Penci Sport plugin only working with the Soledad theme.

Bank Account Nominees | Good News for Bank Account Holders

Bank Account Nominees | బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. ఇక నుంచి నలుగురు నామినీలు..

Bank Account Nominees

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bank Account Nominees | బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి తమ ఖాతాలకు నామినీని జోడించడం మరింత సులభతరం కానుంది. ఇప్పటి వరకు ఒక్కరినే నామినీగా చేర్చగలిగేవారు. కాగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇక నుంచి నలుగురు వరకు నామినీలుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Bank Account Nominees | కొత్త నిబంధనలు ఏమిటంటే..

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఖాతాదారుడు మరణించినట్లయితే.. ఆ తర్వాత అతని కుటుంబీకులు, వారసులు డబ్బుల కోసం బ్యాంకులో క్లెయిమ్ చేసిన సమయంలో తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. కానీ ఇక నుంచి అకౌంట్​ హోల్డర్​ ముందుగానే ఒకరి కన్నా ఎక్కువ నామినీలను నిర్ణయించవచ్చు. ఇందులో ఎవరెవరికి ఎంత శాతం వాటా ఇవ్వాలో స్పష్టంగా పేర్కొనవచ్చు. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో వారసత్వ వివాదాలు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Bank Account Nominees | ప్రస్తుత విధానంలో..

ప్రస్తుతం ఉన్న విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకు ఖాతాలకు ఒక్కరిని మాత్రమే నామినీగా ఎంచుకునే వీలు ఉండడంతో.. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఖాతాదారుల వారసులను గుర్తించడంలో బ్యాంకులకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ చట్ట సరవణ బిల్లును తీసువచ్చినట్లు తెలుస్తోంది.

Bank Account Nominees | ఇతర మార్పులు ఏమిటంటే..

బ్యాంకింగ్ సవరణ చట్టం ద్వారా ఐదు ప్రధాన బ్యాంకింగ్ చట్టాల్లో.. మొత్తం 19 మార్పులు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత ఆధునీకరించడంతో పాటు సమర్థవంతంగా మార్చడం కోసం ఈ మార్పులను చేసింది.

Bank Account Nominees | లాకర్లకు కూడా ప్రత్యేక నిబంధనలు

బ్యాంకు లాకర్ల విషయంలో మాత్రం ప్రభుత్వం కొంచెం భిన్నమైన విధానాన్ని అనుసరిస్తోంది. లాకర్లకు సింక్రోనస్ నామినేషన్ విధానం మాత్రమే అనుమతించనుంది. అంటే, ఒక నామినీ మరణించిన తర్వాత మాత్రమే తదుపరి నామినీకి హక్కులు లభిస్తాయి. ఉదాహరణకు.. తొలి నామినీ జీవించి ఉన్నంత వరకు రెండో నామినీకి ఈ హక్కు ఉండదు. ఇది భద్రతా పరంగా, చట్టపరంగా స్థిరమైన విధానం కానుంది.

Laptop Charging | ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

Follow us: whatsup

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *