తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Cracked Lips in Winter | చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు వస్తుంటాయి. చల్లటి గాలుల ప్రభావం ముఖ్యంగా మన పెదవులపై ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గులాబీ రంగులో మెరిసే పెదవులు ఈ సీజన్‌లో పొడిబారి, పగిలి, ఒక్కోసారి రక్తం కారేంతగా బాధిస్తాయి.
ఈ సమస్యను తగ్గించడానికి చాలామంది ఖరీదైన లిప్ బామ్స్ లేదా క్రీములు వాడుతుంటారు. కానీ మన వంటింట్లోనే చిట్కాలు ఉన్నాయి. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా మార్చే 5 సహజ హోం రెమెడీస్‌ను ఇప్పుడు చూద్దాం.
Cracked Lips in Winter | ప్రకృతి ఇచ్చిన ప్రసాదం తేనె
తేనె రుచికోసం మాత్రమే కాదు.. సౌందర్య రహస్యాల్లో ప్రధానమైంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. యాంటీబాక్టీరియల్ గుణాల వల్ల పగుళ్లతో వచ్చే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. స్వచ్ఛమైన తేనెను కొద్దిగా తీసుకుని పెదవులపై పలుచగా రాయండి. రోజులో రెండు లేదా మూడు సార్లు ఇలా చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే కడిగేస్తే, పెదవులు వెన్నలా మృదువవుతాయి.
Cracked Lips in Winter | సహజ రక్షణ కవచం కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి తేమను నిలిపి ఉంచుతాయి. చల్లని గాలుల ప్రభావం నుంచి పెదవులను కాపాడతాయి. కొద్దిగా నూనెను వేళ్లతో తీసుకుని రోజంతా అప్లయ్ చేయండి. ఇది పెదవులకు సహజ మెరుపును ఇస్తుంది.
Cracked Lips in Winter |వెన్నలాంటివి కావాలా.. పాలమీగడ
పాల మీగడలో ఉండే సహజ కొవ్వులు, లాక్టిక్ యాసిడ్ పొడిబారిన పెదవులను పునరుజ్జీవింపజేస్తాయి. రాత్రి నిద్రకు ముందు రాసుకుని, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయండి. పెదవులు పట్టులా మారిపోతాయి.
Cracked Lips in Winter | చక్కెర – ఆలివ్ నూనె స్క్రబ్..
పొడిబారిన పెదవులు మృత కణాలతో నిండిపోతాయి. వాటిని తొలగించడానికి ఒక సులభమైన స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఒక చెంచా చక్కెరలో కొద్దిగా ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేయండి. ఒక నిమిషం వలయాకారంలో రుద్దాలి. గోరువెచ్చని నీటితో కడిగేసి నెయ్యి లేదా నూనె రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
Cracked Lips in Winter | దోసకాయ రసం
దోసకాయలోని నీటిశాతం పెదవులకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. పగుళ్ల వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. దోసకాయ ముక్కను లేదా దాని రసాన్ని పెదవులపై 10–15 నిమిషాలు ఉంచండి. వెంటనే చల్లదనం, సాంత్వన కలుగుతుంది.
ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai