AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: AI Jobs in India | ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ (AI) వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుండగా.. మన దేశంలోనూ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టిస్తోంది. కానీ ఒకప్పుడు ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు ఏఐ జాబ్స్ విషయంలో వెనుకబడుతోంది. బెంగళూరు లాంటి సిటీలు దూసుకెళ్తుండగా.. హైదరాబాద్​ వెనుకబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

AI Jobs in India | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బూమ్..

ప్రపంచంలో ఏఐ రాక ఒక విప్లవం. ఈ టెక్నాలజీతో కంపెనీలు ఆటోమేషన్‌ ద్వార ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో కొత్త స్కిల్స్ ఉన్నవాళ్లకు డోర్లు తెరుచుకుంటున్నాయి. భారత్‌లో AI Jobs in India 2025లో మరింత పెరిగాయి. మార్కెట్ $20 బిలియన్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఐటీ సెక్టర్‌లో బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ఎప్పుడూ ముందుండేవి. కానీ ఏఐ విషయంలో డైనమిక్స్ మారాయి. స్టార్టప్‌లు, ఆర్&డీ సెంటర్లు ఇక్కడే పుట్టుకొస్తుండగా.. డిస్ట్రిబ్యూషన్ అసమానంగా ఉన్నాయి.

AI Jobs in India | టాప్‌లో ఉన్న నగరాలు ఏమిటంటే..

తాజా రిపోర్టుల ప్రకారం.. AI Jobsలో బెంగళూరు 26 శాతం షేర్‌తో ముందుంది. ఇక్కడ వేలాది ఏఐ స్టార్టప్‌లు, ఎంఎల్ ఇన్నోవేషన్లు జరుగుతున్నాయి. ఇక పుణె 17 శాతంతో రెండో స్థానం, ముంబై 13 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కేవలం 10 శాతంతో నాలుగో స్థానం నిలిచింది. అలాగే చెన్నై 7శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఆ తర్వాత ప్లేస్​లలో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ రంగంలో బలంగా ఉన్నా.. ఏఐ స్పెసిఫిక్ జాబ్స్‌లో మాత్రం వెనుకబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

AI Jobs in India | కొత్త పెట్టుబడులు

విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయనున్నట్లు అక్టోబర్​లో గూగుల్​ ప్రకటించింది. ఈ నిధులతో ఏఐ డేటా సెంటర్ స్థాపించనుంది. ఇది 1.8 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చనే అంచనాలున్నాయి. అదానీ గ్రూప్ కూడా పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీతో కలిసి పనిచేస్తోంది. హైదరాబాద్‌లో కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటివి ఉన్నాయి. కానీ ఏఐ ఫోకస్ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. టైర్-2 సిటీలు ఇప్పుడు 14-16 శాతం ఏఐ హైరింగ్ చేస్తున్నాయి.

హైదరాబాద్ పుంజుకుంటుందా..

ఏఐ జాబ్స్​లో హైదరాబాద్ ప్రస్తుతం వెనుకబడినా.. వేగంగా పెరిగేందుకు అవకాశం ఉంది. టి-హబ్ లాంటి ఇన్‌క్యుబేటర్లు ఏఐ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఇది ఓవరాల్ AI Jobs in Indiaను పెంచుతుంది. యువత ఏఐపై స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటే.. హైదరాబాద్ తిరిగి టాప్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Related posts

BSNL New Offers Plans 2026: బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన నయా ఆఫర్​ ప్లాన్స్​.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

2 comments

Код binance January 8, 2026,3:57 am - January 8, 2026,3:57 am
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://www.binance.info/register?ref=IXBIAFVY
"Ucretsiz hesap olusturun January 23, 2026,11:52 am - January 23, 2026,11:52 am
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://www.binance.com/id/register?ref=UM6SMJM3
Add Comment