Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today - Page 9 of 13

Author: Harsha Vardhan

  • Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

    Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Vande Mataram 150 years celebrations | దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో దేశ భక్తిని నింపిన జాతీయ గీతం ‘వందేమాతరం’. దీనిని రచించి నవంబర్​ 7తో సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం గేయం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరిస్తారు. స్మారక తపాలా బిల్ల, స్మారక నాణేలను కూడా విడుదల చేయనున్నారు.

    Vande Mataram 150 years celebrations

    Vande Mataram 150 years celebrations | దేశ వ్యాప్తంగా వేడుకలు

    వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.50 గంటలకు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా ‘వందేమాతరం’ గేయాలాపన జరగనుంది. అలాగే స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న ప్రతిజ్ఞ చేయనున్నారు.

    Vande Mataram 150 years celebrations | 150 ఏళ్ల మహోన్నత చరిత్ర..

    వందేమాతరం గేయానికి మహోన్నత చరిత్ర ఉంది. దీనిని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా రచించినట్లు చెబుతారు. ఆయన రచించిన నవల ‘ఆనందమఠ్’లో తొలుత ఈ గేయం కనిపించింది. ఈ నవల అప్పట్లో ‘బంగదర్శన్’ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. అనంతరం 1882లో ప్రత్యేక పుస్తకంగా వెలువడింది. ఈ గేయం నాడు ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్పూర్తి నింపింది. అంతేకాకుండా జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటించారు. దీనికి జాతీయ గీతం జనగణమనతో సమాన గౌరవం ఇచ్చారు.

    ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

    Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Hello UPI | ప్రస్తుత కాలంలో మనం ఎక్కడి వెళ్లి ఏది కొనుగోలు చేసినా డిజిటల్​ పేమెంట్స్​ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్​ విధానం వచ్చిన తర్వాత డబ్బుల చెల్లింపు చాలా ఈజీ అయ్యింది. ఇక దీనిని మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇందులో ఉన్న వాయిస్ అసిస్టెంట్​ ఫీచర్​తో మనం పేమెంట్స్​ చేయడం మరింత సులువుగా మారింది. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

    “హలో యూపీఐ” ఉపయోగాలివే..

    Hello UPI ద్వారా భారతీయ ప్రాంతీయ భాషల్లో పేమెంట్స్‌ చేయవచ్చు. ఈ ఫీచర్​ సీనియర్ సిటిజెన్స్, డిజిటల్ నిరక్షరాస్యులు, దృష్టి లోపం ఉన్నవారికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.

    ఏ ఫోన్లలో సపోర్ట్ చేస్తుందంటే..

    Hello UPI అనేది ఫీచర్ ఫోన్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్లు రెండింటిలో పనిచేస్తుంది. యూపీఐ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లో UPI కన్వర్సేషనల్ పేమెంట్స్ చేయవచ్చు.

    ఎవరికి బెస్ట్ అంటే..

    పెద్దవాళ్లు: బటన్ నొక్కడం కష్టమా? వాయిస్‌లో చెప్పండి, పని అయిపోతుంది.

    కళ్లు బాగా కనిపించని వాళ్లు: స్క్రీన్ చూడకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి.

    గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లు: ఇంగ్లీష్ రాదా? మీ తల్లిభాషలోనే మాట్లాడండి.

    టైప్ చేయడం ఇష్టం లేని యంగ్‌స్టర్స్: “హలో UPI, రమేష్‌కి 500 పంపు” అనండి – అంతే!

    ఎందులో ఎలా పనిచేస్తుందంటే..

    స్మార్ట్‌ఫోన్: PhonePe, Google Pay, Paytm – ఏ యాప్ అయినా

    బటన్ ఫోన్: ఫీచర్ ఫోన్‌లో కూడా వాయిస్ పేమెంట్

    కాల్ చేసి: IVR మెనూ విని నంబర్ నొక్కి

    స్మార్ట్ గాడ్జెట్స్: స్పీకర్, టీవీ, ఫ్రిజ్ – రేపటి నుంచి!

    ఎలా పనిచేస్తుంది?

    యాప్ ఓపెన్ చేయండి → “హలో UPI” అని పలకండి.

    వాయిస్ అసిస్టెంట్ మీతో మాట్లాడుతుంది – “ఎంత పంపాలి? ఎవరికి?”

    UPI పిన్ చెప్పండి (లేదా నొక్కండి).

    గమనిక: భద్రత కోసం UPI పిన్ ఇప్పటికీ అవసరమే. వాయిస్‌లో చెప్పినా, టైప్ చేసినా – రెండూ సేఫ్.

    Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

    ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Chat GPT | చాట్​జీపీటీ యూజర్లకు ఓపెన్​ ఏఐ గుడ్​న్యూస్ చెప్పింది. భారత్​లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్​ను ఉచితంగా అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్​ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్​ ఏడాది పాటు చెల్లుబాటు కానుంది.

    Chat GPT | గతంలో నెలకు రూ.399

    ఈ ప్లాన్ గతంలో వినియోగించుకోవాలంటే నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఓపెన్​ఏఐకి భారత్​ రెండో అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో కంపెనీ తన AI టూల్స్​ను ఇక్కడ విస్తరించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. విద్య, వ్యాపారం, కోడింగ్, ఇతర ప్రాజెక్టుల కోసం చాట్​జీపీటీని ఉపయోగించే లక్షల మందికి ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.

    ChatGPT Go ప్రయోజనాలివే..

    ఓపెన్​ఏఐ తీసుకున్న నిర్ణయంతో AI వినియోగాన్ని మరింత ప్రోత్సహించనుంది. ఇప్పటి వరకు ఎక్కువగా మెట్రో నగరాల్లోనే వినియోగించగా.. తాజా నిర్ణయంతో ఇది గ్రామీణ ప్రాంతాల కూడా విస్తరించనుంది. “ChatGPT Go” మిడ్-లెవల్ ప్లాన్. ఇది GPT-5 మోడల్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఇది వేగవంతంగా, మరింత కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.

    • ఉచిత వెర్షన్ కంటే 10x ఎక్కువ మెసెజ్ లిమిట్​లు ఉంటాయి.
    • 10x ఎక్కువ ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్​లు చేసుకోవచ్చు.
    • 2x ఎక్కువ మెమరీ ఉంటుంది. దీని వల్ల చాట్‌బాట్ మునుపటి సంభాషణలను గుర్తుంచుకోవడానికి, వ్యక్తిగతీకరించిన సమాధానాలను అందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
    • దీర్ఘ సంభాషణలు, విశ్లేషణ, ఇమేజ్ క్రియేషన్​ ఉపయోగ పడుతుంది.

    ChatGPT Go

    ఇప్పటికే పెయిడ్​ సబ్​స్ర్కిప్షన్​ తీసుకున్న వారి సంగతేంటంటే..!

    భారత్​లో ఇప్పటికే “ChatGPT Go” సబ్​స్ర్కిప్షన్​ పొందిన వారు ఆటోమేటిక్​గా 12 నెలల ఉచిత ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. ఇందుకోసం తమ ప్లాన్​ను క్యాన్సిల్, రీ-అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఏడాది తర్వాత సాధారణ ధర వర్తించనుంది.

    ఆఫర్‌ను ఎలా పొందాలంటే..?

    “ChatGPT Go” ఆఫర్‌ను పొందాలంటే ChatGPT వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. లేదంటే.. సైన్ అప్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత, వినియోగదారులు “ChatGPT Go”ని ఉచితంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

    ఇది కూడా చదవండి..: Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టిక్కెట్ల రీఫండ్ విధానాల్లో పెద్ద మార్పులు చేయడానికి ప్రణాళికలు ప్రతిపాదించింది. ప్రయాణికులకు అనుకూలంగా, వేగంగా రీఫండ్ పొందేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి.

    డీజీసీఏ ప్రతిపాదించిన ప్రకారం.. ఇక నుంచి మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. కాగా.. ఇప్పటి వరకు విమానయాన సంస్థలు టికెట్ల రద్దు, లేదంటే మార్పు కోసం భారీగా ఛార్జీలను వసూలు చేసేవి. తాజాగా.. DGCA తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యకు చెక్​పడనుంది.

    డీజీసీఏ ప్రతిపాదనలు అమలులోకి వస్తే.. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు క్యాన్సిల్​ చేసుకోవడం లేదంటే తేదీ మార్చుకోవడం ఈజీగా మారనుంది. ఈ సమయంలో కాన్సిలేషన్​ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి. అయితే కొత్త టికెట్ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే.. ప్రయాణికుడు ధర తేడాను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అనేది డొమెస్టిక్​ విమాన టిక్కెట్లకు ఐదు రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు వర్తిస్తుంది. ఇక ఇంటర్నేషనల్​ టిక్కెట్లకు 15 రోజుల ముందుగానే బుక్ చేసిన ప్రయాణాలకు వర్తించనుంది. బుకింగ్ చేసిన వెంటనే మార్పు అవసరం వచ్చినా.. ఇకపై ఎయిర్‌లైన్స్​ అదనపు ఛార్జీలు వసూలు చేయబోవు.

    Flight Ticket Cancellation

    Flight Ticket Cancellation | రీఫండ్​ బాధ్యత ఎయిర్​లైన్స్​దే..

    డీజీసీఏ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. టిక్కెట్లను ఏజెంట్, ట్రావెల్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినా.. రీఫండ్ బాధ్యత అనేది ఎయిర్‌లైన్‌దేనని స్పష్టం చేసింది. ఏజెంట్లను ఎయిర్‌లైన్స్​ అధికార ప్రతినిధులుగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతో ఇకపై టికెట్ రద్దు చేసిన తర్వాత రీఫండ్ ఆలస్యం అయినా.. అందకపోయినా ప్రయాణికుడు ఎయిర్‌లైన్‌ను నేరుగా సంప్రదించవచ్చు.

    కాగా.. ఇటీవల కాలంలో టికెట్ రద్దు ఛార్జీలు, రీఫండ్‌లు, ఏజెంట్ సమస్యలు వంటి అంశాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో DGCA ఈ చర్య తీసుకుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే.. భారతదేశంలో విమాన ప్రయాణం ప్రయాణికులకు మరింత అనుకూలంగా మారనుంది.

    ఇది కూడా చదవండి : Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Womens world cup 2025 | జయహో భారత్​.. మహిళా వరల్డ్​ కప్​ విజేతగా టీమిండియా

    Womens world cup 2025 | జయహో భారత్​.. మహిళా వరల్డ్​ కప్​ విజేతగా టీమిండియా

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Womens world cup 2025 | భారత్​ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్​లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్‌ సేన విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్​ కలను ముద్దాడింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం దశాబ్దాల తరబడిగా ఎదురుచూసిన భారతావని పులకించిపోయింది.

    Womens world cup 2025 | దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా

    భారత మహిళా జట్టు చిరకాల కల సాకారమైంది. వ‌న్డే ప్రపంచ క‌ప్‌ను సొంతం చేసుకుంది. నవీ ముంబయి వేదికగా జరిగిన తుదిపోరులో సౌతాఫిక్రాపై భారత్‌ ఘన విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో చిత్తుచేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.

    షెఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ విరోచిత సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2, శ్రీ చరణి ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా షెఫాలీ నిలిచింది. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డును దీప్తి శర్మ అందుకుంది.

    ఇది కూడా చదవండి..: Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Beaver Supermoon 2025 | ‘నింగికి జాబిలీ అందం.. నేలకు తొలకరి అందం’ అని జాబిలి అందాన్ని వర్ణించాడో కవి. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ ఒకప్పుడు అమ్మ చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేంది. ఇదంతా ఇప్పడెందుకు అనుకుంటున్నారా.. చందమామ మన గ్రహానికి దగ్గరగా రానున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ ఏడాదిలోనే అతిపెద్ద బీవర్ సూపర్ మూన్ కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

    ఆ రోజున చంద్రుడు భూమికి 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని చెబుతున్నారు. దీంతో చందమామ మరింత పెద్దగా, కాంతివంతంగా కనిపించనుందంటున్నారు. అయితే దీనిని చూసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని పేర్కొంటున్నారు. కాగా.. గత డిసెంబర్‌లో సైతం ఒక కోల్డ్ మూన్ కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఫిబ్రవరి 2019 తర్వాత అత్యంత దగ్గరగా వచ్చే పౌర్ణమి కానుందని చెబుతున్నారు.

    Beaver Supermoon 2025

    Beaver Supermoon 2025 | మూడు సూపర్​ మూన్​లలో ఒకటి

    బీవర్ మూన్ 2025లో వచ్చే మూడు సూపర్‌మూన్‌లలో ఇదీ ఒకటి. ఈ ఏడాది వచ్చిన మూడింటిలో ఇది రెండవది. అక్టోబర్‌లో వచ్చిన హార్వెస్ట్ మూన్ తర్వాత.. డిసెంబర్‌లో వచ్చే కోల్డ్ మూన్ కూడా సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తాయి. చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో సూపర్‌మూన్ అనేది సంభవిస్తుంది. అందుకే ఇది కొన్నిసార్లు పౌర్ణమి టైంలో భూమికి దగ్గరగా ఉన్న బిందువుకు చేరుకుంటుంది. నాసా ప్రకారం.. పౌర్ణమి సమయంలో 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

    ఇది కూడా చదవండి.. : Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

    Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Storing eggs in the fridge | ‘సండే హోయా మండే.. రోజ్​ కావో అండే..’ ఇది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటన. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ప్రజలకు వివరించేందుకు గతంలో ఈ ప్రకటన ఇచ్చేది. గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఉంటాయన్న మాట. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే గుడ్లను ఎలా నిల్వచేయాలనేది కూడా ముఖ్యం.

    చాలా మంది మార్కెట్ నుంచి తీసుకువచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తుంటారు. ఇలా వీటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్​లో ఉంచి తినటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్​లో గుడ్లు ఎన్ని రోజులు పెట్టవచ్చు. అసలు వీటిని అలా నిల్వ చేయవచ్చా.. ఫ్రీజ్​లో ఉంచిన గుడ్లు ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
    సాధారణంగా అందరి ఇళ్లలో గుడ్లను ఫ్రిజ్​లో నిల్వ చేయడం చూస్తుంటాం. గుడ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని అలా ఫ్రిజ్‌లో పెడుతుంటాయి. అయితే, వీటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే.. వాటిలో ఉండే పోషకాలు చాలా వరకు తగ్గిపోతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. దీంతో గుడ్ల వల్ల శరీరానికి లభించే ప్రయోజనాల కన్నా.. నష్టం ఎక్కువ జరుగుతుందంటున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకుండా చూసుకోవడం ఉత్తమం. తప్పనిసరి అయితే.. చాలా తక్కువ రోజులు ఉంచాలని సూచిస్తున్నారు.

    Storing eggs in the fridge | ఎక్కువ రోజులు ఉంచినట్లయితే..

    గుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్​లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటిలోని పోషకాలు అందవట. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట. గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదని చెబుతున్నారు. గుడ్లను నిల్వ చేయాలనుకుంటే ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి ఉంచాలి. అయితే ఫ్రిజ్‌లో పెట్టే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి.

    Storing eggs in the fridge అయితే గుడ్లను అవసరమైన వరకు ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా పోషకాలు అందుతాయంటున్నారు.

    గమనిక: మేం అందించిన ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో లభ్యమైన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటిని పాటించే ముందుకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

    FAQ: Storing eggs in the fridge

    1. గుడ్లను ఫ్రిజ్‌లో సరిగ్గా ఎలా దాచాలి?

    • ముందుగా, గుడ్లను అసలు కార్టన్‌లోనే ఉంచండి,

      ఫ్రిజ్ తలుపు మీద కాకుండా, మధ్య షెల్ఫ్‌లో పెట్టండి.

    2. గుడ్లు బయట ఉంచితే ఎన్ని రోజులకు చెడిపోతాయి ?

    • ప్యాక్ తేదీ నుంచి + 30 రోజులు.

    ఈ  Samsung Wallet లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..

    Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్​ రిలీఫ్​ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్​ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. కేవైవీ (Know Your Vehicle) ప్రక్రియ పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్ సేవలను వెంటనే నిలిపివేయబోరు. ఈ పక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులకు సమయం ఇవ్వనున్నారు. ఫాస్టాగ్ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    Fastag kyv Process |కేవైవీ పూర్తి చేయకపోతే..

    కేవైవీ ప్రక్రియ కంప్లీట్​ చేయని వాహనదారుల ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుందని కేంద్రం ఇదివరకు చెప్పింది. దీంతో వారు టోల్‌ ఫీజులను క్యాష్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా.. తాజాగా ప్రక్రియను సరళీకృతం చేయడం ద్వారా కేవైవీ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఊరట లభించింది.

    కేవైవీ నిబంధనల ప్రకారం.. కార్లు, జీపులు, వ్యాన్ల సైడ్ ఫొటోలు ఇకపై అవసరం ఉండదు. నంబర్ ప్లేట్, FASTag కనిపిస్తున్న ముందు చిత్రాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాలి. వాహనదారులు వెహికిల్, ఛాసిస్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసినప్పుడు ‘వాహన్’ పోర్టల్ నుంచి ఆర్​సీ వివరాలు ఆటోమేటిక్‌గా పొందుతారు. ఒకే మొబైల్ నంబర్‌కు మీద ఎక్కువ వాహనాలు రిజస్టర్ అయి ఉన్నట్లయితే వినియోగదారులు ఏ వాహనాన్ని కేవైవీ పూర్తి చేయాలని భావిస్తే దానిని సెలెక్ట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

    Fastag kyv Process | ఏదైనా సమస్య వస్తే..

    కేవైవీ ప్రక్రియలో భాగంగా ఏవైనా సర్టిఫికెట్లు అప్​లోడ్​ చేయడంలో ఇబ్బందులు తలెత్తితే ఫస్టాగ్ జారీచేసే బ్యాంక్ కస్టమర్‌ను సంప్రదించాలి. వెంటనే డిస్‌కనెక్ట్ చేయకుండా కేవైవీ విధానం పూర్తి చేయడంలో సహాయం చేయాలి. వినియోగదారులు 1033లో నేషనల్ హైవే హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే బ్యాంకును సంప్రదించవచ్చు.

    Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ బ్రాండ్​ శాంసంగ్​.. తన వాలెట్​లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్​ వాలెట్​లో ఇక నుంచి పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్​ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా శాంసంగ్​ యూజర్లు బయోమెట్రిక్​ లేదా ఫేషియల్​ రికగ్నిషన్​ ద్వారా చెల్లింపు చేసే సౌకర్యం తేనుంది. దీంతో ప్రతి ట్రాన్​సాక్షన్​కు పీన్​ నంబర్​ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.

    Samsung Wallet | ఇక నుంచి ఆ అవసరం ఉండదు..

    కొత్త ఫీచర్లపై శాంసంగ్ ఇండియా సర్వీసెస్ అండ్ యాప్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ మధుర్ చతుర్వేది స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఫీచర్​ను డిసెంబర్ నుంచి అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. “శాంసంగ్​ వాలెట్ అథెంటికేషన్ అనుభవం మరింత మెరుగుపడింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, డివైస్ ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్‌ ద్వారా రోజువారీ చెల్లింపులకు PIN ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు” అని వివరించారు. “యూజర్లు గెలాక్సీ డివైస్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్‌ ద్వారా యాప్ ఓపెన్ చేసి UPI పేమెంట్స్ చేయవచ్చు.” అని పేర్కొన్నారు.

    Samsung Wallet | వీటికి సైతం..

    సామ్‌సంగ్ వాలెట్ త్వరలో క్రెడిట్, డెబిట్ కార్డులు, కీ మర్చంట్లలో ఆన్‌లైన్​లో ఉపయోగించడానికి సపోర్ట్ చేయనుంది. యూజర్లు గూడ్స్, సర్వీసెస్ కొనుగోలు చేసిన సమయంలో శాంసంగ్ వాలెట్‌ ద్వారా సేఫ్‌గా టోకెనైజ్ చేసిన కార్డులతో సీమ్‌లెస్‌గా పేమెంట్​ చేయవచ్చు. అంతేకాకుండా కార్డ్ డీటెయిల్స్ మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చెక్‌అవుట్‌ను మరింత వేగవంతం చేస్తుంది.

    Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రకటించారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక అయిన ‘ట్రూత్‌ సోషల్’​లో ఈ విషయాన్ని వెల్లడించారు.

    US Nuclear Testing | ట్రంప్​ ఏమన్నారంటే..

    “ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు అమెరికా వద్దనే ఉన్నాయి. నా తొలి పదవీ కాలంలో దీనిని సాధించాం. అయితే ఈ ఆయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి వల్ల అప్పట్లో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇతర దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. ఇందులో రష్యా రెండో స్థానంలో ఉండగా.. చైనా మూడో స్థానంలో ఉంది. రానున్న ఐదేళ్లలో ఈ మూడు దేశాలు సమాన స్థాయికి చేరే ఛాన్స్​ ఉంది. అందుకే మన దేశం తిరిగి అణ్వాయుధ పరీక్షలను ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్​కు ఆదేశాలు జారీ చేశా. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభం కానుంది” అని ట్రంప్‌ తెలిపారు.

    US Nuclear Testing తో ట్రంప్ తాజా​ వ్యాఖ్యలతో అమెరికా–రష్యా–చైనాల మధ్య అణు ఆయుధ పోటీ కొత్త దశకు చేరనున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల రష్యా తన అణు సామర్థ్యాలను పెంచుకునేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల రష్యా పరీక్షించిన పోసిడాన్ అణు డ్రోన్‌ సబ్‌మెర్సిబుల్‌ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించారు. అదే సమయంలో చైనా కూడా తన అణ్వాయుధాలను విస్తరించాలని భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ట్రంప్​ దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే.. ట్రంప్‌ ప్రకటించిన ఈ నిర్ణయంపై అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనట్లు తెలుస్తోంది.

    ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai