change gmail address | ఇక జీమెయిల్ అడ్రస్​ను కూడా సులభంగా మార్చుకోవచ్చు.. మీ డేటాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండానే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: change gmail address | గూగుల్ తన వినియోగదారులకు ఒక కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక మీదట కొత్త జీమెయిల్ ఖాతా రూపొందించుకోకుండానే.. ప్రస్తుత @gmail.com యూజర్‌నేమ్‌ను మార్చుకోవచ్చు. అయితే దీని వల్ల డేటా అంతా పోతుందనే ఆందోళన అవసరంలేదు. డేటా, సమాచారం అలాగే ఉంటుంది. అయితే ఈ సౌకర్యం ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు. గూగుల్ దశలవారీగా ఈ సదుపాయాన్ని అందిస్తూ వస్తోంది. త్వరలోనే అందరి ఖాతాలకు వర్తించనుంది.

change gmail address | ఎలా మార్చుకోవచ్చంటే..

జీమెయిల్ చిరునామా మార్చిన అనంతరం.. పాత అడ్రస్​ ఒక సబ్​ అడ్రస్​(alias)గా మారుతుంది. కాబట్టి పాత లేదా కొత్త చిరునామాకు వచ్చే మెయిల్స్ అన్నీ ఒకే ఇన్‌బాక్స్‌లోకి వచ్చేస్తాయి. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, మ్యాప్స్, ప్లే స్టోర్ వంటి సేవల్లో ఏ చిరునామాతోనైనా లాగిన్ కావొచ్చు. దీనివల్ల ఎటువంటి సమాచారం కోల్పోయే అవకాశం లేదు.

change gmail address | ఆందోళన అవసరం లేదు

మీ జీమెయిల్​ అడ్రస్​ మార్చుకోవడం (change gmail address) వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఈ–మెయిల్స్, ఫొటోలు, ఫైల్స్, మెసేజెస్, అకౌంట్​ హిస్టరీ అన్నీ యథాతథంగా ఉంటాయి. పాత అడ్రస్​ను గూగుల్ శాశ్వతంగా మీ ఖాతాతోనే అనుసంధానం చేసి ఉంచుతుంది. దీనిని మరొకరు తీసుకోలేరు.

change gmail address | కొన్ని పరిమితులు..

ఒకసారి జీ మెయిల్​ అడ్రస్​ మార్చిన తర్వాత, కొత్త చిరునామాను ఏడాది పాటు మళ్లీ మార్చడం లేదా తొలగించడం సాధ్యం కాదు. ప్రతి ఖాతాకు మూడు సార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా నాలుగు జీమెయిల్ చిరునామాలు ఒకే ఖాతాతో లింక్ చేయవచ్చు. పాత క్యాలెండర్ ఈవెంట్స్ వంటి కొన్ని పాత అంశాల్లో ఇంకా పాత చిరునామా కనిపించవచ్చు.

కాగా.. కొన్ని సేవలు కొత్త చిరునామాతో సరిగ్గా పనిచేయకపోవచ్చు. క్రోమ్‌బుక్, గూగుల్ లాగిన్‌తో పనిచేసే యాప్స్ లేదా క్రోమ్ రిమోట్ డెస్క్‌టాప్ వంటి సేవలను ఉపయోగిస్తున్నట్లయితే.. మార్పు చేసే ముందు గూగుల్ సపోర్ట్ డాక్యుమెంటేషన్‌ను పరిశీలించడం మంచిది.

Union Budget 2026 | కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్​..

జీమెయిల్ అడ్రస్​ ఇలా మార్చుకోవచ్చు..

  • 1. myaccount.google.com/google-account-email వెబ్‌సైట్‌కు వెళ్లి, మీ ఖాతాలో సైన్ ఇన్ అవ్వండి.
  • 2. ఎడమవైపు మెనూలో “Personal info” ఎంచుకోండి.
  • 3. “Email” విభాగంలో “Google Account email” ఎంచుకోండి.
  • 4. “Google Account email” కింద “Change Google Account email” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఈ ఆప్షన్ కనిపించకపోతే, మీ ఖాతాలో ఇంకా ఈ సౌకర్యం రాలేదని అర్థం చేసుకోవాలి. ఈ సదుపాయం అందుబాటులోకి రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది.

ఆప్షన్ కనిపిస్తే..

  • – కావాల్సిన కొత్త యూజర్‌నేమ్‌ను నమోదు చేయండి (ఇది ఇంకా ఎవరూ ఉపయోగించకుండా, ముందు తొలగించినది కాకుండా ఉండాలి).
  • – “Change email”పై క్లిక్ చేసి, సూచనలను అనుసరించి నిర్ధారించండి.

ప్రక్రియ పూర్తయిన తర్వాత, కొత్త చిరునామా మీ ప్రధాన జీమెయిల్ చిరునామాగా మారుతుంది. పాత చిరునామా సబ్​ అడ్రస్​గా కొనసాగుతుంది.

ఇది కూడా చదవండి..: Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Related posts

BSNL New Offers Plans 2026: బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన నయా ఆఫర్​ ప్లాన్స్​.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

Your Year with ChatGPT feature | చాట్​ జీపీటీలో ఏడాదంతా ఏం చేశారు.. మీ చరిత్రంతా చెప్పే స్పెషల్​ ఫీచర్​..!