తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Dhurandhar collections | రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ రికార్డుల్లో కొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ముఖ్యంగా హిందీ సినిమాల చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్ల నెట్ వసూళ్లను దాటిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది.
Dhurandhar collections | 15 రోజుల్లోనే..
ధురందర్ చిత్రం విడుదలై 15 రోజుల్లోనే భారతదేశంలో రూ.503 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించడం ద్వారా హిందీ చిత్రాల్లో రికార్డును సృష్టించింది. గతంలో షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ 18 రోజుల్లో రూ.505 కోట్లు, రాజ్‌కుమార్ రావు-శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘స్త్రీ 2’ 22 రోజుల్లో రూ.503 కోట్లు సాధించాయి. ఈ రెండు చిత్రాల రికార్డులను ‘ధురంధర్’ బద్దలు కొట్టింది.
Dhurandhar collections | పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ఆధిపత్యం..
పాన్ ఇండియా చిత్రాల జాబితాలో మాత్రం అత్యవేగంగా రూ.500 కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ రికార్డు కొనసాగుతోంది. ఈ తెలుగు చిత్రం కేవలం 11 రోజుల్లోనే రూ.552 కోట్లకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా ర్యాంకింగ్‌లో ‘ధురంధర్’ రెండో స్థానంలో, ‘జవాన్’ మూడో స్థానంలో, ‘స్త్రీ 2’ నాలుగో స్థానంలో నిలిచాయి.
‘DHURANDHAR’ ALBUM: A MASSIVE SUCCESS… The *entire* #Dhurandhar album has hit the bull’s-eye, setting a rare benchmark in today’s music ecosystem.
Every single track from #Dhurandhar is charting across platforms – a rare feat… History rewritten.#JioStudios | #AdityaDhar |… pic.twitter.com/waQ04pTfOP
— taran adarsh (@taran_adarsh) December 20, 2025
Dhurandhar collections | మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్
చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విజయాన్ని పంచుకుంది. 15వ రోజుల్లో ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. రెండు వారాల్లోనే ఈ స్థాయి విజయాన్ని సాధించిన ‘ధురంధర్’ మరిన్ని రోజులు థియేటర్లలో కొనసాగితే.. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Dhurandhar collections | చిత్రం నేపథ్యం..
‘ధురంధర్’ ఒక శక్తివంతమైన స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రణ్‌వీర్ సింగ్ ‘హంజా’ అనే గూఢచారి పాత్రలో అద్భుత నటన కనబర్చారు. పాకిస్తాన్‌లోని కరాచీలోని గ్యాంగ్‌లు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొచ్చుకుపోయి భారత భద్రతను కాపాడే ఈ పాత్రలో రణ్‌వీర్ తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని విమర్శకులు కొనియాడుతున్నారు. ఆయనతో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.