Penci Sport plugin only working with the Soledad theme.

telugu news today - Telugu News Today

Tag: telugu news today

  • Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Machine Guns | ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) తమ ఉత్పత్తులైన లైట్ మెషిన్ గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 40,000 ఎల్‌ఎంజీల తొలి బ్యాచ్ భారత్ చేరుకునే అవకాశం ఉందని సంస్థ సీఈవో షుకి స్క్వాట్జ్ తెలిపారు. గతేడాది కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ సరఫరా జరగనుంది. కాగా ఇందుకు సంబంధించి అన్ని పరీక్షలు, నాణ్యతా తనిఖీలు పూర్తయ్యాయి. ఉత్పత్తి అనుమతులు కూడా లభించిన నేపథ్యంలో తొలి బ్యాచ్‌ను వచ్చే ఏటి మొదటి త్రైమాసికంలో అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.

    Machine Guns | త్వరలోనే ఒప్పందం

    అదే సమయంలో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (సీక్యూబీ) కార్బైన్‌ల కొనుగోలుకు సంబంధించిన మరో భారీ ఒప్పందం కూడా ఖరారు దశలో ఉంది. సుమారు 1.70 లక్షల కార్బైన్‌ల సరఫరాకు భారత్ ఫోర్జ్ ప్రధాన భాగస్వామిగా, ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ద్వితీయ భాగస్వామిగా ఒప్పందం కుదరనుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా 2026 మొదట్లోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.

    Machine Guns | 60 శాతం స్థానికంగా..

    ఈ కార్బైన్‌లలో 60 శాతం భారత్ ఫోర్జ్ ద్వారా స్థానికంగా తయారు చేయనుండగా.. మిగిలిన 40 శాతం (సుమారు 1.70 లక్షలు) అదానీ గ్రూప్‌కు చెందిన పీఎల్‌ఆర్ సిస్టమ్స్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. దీంతో పాటు పిస్టల్స్, అసాల్ట్ రైఫిల్స్, ఇతర చిన్న తరహా ఆయుధాలను కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాలకు సరఫరా చేయడం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు షుకి స్క్వాట్జ్ తెలిపారు.

    Machine Guns | ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ‘అర్బెల్’

    ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ భారత్‌కు అందించబోయే మరో అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ‘అర్బెల్ టెక్నాలజీ’. ఇది ప్రపంచంలోనే తొలి పూర్తి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌గా పరిగణించబడుతోంది. అత్యంత కచ్చితమైన లక్ష్య సాధన, రియల్ టైమ్ బాలిస్టిక్ కాలిక్యులేషన్, అధునాతన సెన్సార్ల సాయంతో యుద్ధక్షేత్రంలో సైనికుల ప్రాణాలను కాపాడేందుకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని సంస్థ పేర్కొంటోంది.

    ఇది కూడా చదవండి..: RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.

    Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు

    సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన నిర్మాణ సంస్థ.. “అఖండ-2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేం మా వంతు అన్నీ ప్రయత్నాలు చేశాం. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఊహించని రీతిలో పరిస్థితులు మారిపోతాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ గారికి, దర్శకుడు బోయపాటి శ్రీను గారికి మా కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.

    Akhanda 2 release update

    Akhanda 2 release update | ఎన్నో పుకార్లు..

    ముందుగా డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేసిన ఈ చిత్రం, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఆలస్యం చుట్టూ ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇటీవలే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వదంతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను సద్దుమణిగేందుకు చొరవ తీసుకున్న వారిలో ఆయన కూడా ఒకరని సమాచారం.

    Akhanda 2 release update | నిర్మాత పోస్ట్​

    ప్రస్తుతం చిత్ర బృందం అన్ని అడ్డంకులను అధిగమించి, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని నిర్మాత రామ్​ ఆచంట సైతం ట్విట్టర్​లో స్పష్టం చేశారు.

  • RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: RBI interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

    దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.

    RBI interest Rates | ఈ ఏడాది నాలుగోసారి..

    ఈ ఏడాది ఇప్పటివరకు ఇది నాలుగో రేటు కోత కావడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. ప్రస్తుతం మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో మొత్తం 1.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించినట్లయింది. ఈ నిరంతర కోతలతో హోం లోన్, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు ఈఎంఐ భారం నుంచి మరింత ఉపశమనం లభించనుంది.

    గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. “రూపాయి మారకం విలువలో కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం చాలా గతంలో లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఆర్థిక వృద్ధి ఊపందుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు” అని వివరించారు.

    RBI interest Rates | సమీక్షలో ప్రకటించిన మరిన్ని ముఖ్య అంశాలు..

    • 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి భారీగా పెంచుతూ ఆర్‌బీఐ ఆశాజనక సంకేతాలు ఇచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, వినియోగం పెరుగుదల కారణంగా రెండో త్రైమాసికంలోనే 8.2 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది.
    • ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2.0 శాతానికి తగ్గించారు. ఇది సామాన్య ప్రజలకు మరింత ధరల స్థిరత్వాన్ని సూచిస్తుంది.
    • ద్రవ్యత పెంచేందుకు రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
    • ఇక దేశీయ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది రాబోయే 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నట్లు గవర్నర్ చెప్పారు.

    RBI interest Rates | రుణగ్రహీతలకు ఊరట

    వరుసగా వడ్డీ రేటులో కోత విధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మరింత పెరిగి, పెట్టుబడులు, వినిమయం ఊపందుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా ఈ తగ్గింపును తమ లోన్ రేట్లకు త్వరగా అనుసంధానం చేయాలని ఆర్‌బీఐ ఒత్తిడి తెస్తోంది. సామాన్య రుణగ్రహీతలకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది.

    ఇది కూడా చదవండి..: BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్​క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    Akhanda 2 release postponed | సోషల్​ మీడియాలో పోస్ట్​

    ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక భావోద్వేగ పోస్టు ద్వారా తెలియజేసింది. “అనివార్యమైన కారణాల వల్ల అఖండ 2ని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేకపోతున్నామని తీవ్ర బాధతో తెలియజేస్తున్నాం. ఈ క్షణం మాకు అత్యంత వేదననిచ్చింది. ప్రతి బాలయ్య అభిమాని, సినీ ప్రేమికుడు ఎదుర్కొనే నిరాశను మేం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం” అని పేర్కొంది. అలాగే వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించి సానుకూల వార్తతో మళ్లీ వస్తామని పేర్కొంది.

    ఈ ఆకస్మిక వాయిదాకు ఆర్థికపరమైన చిక్కులే కారణమని ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి ప్రీమియర్ షోలను రద్దు చేయడం, ఆ తర్వాత విడుదలను వాయిదా వేయడం చర్చకు దారి తీసింది.

    Akhanda 2 release postponed | కొత్త తేదీ​ ఎప్పుడో..

    కొత్త రిలీజ్ తేదీ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం లేదా వీకెండ్‌లోపు స్పష్టమైన ప్రకటన రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రూపొందిన ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మళ్లీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అఘోరగా మరో సారి శక్తివంతమైన పాత్రలో తెరపై అఖండ తాండవం చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, హర్షాలీ మల్హోత్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

    ఇది కూడా చదవండి..: Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్​మ్యాన్​.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!

    Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్​మ్యాన్​.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Rohit Sharma | భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సొంత మైదానంలో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న రోహిత్.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీ20 జెర్సీ ధరించనున్నాడు. అయితే ఇది అంతర్జాతీయ టీ20 కాదు.. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడే అవకాశం ఉందని సమాచారం.

    Rohit Sharma | అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు.. కానీ..

    2024 టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశవాళీ టోర్నమెంట్లలో ఆడడానికి ఆయనకు అభ్యంతరం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.

    Rohit Sharma | నాకౌట్ దశలోనే రంగంలోకి దిగే అవకాశం

    టోర్నమెంట్‌లో లీగ్ దశ ఇప్పటికే జోరుగా సాగుతోంది. అయితే రోహిత్ షెడ్యూల్ దృష్ట్యా లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. బదులుగా డిసెంబర్ 12, 14, 16 తేదీల్లో ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే నాకౌట్ (ప్రీ-క్వార్టర్, క్వార్టర్, సెమీ-ఫైనల్) మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

    Rohit Sharma | ముంబై జట్టు ఫామ్ అద్భుతం

    ఎలైట్ గ్రూప్-ఎలో ఆడుతున్న ముంబై జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లో ఐదింట్లో విజయం సాధించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. కేరళతో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఈ ఫామ్‌తో నాకౌట్ దశకు అడుగుపెట్టిన ముంబైకి రోహిత్ శర్మ జాయిన్ కావడం జట్టుకు భారీ బూస్ట్‌గా మారనుంది.

    ఇది కూడా చదవండి..: Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Eye health tips | కళ్లు మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగం. కళ్ల ద్వారానే మనం ప్రపంచాన్ని గ్రహిస్తాం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లతో గడిపే సమయం గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా హ్రస్వదృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం వంటి సమస్యలు చిన్న వయసులోనే ప్రారంభమవుతున్నాయి. దీంతో కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు రోజువారీ జీవితంలో అనివార్యమైపోయాయి. అయితే ఈ కళ్లద్దాలను రోజంతా ధరించడం వల్ల చూపు మరింత దెబ్బతింటుందని, కళ్లు వాటికి బానిసైపోతాయని చాలామంది భయపడుతుంటారు. ఇది నిజమేనా? నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం..

    కంటి వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పవర్‌తో తయారైన కళ్లద్దాలను ఎంతసేపు ధరించినా చూపు తగ్గదు, కళ్లు బలహీనం కావు. బదులుగా సరైన దిద్దుబాటు లెన్సులు ధరించడం వల్ల కంటిపై పడే అనవసర ఒత్తిడి తగ్గుతుంది. తలనొప్పి, కళ్ల అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. చూపులో మార్పు రావడానికి ప్రధాన కారణాలు వయసు పెరగడం, మధుమేహం, థైరాయిడ్, రక్తపోటు వంటి వ్యాధులు లేదా జన్యుపరమైన అంశాలే కానీ కళ్లద్దాలు కాదు.

    Eye health tips | కంప్యూటర్ ముందు గంటలకొద్దీ కూర్చుంటే..

    స్క్రీన్ వైపు ఎక్కువ సమయం చూడటం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (డిజిటల్ ఐ స్ట్రెయిన్) వస్తుంది. దీని లక్షణాలు.. కళ్లు ఎండిపోవడం, ఎర్రబడటం, తలనొప్పి, మెడ నొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ ఇవి శాశ్వతంగా చూపును దెబ్బతీసే సమస్యలు కావు. సరైన అలవాట్లు పాటిస్తే ఈ ఇబ్బందులు తగ్గుతాయి.

    Eye health tips | వీటిని పాటిస్తే మేలు..

    • ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. ఇది కళ్లకు విశ్రాంతినిస్తుంది.
    • స్క్రీన్‌ను కంటి స్థాయి కంటే కొంచెం కింద ఉంచండి.
    • గదిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి (ఎక్కువ చీకటి లేదా ఎక్కువ కాంతి రెండూ హానికరమే).
    • ప్రతి గంటకు ఒకసారి కళ్లు మూసుకొని 30 సెకన్లు విశ్రాంతి తీసుకోండి.
    • ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ వాడకం గురించి డాక్టర్‌ను అడగండి.

    Eye health tips | కంటి ఆరోగ్యం కోసం ఆహారం

    విటమిన్ A, లుటీన్, జియాజాంథిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యారెట్, పాలకూర, బ్రకోలీ, కాలే, గుడ్లు, చేపలు, బత్తాయి, నారింజ, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

    సరైన పవర్ కళ్లద్దాలను రోజంతా ధరించడం ఎటువంటి హాని కలిగించదు. బదులుగా కళ్లకు సౌకర్యాన్ని, స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. అపోహలకు భయపడకుండా, నిపుణుల సలహా మేరకు కంటి సంరక్షణ చర్యలు తీసుకుంటే చూపు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.

    ఇది కూడా చదవండి..: Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: BSNL 1 rupee plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తూ ప్రైవేట్ ఆపరేటర్లకు గట్టి పోటీ ఇస్తోంది. గత కొంతకాలంగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ, ప్రత్యేక సందర్భాల్లో అత్యంత తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించి కస్టమర్ల మనసు గెలుచుకుంటోంది.

    ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “ఆజాదీ కా ప్లాన్” పేరుతో రూ.1 రీఛార్జ్ ఆఫర్‌ను (BSNL 1 rupee plan) ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దీపావళి సందర్భంగా “దీపావళి

    BSNL 1 rupee plan

    బొనాంజా” పేరిట మరోసారి ఇదే ఆఫర్‌ను తీసుకొచ్చింది. రెండు సార్లూ ఈ ప్లాన్ ద్వారా భారీ సంఖ్యలో కొత్త కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వ ర్క్‌లో చేరారు.

    BSNL 1 rupee plan | ప్రస్తుతం మరోసారి..

    ఇప్పుడు మరోసారి అదే ఆకర్షణీయ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. కస్టమర్ల నుంచి వివిధ వేదికలపై వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కేవలం ఒక్క రూపాయి ధరతో 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారికంగా ప్రకటించింది.

    BSNL 1 rupee plan | ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు

    • అన్‌లిమిటెడ్ లోకల్ వాయిస్ కాలింగ్ (ఏ నెట్‌వర్క్‌కైనా)
    • రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా (ఆ తర్వాత అన్‌లిమిటెడ్ రిడ్యూస్డ్ స్పీడ్)
    • రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్ సౌకర్యం
    • వ్యాలిడిటీ: 30 రోజులు

    BSNL 1 rupee plan | డిసెంబర్​ 31 వరకు..

    ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే, కొత్త సిమ్ కార్డు తీసుకునే వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సిమ్ కార్డు పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. ఈ స్కీం డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 31, 2025 వరకు కొనసాగనుంది.

    ఈ ప్రత్యేక ఆఫర్‌ను పొందాలంటే సమీప బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధికారిక కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.

    తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రయోజనాలు అందించే ఈ ప్లాన్ ద్వారా మరింత మంది కస్టమర్లను చేరదీసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ యోచిస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల ధరల పెంపుతో నష్టపోతున్న వినియోగదారులకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

    Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

  • Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

    Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Asthma Care Tips | ఆస్థమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. సాధారణంగా దీన్ని ఉబ్బసం అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఈ సమస్య మొదలైతే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పొడి, చల్లని గాలి ప్రవాహం పెరగడంతో ఆస్థమా (Asthma) లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు ఇరుకైపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిపూట దగ్గు, గురక మరియు తీవ్రమైన ఆయాసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

    అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ( పరిశోధనల ప్రకారం.. చల్లని వాతావరణం, గాలి కాలుష్యం మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఆస్థమా రోగుల్లో దాడులను రెచ్చగొట్టే ప్రధాన కారకాలు. కాబట్టి ఈ ఋతువులో రోగులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

    Winter Asthma Care Tips

    Winter Asthma Care Tips | చలికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు

    చలికాలంలో వెచ్చని దుస్తులు ధరించండి. మెడ, తల, చెవులు, ముక్కు భాగాలు చల్లని గాలికి తగలకుండా స్కార్ఫ్, మఫ్లర్, టోపీ, చేతి తొడుగులు వాడండి. వులెన్ లేదా థర్మల్ దుస్తులు శరీర ఉష్ణోగ్రతను కాపాడుతాయి.

    Winter Asthma Care Tips | ఉదయం త్వరగా బయటకు రావద్దు

    తెల్లవారుజామున ఉష్ణోగ్రత ఎక్కువగా తగ్గి ఉంటుంది. కనీసం ఎండ కాస్తా వరకు ఇంట్లోనే ఉండటం మంచిది. ఉదయం త్వరంగా బయటకు రాకూడదు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

    Winter Asthma Care Tips | గోరువెచ్చని నీరు తాగండి

    రోజుకు 8–10 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగండి. దీనివల్ల శ్వాస మార్గాలు తేమగా ఉండి, ఇరుకైపోకుండా కాపాడుకోవచ్చు. అదనంగా అల్లం టీ, తులసి టీ, మిరియాల రసం వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు.

    ఇన్‌హేలర్‌ను సిద్ధంగా ఉంచుకోండి

    డాక్టర్ సూచించిన మేరకు ప్రివెంటివ్ ఇన్‌హేలర్ (నీలిరంగు) లేదా రిలీవర్ ఇన్‌హేలర్ (ఆకుపచ్చ) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. లక్షణాలు తీవ్రమైతే వైద్యుల సూచనల ప్రకారం వాడండి.

    శ్వాస వ్యాయామాలు ఆచరించండి

    ప్రాణాయామం (అనులోమ విలోమ, భ్రామరీ, కపాలభాతి), డీప్ బ్రీతింగ్, పర్స్డ్ లిప్ బ్రీతింగ్ వంటివి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. రోజూ 10–15 నిమిషాలు ఈ వ్యాయామాలు చేయడం ఎంతో ఉపయోగకరం.

    ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

    చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు ఆస్థమాను మరింత పెంచుతాయి. కాబట్టి మాస్క్ ధరించండి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోండి. జలుబు ఉన్నవారి నుంచి దూరంగా ఉండండి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం గురించి డాక్టర్‌ను అడగండి.

    కెఫీన్‌కు దూరంగా ఉండండి

    టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. వీటిలో ఉండే అధిక కెఫీన్ గుండె వేగాన్ని పెంచి శ్వాస సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. బదులుగా మూలికల టీలు తీసుకోవడం మంచిది. అలాగే పొగ, సిగరెట్ ధూమం, ఐస్‌క్రీమ్, కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శ్వాస మార్గాలను ఇరుకును చేస్తాయి.

    ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచండి

    దుమ్ము, పొగ, ధూళి, పెంపుడు జంతువుల రోమాలు, ఫంగస్ ఆస్థమాను పెంచుతాయి. వీక్లీ వెట్ క్లీనింగ్ చేయండి. బెడ్ షీట్స్‌ను వేడి నీటిలో ఉతకండి. గదిలో హ్యూమిడిఫైయర్ వాడొచ్చు (అధిక తేమ కూడా సమస్య కాకుండా చూసుకోండి).

    ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి

    ప్యాకెట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, అధిక ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం శరీరంలో మంటను పెంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి.

    లక్షణాలు ఎక్కువైతే ఆలస్యం చేయకుండా వెంటనే ఛాతీ వైద్యుడిని లేదా పల్మనాలజిస్ట్‌ను సంప్రదించండి.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.

    ఇది కూడా చదవండి..: Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Avatar 3 | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ విజువల్ స్పెక్టాకిల్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ (Avatar: Fire and Ash) మూడో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులను ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ విజువల్​ వండర్​ మూవీ డిసెంబర్​ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్స్​బుకింగ్స్​కు సంబంధించి కీలక అప్​డేట్​ వెలువడింది.

    Avatar 3 | టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ తేదీ నిర్ణయం

    భారతదేశంలో ‘అవతార్ 3’ (Avatar 3) సినిమా టికెట్ల ముందస్తు బుకింగ్ డిసెంబర్ 5, 2025 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ బుకింగ్స్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజ్​ అవనుంది. గత రెండు భాగాల మాదిరే ఈ చిత్రానికి కూడా అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Avatar 3

    Avatar 3 | IMAX వెర్షన్​ కసం..

    ఈ చిత్రాన్ని అత్యంత భారీ తెరపై అనుభవించాలనుకునే అభిమానుల కోసం IMAX వెర్షన్ భారతదేశంలో విడుదల చేయనున్నారు. అయితే, IMAX ఫార్మాట్ కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లోకే పరిమితం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో IMAX వెర్షన్ లేదు.

    Avatar 3

    Avatar 3 | జేమ్స్ కామెరూన్ సంచలన ప్రకటన

    ఇటీవల ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైతే ‘అవతార్’ సిరీస్‌ను శాశ్వతంగా ముగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కథాంశం, సాంకేతిక ప్రమాణాలపై ఆయనకున్న గట్టి నమ్మకాన్ని ఈ ప్రకటన తెలియజేస్తోంది. ఈ వ్యాఖ్యలు చిత్రంపై ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి.

    ఇది కూడా చదవండి..: Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్​..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్​..

    Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్​..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Samantha Marriage | సమంత రూత్ ప్రభు మరోసారి దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. ప్రముఖ నటి సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-2 దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 1వ తేదీ సోమవారం తెల్లవారుజామున తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది.

    Samantha Marriage | ఎరుపు రంగు చీరలో సమంత

    వధువు సమంత సాంప్రదాయ ఎరుపు రంగు చీరలో కనిపించగా.. వరుడు రాజ్ నిడిమోరు క్రీమ్-బంగారు రంగుల కుర్తా పైజమాలో సొగసుగా ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యులు, అతి సన్నిహితుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు ఈశా ఫౌండేషన్ అధికారికంగా శుభాకాంక్షలు తెలియజేసింది.

    Samantha Marriage | ‘భూత శుద్ధి వివాహం’గా..

    ఈ వివాహాన్ని ‘భూత శుద్ధి వివాహం’గా నిర్వహించినట్లు ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో వెల్లడించింది. యోగ శాస్త్రంలో అత్యంత పవిత్రమైన ఈ విధానం.. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేస్తూ ఆధ్యాత్మిక స్థాయిలో లోతైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందని పేర్కొంది. భౌతిక, మానసిక, భావోద్వేగ స్థాయులకు అతీతంగా ఇద్దరి మధ్య శాశ్వతమైన సామరస్యాన్ని, ఆధ్యాత్మిక ఐక్యతను కలిగించేందుకు ఈ ప్రత్యేక వివాహ క్రతువు రూపొందించబడిందని ఫౌండేషన్ వివరించింది.

    Samantha Marriage | గతే రెండేళ్లు వీరి మధ్య స్నేహం

    గత రెండేళ్లుగా సమంత, రాజ్ నిడిమోరు మధ్య సన్నిహిత స్నేహం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘సిటాడెల్: హనీ బన్నీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వంటి ప్రాజెక్టుల సెట్స్‌లోనే వీరి అనుబంధం మొదలైందని ఇండస్ట్రీలో టాక్​. అలాగే సమంత నిర్మాణ సంస్థ ‘శుభం’ పరిధిలో వచ్చిన చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆ చిత్రం విజయోత్సవ వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

    వివాహం తర్వాత సమంత స్వయంగా సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు ఈ శుభవార్తను తెలియజేశారు. ఆ పోస్టులకు క్షణాల్లోనే లక్షలాది మంది నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెట్టారు.

    ఇది కూడా చదవండి..: Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai