తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Telangana Orange Alert తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయితే రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. సాధారణం కన్నా 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Telangana Orange Alert |అత్యల్పంగా ఆసిఫాబాద్
రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం అర్ధరాత్రి అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 7 డిగ్రీలు, సంగారెడ్డిలో 7.1, ఆదిలాబాద్ 7.7 డిగ్రీలు నమోదైంది. ఆ తర్వాత వికారాబాద్ 8.1, రంగారెడ్డి 8.2, సిరిసిల్ల 8.4, కామారెడ్డి 8.5, నిజామాబాద్ 8.9, జిగిత్యాల 9, మెదక్ 9.3, నిర్మల్ 9.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.
Telangana Orange Alert |హైదరాబాద్‌లోనూ గణనీయంగా చలితీవ్రత
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. హెచ్‌సీయూ శేరిలింగంపల్లి ప్రాంతంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాబోయే రెండు రోజుల పాటు నగరంలో 8-10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Telangana Orange Alert |వణికిపోతున్న ప్రజలు
చలి తీవ్రత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. స్వెట్టర్లు లేనిది ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కాగా.. రానున్న రోజుల్లో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Orange Alert | పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే రెండు రోజుల పాటు అత్యంత తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉన్నందుని పేర్కొంది. 10 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6- 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, భూపాలపల్లి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా చలి ఉంటుందని పేర్కొంది. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారు తప్పనిసరిగా వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలని అధికారులు సూచించారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రయాణాలను తగ్గించుకోవాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్‌కు వచ్చేస్తున్నాయ్.. లాంచింగ్ అప్పుడే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment