తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Chat GPT | చాట్‌జీపీటీ యూజర్లకు ఓపెన్ ఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఏడాది పాటు చెల్లుబాటు కానుంది.
Chat GPT | గతంలో నెలకు రూ.399
ఈ ప్లాన్ గతంలో వినియోగించుకోవాలంటే నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఓపెన్ఏఐకి భారత్ రెండో అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో కంపెనీ తన AI టూల్స్‌ను ఇక్కడ విస్తరించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. విద్య, వ్యాపారం, కోడింగ్, ఇతర ప్రాజెక్టుల కోసం చాట్‌జీపీటీని ఉపయోగించే లక్షల మందికి ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.
ChatGPT Go ప్రయోజనాలివే..
ఓపెన్ఏఐ తీసుకున్న నిర్ణయంతో AI వినియోగాన్ని మరింత ప్రోత్సహించనుంది. ఇప్పటి వరకు ఎక్కువగా మెట్రో నగరాల్లోనే వినియోగించగా.. తాజా నిర్ణయంతో ఇది గ్రామీణ ప్రాంతాల కూడా విస్తరించనుంది. “ChatGPT Go” మిడ్-లెవల్ ప్లాన్. ఇది GPT-5 మోడల్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఇది వేగవంతంగా, మరింత కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.
- ఉచిత వెర్షన్ కంటే 10x ఎక్కువ మెసెజ్ లిమిట్లు ఉంటాయి.
- 10x ఎక్కువ ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్లోడ్లు చేసుకోవచ్చు.
- 2x ఎక్కువ మెమరీ ఉంటుంది. దీని వల్ల చాట్‌బాట్ మునుపటి సంభాషణలను గుర్తుంచుకోవడానికి, వ్యక్తిగతీకరించిన సమాధానాలను అందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
- దీర్ఘ సంభాషణలు, విశ్లేషణ, ఇమేజ్ క్రియేషన్ ఉపయోగ పడుతుంది.
ఇప్పటికే పెయిడ్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్న వారి సంగతేంటంటే..!
భారత్‌లో ఇప్పటికే “ChatGPT Go” సబ్‌స్ర్కిప్షన్ పొందిన వారు ఆటోమేటిక్‌గా 12 నెలల ఉచిత ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. ఇందుకోసం తమ ప్లాన్‌ను క్యాన్సిల్, రీ-అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఏడాది తర్వాత సాధారణ ధర వర్తించనుంది.
ఆఫర్‌ను ఎలా పొందాలంటే..?
“ChatGPT Go” ఆఫర్‌ను పొందాలంటే ChatGPT వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. లేదంటే.. సైన్ అప్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత, వినియోగదారులు “ChatGPT Go”ని ఉచితంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి..: Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai