తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: ChatGPT Images: ఓపెన్ ఏఐ సంస్థ తన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్‌జీపీటీ నుంచి కీలక అప్టేడ్ వచ్చింది. ఇటీవల కంపెనీ తన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ “చాట్‌జీపీటీ ఇమేజెస్”కు గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందించింది. ఈ నూతన సంస్కరణ ఓపెన్‌ఏఐ అత్యంత అభివృద్ధి చెందిన ఇమేజ్ మోడల్ “జీపీటీ ఇమేజ్ 1.5” ఆధారంగా పనిచేస్తుంది. ఈ అప్డేట్తో ఇమేజ్ సృష్టి ప్రక్రియ నాలుగు రెట్లు వేగవంతమవుతోంది. అదే సమయంలో వినియోగదారుల సూచనలను మరింత కచ్చితత్వంతో అనుసరిస్తుంది. ChatGPT Images ఇమేజ్‌లోని ముఖ్యమైన వివరాలను అలాగే ఉంచి కేవలం అవసరమైన భాగాలను మాత్రమే సవరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ChatGPT Images, ఈ కొత్త మోడల్ మునుపటి సంస్కరణల కంటే మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఫలితంగా.. వినియోగదారులు ఇచ్చే ప్రాంప్ట్‌లకు బాగా సమీపంగా ఉండే చిత్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇది గూగుల్ ‘నానో బనానా ప్రో’ మోడల్‌కు నేరుగా పోటీ ఇవ్వగల స్థాయిలో ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాట్‌జీపీటీ ఇమేజెస్ కొత్త అప్‌డేట్ స్పెషాలిటీలు
జీపీటీ ఇమేజ్ 1.5 మోడల్ పాత ఇమేజ్ జనరేషన్ సిస్టమ్‌ను పూర్తిగా భర్తీ చేస్తుంది. దీని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. వినియోగదారులు కొత్త చిత్రాలు సృష్టించినా లేదా ఇప్పటికే ఉన్న ఫొటోలను సవరించినా.. మోడల్ సూచనలను బాగా అర్థం చేసుకుని కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఎడిటింగ్ సమయంలో లైటింగ్, కంపోజిషన్, వ్యక్తుల రూపు వంటి ముఖ్య అంశాలను మార్చకుండా ఉంచు.. కేవలం మార్పులను మాత్రమే అమలు చేస్తుంది.
ChatGPT Images
ChatGPT Images : ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
ముందుగా చాట్‌జీపీటీ యాప్ లేదా వెబ్‌సైట్ (chatgpt.com)ను తెరవాలి. సైడ్‌బార్‌లో కొత్తగా జోడించిన “ఇమేజెస్” ట్యాబ్‌ను గమనించవచ్చు. దీనిపై క్లిక్ చేసి.. “క్రియేట్” ఆప్షన్‌ను ఎంచుకోండి.
కొత్త ఇమేజ్ సృష్టించడానికి..
- మీకు కావాల్సిన చిత్రం గురించి వివరంగా ప్రాంప్ట్ టైప్ చేయండి.
- ఎంటర్ నొక్కండి లేదా సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి.
- కొత్త ఇంటర్‌ఫేస్‌లో ప్రీసెట్ స్టైల్స్, ఫిల్టర్స్ మరియు ట్రెండింగ్ ప్రాంప్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించి సృజనాత్మకతను సులభంగా అన్వేషించవచ్చు.
ఇప్పటికే ఉన్న ఇమేజ్‌ను ఎడిట్ చేయడానికి..
- ఇమేజెస్ సెక్షన్‌లో మీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
- కావాల్సిన మార్పులను ప్రాంప్ట్ రూపంలో రాయాలి. (ఉదా: ఒక వస్తువును జోడించడం, తొలగించడం లేదా స్టైల్ మార్చడం).
- మోడల్ ఆ మార్పులను అమలు చేసి, మిగతా వివరాలను అలాగే ఉంచుతుంది.
- అవసరమైతే మరిన్ని మార్పుల కోసం పునరావృత్తి చేయవచ్చు.
ఓపెన్‌ఏఐ ఈ అప్‌డేట్ ద్వారా ఇమేజ్ సృష్టి, ఎడిటింగ్‌ను మరింత ఆహ్లాదకరంగా, సృజనాత్మకంగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫీచర్ ఫ్రీ, ప్లస్, ప్రో వంటి అన్ని సబ్‌స్క్రిప్షన్ స్థాయుల వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ మెరుగైన సాంకేతికతతో చాట్‌జీపీటీ ఇమేజెస్ ఇప్పుడు సృజనాత్మక పనులకు మరింత శక్తివంతమైన సాధనంగా మారింది.
ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్ కల్యాణ్
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai