తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Bank Holidays December 2025, డిసెంబర్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తాయి. పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఈ నెలలో బ్యాంకులు చాలా రోజుల పాటు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
దేశవ్యాప్తంగా చూస్తే డిసెంబర్‌లో మొత్తం 19 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, గోవా, సిక్కిం వంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. Bank Holidays December 2025 ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది కేవలం 10 నుంచి 12 రోజులు మాత్రమే.
Bank Holidays December 2025 |బ్యాంక్ సెలవులు ఎలా నిర్ణయిస్తారు?
RBI మూడు విధాలుగా సెలవులను వర్గీకరిస్తుంది ఇందులో 1) నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింది సాధారణ సెలవులు, 2) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సెలవులు, 3) బ్యాంకుల ఖాతాల మూసివేత సెలవులు.
మొదటి విభాగంలోని సెలవులు దేశవ్యాప్తంగా లేదా సంబంధిత ప్రాంతాల్లో అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.
డిసెంబర్ 2025 – ప్రాంతీయ బ్యాంక్ సెలవుల జాబితా
– డిసెంబర్ 1 (సోమవారం) – రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం / ఇండిజినస్ ఫెయిత్ డే (ఇటానగర్, కోహిమా)
– డిసెంబర్ 3 (బుధవారం) – ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (పనాజీ (గోవా)
– డిసెంబర్ 12 (శుక్రవారం) – పా టోగన్ నెంగ్‌మింజా సాంగ్మా వర్ధంతి (షిల్లాంగ్)
– డిసెంబర్ 18 (గురువారం) – యూ సోసో థామ్ వర్ధంతి (షిల్లాంగ్)
– డిసెంబర్ 19 (శుక్రవారం) – గోవా విమోచన దినోత్సవం (పనాజీ)
– డిసెంబర్ 20 (శనివారం) – లోసూంగ్ / నామ్‌సూంగ్ ఉత్సవాలు (ఐజ్వాల్)
– డిసెంబర్ 22 (సోమవారం) – లోసూంగ్ / నామ్‌సూంగ్ ఉత్సవాలు (ఐజ్వాల్)
– డిసెంబర్ 24 (బుధవారం) – క్రిస్మస్ ఈవ్ → కోహిమా, ఐజ్వాల్, షిల్లాంగ్, గాంగ్‌టక్
– డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్ → దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు
– డిసెంబర్ 26 (శుక్రవారం) – క్రిస్మస్ ఉత్సవాలు / వర్ధంతి (ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్)
– డిసెంబర్ 27 (శనివారం) – క్రిస్మస్ ఉత్సవాలు (కొన్ని ఈశాన్య రాష్ట్రాలు)
– డిసెంబర్ 30 (మంగళవారం) – యూ కియాంగ్ నాంగ్‌బా (షిల్లాంగ్)
– డిసెంబర్ 31 (బుధవారం) – న్యూ ఇయర్ ఈవ్ (ఐజ్వాల్)
ఆదివారాలు & శనివారాలు
– డిసెంబర్ 7, 14, 21, 28 → ఆదివారాలు (దేశవ్యాప్తంగా సెలవు)
– డిసెంబర్ 13, 27 → రెండో, నాలుగో శనివారాలు (అన్ని బ్యాంకులకు సెలవు)
Bank Holidays December 2025 :ముఖ్య గమనిక
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM, డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలు సాధారణంగా కొనసాగుతాయి. అయితే చెక్ క్లియరెన్స్, RTGS, NEFT (కొన్ని సందర్భాల్లో), బ్రాంచ్‌లో నేరుగా చేసే పనులు ఆగిపోతాయి. అందుకే ఈ నెలలో బ్యాంక్ పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి..: X Chat | WhatsAppకు షాక్ ఇవ్వనున్న మస్క్.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai