు చేసే ముందు వీటి గురించి పూర్తిగా తెలుసుకోని ముందుకు వెళ్లడం ఉత్తమం. ఇక మరో విషయం ఏమిటంటే.. ప్రాంతాల ఆధారంగా ఎక్స్‌ షోరూం ప్రైస్​ ధర, ఆన్ రోడ్ ధరలు మారుతుంటాయి. అంతేకాకుండా వివిధ మోడల్స్‌, వేరియంట్లను బట్టి రేట్లు ఛేంజ్​ అవుతుంటాయి. అందుకే పూర్తి సమాచారం కోసం మీ సమీపంలోని షో రూంను సంప్రదించడం మంచిది.

    ఒకసారి ఈ క్రింది ఇంస్టాగ్రామ్ కొత్త ఫీచర్ గురించి కూడా తెలుసుకోండి.

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో..

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Google gemini prompts | ఈ జెమినీ ప్రాంప్ట్స్​ ట్రయ్​ చేయండి.. క్షణాల్లో మీ ప్రెజెంటేషన్స్​ రెడీ!

    Google gemini prompts | ఈ జెమినీ ప్రాంప్ట్స్​ ట్రయ్​ చేయండి.. క్షణాల్లో మీ ప్రెజెంటేషన్స్​ రెడీ!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Google gemini prompts | ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఏఐ ఫొటోల ట్రెండ్​ నడుస్తోంది. అందులోనూ గూగుల్ జెమినితో రూపొందించిన ఇమేజ్​లు విపరీతంగా ట్రెండ్​ అవుతున్నాయి. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా సాధారణమైన ఫొటోలను మనకు నచ్చిన లొకేషన్లు, డ్రెస్సింగ్​, సైల్స్​లో ఈమేజీ రూపొందించి ఇస్తుంది. అంతేకాకుండా దీనిని రూపొందించడం సులభంగా ఉండడంతో ప్రజలు గూగుల్ జెమిని AIతో ఇమేజ్​లను జెనరేట్​ చేస్తూ సోషల్​ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ ఏఐ ఫీచర్‌ ద్వారా మీ ఫొటోకు రెట్రో టచ్ ఇవ్వొచ్చు.

    Google gemini prompts | ఇలా ట్రై చేయండి..

    జెమినీ ఏఐ టూల్ ద్వారా వినియోగదారులు కేవలం కొన్ని సెకన్లలోనే మీకు నచ్చినట్లు ఫొటోస్​ జెనరేట్​ చేసుకోవచ్చు. ఇందుకోసం సరైన ప్రాంప్ట్​ ఇవ్వడం ద్వారా ఇమేజ్​లు రూపొందించవచ్చు. ఇందుకోసం మేం కొన్ని ప్రాంప్ట్స్​ ఇస్తున్నాం.. వీటిని ట్రైయ్​ చేసిన ఇమేజెస్​ జనరేట్​ చేసుకోండి..

    Produce an artistic image of an Indian couple in a luxurious hotel lobby, the woman in an elegant 90’s inspired red saree, both laughing joyfully while capturing a memorable photo.

    కొందరు జంటలకు పార్క్​లో నడుస్తూ 90త లుక్​లో ఫొటో దిగాలని ఉంటుంది. అంతేకాకుండా చెట్ల ఆకులు రాలుతుండగా నడుస్తున్నట్లు ఫొటో దిగడం కొంత కష్టం. ఇలాంటి ఇమేజ్​ కోసం ఈ కింది ప్రాంప్ట్​ వాడండి..

    Design a scenic photo of a loving couple walking through a serene park, featuring the female partner in a flowing 90’s red saree, with autumn leaves falling around them.

    వర్షం కురుస్తున్న వేళలో పార్క్​లో గొడుగు పట్టుకుని ఓ జంట నడుస్తున్నట్లు ఈ కింది ప్రాంప్ట్​ ఇచ్చి ఇమేజ్​ జనరేట్​ చేయవచ్చు.

    Here’s an image of a couple sharing an umbrella in the rain near a park, with wet reflections on the road, the woman’s red saree slightly wet, gentle smiles, soft focus, cinematic rain aesthetic, and a vintage romance feel.

    Google gemini prompts |బీచ్‌సైడ్ క్షణాలను ఆస్వాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. రెట్రో 90ల నాటి ఎఫెక్ట్​తో ఇసుకపై జంట కూర్చుని ఫొటో దిగినట్లు ఈ ప్రాంప్​ ఇవ్వడం ద్వారా ఇమేజ్​ జెనరేట్​ చేయవచ్చు..

    Illustrate a couple enjoying a beachside moment, the woman adorned in a retro 90’s red saree with intricate patterns, sitting on the sand as they pose for a candid shot.

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ సోషల్​మీడియా యాప్​ ఇన్​స్టాగ్రాం నయా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్​కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్​స్టా తీసుకున్న వచ్చిన ఈ కొత్త ఫీచర్​ ఈ సమస్యకు చెక్​ పెట్టనుంది. ‘వాచ్​ హిస్టరీ’ ఫీచర్​ ద్వారా మనం గతంలో చూసి రీల్​ను మళ్లీ చూసేయవచ్చు. దీని గురించి తెలుసుకుందామా..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన సోషల్​ మీడియా ప్లాట్​ఫాం. సామాన్య వినియోగదారుల నుంచి ప్రముఖుల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. కొందరైతే గంటల కొద్దీ స్క్రోల్​ చేస్తూ గడిపేస్తున్నారు. అయితే, ఒకసారి స్క్రోల్ చేసిన తర్వాత ఆ రీల్‌ను మళ్లీ చూడాలనుకుంటే పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఇన్‌స్టా కొత్త ఫీచర్​ను లాంఛ్​ చేసింది. ఇది తన వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం ఉపయోగపడనుంది.

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఏమన్నారంటే..

    ఈ కొత్త ఫీచర్​పై ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మొస్సేరి ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో ఏమన్నారంటే.. “ఇకపై మీరు గతంలో చూసిన రీల్స్‌ను సులభంగా కనుగొనవచ్చు. ఈ ఫీచర్‌ మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

    ఎలా యాక్సెస్ చేయాలంటే..

    Instagram History Feature ఇన్​స్టా గ్రాం తీసుకున్న వచ్చిన కొత్త ఫీచర్​ను ఉపయోగించడం ఎంతో సులభం. ఈ స్టెప్స్​ ఫాలో అయితే గత రీల్స్​ జాబితాను చూసేయవచ్చు.

    • ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్​ చేయండి
    • సెట్టింగ్స్​లోకి (Settings) వెళ్లండి.
    • తర్వాత Your Activity ఎంపికను ఎంచుకోండి.
    • అక్కడ ‘వాచ్ హిస్టరీ’ (Watch History) అనే ఆప్షన్​ ఎంపిక కనిపిస్తుంది.
    • ఈ విభాగంలోకి వెళ్లాక.. మీరు గతంలో చూసిన రీల్స్ చేసేయవచ్చు.

    ఈ ఫీచర్ ఎందుకంటే..

    ఎంతో మంది వినియోగదారులు రీల్ చూస్తున్న టైం ఫోన్ కాల్ వచ్చినా లేదా యాప్‌ను రిఫ్రెష్ చేసినా.. ఆ రీల్‌ను తిరిగి దొరకక నిరాశకు గురవుతుండేవారు. ఈ సమస్యపై యూజర్స్​ నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇన్‌స్టా ఈ ఫీచర్​ను డెవలప్​ చేసింది. మీరు కూడా ఈ కొత్త ఫీచర్‌ను ట్రై చేయండి.. మీకు నచ్చిన రీల్స్‌ను సులభంగా తిరిగి చూసేయండి..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Bharat Taxi | ఓలా, ఊబర్​లకు గట్టిషాక్​.. ‘భారత్​ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..

    Bharat Taxi | ఓలా, ఊబర్​లకు గట్టిషాక్​.. ‘భారత్​ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Bharat Taxi | దేశంలో ప్రముఖ క్యాబ్​ సర్వీసెస్​ అయిన ఓలా, ఊబర్​లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అతి త్వరలోనే ‘భారత్​ ట్యాక్సీ’​ (Bharat Taxi) సర్వీస్​ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కో- ఆపరేషన్, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించనుంది. అయితే డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా.. కేవలం సభ్యత్వ రుసుముతోనే సేవలను అందించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలపై ప్రజల నుంచి కేంద్రానికి కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Bharat Taxi | ప్రైవేటు సర్వీసులపై ఫిర్యాదులు

    ప్రైవేట్ క్యాబ్ సర్వీసులపై ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదులు వస్తున్నాయి. ఇష్టారీతిన క్యాబ్ ధరలను పెంచడం, పాత వాహనాలను వినియోగించడం, సడెన్ క్యాన్సిలేషన్, వెంటనే రేట్లు పెరగడం తదితర ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారి వద్ద నుంచి కంపెనీలు అత్యధికంగా కమీషన్లు తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆదాయంలో సుమారు 25 శాతం కమీషన్లకే పోతుందని క్యాబ్​ డ్రైవర్లు వాపోతున్నారు.

    Bharat Taxi | ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న భారత్ టాక్సీ సర్వీసులు నవంబర్​లో ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. అయితే తొలుత దేశ రాజధానిలోని విమానాశ్రయాలతో పాటు ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ యాప్ ఆధారిత సేవలు అందించేందుకు ఇప్పటివరకు సుమారు 650 మంది డ్రైవర్లను నియమించుకుంది. ఢిల్లీలో సేవలను పరీక్షించిన అనంతరం దేశ వ్యాప్తంగా ప్రధాన సిటీలకు విస్తరించనుంది.

    Bharat Taxi | సహకార సంస్థ ఏర్పాటు

    భారత్​ టాక్సీ సర్వీస్​ ఏర్పాటు కోసం కేంద్రం ఇప్పటికే ‘సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా దీనికోసం రూ. 300 కోట్ల వాటా మూలధనం కూడా కేటాయించింది. ఈ సహకార సంస్థకు ఇటీవల ఎన్నికలు సైతం నిర్వహించగా.. అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. అలాగే ఎన్​సీడీసీ (NCDC) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గుప్తా వైస్ ఛైర్మన్​గా ఎన్నుకున్నారు.

    Bharat Taxi | ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పనిలేదు

    ‘భారత్‌ ట్యాక్సీ’ సేవల్లో రైడ్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా డ్రైవర్లకే చెల్లించనున్నారు. డ్రైవర్​లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పనిలేదు. అతి తక్కువ నామినల్‌ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫామ్‌తో పనిచేయవచ్చు. దీని వల్ల డ్రైవర్లకు ఎంతో మేలు జరుగనుంది.

    Laptop Charging | ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    Follow Us : WhatsappFacebookTwitter