Penci Sport plugin only working with the Soledad theme.

telugu news today - Telugu News Today

Tag: telugu news today

  • instagram hashtags | మీ ఇన్​స్టా వీడియో వైరల్​ అయ్యేందుకు ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి..!

    instagram hashtags | మీ ఇన్​స్టా వీడియో వైరల్​ అయ్యేందుకు ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్: instagram hashtags | ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, పోస్టులకు ఎక్కువ రీచ్​ రావాలనే లక్ష్యంతో చాలా మంది విపరీతంగా హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తుంటారు. ఎడాపెడా హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. కంటెంట్‌కు సంబంధం లేకుండా ట్రెండింగ్​లో ఉన్న హ్యాష్​ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై కఠినమైన పరిమితులను విధించింది.

    instagram hashtags | కేవలం ఐదు మాత్రమే..

    ఇక నుంచి ఒక పోస్ట్ లేదా రీల్‌కు కేవలం ఐదు హ్యాష్‌ట్యాగ్‌లు మాత్రమే జోడించడానికి వీలవుతుంది. ఈ మార్పు క్రమంగా అన్ని ఖాతాలకు వర్తింపజేయనుంది. సాధారణమైన జెనరిక్ ట్యాగ్‌లకు బదులుగా కంటెంట్‌కు రిలేటెడ్​ టార్గెటెడ్ హ్యాష్‌ట్యాగ్‌లను ఎంచుకోవాలని ప్లాట్‌ఫామ్ కంటెంట్ సృష్టికర్తలకు సూచించింది. ఉదాహరణకు.. టెక్నాలజీ లేదా ఫుడ్ కంటెంట్ షేర్ చేసేవారు ఆ రంగాలకు చెందిన హ్యాష్​ట్యాగ్‌లను మాత్రమే వినియోగించాలి. అంతేకాకుండా.. #రీల్స్, #ఎక్స్‌ప్లోర్ వంటి విస్తృత ట్యాగ్‌లు వినియోగిస్తున్నారని.. ఇవి రీచ్‌ను పెంచవని, వాటి వల్ల లాభం లేదని పేర్కొంది.

    instagram hashtags | 2011 నుంచి హ్యాష్‌ట్యాగ్స్​..

    ఇన్‌స్టాగ్రామ్ 2011 నుంచి హ్యాష్‌ట్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి టాపిక్ ఆధారిత డిస్కవరినీ సులభతరం చేయడంతో పాటు అల్గారిథమ్ ఆధారిత కంటెంట్ సిఫారసులకు దోహదపడ్డాయి. ఇప్పటి వరకు ఒక్కో పోస్ట్ లేదా రీల్‌కు గరిష్ఠంగా 30 హ్యాష్‌ట్యాగ్‌లు జోడించే సౌకర్యం ఉండేది. అయితే సంబంధం లేని ట్రెండింగ్ ట్యాగ్‌లను దుర్వినియోగం చేయడం పెరిగినందున ఇన్‌స్టాగ్రామ్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.

    ఇది కూడా చదవండి..: Water Geyser Replacement |ఈ ఐదు సంకేతాలు మీ గీజర్​లో కనిపిస్తున్నారా.. అయితే మీరు వెంటనే మార్చాల్సిందే..!

  • Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..

    Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar collections | రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సూపర్​హిట్​ టాక్​ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ రికార్డుల్లో కొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ముఖ్యంగా హిందీ సినిమాల చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్ల నెట్ వసూళ్లను దాటిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది.

    Dhurandhar collections | 15 రోజుల్లోనే..

    ధురందర్​ చిత్రం విడుదలై 15 రోజుల్లోనే భారతదేశంలో రూ.503 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించడం ద్వారా హిందీ చిత్రాల్లో రికార్డును సృష్టించింది. గతంలో షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ 18 రోజుల్లో రూ.505 కోట్లు, రాజ్‌కుమార్ రావు-శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘స్త్రీ 2’ 22 రోజుల్లో రూ.503 కోట్లు సాధించాయి. ఈ రెండు చిత్రాల రికార్డులను ‘ధురంధర్’ బద్దలు కొట్టింది.

    Dhurandhar collections | పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ఆధిపత్యం..

    పాన్ ఇండియా చిత్రాల జాబితాలో మాత్రం అత్యవేగంగా రూ.500 కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ రికార్డు కొనసాగుతోంది. ఈ తెలుగు చిత్రం కేవలం 11 రోజుల్లోనే రూ.552 కోట్లకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా ర్యాంకింగ్‌లో ‘ధురంధర్’ రెండో స్థానంలో, ‘జవాన్’ మూడో స్థానంలో, ‘స్త్రీ 2’ నాలుగో స్థానంలో నిలిచాయి.

    Dhurandhar collections | మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్​

    చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విజయాన్ని పంచుకుంది. 15వ రోజుల్లో ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. రెండు వారాల్లోనే ఈ స్థాయి విజయాన్ని సాధించిన ‘ధురంధర్’ మరిన్ని రోజులు థియేటర్లలో కొనసాగితే.. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Dhurandhar collections | చిత్రం నేపథ్యం..

    ‘ధురంధర్’ ఒక శక్తివంతమైన స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రణ్‌వీర్ సింగ్ ‘హంజా’ అనే గూఢచారి పాత్రలో అద్భుత నటన కనబర్చారు. పాకిస్తాన్‌లోని కరాచీలోని గ్యాంగ్‌లు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొచ్చుకుపోయి భారత భద్రతను కాపాడే ఈ పాత్రలో రణ్‌వీర్ తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని విమర్శకులు కొనియాడుతున్నారు. ఆయనతో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

  • Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!

    Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Movies releasing this week | సినిమా ప్రియులకు ఈ వారం మంచి ఎంట్రటైన్​మెంట్​ లభించనుంది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి పెద్దగా ప్రచారం లేదు. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందామా..

    Movies releasing this week | థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు

    • సకుటుంబానాం – డిసెంబర్ 19
    • గుర్రం పాపిరెడ్డి – డిసెంబర్ 19
    • మిస్ టీరియస్ – డిసెంబర్ 19
    • అవతార్: ఫైర్ అండ్ యాష్ – డిసెంబర్ 19

    Movies releasing this week | ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు, సిరీస్‌లు

    నెట్‌ఫ్లిక్స్

    • ప్రేమంటే – డిసెంబర్ 19 నుంచి..
    • రాత్ అఖేలీ హై – డిసెంబర్ 19 నుంచి..
    • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 – డిసెంబర్ 18 నుంచి..

    అమెజాన్ ప్రైమ్ వీడియో

    • ధామా (హిందీ) – డిసెంబర్ 16 నుంచి..
    • ఫాలౌట్ – డిసెంబర్ 17 నుంచి..
    • ఏక్ దివానే కీ దివానీయత్ (హిందీ) – డిసెంబర్ 16 నుంచి..
    • ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (వెబ్ సిరీస్) – డిసెంబర్ 19 నుంచి..

    జీ5

    • నయనం – డిసెంబర్ 19 నుంచి..
    • డొమినిక్ అండ్ లేడీస్ వర్సెస్ – డిసెంబర్ 19 నుంచి..

    డిస్నీ+ హాట్‌స్టార్

    • మిసెస్ దేశ్ పాండే (హిందీ సిరీస్) – డిసెంబర్ 19 నుంచి..

    ఈ వారం థియేటర్లలో నాలుగు చిత్రాలు, ఓటీటీలో 10కి పైగా సినిమాలు, సిరీస్​లు రిలీజ్​ కానున్నాయి. ఇవి ప్రేక్షకులకు మంచి ఎంట్రటైన్​మెంట్​ అందించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.

    ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Google Translater | గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్​.. హెడ్‌ఫోన్ల ద్వారా రియల్-టైమ్ అనువాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

    Google Translater | గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్​.. హెడ్‌ఫోన్ల ద్వారా రియల్-టైమ్ అనువాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Google Translater | ప్రముఖ సెర్చ్​ ఇంజన్​ గూగుల్.. ఇటీవల తన గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఒక కొత్త బీటా ఫీచర్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇది యూజర్లు తమ హెడ్‌ఫోన్ల ద్వారా నిజ సమయంలో అనువాదాలను వినే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఫీచర్ సాధారణ హెడ్‌ఫోన్లను లైవ్ అనువాద సాధనంగా మారుస్తుంది. వివిధ భాషల్లో జరిగే సంభాషణలు, ఉపన్యాసాలు లేదా మీడియా కంటెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.

    ఈ రియల్-టైమ్ అనువాదం మాట్లాడే వ్యక్తి టోన్, లయను కాపాడుతుంది. దీనివల్ల ఎవరు మాట్లాడుతున్నారో, ఏమి చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫీచర్ 70కి పైగా భాషలకు సపోర్ట్​ చేస్తుంది. ఇది వైర్డు లేదా వైర్‌లెస్ ఏ హెడ్‌ఫోన్లతోనైనా పనిచేస్తుంది.

    ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ పరికరాల్లో అమెరికా, మెక్సికో, భారత్​లో అందుబాటులో ఉంది. 2026లో ఐవోఎస్​లోనూ అందుబాటులోకి తేనుంది. అలాగే మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

    Google Translater | ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం..

      • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను తెరవండి.
      • హెడ్‌ఫోన్లను కనెక్ట్ చేయండి.
      • “లైవ్ ట్రాన్స్‌లేట్” ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
      • మూల భాషను, అనువాదించాల్సిన భాషను ఎంచుకోండి.
      • వినడం ప్రారంభించండి – అనువాదిత ఆడియో నేరుగా మీ హెడ్‌ఫోన్లలో వినిపిస్తుంది.

    ఈ ఫీచర్ ప్రత్యక్ష సంభాషణలు, ఉపన్యాసాలు, లెక్చర్లు లేదా ప్రయాణంలో విదేశీ భాషా కంటెంట్‌ ట్రాన్స్​లేషన్​ కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

    Google Translater | జెమినీ ఏఐతో మరింత మెరుగైన ట్రాన్స్​లేషన్​

    గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో జెమినీ ఏఐ సాంకేతికతను అనుసంధానం చేస్తోంది. ఇది మరింత సహజంగా, ఉత్తమ ట్రాన్స్​లేషన్​ను అందిస్తుంది. ముఖ్యంగా స్లాంగ్, ఇడియమ్స్, స్థానిక వ్యక్తీకరణలకు సంబంధించి బాగా పనిచేస్తుంది.

    Google Translater | నిజమైన అర్థం ఇచ్చేలా..

    ఉదాహరణకు.. “స్టీలింగ్ మై థండర్” వంటి ఇంగ్లిష్ ఇడియమ్‌ను అక్షరాలా అనువదించకుండా.. దాని నిజమైన అర్థాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రాన్స్​లేట్​ చేస్తుంది. ఈ అప్‌డేట్ అమెరికా, భారత్​లో ఇంగ్లిష్ నుంచి దాదాపు 20 భాషలకు (హిందీ, అరబిక్, జపనీస్, జర్మన్, స్పానిష్, చైనీస్ వంటివి) అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

    ఇది కూడా చదవండి.. : Side Effects of Mobile Phones | స్మార్ట్‌ఫోన్లలో బందీ అవుతున్న బాల్యం.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • ragi rotti | రాగి రొట్టెలు సాఫ్ట్​గా రావాలంటే.. ఈ చిన్న చిట్కా పాటించి చూడండి..!

    ragi rotti | రాగి రొట్టెలు సాఫ్ట్​గా రావాలంటే.. ఈ చిన్న చిట్కా పాటించి చూడండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ragi rotti | ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. అందుకే చాలామంది పోషకాలు పుష్కలంగా ఉండే సాంప్రదాయ ఆహార పదార్థాల వైపు మళ్లుతున్నారు. అలాంటి వాటిలో రాగి రొట్టెలు ప్రముఖమైనవి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారితో పాటు మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.

    అయితే రాగి రొట్టెలు తయారు చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పిండి ముద్ద గట్టిగా అయిపోవడం లేదా చపాతి చేస్తున్నప్పుడు చిట్లిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ సరైన పద్ధతిని అనుసరిస్తే, గోధుమ రొట్టెల్లా మెత్తగా, పొరలు పొరలుగా సులభంగా చేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలతో దూది మెత్తని రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా..!

    Ragi rotti

    ragi rotti | కావాల్సిన పదార్థాలు

    • రాగి పిండి – ఒక కప్పు
    • నీళ్లు – ఒక కప్పు
    • నూనె లేదా నెయ్యి – ఒక టీస్పూన్
    • ఉప్పు – రుచికి తగినంత

    Ragi rotti

    ragi rotti | తయారీ విధానం

    • ముందుగా గిన్నెలో ఒక కప్పు నీటిని స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఆ తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేయండి. నూనె వేయడం ద్వారా రొట్టెలు ఎక్కువ సేపు సాఫ్ట్​గా ఉంటాయి.
    • నీళ్లు బాగా మరిగిన తర్వాత మంటను తగ్గించి లేదా స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే రాగి పిండిని ఆ వేడి నీటిలో కలపండి. గరిటె లేదా విస్క్‌తో ముద్దలు లేకుండా బాగా కలియబెట్టారు. ఆ తర్వాత గిన్నెకు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు పక్కన ఉంచండి.
    • పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్‌లోకి తీసుకోవాలి. చేతులతో బాగా మర్దించి పిసకండి. ఎంత ఎక్కువగా పిసికితే రొట్టె అంత సాఫ్ట్​గా వస్తుంది. చేతికి కొద్దిగా నూనె రాసుకుని మెత్తని ముద్దలా తయారు చేసుకోండి.
    • ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. పొడి రాగి పిండి లేదా గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో మెల్లగా తాల్వండి. వేడి నీటిలో కలిపినందువల్ల రొట్టె అంచులు పగలకుండా చక్కగా ఉంటుంది.
    • పెనం వేడెక్కిన తర్వాత రొట్టెను వేసి, ఒక వైపు బుడగలు వచ్చాక మరో వైపు తిప్పండి. రెండు వైపులా కాలిన తర్వాత మెత్తటి గుడ్డతో అంచులు ఒత్తితే బాగా పొంగుతుంది. లేదా నేరుగా మంట మీద కాల్చినా పూరీలా ఉబ్బుతుంది.

    ragi rotti | టెస్టీగా..

    ఈ రాగి రొట్టెలను పప్పు, పచ్చళ్లు, వంకాయ కూర లేదా ఏదైనా కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లో పెట్టుకుపోయినా గంటల తర్వాత కూడా సాఫ్ట్​గానే ఉంటాయి. ఈ సులభమైన చిట్కాతో ఆరోగ్యవంతమైన రాగి రొట్టెలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి.

    ఇది కూడా చదవండి..: stainless steel containers | స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడని ఫుడ్​ ఐటమ్స్​ ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Home remedies for mouth ulcers | నోటి పుండ్లతో తరచూ ఇబ్బంది పడుతున్నారా.. ఇంటి వైద్యంతో సులభంగా ఉపశమనం పొందవచ్చు..!

    Home remedies for mouth ulcers | నోటి పుండ్లతో తరచూ ఇబ్బంది పడుతున్నారా.. ఇంటి వైద్యంతో సులభంగా ఉపశమనం పొందవచ్చు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Home remedies for mouth ulcers | విటమిన్ల లోపం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మహిళల్లో నెలసరి సమయంలో హార్మోన్ల అసమతుల్యత, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలో అధిక వేడి, ఇలాంటి అనేక కారణాల వల్ల చాలా మంది నోటి పుండ్ల బారిన పడుతుంటారు. ఈ చిన్న పుండ్లు మాట్లాడడం, తినడం, నీళ్లు తాగడం కూడా కష్టతరం చేస్తాయి. మందుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లోనే ఉన్న సహజ పదార్థాలతో ఈ ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Home remedies for mouth ulcers

    Home remedies for mouth ulcers | తులసి ఆకులు..

    పవిత్రమైన తులసి మొక్క ఆరోగ్యానికి అద్భుత ఔషధం. దీని ఆకుల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ 4-5 సార్లు 8-10 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమలడం లేదా ఆకులను నీళ్లలో మెత్తగా నమిలి ఆ నీటితో పుక్కిలించడం వల్ల నోటి పుండ్లు త్వరగా తగ్గుతాయి. అనేక అంతర్జాతీయ పరిశోధనలు తులసిని నోటి రుగ్మతలకు సహజ చికిత్సగా గుర్తించాయి.

    Home remedies for mouth ulcers

    Home remedies for mouth ulcers | సహజ తేనె..

    తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. నోటి పుండ్లపై రోజూ 3-4 సార్లు కాస్త తేనె రాయడం వల్ల నొప్పి, మంట తగ్గి, ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది. మరింత శక్తినిచ్చేందుకు చిటికెడు పసుపును తేనెలో కలిపి రాయవచ్చు. పిల్లల్లో కూడా తేనె సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్సగా నిరూపితమైంది.

    Home remedies for mouth ulcers | కొబ్బరి – బహుముఖ ఔషధం

    కొబ్బరి నూనెను పుండ్లపై సున్నితంగా రాయడం వల్ల తేమ నిలువరించి, నొప్పి తగ్గుతుంది. ఎండు కొబ్బరి ముక్కలు నమలడం లేదా రోజూ రెండు మూడు లేత కొబ్బరి బోండాల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గి, పుండ్లు త్వరగా మాయమవుతాయి.

    Home remedies for mouth ulcers | గసగసాలు

    శరీర వేడిని తగ్గించడంలో గసగసాలకు ఎటువంటి సాటి లేదు. ఒక టీస్పూన్ గసగసాల పొడిని అంతే మోతాదు పంచదారతో కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే నోటి పుండ్లు గణనీయంగా తగ్గుతాయి.

    Home remedies for mouth ulcers | ఇతర సహజ సలహాలు

    • పుండ్లపై ఐస్ ముక్కలతో సున్నితంగా రుద్దితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
    • లవంగం నమలడం లేదా లవంగం నూనె రాయడం వల్ల యాంటీ-బ్యాక్టీరియల్ ప్రభావం వలన నొప్పి తగ్గుతుంది.
    • రోజూ గోరువెచ్చని నీటితో ఎక్కువసార్లు పుక్కిలించడం అత్యంత సులభమైన మార్గం.
    • మజ్జిగ ఎక్కువగా తాగడం లేదా పుండ్లపై నెయ్యి రాయడం కూడా ఉపయోగకరం.
    • పచ్చి ఉల్లిపాయలు తినడం, విటమిన్ సి, బి12 అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం సహాయకారి.
    • టీ, కాఫీ, మాంసాహారం, అధిక మసాలా ఆహారం తాత్కాలికంగా తగ్గించడం మంచిది.
    • ప్రతిరోజూ రెండుసార్లు పళ్లు శుభ్రంగా తోముకోవడం, ఫ్లాసింగ్ చేయడం, మూడు నెలలకోసారి బ్రష్ మార్చడం వంటి నోటి పరిశుభ్రత అలవాట్లు పుండ్లు రాకుండా కాపాడతాయి.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.

    ఇది కూడా చదవండి..: Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda2 Release Date Fix |అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్​.. డిసెంబర్ 12న గ్రాండ్​గా రిలీజ్

    Akhanda2 Release Date Fix |అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్​.. డిసెంబర్ 12న గ్రాండ్​గా రిలీజ్

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Akhanda2 Release Date Fix |ఐదు రోజులుగా సోషల్ మీడియా నుంచి వార్తా ఛానెళ్ల వరకు అన్నీ ‘అఖండ 2’ వాయిదా వార్తలతో నిండిపోయాయి. వివిధ రకాల ప్రచారాలు, వదంతులు, ఆరోపణలు, అభిమానుల ఆందోళనలు కలిసి ఈ విషయం రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. కాగా.. నిర్మాణ సంస్థ సినిమా విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. డిసెంబర్ 12న చిత్రం థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు 14 రీల్స్​ ప్లస్​ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.

    Akhanda2 Release Date Fix | అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్​.. డిసెంబర్ 12న గ్రాండ్​గా రిలీజ్

    Akhanda 2 release update

    ‘‘డబుల్ బ్లాక్‌బస్టర్ అనుభవాన్ని అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం” అని నిర్మాతలు పేర్కొన్నారు. అదనంగా డిసెంబర్ 11 రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటి నుంచి మరే మార్పు ఉండదని, చెప్పిన సమయానికి సమయానికే షోలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

    Akhanda2 Release Date Fix : 11న ప్రీమియర్​ షోస్​

    ప్రస్తుతం అభిమానులందరి దృష్టి డిసెంబర్ 11 అర్ధరాత్రి వచ్చే ఫస్ట్ షో టాక్ మీదే నెలకొని ఉంది. ఈ సందర్భంగా ప్రత్యేక రిలీజ్ ట్రైలర్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త మీనన్ తదితరులు ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించారు.

    మొదట్లో వాయిదా వార్త ఎంతోమంది అభిమానుల్లో నెగటివ్ భావన కలిగించినప్పటికీ, క్రమంగా ఈ నిర్ణయం సినిమా నాణ్యత కోసమే అని గ్రహించిన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ డిసెంబర్ 25 వరకు వెళ్తే ఇంకా ఆలస్యమవుతుందనే ఆందోళన కలిగిన వారికి ఈ ప్రకటన ఊరట కలిగించింది.

    Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • stainless steel containers | స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడని ఫుడ్​ ఐటమ్స్​ ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

    stainless steel containers | స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడని ఫుడ్​ ఐటమ్స్​ ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: stainless steel containers | ప్రాచీన కాలంలో మన పూర్వీకులు వంటకు, నిల్వకు మట్టి పాత్రలే వాడేవారు. కానీ ఆధునిక జీవనశైలితో పాటు అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఇళ్లలో ఎక్కువైపోయాయి. గ్రామాల్లో కూడా ఇప్పుడు స్టీల్ వస్తువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. శుభ్రం చేయడం సులువు. అయితే ఈ సౌలభ్యం వెనుక కొన్ని ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు.

    స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, కొన్ని ఆమ్ల (యాసిడ్) లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో రసాయనిక చర్య జరిగి, స్టీల్‌లోని లోహ అంశాలు (క్రోమియం, నికిల్, ఇనుము మొ.) స్వల్ప మోతాదులో ఆహారంలో కలిసే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యానికి హానికరం కావొచ్చు, రుచి–వాసన కూడా మారిపోతుంది. అందుకే కొన్ని ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాల్లో ఎక్కువ సేపు నిల్వ చేయడం మానేయడం మంచిది.

    stainless steel containers

    stainless steel containers | పచ్చళ్లు

    భారతీయ వంటలో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉప్పు, మసాలా, నూనెతో పాటు పుల్లని రసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్లత్వం, ఉప్పు స్టీల్‌తో స్పందించి పాత్రను తుప్పు పట్టిస్తుంది. ఫలితంగా లోహ రేణువులు పచ్చడిలో కలిసి ఆరోగ్యానికి హాని చేకూర్చవచ్చు. అందుకే ఎప్పటి నుంచో మన పెద్దలు పచ్చళ్లను గాజు లేదా పింగాణీ వాటిల్లోనే నిల్వ చేసేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించడం ఉత్తమం.

    stainless steel containers | పుల్లని ఆహార పదార్థాలు

    నిమ్మకాయ, టమాటో, చింతపండు, ఉసిరి వంటి పుల్లని పదార్థాల్లో సిట్రిక్ యాసిడ్, మరియు మాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని స్టీల్ డబ్బాలో ఎక్కువ సేపు నిల్వ చేస్తే ఆమ్లం స్టీల్‌ను కరిగించి విషకరమైన సమ్మేళనాలు ఏర్పరుస్తుంది. ఫలితంగా ఆహారం చేదుగా మారడంతో పాటు గుండెల్లో మంట, అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి పుల్లని గ్రేవీలు, రసాలను గాజు బాటిల్స్ లేదా ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో మాత్రమే భద్రపరచాలి.

    stainless steel containers

    stainless steel containers | పెరుగు, పెరుగుతో చేసిన వంటకాలు

    పెరుగు సహజంగానే ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. స్టీల్ డబ్బాలో నిల్వ చేస్తే త్వరగా పులిసిపోతుంది. రుచి–వాసన పోతుంది, పోషక విలువలు కూడా తగ్గుతాయి. అందుకే మన ఇళ్లలో ఇప్పటికీ పెరుగును మట్టి లేదా గాజు పాత్రలోనే పెట్టే సంప్రదాయం ఉంది. మట్టి పాత్ర అయితే పెరుగు చల్లగా, తాజాగా ఎక్కువ రోజులు ఉంటుంది.

    stainless steel containers | తాజా పండ్లు (ముఖ్యంగా ఆమ్లత్వం ఎక్కువ ఉన్నవి)

    ఆపిల్, నారింజ, ద్రాక్ష, కివీ వంటి పండ్లను స్టీల్ డబ్బాలో పెడితే త్వరగా నల్లబడతాయి లేదా మృదువుగా మారి పాడైపోతాయి. స్టీల్ ఉపరితలం తేమను పీల్చుకుని పండ్లలో ఆక్సిడేషన్ వేగంగా జరిగేలా చేస్తుంది. అందుకే ఫ్రిజ్‌లో ఉన్నా సరే, పండ్లను ప్లాస్టిక్ లేదా గాజు ట్రేల్లోనే ఉంచడం మంచిది.

    stainless steel containers | తేనె

    తేనెలో సహజ ఆమ్లాలు ఉంటాయి. స్టీల్‌తో ఎక్కువ కాలం సంబంధం ఉంటే స్వల్పంగా లోహ రుచి వచ్చే అవకాశం ఉంది. అందుకే సంప్రదాయంగా తేనెను గాజు బాటిల్స్‌లోనే నిల్వ చేస్తారు.

    స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వంటకు, సాధారణ నిల్వకు ఎంతో ఉపయోగకరం అయినప్పటికీ, ఆమ్లత్వం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలతో జాగ్రత్త అవసరం. గాజు, మట్టి, లేదా ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ పాత్రలు ఈ సందర్భాల్లో ఎప్పుడూ సురక్షితమైన, ఆరుచికరమైన ఎంపికలు. చిన్న జాగ్రత్తతోనే మన ఆహారం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

    ఇది కూడా చదవండి..: soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Apple Fitness Plus | భారత్‌కు వచ్చేస్తున్న ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ సర్వీస్​.. డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి..

    Apple Fitness Plus | భారత్‌కు వచ్చేస్తున్న ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ సర్వీస్​.. డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Apple Fitness Plus | ఆపిల్ కంపెనీ తన ప్రముఖ ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ సేవ ‘ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్’ను ఈ నెల 15వ తేదీ నుంచి భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి తెస్తోంది. 2020లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఒకేసారి 17 కొత్త దేశాలు, ప్రాంతాలకు విస్తరిస్తూ, ఇదే తన చరిత్రలో అతిపెద్ద విస్తరణగా ఆపిల్ పేర్కొంది.

    ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ అంటే కేవలం వర్కౌట్ యాప్ మాత్రమే కాదు. ఇది ఆపిల్ ఎకోసిస్టమ్‌లోని పరికరాలతో పూర్తిగా అనుసంధానమై పనిచేసే సమగ్ర డిజిటల్ ఫిట్‌నెస్ వేదిక. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీలలోని ఫిట్‌నెస్ యాప్ ద్వారా దీన్ని సులువుగా ఉపయోగించవచ్చు. ఆపిల్ వాచ్ ఉంటే మీ హృదయ స్పందన రేటు, కేలరీల ఖర్చు, యాక్టివిటీ రింగ్స్ ప్రోగ్రెస్ వంటి వ్యక్తిగత డేటా రియల్ టైమ్‌లో స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో 3తో కలిపి ఉపయోగిస్తే ఈ అనుభవం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

    ప్రస్తుతం 12 రకాల వ్యాయామ శైలులు ఈ సేవలో అందుబాటులో ఉన్నాయి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT), పిలేట్స్, డాన్స్, సైక్లింగ్, కిక్‌బాక్సింగ్, మెడిటేషన్, ట్రెడ్‌మిల్ / రన్నింగ్, రోయింగ్, కోర్ ట్రైనింగ్, మైండ్‌ఫుల్ కూల్‌డౌన్ వంటివి ఉన్నాయి. ప్రతి వ్యాయామం 5 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉంటుంది. కొత్తగా వచ్చే వినియోగదారుల నుంచి అనుభవజ్ఞుల వరకు అందరికీ అనుగుణంగా రూపొందించారు.

    Apple Fitness Plus | ప్రత్యేక ఫీచర్స్

    • కస్టమ్ ప్లాన్స్: మీకు ఇష్టమైన వ్యాయామ రకం, సమయం, ట్రైనర్, సంగీతం ఆధారంగా వారంవారీ వ్యక్తిగత షెడ్యూల్ తయారు చేస్తుంది.
    • స్టే కన్సిస్టెంట్, పుష్ ఫర్దర్, గెట్ స్టార్టెడ్ వంటి రెడీమేడ్ ప్రోగ్రామ్స్.
    • ఆపిల్ మ్యూజిక్‌తో లోతైన అనుసంధానం.. హిప్-హాప్, లాటిన్, K-పాప్ సహా ఎన్నో జానర్ల ప్లేలిస్ట్‌లు.
    • ‘రన్ యువర్ ఫస్ట్ 5K’, ‘పిలేట్స్ ఫర్ మోర్ దెన్ యువర్ కోర్’ వంటి లక్ష్యాధారిత కలెక్షన్స్.
    • 12 రకాల మెడిటేషన్ థీమ్స్ – కామ్, స్లీప్, సౌండ్ మొదలైనవి.

    Apple Fitness Plus | ధర & లభ్యత:

    భారత్‌లో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.149, వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.999కు లభిస్తుంది. ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఐదుగురు కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ షేరింగ్ ద్వారా) ఉపయోగించుకోవచ్చు.

    కొత్తగా ఆపిల్ వాచ్, ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీ, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లేదా పవర్‌బీట్స్ ప్రో 2 కొనుగోలు చేసిన వినియోగదారులకు మొదటి మూడు నెలలు పూర్తిగా ఉచితం.

    Apple Fitness Plus | ఈ సేవ ఏ పరికరాల్లో పనిచేస్తుంది?

    • ఐఫోన్ 8 లేదా తదుపరి మోడల్స్
    • ఆపిల్ వాచ్ సిరీస్ 3 లేదా తర్వాతి వెర్షన్లు
    • ఐప్యాడ్ (ఏదైనా తరం)
    • ఆపిల్ టీవీ

    డిసెంబర్ 15 నుంచి భారత్‌తో పాటు చిలీ, హాంకాంగ్, నెదర్లాండ్స్, నార్వే, ఫిలిప్పీన్స్, పోలాండ్, సింగపూర్, స్వీడన్, తైవాన్, వియత్నాం మొదలైన 17 దేశాలు/ప్రాంతాల్లో ఈ సేవ అందుబాటులోకి వస్తోంది. ఈ సందర్భంగా జర్మన్, స్పానిష్ భాషల్లో డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్‌తో భారతీయ వినియోగదారులు ఇకపై తమ ఆరోగ్య లక్ష్యాలను మరింత సులువుగా, ఆసక్తికరంగా సాధించే అవకాశం లభించనుంది.

    ఇది కూడా చదవండి..: Starlink Home Plan India | భారత కస్టమర్ల కోసం స్టార్​ లింక్​ హోం ప్లాన్​.. త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Starlink Home Plan India | భారత కస్టమర్ల కోసం స్టార్​ లింక్​ హోం ప్లాన్​.. త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు..!

    Starlink Home Plan India | భారత కస్టమర్ల కోసం స్టార్​ లింక్​ హోం ప్లాన్​.. త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Starlink Home Plan India | ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్‌లింక్ (Starlink).. భారత్‌లో తన ఉపగ్రహ ఆధారిత హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘రెసిడెన్షియల్ హోమ్ ప్లాన్’ వివరాలను తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. సేవల ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరం చేస్తోంది.

    ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి వాణిజ్య స్థాయి అనుమతులు ఇంకా రాకపోయినా, స్టార్‌లింక్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి భద్రతా పరీక్షలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హోమ్ ప్లాన్ వివరాలను ప్రకటించడం ద్వారా, అనుమతులు లభించిన వెంటనే సేవలు అందుబాటులోకి తెచ్చే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

    Starlink Home Plan India | హోమ్ ప్లాన్ ముఖ్యాంశాలు

    • నెలవారి ఛార్జీ: రూ. 8,600 (పన్నులు అదనం కావచ్చు)
    • హార్డ్‌వేర్ విలువ: సుమారు రూ. 34,000ల డిష్, రూటర్, ఇతర పరికరాలు పూర్తిగా ఉచితం
    • ట్రయల్ సౌకర్యం: 30 రోజుల మనీ-బ్యాక్ గ్యారెంటీతో రిస్క్ ఫ్రీ ట్రయల్
    • డేటా పరిమితి: అపరిమిత డేటా (నో డేటా క్యాప్)
    • వాతావరణ నిరోధకత: ఏ వాతావరణ పరిస్థితుల్లోనూ స్థిరమైన పనితీరు
    • ప్రస్తుతం భారత్‌లో కేవలం రెసిడెన్షియల్ (హోమ్) ప్లాన్ వివరాలు మాత్రమే వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. బిజినెస్ మరియు ఎంటర్‌ప్రైజ్ ప్లాన్‌ల వివరాలు తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

    Starlink Home Plan India | స్టార్‌లింక్​తో ఎయిర్​టెల్​, జియో చర్చలు

    గత కొన్ని నెలలుగా భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలతో స్టార్‌లింక్ చర్చలు జరుపుతోంది. రెండు టెలికాం దిగ్గజాలు స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని ఆసక్తి చూపినప్పటికీ.. నిబంధనల కారణంగా అధికారిక ఒప్పందాలు ఇంకా ప్రకటించబడలేదు. అయితే తాజా పరిణామాలు అనుమతులు స్థిరీకరణ దిశగా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

    Starlink Home Plan India | స్టార్‌లింక్ ప్రత్యేకతలు

    సాధారణ ఫైబర్ లేదా కేబుల్ ఇంటర్నెట్‌కు భిన్నంగా, స్టార్‌లింక్ భూమికి దగ్గరలో (లో ఎర్త్ ఆర్బిట్) తిరుగుతున్న వేలాది చిన్న ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా సేవలు అందిస్తుంది. దీని వల్ల మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. తక్కువ లేటెన్సీ (జాప్యం తక్కువ) ఉంటుంది. వర్షం, మంచు, తుఫాను వంటి ప్రతికూల వాతావరణంలోనూ స్థిరమైన డేటా వస్తుంది. ప్రస్తుతం భూమి చుట్టూ 7,000కు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    Starlink Home Plan India | ఇంటర్నెట్ వేగం

    అంతర్జాతీయంగా 2024 చివరి త్రైమాసిక గణాంకాల ప్రకారం.. స్టార్‌లింక్ డౌన్‌లోడ్ వేగం సగటున 100 నుంచి 200 Mbps మధ్య ఉంటోంది. భారత్‌లో భౌగోళిక పరిస్థితులు, ఉపగ్రహ కవరేజ్ ఆధారంగా ఈ వేగం మారవచ్చు. అయితే పట్టణాలతో పోలిస్తే మారుమూల ప్రాంతాల్లో ఇది గణనీయమైన మెరుగుదలనిస్తుందనే అంచనా విశ్లేషకులది.

    భారత్‌లో డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కవరేజ్ పెంచడానికి స్టార్‌లింక్ వంటి శాటిలైట్ సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. అనుమతులు లభించిన వెంటనే దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

    ఇది కూడా చదవండి..: Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai