తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Dak Sewa App | పోస్టల్ సేవలను తపాల శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా వినియోగించుకునేలా ‘డాక్ సేవ’ పేరిట యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకోవచ్చు.
Dak Sewa App | యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
డాక్ సేవక్ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో (Dak Sewa App) అందుబాటులో ఉంది. అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ కావాలి. ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి సేవలను వినియోగించుకోవచ్చు.
Dak Sewa App | ఈ సౌకర్యాలు పొందవచ్చు..
డాక్ సేవ యాప్ ద్వారా వివిధ సేవలను పొందవచ్చు. పార్సిల్ ట్రాకింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెమెంట్, స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్, పోస్టేజ్ కాలిక్యులేషన్, కంప్లైంట్ రిజిస్ట్రేషన్, ట్రాకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా మీకు దగ్గరలోని పోస్టాఫీసుల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే వినియోగదారులు రియల్ టైమ్‌లో పార్సిళ్లు, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్లను సైతం ట్రాక్ చేయవచ్చు. వినియోగదారులు ఎక్కువ క్యూలలో నిలబడకుండా మెయిల్ ఐటెమ్‌లు, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్శిల్‌లను బుక్ చేసుకోవడానికి దోహదం చేస్తుంది. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కూడా ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఇలా డాక్ సేవక్ యాప్ ద్వారా వివిధ సేవలను మొబైల్ ద్వారానే వినియోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai