Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today - Page 7 of 13

Author: Harsha Vardhan

  • Karthika Amavasya | విశిష్టం.. కార్తీకమాస అమావాస్య.. ఈ రోజు చేయాల్సిన పనులివే..

    Karthika Amavasya | విశిష్టం.. కార్తీకమాస అమావాస్య.. ఈ రోజు చేయాల్సిన పనులివే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Karthika Amavasya | పవిత్రమైన కార్తీక మాసం అమావాస్యతో ముగియనుంది. ఈ మాసంలో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అయితే కార్తీక వ్రతం పూణ్య ఫలం దక్కాలంటే చివరి రోజైన అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు.. తిథి, శుభముహూర్తం వంటి విషయాలను తెలుసుకుందామా..

    ప్రతి నెల వచ్చే అమావాస్య, పౌర్ణమిలకు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో పాటు అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి యేటా ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. పితృపూజకు కార్తీక అమావాస్యను అత్యంత పవిత్రమైందిగా భావిస్తుంటారు. ఈ రోజు నదీ స్నానాలు ఆచరిస్తారు. అంతే కాకుండా దానధర్మాలు చేస్తుంటారు. కార్తీక అమావాస్య రోజు శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్ముతారు.

    Karthika Amavasya | అమావాస్య తిథి..

    హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య తిథి నవంబర్‌ 19న ఉదయం 9:44 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం 12:17 గంటలకు ముగియనుంది. అయితే అయితే సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే నవంబర్‌ 20న కార్తీక అమావాస్య జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

    Karthika Amavasya | అమావాస్య ప్రాముఖ్యత

    కార్తీక అమావాస్య విశేషమైందిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు ఈ రోజున పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగిందుకు పితృ పూజలు, తిలా తర్పణం, పిండ దానం చేస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు శక్తికొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, సిరి సంపదలు, ఆనందం, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.

    Karthika Amavasya

    Karthika Amavasya | దీపారాధన

    కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంటని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత.. నువ్వుల నూనెతో ఇంటి ముందు, దేవుడి వద్ద, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శ్రీమహావిష్ణువుకు తులసి మాలను సమర్పించడం విశిష్టమైందిగా చెబుతారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

    Karthika Amavasya | ఉపవాస దీక్ష

    అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అందుకే ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే కార్తీక మాసమంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక అమావాస్య నియమాలను శాస్త్రయుక్తంగా ఆచరిద్దాం.

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

    ఇది కూడా చదవండి..: Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

    F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: F-35 fighter jets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో సైనికంగా కీలక పరిణామాలు జరుగనున్నాయి. కాగా.. MBS ఏడేళ్ల తర్వాత అమెరికా రాజధాని సందర్శించడం గమనార్హం.

    ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా మా గొప్ప మిత్రదేశం. వాళ్లు F-35 జెట్లు కొనాలని కోరుకుంటున్నారు.. మేం కచ్చితంగా అమ్ముతాం” అని స్పష్టం చేశారు. సౌదీ ఇప్పటికే 48 వరకు F-35 జెట్ల కోసం అభ్యర్థన పెట్టింది. ఇది బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందంగా మారనుందని తెలిపారు.

    f-35 fighter jets

    F-35 fighter jets | ఈ ఒప్పందంపై ఆందోళన

    అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లోని కొందరు అధికారులు ఈ అమ్మకానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సౌదీ – చైనా సన్నిహిత సంబంధాలు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది చైనా సౌదీకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. రెండు దేశాలు సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. F-35లోని అత్యంత రహస్య సాంకేతికత చైనా చేతికి చిక్కే ప్రమాదం ఉందని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే కారణంతో గతంలో UAEకి F-35 అమ్మకం కూడా ఆలస్యమైంది.

    F-35 fighter jets | మరో కీలక అంశం ఏమిటంటే..

    ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యం (Qualitative Military Edge). అమెరికా చట్టం ప్రకారం ఇజ్రాయెల్‌కు మధ్యప్రాచ్యంలో ఎవరికీ లభించని సైనిక ప్రాధాన్యత ఉండాలి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో F-35లు ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే.

    F-35 fighter jets | అబ్రహం ఒడంబడిక విస్తరణపై ట్రంప్ ఆశలు

    ట్రంప్ తన మొదటి టర్మ్‌లో సాధించిన అబ్రహం ఒడంబడికను (Abraham Accords) విస్తరించాలని భావిస్తున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ ద్వారా మధ్యప్రాచ్య శాంతిని సాధించవచ్చని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. “సౌదీ త్వరలోనే అబ్రహం ఒడంబడికలో చేరుతుందని ఆశిస్తున్నా” అని ట్రంప్ చెప్పారు.

    Source : Indiatvnews.com

    ఇది కూడా చదవండి..: Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్​ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​కు షాక్​ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్​కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు.

    X Chat | వాట్సప్​, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా..

    ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X Chatను లాంచ్ చేయనున్నారు. ఇందులో ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాట్ ఫాం.. డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​తో పాటు అడ్వాన్స్‌డ్ మెసేజ్ కంట్రోల్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా పాత డైరెక్ట్ మెసేజీలు (DM), కొత్త చాట్ ఫంక్షన్స్​ కోసం యూనిఫైడ్ ఇన్‌బాక్స్ అలాంటి స్పెషల్​ ఫీచర్స్​ ఉండడం దీని ప్రత్యేకత.

    X Chat

    త్వరలోనే లాంఛ్​..

    ఈ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారం త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌, ఆడియో, వీడియో కాల్స్​ వంటి ఫీచర్స్​తో కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఆవిష్కరించినట్లు ట్వీట్ చేశారు. కాగా.. ‘ఎక్స్’ను “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చే ఉద్దేశంలో ఉన్న మస్క్​.. త్వరలో ‘ఎక్స్ మనీ’ (X Money) కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. X Chatలో పంపిన మెసేజ్​లు, ఫైల్ షేరింగ్‌తో సహా అన్ని చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​ సౌకర్యం ఉంటుందని వివరించారు. కేవలం వీటిని పంపినవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ యాక్సెస్ చేయలేరని పేర్కొన్నారు.

    ఎడిటింగ్​ ఆప్షన్​

    త్వరలో లాంఛ్​ చేయనున్న ఈ మెసేజింగ్ యాప్​లో యూజర్లు తాము పంపిన మెసేజ్​లను తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చు, లేదంటే డిలిట్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని యాప్​ కల్పించనుంది. అవసరం అనుకుంటే డిసప్పియర్ చేసే వెసలుబాటు కూడా కల్పించనుంది. వాట్సాప్‌లో ఏదైనా సమాచారాన్ని డిలిట్ చేసినట్లయితే This Message was Deleted.. అని కనిపిస్తుంటుంది. కానీ ఎక్స్ చాట్​లో డిలిట్ చేసినట్లయితే ఇలా కనిపించదు.

    ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Saudi Arabia Bus Crash | సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Saudi Arabia Bus Crash) జరిగింది. ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాగా.. మృతులు హైదరాబాద్‌ వాసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

    Saudi Arabia Bus Crash | మక్కాకు వెళ్తుండగా..

    ఉమ్రా యాత్రికులు మక్కా మసీదు అల్‌హరామ్‌లో ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. సౌదీ అధికారులు రక్షణ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపారు. ఎమర్జెన్సీ సర్వీసులు బాధితులను రక్షించేందుకు, మృత దేహాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరణాల సంఖ్య ఇంకా ధ్రువీకరణ కాలేదు. కానీ.. స్థానిక మీడియా ప్రకారం 42 మంది మరణించినట్లు వార్తలు రాస్తున్నాయి. గాయపడినవారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చారని అధికారులు తెలిపారు.

    Saudi Arabia Bus Crash | రంగంలో ఇండియన్​ ఎంబసీ

    రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం ఇండియన్​ ఎంబసీ వెంటనే దీనిపై దృష్టి పెట్టింది. హజ్​ కమిటీతో పాటు భారతీయ ఎంబసీ.. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాయి. మృత దేహాలను భారత దేశానికి తీసుకురావడానికి, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: AI Jobs in India | ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ (AI) వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుండగా.. మన దేశంలోనూ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టిస్తోంది. కానీ ఒకప్పుడు ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు ఏఐ జాబ్స్ విషయంలో వెనుకబడుతోంది. బెంగళూరు లాంటి సిటీలు దూసుకెళ్తుండగా.. హైదరాబాద్​ వెనుకబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

    AI Jobs in India | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బూమ్..

    ప్రపంచంలో ఏఐ రాక ఒక విప్లవం. ఈ టెక్నాలజీతో కంపెనీలు ఆటోమేషన్‌ ద్వార ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో కొత్త స్కిల్స్ ఉన్నవాళ్లకు డోర్లు తెరుచుకుంటున్నాయి. భారత్‌లో AI Jobs in India 2025లో మరింత పెరిగాయి. మార్కెట్ $20 బిలియన్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఐటీ సెక్టర్‌లో బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ఎప్పుడూ ముందుండేవి. కానీ ఏఐ విషయంలో డైనమిక్స్ మారాయి. స్టార్టప్‌లు, ఆర్&డీ సెంటర్లు ఇక్కడే పుట్టుకొస్తుండగా.. డిస్ట్రిబ్యూషన్ అసమానంగా ఉన్నాయి.

    AI Jobs in India | టాప్‌లో ఉన్న నగరాలు ఏమిటంటే..

    తాజా రిపోర్టుల ప్రకారం.. AI Jobsలో బెంగళూరు 26 శాతం షేర్‌తో ముందుంది. ఇక్కడ వేలాది ఏఐ స్టార్టప్‌లు, ఎంఎల్ ఇన్నోవేషన్లు జరుగుతున్నాయి. ఇక పుణె 17 శాతంతో రెండో స్థానం, ముంబై 13 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కేవలం 10 శాతంతో నాలుగో స్థానం నిలిచింది. అలాగే చెన్నై 7శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఆ తర్వాత ప్లేస్​లలో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ రంగంలో బలంగా ఉన్నా.. ఏఐ స్పెసిఫిక్ జాబ్స్‌లో మాత్రం వెనుకబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    AI Jobs in India

    AI Jobs in India | కొత్త పెట్టుబడులు

    విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయనున్నట్లు అక్టోబర్​లో గూగుల్​ ప్రకటించింది. ఈ నిధులతో ఏఐ డేటా సెంటర్ స్థాపించనుంది. ఇది 1.8 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చనే అంచనాలున్నాయి. అదానీ గ్రూప్ కూడా పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీతో కలిసి పనిచేస్తోంది. హైదరాబాద్‌లో కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటివి ఉన్నాయి. కానీ ఏఐ ఫోకస్ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. టైర్-2 సిటీలు ఇప్పుడు 14-16 శాతం ఏఐ హైరింగ్ చేస్తున్నాయి.

    హైదరాబాద్ పుంజుకుంటుందా..

    ఏఐ జాబ్స్​లో హైదరాబాద్ ప్రస్తుతం వెనుకబడినా.. వేగంగా పెరిగేందుకు అవకాశం ఉంది. టి-హబ్ లాంటి ఇన్‌క్యుబేటర్లు ఏఐ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఇది ఓవరాల్ AI Jobs in Indiaను పెంచుతుంది. యువత ఏఐపై స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటే.. హైదరాబాద్ తిరిగి టాప్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: sabarimala temple | శబరిమల అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. మండల-మకరవిళక్కు సీజన్​లో భాగంగా అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుడి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచారు. కానీ సోమవారం తెల్లవారు జాము నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

    sabarimala temple | నేటి నుంచి భక్తులకు అనుమతి

    ఆలయ ప్రధాన పూజారి ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను నిర్వహించారు. పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి పవిత్రమైన 18 మెట్ల వద్ద అధి(పవిత్ర మంట)ని వెలిగించారు. కాగా.. ఆదివారమే ఆలయాన్ని తెరిచినా.. సోమవారం తెల్లవారుజామున అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరిచి తీర్థయాత్ర సీజన్​ను ప్రారంభించారు. నేటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తున్నారు. కాగా.. తీర్థయాత్ర సీజన్​కు సంబంధించిన ఏర్పాట్లను ట్రావెన్‌ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) పరిపాలనా కమిటీ పర్యవేక్షిస్తోంది.

    sabarimala temple | అందుబాటులో స్పాట్ బుకింగ్ కేంద్రాలు!

    ఆన్​లైన్​లో టికెట్లను బుక్ చేసుకుని ప్రతిరోజూ 70,000 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చు. పంబ, నీలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రం, చెంగన్నూర్​లలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి ఆన్​లైన్ బుకింగ్ తప్పనిసరి చేశారు. దర్శన టికెట్లను sabarimalaonline.org వెబ్​సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక అయ్యప్ప ఆలయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

    sabarimala temple

    sabarimala temple | భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

    శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. క్యూలో వేచి ఉండే భక్తులకు బిస్కెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించారు. చిన్నారులు, మహిళల కోసం స్పెషల్​ క్యూ వ్యవస్థను తెచ్చారు. మాలికప్పురంలోని అన్నదాన మండపంలో భక్తులకు తగినంత ఆహారం లభించేలా ఏర్పాట్లు చేశారు.

    sabarimala temple | డిసెంబర్​ 27వ తేదీ వరకు..

    41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగియనుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. తిరిగి డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు.

    ఇది కూడా చదవండి..: Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: vivo x300 | ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ వివో తన “ఫ్లాగ్‌షిప్ X300” సిరీస్‌ను త్వరలో భారత్​లో లాంఛ్​ చేయనుంది. ఈ విషయాన్ని “X” వేదికగా సంస్థ ప్రకటన చేసింది. చైనాలో గత అక్టోబర్​లో రీలీజ్​ చేసిన ఈ సిరీస్​లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో “వివో X300″తో పాటు “X300 ప్రో” తీసుకొచ్చింది. అయితే త్వరలోనే భారత్​లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌లో ఈ మోడళ్లకు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు వెల్లడించింది.

    vivo x300 | సూపర్​ ఫీచర్లతో..

    వివో “X300” సిరీస్​లో కీలక ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, V3+ ఇమేజింగ్ చిప్, ZEISSతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లతో భారత్​లో లాంఛ్​ చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్ “X300” మోడల్​ను స్పెషల్​గా రెడ్ కలర్​లో తీసుకు రానున్నామని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ రెండు మోడల్స్​ డిసెంబర్ 2న భారతదేశంలో విడుదల కానున్నాయి.

    vivo x300

    vivo x300 | ప్రాసెసర్, పనితీరు..

    వివో తీసుకురానున్న రెండు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (3nm) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది V3+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. “ప్రో” మోడల్‌లో అదనపు “ప్రో ఇమేజింగ్ చిప్ VS1” సైతం ఉండనుంది. 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం బాగుంటుంది. ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6పై రన్ అవుతంది.

    vivo x300 | కెమెరా ప్రత్యేకం..

    ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో కంపెనీ ఈ సిరీస్​లోని కెమెరా సిస్టమ్​ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. వివో “X300 ప్రో” మోడల్​లో 50MP (f/1.57) సోనీ LYT-828 మెయిన్ (ZEISS గింబాల్ – గ్రేడ్), 50MP (f/2.0) శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్, 200MP (f/2.67) HPB APO టెలిఫొటో ఫీచర్​తో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇక స్టాండర్డ్ “X300” మోడల్​లో 200MP (f/1.68) HPB మెయిన్ (OISతో), 50MP (f/2.57) సోనీ LYT-602 టెలిఫొటో (OISతో), 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఈ రెండు మెడళ్లలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం 50MP (f/2.0) శాంసంగ్ JN1 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

    ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Varanasi Movie | మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్​లో SSMB29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​ మూవీ టీం మహేశ్ పోస్టర్​తో పాటు టైటిల్, గ్లింప్స్​ను రివీల్ చేశారు. ఈ గ్లింప్స్​ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. నందీశ్వరుడిపై మహేశ్​ బాబు విజువల్స్​ అదరగొట్టాయి.

    Varanasi Movie | నందీశ్వరుడిపై మహేశ్​ ఎంట్రీ

    ఈవెంట్​లో స్టేజ్​పైకి మహేశ్ ఎంట్రీ నెక్ట్స్ లెవెల్​గా నిలిచింది. ఆయన సినిమా క్యాస్టూమ్ ధరించి నందీశ్వ‌రుడిపై కూర్చుని ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 50 ఫీట్ల ఎత్తులో క్రేన్​పై నిల్చుని అభిమానుల‌కు అభివాదం చేశారు. భారీ పబ్లిక్ ఈవెంట్​లో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఏ హీరోకైనా గ్రేట్ అచీవ్​మెంట్ అనే చెప్పాలి.

    Varanasi Movie

    Varanasi Movie | నా డ్రీమ్​ ప్రాజెక్టు

    గ్లోబ్​ ట్రాటర్​ ఈవెంట్​కు హాజరైన మహేశ్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ఇది ఒక నటుడికి లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ లాంటిందని పేర్కొన్నారు. ‘మీ అందర్నీ (ఫ్యాన్స్​) కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడకు నార్మల్​గానే వస్తానని చెప్పాను. కానీ, రాజమౌళి కుదరదని చెప్పి నాతో ఇలా స్పెషల్​గా చేయించారు. నన్ను పౌరాణిక సినిమా చేయ‌మ‌ని నాన్న‌గారు చాలాసార్లు అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు. ఈ సినిమా కోసం ఎంత కావాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అంద‌రూ గర్వించేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళి గారిని’ అని మహేశ్​ పేర్కొన్నారు.

    ‘వార‌ణాసి విడుద‌లైన అనంతరం దేశం మొత్తం గ‌ర్వంగా ఫీల‌వుతుంది. ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్ర‌మే. మున్ముందు ఎలా ఉండ‌బోతోందనేది మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నా. మీ మద్దతు ఎల్లపుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌ అనేది చాలా చిన్న మాటే. మీ అభిమానం మాటల్లో చెప్పలేను. ఈవెంట్‌ సజావుగా సాగడానికి సహకరించిన పోలీసు శాఖకు నా ధన్యవాదాలు’ అని మహేశ్ అన్నారు.

    Varanasi Movie

    Varanasi Movie | రాముడిగా మహేశ్‌..: రాజమౌళి

    దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా ప్రారంభించే ముందు ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా విశేషాలు చెబుతాను. అయితే, అన్నింటికీ చెప్పలేదు. కథకు ఉన్న ప్రాధాన్యం ఆధారంగా అది జరుగుతుంది. ఈ మూవీ గురించి మాటల్లో చెప్పలేం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక మాట చెప్పకుండా వీడియో చేద్దామని భావించాం. మార్చిలో ఈవెంట్‌ నిర్వహించి విడుదల చేద్దామని అనుకున్నా కుదరలేదు. జూన్‌, జులై నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు నవంబరు 15న మీ ముందుకు ఈ వీడియోను తెచ్చాం’ అని అన్నారు.

    ‘‘చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం నాకు అంతగా తెలియదు. ఎక్కువగా ఎన్టీఆర్‌ సినిమాలు చూస్తుండేవాడిని చూసేవాడిని. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే కృష్ణగారి గురించి అర్థమైంది. ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ ఆయన సినిమాల వల్లనే పరిచయమైంది. మనం తీసే సినిమాలను స్కోప్​లో తీసి.. ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు బ్లో అప్‌ చేస్తాం. కానీ అది నిజమైన ఐమ్యాక్స్‌ కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను అసలైన ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈవెంట్‌ కోసం మా టీం ఎంతో కష్టపడింది. మేం విడుదల చేసే వీడియో చూసి, ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలవ్వాలని అనుకున్నాం.’

    ‘ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. సినిమాలో మహేశ్‌బాబు పాత్ర.. ఇందుకు ఆయన పడిన కష్టం గురించి ప్రస్తుతం మాట్లాడను. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడతా.. మహేశ్​ నుంచి నేర్చుకునే లక్షణం ఒకటి ఉంది. మనం సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేం. కానీ, మహేశ్‌బాబు షూటింగ్‌కు వస్తే.. అస్సలు మొబైల్​ చూడరు. కారులోనే ఫోన్‌ను పెట్టేసి వస్తారు. ఏడెనిమిది గంటలైనా దాని జోలికి పోరు. నేను కూడా అలా ఉండేందుకు ప్రయత్నిస్తా. అది కచ్చితంగా నేర్చుకుంటా’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.

    ఇది కూడా చదవండి..: Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Prashant kishor | పీకే డకౌట్​.. అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట..!

    Prashant kishor | పీకే డకౌట్​.. అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Prashant kishor | ప్రశాంత్​ కిషోర్​.. దేశ రాజకీయాల్లో ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోని అనేక పార్టీలను గెలుపు తీరాలకు చేర్చారు. దేశంలో చాలా పార్టీలు ఆయనతో పనిచేసేందుకు ఆరాటపడుతుండేవి. అయితే తాజాగా ఆయన పరిస్థితి ‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లు’గా మారింది. ఎందుకంటే ఆయన స్థాపించిన జన్​ సురాజ్​ పార్టీ బీహార్​ డకౌట్​ అయ్యింది. 238 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది.

    Prashant kishor | బొక్కబోర్లా పడ్డ జన్​సురాజ్​ పార్టీ

    బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకుమించి ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. 200లకు పైగా సీట్లు దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్​ బంధన్​ కూటమి 35 సీట్లకే పరిమితమైంది. ఇక ప్రశాంత్​ కిషోర్ (Prashant kishor)​ పార్టీ ఖాతా కూడా తెరవకుండా బొక్కబోర్లా పడింది. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీతో (I-PAC) వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలను అధికారంలో తీసుకురావడంలో పీకే కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.

    Prashant kishor | ఐ-ప్యాక్‌‌తో ఫేమస్..

    ప్రశాంత్ కిషోర్ గతంలో ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) స్థాపించారు. వివిధ దేశాల ఎన్నికల్లో అనుసరించే ప్రచార శైలిని భారత్‌లో తీసుకువచ్చారు. దశాబ్ద కాలానికి పైగా వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. సమాచార విశ్లేషణ ఆధారిత విధానాలు అవలంభించడం, బూత్‌ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అస్త్రాలతో పార్టీలను విజయ తీరాలకు చేర్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పని చేసిన పీకే.. చాయ్ పే చర్చా, అబ్ కీ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలతో నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, బీహార్ నీతీశ్‌ కుమార్‌ గెలుపునకు పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్‌లో అమరీందర్ సింగ్, తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు పనిచేసి.. ఆయా పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు.

    Prashant kishor

    Prashant kishor | వ్యూహాలు విఫలం

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి విజయ ఢంకా మోగించింది. ఎన్నికల ముందు ఎన్డీఏ, మహాగఠ్​ బంధన్​ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని భావించారు. అంతేకాకుండా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్‌ పార్టీ కూడా గణనీయమైన మార్పుకు కారణం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ తాజా ఫలితాల్లో జన్‌సురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. తన వ్యూహ చతురతతో దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలకు గెలుపు అందించిన ప్రశాంత్ కిషోర్ పాచికలు.. స్వరాష్ట్రంలో పారలేదు.

    Prashant kishor | సొంత రాష్ట్రంలో పారని పాచికలు

    ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తన సొంత రాష్ట్రంలో రివర్స్ అయ్యాయి. రాష్ట్రంలో వలసలు తగ్గించి, నిరుద్యోగం లేకుండా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అభివృద్ధిలో వెనకబడిపోయిన రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. అయినా కూడా బీహారీలు ఆయన వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన ప్రయోగించే అస్త్రాలైన సమాచార ఆధారిత ప్రచారం, సోషల్ మీడియా, బూత్ స్థాయి నిర్వహణ ఇవేవీ పనిచేయలేదు. ఎన్నికలకు రెండు, మూడేళ్ల నుంచే సన్నద్ధం అయినా ఓటర్లలో నమ్మకం కల్పించడంలో విఫలమయ్యారు.

    ఇది కూడా చదవండి..: Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

  • child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

    child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: child safety tips | చిన్న పిల్లలు ఉంటే ఇల్లు కళకళాడుతుంది. ఇళ్లంతా సందడిగా ఉంటుంది. చిన్నారులంటే అందరికీ ముద్దే. కానీ వారి పెంచాలంటే ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి (child safety tips) ఉంటుంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సి అవసరం వస్తుంది. ముఖ్యంగా ఆడుకునేటప్పుడు వాళ్లు ఏది చూసినా నోట్లో పెట్టుకుంటుంటారు. బొమ్మల విడి భాగాలు, బ్యాటరీలు, నాణేలు, ఆట వస్తువుల్లాంటివి గొంతులో ఇరుక్కున్న సంఘటనలు చాలా చూస్తుంటాం. ఏదిపడితే అది నోట్ల పెట్టుకోవడం వల్ల శ్వాస ఆడకపోవడంతో ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తుంది. ఒక్కో సారి ప్రాణాలు పోయిన సంఘటనల వార్తలు కూడా చూస్తుంటా. అందుకే ఇంట్లో ఇలాంటి ప్రమాదాల్ని నివారించే సింపుల్ టిప్స్ పాటిద్దాం..

    child safety tips | ఒక్క నిమిషం జాప్యం – పెను ప్రమాదం

    చాలా మంది తల్లులు పిల్లలకు ఆట వస్తువులు ఇచ్చి.. వంటింట్లో లేదా ఇతర పనుల్లో మునిగిపోతారు. ఇలా చేయకూడదంటున్నారు నిపుణులు. మాగ్నెట్స్, బటన్ బ్యాటరీలు, పిన్స్ లాంటివి పిల్లల చేతికి అందకుండా దూరంగా పెట్టాలని సూచిస్తున్నారు. బొమ్మలు ఎప్పుడైనా విరిగిపోతే వాటిని ఉపయోగించకుండా పక్కన పెట్టేయాలని చెబుతున్నారు. మూతలు సడలిన డబ్బాలు, నోటికి సరిపడా చిన్న ప్లాస్టిక్ ముక్కలు, రేడియం బాల్స్ లాంటివన్నీ పిల్లల దృష్టిలో పడకుండా చూడాలంటున్నారు.

    child safety tips

    child safety tips | ఈ వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరపెట్టొద్దు

    నెలల నుంచి 5 ఏళ్ల లోపు పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతుండాలి. మెడలో సన్నని గొలుసు, పూసల దండలు వేయకూడదు. వీటిని నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే నాణేలు, చిన్న బ్యాటరీలు, బొమ్మల స్పేర్ పార్ట్స్, ఆభరణాలు, పెన్సిల్, రబ్బరు బిట్స్, పిన్స్ పిల్లల దగ్గర ఉండాకుండా చూసుకోవాలి. జామకాయ, ఆపిల్ లాంటి పండ్లు ముక్కలు చేసి పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మాంసం తినిపించినట్లయితే చేత్తో నలిపి ఎముకలు తీసేసి మెత్తగా చేసి ఇవ్వండి.

    child safety tips

    child safety tips | పరిస్థితి చేయిదాటకుండా చూసుకోండి

    పిల్లల గొంతులో ఇరుక్కుపోయిందని అనుమానం వస్తే బలవంతంగా లాగొద్దు. అంతేకాకుండా లోపలికి నెట్టొద్దని నిపుణులు సూచిస్తున్నారు. సున్నితంగా బయటకు తీసేలా ప్రయత్నించండి. గట్టిగా దగ్గిస్తే కొన్నిసార్లు బయటపడుతుంది. కానీ వాంతి పుట్టించేందుకు ఇంకో ఆహారం ఇవ్వడం, పొట్టపై గట్టిగా రుద్దడం లాంటివి చేయవద్దని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లోపల గాయాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం ఉత్తమం.

    గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం. వీటిని పాటించే ముందుకు తప్పకుండా నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి..

    ఇది కూడా చదవండి..: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai