తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.
Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు
సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన నిర్మాణ సంస్థ.. “అఖండ-2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేం మా వంతు అన్నీ ప్రయత్నాలు చేశాం. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఊహించని రీతిలో పరిస్థితులు మారిపోతాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ గారికి, దర్శకుడు బోయపాటి శ్రీను గారికి మా కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.

Akhanda 2 release update | ఎన్నో పుకార్లు..
ముందుగా డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేసిన ఈ చిత్రం, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఆలస్యం చుట్టూ ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇటీవలే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వదంతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను సద్దుమణిగేందుకు చొరవ తీసుకున్న వారిలో ఆయన కూడా ఒకరని సమాచారం.
Akhanda 2 release update | నిర్మాత పోస్ట్
ప్రస్తుతం చిత్ర బృందం అన్ని అడ్డంకులను అధిగమించి, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని నిర్మాత రామ్ ఆచంట సైతం ట్విట్టర్లో స్పష్టం చేశారు.
We’ve tried our absolute best to bring #Akhanda2 to the big screens, but despite our tireless efforts, sometimes, the most unexpected things happen, and unfortunately, this is that time.
We sincerely apologize to all the fans and cinema lovers across the world who have been…
— 14 Reels Plus (@14ReelsPlus) December 5, 2025
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

1 comment
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://www.binance.info/fr/register?ref=T7KCZASX