తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: UIDAI | దేశంలో సుమారు రెండు కోట్ల మంది ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు UIDAI వెల్లడించింది. చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర సేవలను అక్రమంగా పొందకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఆధార్ డేటాబేస్‌లోని అదనపు వివరాలను తొలగించడానికి దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సుమారు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది.
ఆధార్ నిబంధనల ప్రకారం.. ఒకసారి జారీ చేసిన నంబర్‌ను మరొకరికి ఎప్పటికీ కేటాయించరు. అయినప్పటికీ మరణించిన వ్యక్తుల వివరాలు సకాలంలో తొలగించకపోతే డూప్లికేట్ లావాదేవీలు, మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. దీనిని నివారించేందుకు UIDAI దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టింది.
UIDAI మరణ వివరాలు ఎలా సేకరిస్తున్నారంటే..
UIDAI ప్రస్తుతం కింది విభాగాలతో సమన్వయం చేసుకుని మరణించిన వ్యక్తుల జాబితాను సేకరించనుంది.
- రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI)
- రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
- ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)
- జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP)
- ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు
భవిష్యత్తులో బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు వంటి ప్రైవేట్ రంగ సంస్థలతో కూడా డేటా షేరింగ్ ఒప్పందాలు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వివిధ వనరుల నుంచి సేకరించిన మరణ ధ్రువీకరణ పత్రాలను ఆధార్ డేటాబేస్‌తో సరిపోల్చి, ధ్రువీకరించిన తర్వాత సంబంధిత నంబర్లను డియాక్టివేట్ చేయనున్నారు.
కుటుంబ సభ్యులకు ఆన్‌లైన్ సౌకర్యం
ఈ ఏడాది ప్రారంభం నుంచి ‘మై ఆధార్’ పోర్టల్‌లో ప్రత్యేకమైన సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు తమ ఇంటి సభ్యుడు మరణిస్తే స్వయంగా ఆన్‌లైన్‌లోనే ఆ వ్యక్తి ఆధార్ డియాక్టివేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల ఎన్నో కుటుంబాలు ఇంటి నుంచే ఈ పని పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోంది.
ప్రక్రియ విధానం ఇలా..
1. myAadhaar.gov.in పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి
2. ‘Report Deceased Aadhaar’ సేవను ఎంచుకోవాలి
3. మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, మరణ ధ్రువీకరణ పత్రం నంబరు, తేదీ మొదలైన వివరాలు అప్‌లోడ్ చేయాలి
4. అధికారులు ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత ఆధార్ నంబర్‌ను శాశ్వతంగా నిష్క్రియం చేస్తారు.10:
Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!
1 comment